సి.కృష్ణవేణి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.
మేకా కృష్ణవేణి | |
---|---|
జననం | డిసెంబర్ 24, 1924 పంగిడి గూడెం, కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం |
నివాస ప్రాంతం | మద్రాసు (చెన్నై), హైదరాబాదు |
ఇతర పేర్లు | సి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి |
వృత్తి | తెలుగు చలనచిత్ర నటి, గాయని, నిర్మాత |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | మీర్జాపురం రాజు మేకా రంగయ్య |
పిల్లలు | మేకా రాజ్యలక్ష్మి అనూరాధ |
తండ్రి | డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు[1] |
తల్లి | నాగరాజు |
సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
జీవిత చరిత్ర
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
పురస్కారాలు
మార్చు- తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
- 2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్ టైమ్ ఎఛివ్మెంట్ అవార్డును ఆమె అందుకుంది.[2]
- 2022: ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం[3]
కృష్ణవేణి నటించిన సినిమాలు
మార్చు- సతీ అనసూయ -ధ్రువ (1935)
- మోహినీ రుక్మాంగద (1937)
- కచ దేవయాని (1938)
- మళ్ళీ పెళ్ళి (1939)
- మహానంద (1939)
- జీవనజ్యోతి (1940)
- దక్షయజ్ఞం (1941)
- భీష్మ (1944)
- బ్రహ్మరథం (1947)
- మదాలస (1948)
- మన దేశం (1949)
- గొల్లభామ (1947)
- లక్ష్మమ్మ (1950)
నిర్మాతగా కృష్ణవేణి
మార్చుకృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
మార్చు- భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
- సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
మార్చు- మన దేశం (1949)
- లక్ష్మమ్మ (1950)
- దాంపత్యం (1957)
- గొల్లభామ (1947)
- భక్త ప్రహ్లాద (1042)
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైంది
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Ch Krishnaveni's Exclusive Interview - Telugucinema.com Oct 25, 2005[permanent dead link]
- ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Nava Telangana (2 December 2022). "నటి కృష్ణ వేణికి ఆకృతి-ఘంటసాల శతాబ్ది పురస్కారం". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.