రాజస్థాన్ క్రికెట్ జట్టు
రాజస్థాన్ క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. ఈ జట్టు 2010-11, 2011-12 సీజన్లలో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, 1960-61, 1973-74 మధ్య ఎనిమిది సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇది ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూప్‌లో ఉంది. "టీమ్ రాజస్థాన్" అని పిలిచే ఈ జట్టును రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | అశోక్ మెనారియా |
యజమాని | రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1928 |
స్వంత మైదానం | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ |
సామర్థ్యం | 30,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | Rajasthan Cricket Association |
చరిత్ర
మార్చురాజపుతానా
మార్చురాజ్పుతానాలో మొదటి క్రికెట్ మ్యాచ్ 1928/29 ఢిల్లీ టోర్నమెంట్‌లో అలీఘర్‌తో జరిగింది.[1] ఆ తర్వాత 1931లో అజ్మీర్‌లో రాజ్‌పుతానా క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది.[2][n 1] రాజ్‌పుతానా ఆడిన తొలి ఫస్ట్-క్లాస్ ఆట 1933 నవంబరులో అజ్మీర్‌లోని మాయో కాలేజ్ గ్రౌండ్‌లో పర్యటనకు వచ్చిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌తో ఆడింది. అందులో భారీగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది.[3] జట్టు 1935/36 సీజన్‌లో మొదటిసారిగా రంజీ ట్రోఫీలోకి ప్రవేశించింది. సెంట్రల్ ఇండియాతో జరిగిన పోటీలో తన మొదటి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోయింది.[4][5] ఆ జట్టు తర్వాతి సీజన్లలో రంజీ ట్రోఫీలో ఆడి, మళ్లీ సెంట్రల్ ఇండియా చేతిలో ఓడిపోయింది. అయితే, ఈసారి కేవలం రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది.[6] రాజ్‌పుతానా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొదటి విజయాన్ని లియోనెల్ టెన్నిసన్ టూరింగ్ ఎలెవన్‌పై 1937లో రెండు వికెట్ల తేడాతో సాధించింది. జట్టు 1938/39 రంజీ ట్రోఫీలో సదరన్ పంజాబ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అది ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో తన మొదటి రంజీ విజయాన్ని నమోదు చేసింది.[7] అయితే దక్షిణ పంజాబ్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో, భారతదేశంలో క్రికెట్‌కు కొంత అంతరాయం ఏర్పడింది, అయితే ఫస్ట్-క్లాస్ క్రికెట్ కొనసాగింది.
రాజస్థాన్
మార్చురంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన
మార్చుసంవత్సరం | స్థానం |
---|---|
2010-11 | విజేత |
2011-12 | |
1960–61 | ద్వితియ విజేత |
1961–62 | |
1962–63 | |
1963–64 | |
1965–66 | |
1966–67 | |
1969–70 | |
1973–74 |
ప్రసిద్ధ క్రీడాకారులు
మార్చుభారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- సలీం దురాని (1960)
- హనుమంత్ సింగ్ (1964)
- పార్థసారథి శర్మ (1974)
- ప్రవీణ్ ఆమ్రే (1992)
- పంకజ్ సింగ్ (2014)
ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- కబీర్ అలీ (2003)
భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- గగన్ ఖోడా (1998)
- ఖలీల్ అహ్మద్ (2018)
- దీపక్ చాహర్ (2018)
- రాహుల్ చాహర్ (2021)
- రవి బిష్ణోయ్ (2022)
ఇంగ్లండ్ తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- విక్రమ్ సోలంకి (2000)
ప్రస్తుత స్క్వాడ్
మార్చు- అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.
Name | Birth date | Batting style | Bowling style | Notes |
---|---|---|---|---|
Batters | ||||
మహిపాల్ లోమ్రోర్ | 1999 నవంబరు 16 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Plays for Royal Challengers Bangalore in IPL |
అశోక్ మెనారియా | 1990 అక్టోబరు 29 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Captain |
యష్ కొఠారి | 1995 అక్టోబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
అభిజీత్ తోమర్ | 1995 మార్చి 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
సల్మాన్ ఖాన్ | 1998 డిసెంబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
ఆదిత్య గర్వాల్ | 1996 ఏప్రిల్ 15 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
కరణ్ లాంబా | 2004 నవంబరు 28 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
దీపక్ హుడా | 1995 ఏప్రిల్ 19 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Lucknow Super Giants in IPL |
అర్జిత్ గుప్తా | 1989 సెప్టెంబరు 12 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
All-rounders | ||||
అనిరుధ్ చౌహాన్ | 2002 అక్టోబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
Wicket-keepers | ||||
కునాల్ రాథోడ్ | 2002 అక్టోబరు 9 | ఎడమచేతి వాటం | Plays for Rajasthan Royals in IPL | |
సమర్పిత జోషి | 1999 సెప్టెంబరు 19 | కుడిచేతి వాటం | ||
మనేందర్ సింగ్ | 1996 జనవరి 2 | కుడిచేతి వాటం | ||
Spinners | ||||
రవి బిష్ణోయ్ | 2000 సెప్టెంబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Lucknow Super Giants in IPL |
మానవ్ సుతార్ | 2002 ఆగస్టు 3 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
రాహుల్ చాహర్ | 1999 ఆగస్టు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Punjab Kings in IPL |
శుభం శర్మ | 1997 మార్చి 26 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
మోహిత్ జైన్ | 1999 మార్చి 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
Fast Bowlers | ||||
అనికేత్ చౌదరి | 1990 జనవరి 28 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | Vice-captain |
కమలేష్ నాగరకోటి | 1999 డిసెంబరు 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Plays for Delhi Capitals in IPL |
అరాఫత్ ఖాన్ | 1996 డిసెంబరు 27 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
తన్వీర్-ఉల్-హక్ | 1991 డిసెంబరు 3 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం fast | |
రితురాజ్ సింగ్ | 1990 అక్టోబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ఖలీల్ అహ్మద్ | 1997 డిసెంబరు 5 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | Plays for Delhi Capitals in IPL |
24 జనవరి 2023 నాటికి నవీకరించబడింది
కెప్టెన్లు
మార్చు- 2011-2021 అశోక్ మెనారియా
- 2018-2021 మహిపాల్ లోమ్రోర్
- 2012-2020 రాబిన్ బిస్ట్
- 2018-2019 దీపక్ చాహర్
- 2018 అనికేత్ చౌదరి
- 2014-2017 పంకజ్ సింగ్
- 2010–2013 హృషీకేశ్ కనిత్కర్
- 1992/1997 రాజీవ్ రాథోర్
- 1990/91– పర్మిందర్ సింగ్
- 1989/90 సంజయ్ వ్యాస్
- 1988/89 పదం శాస్త్రి
- 1985/86–1987/88 సంజయ్ వ్యాస్
- 1979/80–1984/85 పార్థసారథి శర్మ
- 1977/78–1978/79 కైలాష్ గట్టాని
- 1966/67–1976/77 హనుమంత్ సింగ్
- 1962/63–1965/66 రాజ్‌సింగ్ దుంగార్పూర్
- 1960/61–1961/62 కిషన్ రుంగ్తా
- 1957/58–1959/60 వినూ మన్కడ్
- 1951/52–1956/57 మేవార్ మహారాణా
- 1935/36–1939/40 వాల్టర్ బ్రాడ్షా
- 1933/34–1937/38 లక్ష్మణ్ సింగ్
రికార్డులు
మార్చు{{ ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం, రాజస్థాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ రికార్డుల జాబితా, రాజస్థాన్ లిస్ట్ A క్రికెట్ రికార్డుల జాబితా, రాజస్థాన్ ట్వంటీ20 క్రికెట్ రికార్డుల జాబితా }}
మైదానాలు
మార్చుసవాయ్ మాన్‌సింగ్ స్టేడియం
మార్చురాజస్థాన్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమ హోమ్ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం ఆడుతుంది.
గమనికలు
మార్చు- ↑ What is today the modern state of Rajasthan was then a part of the British Raj and was known as Rajputana.
మూలాలు
మార్చు- ↑ "Other Matches played by Rajputana". CricketArchive. Archived from the original on 10 November 2013. Retrieved 1 November 2012.
- ↑ "RCA History". Rajasthan Cricket Association. Retrieved 1 November 2012.
- ↑ "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
- ↑ "RCA History". Rajasthan Cricket Association. Retrieved 1 November 2012.
- ↑ "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
- ↑ "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
- ↑ "Delhi v Rajputana, 1939/40 Ranji Trophy". CricketArchive. Retrieved 2 November 2012.