రావు కమలకుమారి (ఏప్రిల్ 21, 1944 - ఏప్రిల్ 7, 2018) హరికథ కళాకారిణి,[2] ప్రముఖ రంగస్థల మరియు సినీనటులైన రావు గోపాలరావు సతీమణి.[3] ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో 5వేలకుపైగా హరికథలు చెప్పింది.

రావు కమలకుమారి
Rao KamalaKumari.jpg
జననంమండా కమలకుమారి
(1944-04-21) 1944 ఏప్రిల్ 21
విజయనగరం
మరణం2018 ఏప్రిల్ 7 (2018-04-07)(వయసు 73)[1]
కొండాపూర్, హైదరాబాద్
ప్రసిద్ధులుతెలుగు హరికథలు, సాహిత్యం
జీవిత భాగస్వామిరావు గోపాలరావు
పిల్లలురావు రమేష్, క్రాంతికుమార్, సీతాదేవి
తల్లిదండ్రులు
  • మండా సూర్యనారాయణ (తండ్రి)
  • రాజరాజేశ్వరి (తల్లి)

జననంసవరించు

కమలకుమారి 1944, ఏప్రిల్ 21న మండా సూర్యనారాయణ, రాజరాజేశ్వరి దంపతులకు విజయనగరం లో జన్మించింది. సూర్యనారయణ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా భాగ్ రథీ పురం. కమలకుమారి తాత కలవరాయుని లక్ష్మీనారాయణ శాస్త్రీ విజయనగర సంస్థాన విద్వాంసులు.

 
రావు గోపాలరావు దంపతులు

కళారంగంసవరించు

కమలకుమారి తండ్రి సూర్యనానాయణ శాస్త్రి విజయనగరం సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలోనూ, పూనాలోని హిందూస్థానీ సంగీతంలోనూ డిప్లొమాలు పొందిన విద్వాంసులు. వీణ, గాత్రం, భరతనాట్యం, హరికథా కళలను అభ్యసించిన కమలకుమారి ఎనమిదేళ్ళ వయసులో తండ్రి హరికథ మధ్యలో భరతనాట్యం చేసేది.

స్వరజతి, వర్ణం, తిల్లాన, స్వరం, శబ్ధం, సాహిత్యం అభ్యసించింది. తన పాటలు తానే పాడుకుంటూ జానపద నృత్యాలు చేసేది. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట మొదలైన పుణ్యక్షేత్రాల్లో హరికథా గానం చేసింది.

వివాహం - పిల్లలుసవరించు

వీరిది ప్రేమ వివాహం. ప్రముఖ రంగస్థల, సినీనటులైన రావు గోపాలరావు తో 1966, జనవరి 16న కమలకుమారి వివాహం జరిగింది. పురాణ కథలను, పౌరాణిక కళలలను ద్వేషించే రావు గోపాలరావు... కాకినాడ లో కమలకుమారి హరికథకు వచ్చి అల్లరిచేయాలనుకున్నారు. ఆరు గంటలపాటు హరికథ విని, ముగ్ధలై కమలకుమారితో ప్రేమలో పడ్డారు.[3] వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు రావు రమేష్ సినీనటుడు. రెండో కుమారుడు క్రాంతికుమార్ అమెరికాలో ఇంజనీర్, కుమార్తె సీతాదేవి.

బిరుదులుసవరించు

  1. సకల కళా విశారద - ప్రవాసాంధ్ర కళాసమితి, టాటా నగరం, మద్రాస్
  2. నాట్యకుమారి, హరికథా శిరోమణి, కోకిల వాణి - కాకినాడ
  3. మధుర గాన సుహాసిని - కలకత్తా
  4. సకల జన రంజన హరికథా కళా ప్రపూర్ణ - ఖరగ్‌పూర్
  5. అభినవ సరస్వతి - బెంగళూరు
  6. శారదావతరిణి - విజయనగరం
  7. ఆదర్శ హరి కథా సుధామతి - గుంటూరు

మరణంసవరించు

2018, ఏప్రిల్ 7న హైదరాబాద్ కొండాపూర్ లోని తన నివాసంలో మరణించారు.[4][5]

మూలాలుసవరించు

  1. "నటుడు రావురమేష్‌కు మాతృ వియోగం". eenadu.net. ఈనాడు. 8 April 2018. మూలం నుండి 8 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 8 April 2018.
  2. ది హిందూ. "Benchmark in performance". Retrieved 24 April 2017. Cite news requires |newspaper= (help)
  3. 3.0 3.1 రావు కమలకుమారి, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 200. ISBN 978-81-8351-2824. |access-date= requires |url= (help)
  4. తెలుగు వి6 న్యూస్, సినిమా వార్తలు (7 April 2018). "రావు రమేష్ తల్లి కన్నుమూత". మూలం నుండి 10 ఏప్రిల్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 April 2018. Cite news requires |newspaper= (help)
  5. నమస్తే తెలంగాణ (7 April 2018). "రావు ర‌మేష్‌కి మాతృ వియోగం". Retrieved 7 April 2018. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులుసవరించు