పోరంకి
పోరంకి భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ పొరుగు ప్రాంతంగా, జనాభా గణన పట్టణంగా ఉంది. ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది.2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[2][3]పోరంకి విజయవాడ ఆదాయ విభాగం పెనమలూరు మండలంలో ఉంది.[1] విజయవాడ, మచిలీపట్నం ముఖ్య రహదారి మార్గంలో ఉంది. విజయవాడ పట్టణం (కార్పొరేషన్) నడిబొడ్డు నుండి 6 కి.మీ.దూరంలో ఉంది.
పోరంకి | |
---|---|
నిర్దేశాంకాలు: 16°28′27.52″N 80°42′46.13″E / 16.4743111°N 80.7128139°ECoordinates: 16°28′27.52″N 80°42′46.13″E / 16.4743111°N 80.7128139°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
ప్రభుత్వం | |
• నిర్వహణ | పోరంకి గ్రామ పంచాయితీ |
విస్తీర్ణం | |
• మొత్తం | 11.78 కి.మీ2 (4.55 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 25,545 |
• సాంద్రత | 2,200/కి.మీ2 (5,600/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
కాలమానం | UTC+5:30 |
పిన్‌కోడ్ | 521137 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 0866 |
వాహనాల నమోదు కోడ్ | AP16 |
సమీప నగరం | విజయవాడ |
అక్షరాస్యత | 99% |
లోకసభ నియోజకవర్గం | మచిలీపట్నం |
విధాన సభ నియోజకవర్గం | పెనమలూరు |
సమీప గ్రామాలుసవరించు
సమీప నగరాలు, పట్టణాలుసవరించు
సమీప మండలాలుసవరించు
సమీప జిల్లాలుసవరించు
- గుంటూరు జిల్లా: 33.9 కి.మీ.
- పశ్చిమ గోదావరి జిల్లా: 50.9 కి.మీ.
- ఖమ్మం జిల్లా: 104.4 కి.మీ.
- ప్రకాశం జిల్లా: 129,2 కి.మీ.
జనాభా గణాంకాలుసవరించు
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పోరంకి జనాభా గణనలో 25,545 మంది జనాభా ఉన్నారు, ఇందులో 12,438 మంది మగవారు, 13,107 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0-6 ఏళ్ళ వయస్సు ఉన్న చిన్నారుల జనాభా 1977 లో ఉండగా, ఇది పోరంకి మొత్తం జనాభాలో 7.74%గా ఉంది. పోరంకి సెన్సస్ టౌన్ లో, మహిళా సెక్స్ నిష్పత్తి 1054 ఉండగా ఇది రాష్ట్ర సగటు 993 కి కంటే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, పోరంకిలో పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి దాదాపుగా 969 గా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోల్చితే ఎక్కువగా ఉంది. పోరంకి పట్టణం అక్షరాస్యత శాతం 87.05%, రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. పట్టణంలో, పురుష అక్షరాస్యత 88.90%, స్త్రీ అక్షరాస్యత రేటు 85.30%.[1] పోరంకి పట్టణం మొత్తం జనాభాలో షెడ్యూల్ కులం (ఎస్.సి.) 11.35%, షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) 3.30% మంది ఉన్నారు.
పనిచేయువారుసవరించు
మొత్తం జనాభాలో 8,424 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో 6,308 మంది మగవారు, 2,116 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా లెక్కల సర్వేలో, పనిచేయువాడు అనగా; వ్యాపారం, ఉద్యోగం, సేవా, వ్యవసాయదారుడు, కార్మిక కార్యకలాపాలను నిర్వహించేవాడు అని అర్థం. మొత్తం పనిలో 8424 మంది పనిచేస్తున్నప్పుడు, 95.22% మంది ప్రధాన (మెయిన్ వర్క్లో) పనులలో పాల్గొంటున్నారు, అదే సమయంలో 4.78% మొత్తం కార్మికులు సాధారణ (అండర్ వర్క్) పనిలో నిమగ్నమయ్యారు.[1]
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
- విమానాశ్రయం 11.6 కి.మీ., విజయవాడ బస్ స్టాండ్ నకు 9 కి.మీ. విజయవాడ రైల్వేస్టేషన్ నుండి 10 కి.మీ. దూరములో పోరంకి ఉంది.
