బసవేశ్వర ఎత్తిపోతల పథకం

బసవేశ్వర ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌ మండలం ప్రాంతంలో నిర్మించబడుతున్న నీటిపారుదల పథకం. సింగూరు జలాశయం ఎడమవైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసినారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మించబడుతోంది.[1][2] 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఇక్కడికి తరలించనున్నారు.

బసవేశ్వర ఎత్తిపోతల పథకం
బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రదేశంనారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితినిర్మాణంలో వున్నది
నిర్మాణం ప్రారంభం2022
నిర్మాణ వ్యయంరూ. 1,774 కోట్లు
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుగోదావరి
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

ప్రారంభం

మార్చు

2022, ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో ఈ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి (సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కూడా) ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఆర్థిక - వైద్యారోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, కె.మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, పద్మా దేవేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పి.వెంక‌ట్రామి రెడ్డి, శ్రీ ఫరూక్ హుస్సేన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4]

పథకం వివరాలు

మార్చు

మల్లన్నసాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని సింగూరుకు తీసుకువచ్చి, అక్కడి బ్యాక్‌ వాటర్‌ నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తారు. మానూరు మండలంలోని బోరంచ నుంచి గోదావరి జలాలను 74 మీటర్ల మేర ఎత్తిపోసి కాల్వల ద్వారా నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాలకు చెందిన 166 గ్రామాల్లోని 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.[5] ఈ పథక నిర్మాణంలో భాగంగా 74.52 మీటర్ల ఎత్తులో లిఫ్టులు, రెండు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 160 కిలోమీటర్ల మేర ఏడు కాల్వలను కరస్‌గుత్తి కెనాల్‌ (88.20 కిలోమీటర్లు), కరస్‌గుత్తి బ్రాంచి కెనాల్‌ (25.80 కిలోమీటర్లు), వట్‌పల్లి కెనాల్‌ (20 కిలోమీటర్లు), నారాయణఖేడ్‌ కెనాల్‌ (20 కిలోమీటర్లు), రేగోడ్‌ కెనాల్‌ (12.90 కిలోమీటర్లు), కంగ్టి కెనాల్‌ (16.80 కిలోమీటర్లు), అంతర్‌గావ్‌ కెనాల్‌ (16.40 కిలోమీటర్లు)) నిర్మించనున్నారు.[6] మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంతో నిర్మితమవుతున్న ఈ ఎత్తిపోతల పథక నిర్మాణానికి 4,150 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని, రూ. 1,774 కోట్లు ఖర్చవుందని, 70 మెగావాట్లు విద్యుత్తు వినియోగమవుతుందని అంచనా వేయబడింది.[7]

ఆయకట్టు వివరాలు:

మూలాలు

మార్చు
  1. Velugu, V6 (2022-02-19). "సంగమేశ్వర - బసవేశ్వర పథకానికి శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డాను: కేసీఆర్‌". andhrajyothy. 2022-02-21. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  3. telugu, NT News (2022-02-21). "CM KCR | సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  4. Velugu, V6 (2022-02-21). "సంగమేశ్వర్,బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Telangana Cabinet gives nod for Sangameshwara, Basaveshwara schemes". The New Indian Express. 2022-02-20. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-21.
  6. "సీఎం పెట్టారు.. ఈ ఎత్తిపోతల పేర్లు". EENADU. 2022-02-20. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-21.
  7. telugu, NT News (2022-02-20). "కాళేశ్వర సంగమం". www.ntnews.com. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-21.