ప్రేమ మందిరం

(ప్రేమమందిరం నుండి దారిమార్పు చెందింది)

ప్రేమ మందిరం 1981 లో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ [1] పతాకంపై, దాసరి నారాయణరావు దర్శకత్వంలో రామానాయుడు ఈ సినిమాను నిర్మించాడు.[2] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, గుమ్మడి ముఖ్య తారాగణం.[3]

ప్రేమ మందిరం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం డి. రామానాయుడు
రచన దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం పి.ఎస్.సెల్వరాజ్
కూర్పు కె.ఎ. మార్తాండ్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

స్వాతంత్ర్య పూర్వ కాలంలో, జమీందారు భూపతి రాజా (గుమ్మడి) కనుసన్నలలో నడీచే ఓ జమీందారీలోఈ చిత్రం ప్రారంభమవుతుంది. అతడికి ఇద్దరు కుమారులు - సర్వరాయుడు (అక్కినేని నాగేశ్వరరావు), విక్రమ్ (జగ్గయ్య). సర్వరాయుడు తండ్రి మాట జవదాటడు. జమీందారు మొండి పట్టుదలగల, కర్కశమైన వ్యక్తి. కుల, కుటుంబ ప్రతిష్ఠకు కట్టుబడి ఉంటాడు. ఈ మొండితనం వల్లనే ఒక పేద అమ్మాయిని (గీత) ప్రేమించినందుకు స్వంత కుమారుడు విక్రమ్‌ను వధించాడు కూడా. ప్రస్తుతం, జమీందారు తన మనవడు చిన్నబాబు (మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు) ను ప్యాలెస్‌లో బంధించి, ఆ సరిహద్దుల్లోనే అతణ్ణి చదివిస్తాడు. విసుగు చెందిన చిన్నబాబు బయటి ప్రపంచాన్ని చూసేందుకు తప్పించుకుంటాడు. ఈ సంగతి తెలిసిన సర్వరాయుడు, అసలు సంగతిని జమీందారుకు చెప్పకుండా దాచిపెట్టి, తన కొడుకును వెతుక్కుంటూ బయలుదేరుతాడు. దురదృష్టవశాత్తు, చిన్నబాబు ఒక వేశ్య ఇంట్లో దిగుతాడు. అక్కడ అతనికి మధుర రంజని (జయప్రద) అనే అందమైన అమ్మాయి పరిచయ మౌతుంది. ఆమె గొప్ప సంస్కారం గల స్త్రీ. వారు ప్రేమలో పడతారు. అది తెలుసుకున్న సర్వరాయుడు తన కొడుకును తిరిగి తీసుకు వెళ్తాడూ గానీ, అతడు మళ్ళీ మళ్ళీ తప్పించుకుని మధురకు వెళ్తూనే ఉంటాడు. ఇక్కడ సర్వరాయుడు ఈ విషయాన్ని జమీందార్కు వెల్లడించడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఇది తన కొడుకు ప్రాణానికే ముప్పు కాబట్టి. అందువల్ల, చిన్నబాబు తనను విస్మరించేలా చేసేందుకు అతడి దృష్టిలో తనను తాను చవకబరచుకోవాలని అతను మధురను అభ్యర్థిస్తాడు. ఆమె అంగీకరించి అలాగే చేస్తుంది. ఈ బాధతో చిన్నబాబు తాగుబోతుగా మారిపోతాడు, దుఃఖంతో బాధపడుతున్న మధుర అనారోగ్యానికి గురవుతుంది. తరువాత, చిన్నబాబు నిజం తెలుసుకుని మధురను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అది తెలుసుకుని కోపంతో ఉన్న జమీందారు వారిని చంపమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో, సర్వరాయుడు వారికి పెళ్ళి చేసి ప్యాలెస్‌కు స్వాగతం పలుకుతాడు. వారి మొదటి రాత్రి సమయంలో, అతను వారిపై విష ప్రయోగం చేసానని చెబుతాడు. కానీ వాస్తవానికి, వాటిలో ఒక దానిని తండ్రికి ఇచ్చి మరొకటి తాను మింగేస్తాడు. చివరికి జమీందారు మరణిస్తాడు. చివరగా, సర్వరాయుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడు. ప్రేమ కులానికీ వంశానికీ అతీతమైనదని చెబుతూ తుది శ్వాస విడుస్తాడు

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు

కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. SEA రికార్డ్స్ ఆడియో కంపెనీ వారు సంగీతాన్ని విడుదల చేసారు.[4]

S.No పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "ప్రేమ మందిరం ఇదే" వేటూరి సుందరరామ మూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:32
2 "చంద్రోదయం" వేటూరి సుందరరామ మూర్తి ఎస్పీ బాలు, పి. Susheela 4:03
3 "ఎక్కడో చూసినట్టు ఉన్నాది" ఆరుద్ర ఎస్పీ బాలు, పి.సుశీల 4:35
4 "ఆటా తందాన తానా" వేటూరి సుందరరామ మూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:12
5 "తోలిసారి పలికేను" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 5:33
6 "ఉదయమా ఉదయంచకు" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 4:23
7 "అమరం అమరం" దాసరి నారాయణరావు ఎస్పీ బాలు 5:47
8 "మా ఇంటి అల్లుడా" వేటూరి సుందరరామ మూర్తి ఎస్.జానకి, పి.సుశీల 5:40

మూలాలు

మార్చు
  1. "Prema Mandiram (Banner)". Filmiclub.
  2. "Prema Mandiram (Direction)". Know Your Films.
  3. "Prema Mandiram (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-07-26. Retrieved 2020-08-05.
  4. "Prema Mandiram (Songs)". Cineradham. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-05.