- ఈ గ్రామం నుండి భారతదేశములోని అన్ని ప్రాంతములకు రహదారి, రైలు, విమాన సదుపాయములు కలిగి ఉన్నాయి.
రైలు సౌకర్యంసవరించు
- విజయవాడ జంక్షన్: 8.0 కి.మీ. దూరంలో ఉంది.
- నిడమానూరు: 4.4 కి.మీ. దూరంలో ఉంది.
- రామవరప్పాడు: 6.2 కి.మీ. దూరంలో ఉంది.
- ఉప్పలూరు: 8.2 కి.మీ. దూరంలో ఉంది.
- ముస్తాబాద: 8.3 కి.మీ. దూరంలో ఉంది.
విమానాశ్రయముసవరించు
- విజయవాడ విమానాశ్రయం: 11.6 కి.మీ. దూరంలో ఉంది.
- రాజమండ్రి విమానాశ్రయం: 138.1 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[4][5] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.
- వేద పాఠశాలలు:- ఈ గ్రామంలో విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానానికి 6.66 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రు. 150 కోట్లు ఉంటుంది. ఈ భూమిలో ఇదివరకే రు. 2.5 కోట్లతో రెండు భవనాలను నిర్మించారు. వీటిలో ఇప్పుడు రెండు వేదపాఠశాలలను ప్రారంభించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఒకటి వేద పాఠశాల మరియొకటి స్మార్త వేద పాఠశాల. [8]
- విజ్ఙాన భారతి స్కూల్
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
- కృష్ణవేణి పబ్లిక్ స్కూల్, .
- శ్రీ చైతన్య మహిళా కళాశాల.
- శ్రీ కృష్ణవేణి కో-ఆపరేటివ్ జూ||.కాలేజ్.
- నలంద జూ||.కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్.
- పిన్నమనేని రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్.
- ఆదర్శ మహిళా డిగ్రీ కాలేజ్.
- శ్రీ సాయి మహిత డిగ్రీ కాలేజ్.
- వికాస్ మోడల్ ఉన్నత పాఠశాల, పెనమలూరు సెంటర్.
- శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్.
- కెవిఆర్ నర్సింగ్ స్కూల్
- సెయింట్ థెరిసా ఉన్నత పాఠశాల
- జ్ఞాన భారతి పబ్లిక్ స్కూల్
- కెసిపి సిథార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్
- కెసిపి సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
- 2001 సం. జనాభా లెక్కల ప్రకారము ఈ గ్రామ జనాభా సంఖ్య 20,137.
- ఈ గ్రామం పాఠశాలలు, కళాశాలలు, మంచినీటి సరఫరా, మురుగు కాల్వల, రహదారుల నిర్వహణ, ఇతర ఆన్ని నిత్య అవసరాల సదుపాయాల అభివృద్ధి విషయములలో యెంతో ముందడుగులో ఉంది.
ఆసుపత్రులుసవరించు
పోరంకిలో ఉన్న "బొప్పన ఆసుపత్రి" 200 పడకలతో నిర్మాణం చేశారు.
విద్యుత్తు సబ్స్టేషనుసవరించు
ఈ గ్రామంలో 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషను ఉంది.
వృద్ధ, అనాథ శరణాలయాలుసవరించు
పోరంకి, వణుకూరు గ్రామాల్లో వృద్ధ, అనాథ శరణాలయాలున్నాయి.
కర్మాగారాలుసవరించు
గోసాల, పోరంకిలలో తినుబండారాల తయారీ కర్మాగారాలు ఇంటింటికి బాగా విస్తరించాయి.
ఇతర పరిశ్రమలుసవరించు
ప్రియా ఫుడ్స్, సిరీస్ కంపెనీ, డార్విన్ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలు, రైస్‌మిల్లులు గంగూరు, పోరంకిల్లో ఉన్నాయి.
విందు వివాహం, సమావేశం, ఫంక్షన్ హాళ్ళుసవరించు
- శ్రీ సాయి బాలాజీ కళ్యాణ వేదిక
చలనచిత్ర ప్రదర్శన శాలలుసవరించు
- బాలాజీ సినీ విల్లా మల్టీప్లెక్స్ (రామప్రియ)
- శ్రీనివాస
- వెంకటకృష్ణ
- విజయలక్ష్మి (కానూరు)
పోస్టాఫీస్సవరించు
పోరంకి గ్రామ తపాలా కార్యాలయము (పోస్టాఫీస్) పిన్ నంబరు: 521 137. ఎస్.టి.డి. కోడ్ = 0866. పెద్దపులిపాక, తాడిగడప గ్రామంలకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరములు ఈ తపాలా కార్యాలయము నుండియే జరుపబడును.
