AjayaBabu
AjayaBabu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 09:31, 14 మార్చి 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.
ఇంకా చదవండి: వికీపీడియా:గైడు
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
మార్చునేను కొత్తగా తెవికీ లొ అనువాదం ప్రారంబించాను.నేను చేసిన మార్పులు తొలగిచినట్లయితే నాకు తెలియచేస్తారా?, లేదా తోలగించిన మార్పులను తెలుసుకొనుటకు ఏదయినా వ్యవస్తయున్నదా?
ధన్యవాదములు. అజయ
- మంచిది అజయ్ బాబు గారూ! ముందు మీరు ఎటువంటి సంకోచం లేకుండా అనువాదాలు చేయండి. మీకు సలహాలు, సూచనలు ఇదే పేజీలో అందిస్తాం. మేకేదైనా సందేహాలుంటే ఇదే పేజీలో అడగండి. మేరు ఏ మార్పులు చేసినా సదరు పేజీ యొక్క చరితంలో అవి రికార్డు చేయబడి ఉంటాయి. — రవిచంద్ర(చర్చ) 15:25, 8 మే 2009 (UTC)
ప్రోత్సాహమిస్తున్న రవిచంద్ర గారికి కృతఙతలు, నేను గాలిపటంలో తయారు చేసే విధానం అనువదించాను, శైలి సరిగ్గావుందో లేదో చెప్పగలరు.
ధన్యవాదములు. అజయ
- అజయ్ గారు, మీరు చేసిన మార్పులు వికీపీడియాకు అనుగుణంగా ఉన్నంతవరకు తొలిగించే అవసరం ఉండదు. మీ రచనలలో చిన్న పొరపాట్లు ఉండిఉంటే దాన్ని ఎవరైనా సరిదిద్దవచ్చు. అలా కాకుండా మీరు సృష్టించిన వ్యాసాలు తొలగించాల్సి వస్తే తప్పకుండా మీరు తెలియజేస్తాము ( ఆ అవసరం రాదనుకుంటా). మీరు గాలిపటంలో చేసిన అనువాదం చూశాను, బాగుంది. మీరు ఇలాగే ఏ అనువాదం అయినా చేయవచ్చు. ఆంగ్ల వికీలోని సమాచారం ఆధారంగా మీరు కొత్తగా వ్యాసం కూడా సృష్టించవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:59, 9 మే 2009 (UTC)
నేను భారతస్వాతంత్రోధ్యమము (Indian Freedom Movement ) అనువదిద్దామనుకుంటున్నాను, ఇప్పటికే ఈ అనువాదంయున్నట్లయితే లింకు వివరాలు తేలుపగలరు. నేను వెతికినంతవరకు ఈ వ్యాసంలేదు. అందుకు భారత స్వాతంత్రోధ్యమమనే మొలకను సృష్ఠించాను. AjayaBabu 15:40, 10 మే 2009 (UTC)ఆజయ
అజయ్ గారూ, చక్కటి అనువాద కార్యక్రమాన్ని చేపట్టారు, అభినందనలు అందుకోండి. ఇది వరకు ఈ వ్యాసం లేదు. ఇదియే మొదటి సారిగా వ్రాయబడుచున్నది. బేషుగ్గా వ్రాయండి. కాని వ్యాసం పేరులో అక్షర దోషమున్నది, నేను దాన్ని సరిచేస్తాను, భారత స్వాతంత్ర్యోద్యమము సరైన పదం. మిగతా పేర్లతో దారిమార్పులివ్వవచ్చు. :-)అహ్మద్ నిసార్ 15:55, 10 మే 2009 (UTC)
తెలుగులో రాసి చాలా సంవత్సరాలయింది. తెలుగుని మరచిపోతానేమో అన్నంతగా దూరం అయ్యాను. ఇలా ఇకముందు కాగూడదని ఈ ప్రయత్నం ధన్యవాదాలు -- AjayaBabu 17:26, 10 మే 2009 (UTC)అజయ
- ఈ సబ్జెక్టు నాకు పసందైన సబ్జెక్టు. దాన్ని మీరు వ్రాస్తుంటే నాకు చాలా ఆనందంగా వున్నది. మీరు చాలా చక్కగా వ్రాస్తున్నారు, అక్షరదోషాలు సామాన్యమే, వ్రాస్తూ వుండండి, అన్నీ సవ్యంగా తయారవుతాయి. సహాయసహకారాలు అందించడాని చక్కటి తెవికీ బృందమున్నది. విజయోస్తు. అహ్మద్ నిసార్ 19:40, 10 మే 2009 (UTC)
చక్కటి సలహాలు ఇస్తున్న అహ్మద్ నిసార్ గారికి కృతజ్ఞతలు. నేను జాతీయోద్యమము, సిధూనాగరికత మరియూ నాలుగు మహా విప్లవాలను అనువదిద్దామని ప్రయత్నిస్తున్నాను.అ లాగే కురుక్షేత్రయుద్ధ అనువాదాన్ని పూరించటానికి ప్రయత్నంచేస్తున్నాను.మీరు కౌరవుల పక్షంవహిచిన రాజ్యాల పేర్లు తెలపగలరా!, ఆంగ్లవికీలో సరిగ్గాలేవనిపిస్తుంది.
ముందుకు సాగండి
మార్చుఅజయ్ గారూ! మీ కృషికి అభినందనలు. సింధు లోయ నాగరికత వ్యాసం ఉన్నది. చూడగలరు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాల ఉన్న రాజ్యాల గురించి కాస్త వెతికి, తరువాత వ్రాస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:17, 11 మే 2009 (UTC)