పేరాల సుబ్రహ్మణ్యం

తెలుగు, కన్నడ చలనచిత్ర దర్శకుడు

పేరాల సుబ్రహ్మణ్యం తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూరు. ఇతడు 1969లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద తొమ్మిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సినిమాలలో ప్రవేశించక ముందు అతడు సాంఘిక నాటకాలలో నటించాడు. [1]

పేరాల సుబ్రహ్మణ్యం
జననం
ఇతర పేర్లువసంత సేన్, పేరాల
వృత్తిసినిమా దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1978-2005
గుర్తించదగిన సేవలు
పిల్లలు దిద్దిన కాపురం,
రాఘవయ్య గారి అబ్బాయి

సినిమారంగం

మార్చు

ఇతడు అనేక తెలుగు, కన్నడ సినిమాలకు కథ, చిత్రానువాదం, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. దర్శకుడిగా ఇతని తొలి సినిమా ఓ అమ్మకథలో ఇతడి పేరుని వసంతసేన్‌గా పేర్కొన్నారు. తరువాతి సినిమాలలో ఇతడు ఇంటిపేరు పేరాలతో ప్రసిద్ధి చెందాడు. ఇతడు కృష్ణంరాజు, జగపతి బాబు, నూతన్ ప్రసాద్, శ్రీనాథ్, చరణ్‌రాజ్, వజ్రముని, అంబరీష్, అనంత్ నాగ్, కన్నడ ప్రభాకర్,శారద, జయసుధ, అంబిక,గీత, ఆరతి, రాధిక, దివ్యవాణి, లక్ష్మి వంటి నటీనటులతో పనిచేశాడు.


ఇతడు పని చేసిన సినిమాలలో కొన్ని,:[2] [3]

సంవత్సరం సినిమా పేరు భాష పాత్ర వివరాలు
దర్శకుడు సహదర్శకుడు కథ స్క్రీన్ ప్లే/సంభాషణలు
1978 డూ డూ బసవన్న తెలుగు  Y
1980 త్రిలోక సుందరి తెలుగు  Y
1981 ఓ అమ్మకథ తెలుగు  Y ఈ చిత్రంలో ఇతని పేరు వసంతసేన్ అని పేర్కొన్నారు.
1981 మావూరి పెద్దమనుషులు తెలుగు  Y
1981 మనవూరి రాముడు తెలుగు  Y
1982 గరుడరేఖె కన్నడ  Y
1984 బడ్డి బంగారమ్మ కన్నడ  Y
1984 డాకూ రాణి తెలుగు  Y హిందీలో డాకూరాణి హిమ్మత్‌వాలి అనే పేరుతో డబ్ చేయబడింది.
1985 మారుతి మహిమె కన్నడ  Y  Y  Y
1986 బెట్టద తాయి కన్నడ  Y  Y  Y
1986 బ్రహ్మాస్త్ర కన్నడ  Y  Y
1987 అతిరథ మహారథ కన్నడ  Y  Y
1987 తాయి కన్నడ  Y  Y
1987 బజార్ భీమ కన్నడ  Y  Y
1987 లారీ డ్రైవర్ కన్నడ  Y  Y
1988 కంకణ భాగ్య కన్నడ  Y  Y
1988 ధర్మతేజ తెలుగు  Y
1988 పృథ్వీరాజ్ తెలుగు  Y
1990 ఆవేశ కన్నడ  Y  Y  Y
1990 నమ్మూర హమ్మీర కన్నడ  Y  Y
1990 నిగూఢ రహస్య కన్నడ  Y  Y  Y
1992 నన్న తంగి కన్నడ  Y  Y  Y
1993 పిల్లలు దిద్దిన కాపురం తెలుగు  Y  Y  Y
1995 ముత్తినంత హెండతి కన్నడ  Y  Y  Y
1996 హైదరాబాద్ గూండాయిజం తెలుగు  Y
1997 రాజదర్బార్ తెలుగు  Y
1997 జేనిన హొళె కన్నడ  Y  Y
2000 రాఘవయ్య గారి అబ్బాయి తెలుగు  Y  Y
2005 దేవీమాతా హిందీ  Y
2005 ఆశల పల్లెకి తెలుగు  Y ఉత్తమ బాలల చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వంచే నంది పురస్కారం[4]

మూలాలు

మార్చు
  1. వి.ఎస్.అవధాని (5 January 1982). "పరిచయం: పేరాల సుబ్రహ్మణ్యం" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి:68 సంచిక:276. Archived from the original (PDF) on 29 సెప్టెంబర్ 2022. Retrieved 29 September 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. వెబ్ మాస్టర్. "All Movies Perala". ఇండియన్ సినిమా. Retrieved 29 September 2022.
  3. వెబ్ మాస్టర్. "Perala". చిత్రలోక కన్నడ. Retrieved 29 September 2022.
  4. L.VENUGOPAL. "Andhra Pradesh State Nandi Film Awards(2001-2006)". TELUGUCINEMA CHARITRA. Retrieved 30 September 2022.


బయటిలింకులు

మార్చు