బ్యాంకులుసవరించు
1) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
2) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
3) కరూర్ వైశ్యా బ్యాంకు
4) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
గ్రామ పంచాయతీసవరించు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వేమూరి స్వరూపరాణి సర్పంచిగా 9030 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఉపసర్పంచిగా అనుమోలు ప్రభాకరరావు ఎన్నికైనాడు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు, ప్రార్ధనా మందిరములుసవరించు
- పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
- శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయము[3]
- శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము [5][6]
- శ్రీ వసంతవేణుగోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల దేవాలయము [2] [4]
- శ్రీ రామాలయము
- శ్రీ షిర్డీ సాయిబాబా మందిరము.[7]
- శ్రీ ఆంజనేయ భవానీ శంకర సూర్యనారాయణ స్వామి వార్ల దేవస్థానము.
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
శ్రీ తోటకూర గోపీచంద్సవరించు
పోరంకి గ్రామానికి చెందిన శ్రీ తోటకూర గోపీచంద్, అమెరికాలోని ఎంబ్రిరైడిల్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినారు. 4 రోజులక్రితం అక్కడ గ్రాడ్యుయేషన్ ఉత్సవం నిర్వహించారు. ఆ ఉత్సవంలో వీరికి, సీనియర్ క్లాస్ ప్రెసిడెంట్ పురస్కారం లభించింది. 1926వ సంవత్సరంలో నెలకొల్పబడిన ఈ విశ్వవిద్యాలయంలో ఒక ఆంధ్రునికి ఈ పురస్కారం లభించడం ఇదే ప్రథమం. [9]
శ్రీ యు.బ్రహ్మానందంసవరించు
వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు, కరాటే శిక్షకులు. నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో 2017,ఏప్రిల్8న నిర్వహించు ప్రదర్శనలో పాల్గొనడానికి, వీరిని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఐదువేలమంది పాల్గొనుచున్న ఈ ప్రదర్శనలో, కృష్ణాజిల్లా నుండి వీరికొక్కరికే ఈ ఆహ్వానం అందినది. కూచిపూడి నాట్యం తరహాలో, నిరంతరంగా కరాటే విద్యను ప్రదర్శించే అంశాన్ని ఆ సంస్థ నెల్లూరులో ఆ రోజున నిర్వహించనున్నది. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి శ్రీ బ్రహ్మానందం, తన శిష్యులతోపాటు బయలుదేరెదరు. [10]
గ్రామ విశేషాలుసవరించు
పోరంకి సెన్సస్ టౌన్ మొత్తం నిర్వహణలో 6,420 గృహాలు ఉన్నాయి, మంచినీటి వసతి, మురికినీరు వంటి ప్రాథమిక సదుపాయాలను ఇది కలగ చేస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా అధికారం కలిగి ఉంటుంది.[1]
చుక్కలనంటిన భూముల ధరలుసవరించు
- ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు బందరు రోడ్డు (హైవే) వెంబడి ఉన్న స్థలం గజం రూ20వేల నుంచి రూ.30వేల ఉంటే, వెనుక ఉన్న స్థలాలు గజం రూ.15వేల నుంచి రూ.25వేల వరకు పెరిగాయి. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
- రియల్ ఎస్టేట్ రంగములో ప్రసిద్ధి గాంచింది. అనేక కాలనీలు ప్రజలు నివసించేందుకు వీలుగా (గేటెడ్ కమ్యూనిటీస్) వెలసినవి.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 16,394. Retrieved 6 February 2016.
- ↑ Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
- ↑ "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Archived from the original on 7 May 2017. Retrieved 27 March 2017.
- ↑ "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 7 November 2016. Retrieved 7 November 2016.
- ↑ "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.
వెలుపలిలింకులుసవరించు
[1] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013,డిసెంబరు-5; 1వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,ఏప్రిల్-12; 3వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; మే-12,2014; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మే-15; 2వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-5, 1వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-10; 1వపేజీ. [7] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చి-4; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే-10; 14వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,జులై-6; 17వపేజీ.