వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 10

సలహా కొరకు

మార్చు

ఎవరో రెడ్డి గారికి సభ్య పేజికి ఉప పేజీలుగా వ్యాసాలు సృష్టించమని సలహా యిచ్చి ఉండవచ్చు.అది సరియైన విధానమేనా! మీ అభిప్రాయాన్ని తెలియ జేయండి...సోము

ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదండి సోముగారు, దానికీ ఒక పరిమితి ఉంటుంది, ఇప్పటివరకైతే దానిపై విధివిధానాలంటూ ఏమీ లేవు. భవిషత్తులో వాటినీ ఎవరైనా దుర్వినిపరిస్తే తప్పకుండా నియమాలు రూపొందుతాయి. కాబట్టి మరికొంతకాలం వేచిచూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:28, 1 మార్చి 2013 (UTC)Reply

అభినందనలు

మార్చు

వికీ తత్వాన్ని, స్ఫూర్తిని బాగా ఆకలింపుచేసుకొని మంచి వికీసభ్యునిగా పరిణితి చెందారు. చాలా ఆనందంగా ఉంది --వైజాసత్య (చర్చ) 03:12, 10 మార్చి 2013 (UTC)Reply

మీ రాక కోసం...

మార్చు

అనుభవజ్ఞులైన మీరాకతో తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశం దిగ్విజయవంతం కాగలదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ .... ఈ నేపథ్యంలో జరుగనున్న ముందస్తు సమావేశాలకు తమరు హాజరై సర్వ సభ్య సమావేశ రూపకల్పన మరియు నిర్వహణకు దిశానిర్దేశం చేయవలసిందిగా నా ప్రత్యేక విన్నపం. ......Malladi kameswara rao (చర్చ) 13:50, 13 మార్చి 2013 (UTC)Reply

ముందస్తు సమావేశాలకు హాజరు కాకున్ననూ నిర్వహణకు కావలసిన రూపకల్పన, దిశానిర్దేశం చేయడానికి ఇక్కడి నుంచే ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:32, 14 మార్చి 2013 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు
తప్పనిసరిగా ఉండవలసిన వ్యాసాల జాబితాను తెలియజేసినందుకు ధన్యవాదాలు. వ్యాసాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.--  కె.వెంకటరమణ చర్చ 06:24, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply
విక్షనరీ లో తెలుగు వాడుక పదాలు అక్షర దోషాలు ఉన్ననూ చేర్చవచ్చా? దోషాలను చర్చా పేజీలో చేర్చించవచ్చా? ఆ పదం అక్షర దోషం కలది అని తేలిసినపుడు నిర్వాహకులు దానిని సరిచేయకూడదా? ఉదాహరణకు "చత్రము" అనే పదాన్ని "ఛత్రము" అని సరిచేయమని చర్చా పేజీలో తెలియ జేశాను. మొదటీ పదాన్ని కూడాసమర్ధిస్తున్నారు. ఇలాఐతే వాడుకలో ఉచ్ఛారణ దోషం గల పథాలు అనేకం ఉంటాయి. తెలుగు భాషాభిమానులుగా నిఘంటువులలో లేని పదాలను కూడా విక్షనరీ లో చేర్చితే దానిని ప్రామాణికంగా అందరూ భావిస్తారా? మీరు నాకుసరైన విధానాన్ని తెలియ జేస్తారని ఆశిస్తాను.   కె.వెంకటరమణ చర్చ 23:44, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply
విక్షనరీలో నేను సభ్యుడిని కానండి. అక్కడి పద్దతులు, నియమాల అనుసారంగా అక్కడి సముదాయంతోనే చర్చలు కొనసాగించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:57, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ముందస్తు సమావేశం విన్నపం

మార్చు

ఏప్రిల్ 10, 11 తేదీలలో హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో జరుగనున్న తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కార్యక్రమానికి తమరు హాజరై, కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావలసిందిగా అభ్యర్ధిస్తున్నాము. అలాగే - కార్యక్రమంలో కొన్ని అంశాలలో మీ ప్రాతినిధ్యం అత్యంత ప్రాధాన్యంగా ముందస్తు సమావేశం భావించి, మీ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినది. కావున ఈ విన్నపం మన్నించి 10, 11 తేదీలలో జరిగే మన తెవికీ మహోత్సవాలకు తమరు తప్పక విచ్చేసి, దిగ్విజయవంతం చేయవలసిందిగా సమావేశం తరఫునా, నా తరఫునా విజ్ఞప్తి చేస్తున్నాను. మా విన్నపానికి మీ సానుకూల స్పందన తెలుపవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను. కృతజ్ఞతలతో ....Malladi kameswara rao (చర్చ) 18:09, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply

అదే రోజు నాకు పుస్తకావిష్కరణ మరియు ఇతర ముఖ్యమైన పని ఉన్నందున తెవికీ మహోత్సవానికి వస్తాను/రాను అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. రేపు రాత్రికల్లా ఏదో విషయం చెప్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:49, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • మీ కార్యక్రమాలు దిగ్విజయం కావాలని కోరుతున్నాను. వాటితో పాటు వీలుచేసికొని ఉదయం లేక సాయంత్ర కార్యక్రమానికి వీలయినంతవరకు హాజరవటానికి ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 23:43, 10 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • అర్జునరావు గారూ, తెవికీ సమావేశాలను చివరి వరకు రావాలనుకున్ననూ అదేరోజు పుస్తకావిష్కరణ మరియు బ్లాగు ఆవిష్కరణ కార్యక్రమం నిర్ణయించబడింది. అయితే నేను రచించిన పుస్తకాలు సకాలంలో అందనందున నా పుస్తకాలు మాత్రం ఆవిష్కరించబడలేవు కాని పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వము బ్లాగు ఆవిష్కరణ మాత్రం జిల్లా కలెక్టరు చేతుల మీదుగా జయప్రదంగా ఆవిష్కరించబడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:32, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • మీ పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వము బాగుంది. కాకపోతే మహబూబ్ నగర్ కు పాత పేరు వాడడంతో కొంత గందరగోళపడ్డాను. వికీపీడియా మహోత్సవములో వికీ అకాడమీలు ఎక్కువగా నిర్వహించాలన్నది ప్రధానమైన సందేశం కాబట్టి, మీ జిల్లాలో వివిధ చోట్ల వికీ అకాడమీలు నిర్వహించటానికి సహాయపడి, మీజిల్లానుండి కొత్త వికీపీడియన్లుఎక్కువగా ప్రవేశించాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 03:36, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • కొత్త వికీపీడియన్లను తెవికీలో చేర్చడానికి నేను ఇదివరకే చొరవ చూపాను కొందరు సభ్యత్వం కూడా తీసుకున్నారు, కాని తెలుగులో టైపు చేయుటలో ఇబ్బంది మరియు ఓపిక లేకపోవడం వల్లనో రచనలు మాత్రం చేయడం లేరు. ఈ జిల్లా కనీసం ముగ్గురు, నలుగురు సభ్యులు చురుగ్గా ఉంటే వికీ అకాడమీ నిర్వహించడానికి వీలవుతుంది. తెవికీ మహోత్సవాల ప్రక్రియను వివరిస్తూ ఒక వ్యాసం తయారుచేస్తే బాగుంటుంది. హాజరు కానివారికి కూడా మహోత్సవం గురించి తెలుగుకోవడానికి వీలవుతుంది. పత్రికలలో తెవికీ ఉత్సవాల గురించి నాకేమి కనిపించలేదు. ఒకవేళ వచ్చిఉంటే క్లిప్పింగ్ రూపంలో పెడితే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:12, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • సౌకర్యాలు గల స్థలంలో(కళాశాల కంప్యూటర్ ప్రయోగశాలలాంటిది) వికీ అకాడమీ నిర్వహిస్తే తెలుగు వికీ పీడియా గురించి మరికొంతమంది తెలుసుకుంటారు. సమావేశ పేజీలోనే నివేదిక రాయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా ప్రదర్శన పత్రాలు, బొమ్మల లింకులు ఇప్పటికే పెట్టాను. --అర్జున (చర్చ) 15:09, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • బొమ్మలు చూశాను బాగున్నాయి. సమావేశ ప్రక్రియ గురించి కూడా సమగ్ర నివేదిక రాస్తూ సమయసమయానికి ఏయే అంశంపై ఎవరు పాల్గొన్నారు, ఆ అంశంపై చర్చ/సమావేశం ఎలా కొనసాగింది, ఫలితమేమిటి, ...ఇలా రాస్తే ఇకముందు జరగబోయే సమావేశాలకు మార్గదర్శకంగా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:27, 15 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఆహ్వానం

మార్చు

తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవంలో చురుకుగా పాల్గొని సభ్యులందరికీ మార్గదర్శకంగా నిలుస్తారని, మీ రాక కోసం ఎదురుచూస్తూ..., మహోత్సవం పేజీలోని పూర్తి కార్యక్రమ వివరాలను ఒకసారి వీక్షించి మీ అభిప్రాయాలను తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 08:13, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

రేపు రాత్రికల్లా నా అభిప్రాయం చెప్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:51, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియా విజయ ఉగాది మహోత్సవానికి ఆహ్వానము

మార్చు

చంద్రకాంతరావు గారు, మీరు చేస్తున్న కృషి అద్వితీయం. తెలుగు వికీపీడియా ఇతర సభ్యులకు మీ స్ఫూర్తినిచ్చే సలహాలు ఎంతో అవసరం. వికీపీడియన్లు పెద్ద స్థాయిలో కలిశే అవకాశం చాలా అరుదు. అలాంటి సందర్భాల్లో ఒకటి ఈ ఉగాదికి హైదరాబాదులో జరుగనుంది. దయచేసి ఈ తెవికీ మహోత్సవానికి తప్పక విచ్చేసి మా అందరికీ వికీ అభివృద్ధిలో తీసుకోవాల్సిన మెళకువలపై సలహాలూ, సూచనలివ్వాలని ప్రార్థన. రహ్మానుద్దీన్ (చర్చ) 08:35, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

చంద్రకాంత రావుగారూ ! మీరు ఈ సమావేశంలో పాల్గొనడం ఆవశ్యకమని నా అభిప్రాయం. ఆలోచించండి.t.sujatha (చర్చ) 16:08, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
సమావేశానికి హాజరు కావాలని నాకూ కోరిక ఉంది కాని అదేరోజు నాకు ఇతర ముఖ్యమైన పనులు ఉండటం వల్ల ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. రేపు రాత్రి వరకు నా అభిప్రాయం చెప్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:53, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
చంద్రకాంత కాంత్‌రావు గారూ ! వీలైతే 10వ తారీఖున పత్రికా సమావేశానికి రావడానికి ప్రయత్నించండి. t.sujatha (చర్చ)
ఉగాది పర్వదినాన హైదరాబాదులో నిర్వహిస్తున్న తెవికీ మహోత్సవానికి హాజరవ్వాలని చివరి వరకు ఎంతో ప్రయత్నించిననూ వ్యక్తిగత కారణాల వల్ల హాజరవడానికి వీలుకావడం లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. నా రాకకోసం మొదటి నుంచీ ఆహ్వానిస్తున సుజాత గారికి, చర్చా పేజీలో నన్ను ఆహ్వానించిన సభ్యులకు, మెయిల్స్ ద్వారా ప్రత్యేకంగా విన్నవించిన సభ్యులందరికీ బాధతో ఈ విషయం చెప్పడానికి విచారిస్తున్నాను. మళ్ళీ ఇటువంటి సమావేశం ఇంత సమీపంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాని అందివచ్చిన ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని వదులుకోవడం, ఇన్ని సంవత్సరాలుగా కేవలం తెవికీ చర్చలతోనే సంభాషించిన సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం వదులుకుంటున్నందుకు ఒకవైపు నిరుత్సాహంగా ఉన్ననూ సమావేశానికి హాజరైన సభ్యులు మన తెవికీ మహోత్సవాన్ని జయప్రదమొనర్చి పేరుతెస్తారనే ఆశాభావంతో ఉన్నాను. కార్యక్రమంలో కొన్ని విషయాలలో నిర్వాహకత్వం వహించడానికి, బాధ్యత తీసుకోవడానికి నా పేరు ప్రతిపాదించిన వారికీ, సహకరించిన వారందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. నేను ప్రత్యక్షంగా రాకున్ననూ నాపై ఉన్న నమ్మకంతో కొన్ని విషయాలలో నాపేరు ప్రతిపాదించినందులకు నాపై పెట్టుకున్న నమ్మకాని పూర్తిగా వమ్ము చేయకుండా కనీసం సంక్షిప్త ఉపన్యాసమైననూ పంపడం సమంజసం అనుకుంటున్నాను. ఎవరైననూ నా సందేశం చదివి వినిపిస్తే నేను హాజరు కాకున్ననూ మహోత్సవంలో నా వాణి పరోక్షంగా వినిపించినందులకైననూ నేను సంతోషపడగలుగుతానని తెలియజేస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:20, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply
తెలుగు వికీపీడియా ప్రస్థానం:

దాదాపు దశాబ్దం క్రిందట డిసెంబరు 2003లో వెన్న నాగార్జున సవాలుగా తీసుకొని ఆరంభించిన మన తెలుగు వికీపీడియా ప్రారంభంలో మందగమనంలో ఉన్ననూ క్రమక్రమంగా సభ్యుల సంఖ్య, వ్యాసాల సంఖ్య వృద్ధికావడంతో మూడంకెలు, నాలుగంకెలు, ఐదంకెల సంఖ్య గల వ్యాసాల మైలురాళ్లను అధికమించి దేశభాషా వికీలలో ప్రథమస్థానం కూడా పొందినది. హిందీ, తమిళ వికీలు వ్యాసాల సంఖ్యలో నేడు మనల్ని అధికమించిననూ దేశభాషా వికీలలో పాతికవేల వ్యాసాల మైలురాయిని దాటిన తొలి వికీగా మన రికార్డును మాత్రం ఎవరూ చెరపలేనిది. తెవికీ ప్రస్థానాన్ని సంవత్సరాల వారీగా చూస్తే తొలి ఏడు ఏమంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. వ్యాసాల సంఖ్య రెండంకెలు దాటడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. 2004లో చావాకిరణ్, వీవెన్, వేమూరి, 2005లో వైజాసత్య, చదువరి, ప్రదీప్, త్రివిక్రంల చేరికతో వ్యాసాల సంఖ్యలో కదలిక వచ్చి విశేష పురోభివృద్ధి కనిపించింది. సెప్టెంబరు 2005లో వ్యాసాల సంఖ్య నాలుగంకెలకు చేరింది. 2006లో కాసుబాబు, సుజాత, రహమతుల్లా, చిట్టెల, నవీన్‌ల చేరిక మరియు ఇదివరకటి సభ్యుల సహకారంతో వ్యాసాల సంఖ్య పాతికవేల మైలురాయిని దాటింది. తెవికీలో గ్రామవ్యాసాలు చేర్చడం ఈఏటి విశేషంగా చెప్పుకోవచ్చు. 2007లో రాజశేఖర్, అహ్మద్ నిసార్, రవిచంద్ర, అర్జునరావు, మాటలబాబు, దేవాలతో పాటు నేను (చంద్రకాంతరావు) చేరాను. ఈ ఏడు వ్యాసాల సంఖ్య దాదాపు 38000కు చేరింది. 2008 తలపాగల రాజు, శివరామప్రసాద్, బొజ్జలు చేరినవారిలో ముఖ్యులు. ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో కవర్ పేజీగా తెలుగు వికీపీడియా వ్యాసం రావడంతో ఫిబ్రవరి 2008లో తెవికీకి విశేష ఆదరణ లభించింది. సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు, ఉన్న సభ్యులు ఉత్సాహంగా పనిచేయడంతో తెవికీ గుణాత్మకంగానూ, పరిమాణాత్మకంగానూ వృద్ధి చెందింది. పుణ్యక్షేత్రాలు, శాస్త్రసాంకేతిక రంగాలు, ఆర్థికశాస్త్రం, క్రీడలు, నియోజకవర్గాలు, ఇస్లాం లాంటి రంగాలలో వ్యాసాల పురోభివృద్ధి కొనసాగింది. సంవత్సరం అంతం వరకు 42 వేల వ్యాసాలు తయారయ్యాయి. 2009లో చేరినవారిలో సుల్తాన్ ఖాదర్, వీరా, జయంత్ కుమార్, ముక్తేశ్వరి ముఖ్యలు. ఈఏడు మొత్తంపై సుమారు 2000 వ్యాసాలు కొత్తగా చేరాయి. ఉన్న వ్యాసాలలో సమాచారం వృద్ధి చెందింది. వ్యాసాల నాణ్యత పెరిగింది. 2010లో చేరిన వారిలో జెవిఆర్‌కె ప్రసాద్ ముఖ్యలు. వ్యాసాల సంఖ్య వృద్ధిలో చూస్తే క్రితం సంవత్సరంవలె సుమారు 2000 వ్యాసాలు మాత్రమే కొత్తగా చేరిననూ ఇవన్నీ ప్రయోజనకర వ్యాసాలేనని చెపవచ్చు. ఇదివరకు చురుకుగా ఉన్న కొందరు సభ్యులు దిద్దుబాట్లు తగ్గించిననూ కొత్తగా చేరినవారు ఓ లోటుపూడ్చడానికి ప్రయత్నించారు. 2011, 2012లలో భాస్కరనాయుడు, వైవిఎస్ రెడ్డి, పాలగిరి, రహ్మానుద్దీన్, శ్రీధర్, వెంకటరమణ చేరినవారిలో ముఖ్యలు. ఈ రెండు సంవత్సరాలలో కూడా వ్యాసాల వృద్ధి మామూలుగానే ఉన్ననూ నాణ్యత మెరుగుపడిందని చెప్పవచ్చు. 2013లో ఇప్పుడు జరిగే తెవికీ మహోత్సవంతో తెలుగు భాషాభిమానులు, ఔత్సాహికులు సభ్యులుగా చేరి తెవికీ వ్యాస సంపదను, నాణ్యతను పెంపొందిస్తారని తద్వారా అంతర్జాలంలో తెలుగు విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారని భావిస్తున్నాను.

(సమయం లేనందున తెవికీపై పూర్తి విశ్లేషణ చేయలేను) 11వ తేది నాడు కూడా రావడానికి వీలుకాకుంటే "దిద్దుబాట్లు సూచనల" గురించి మరో సందేశం పంపగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:20, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply

  • చక్కనైన చిన్న సందేశం ద్వారా తెవికీ ప్రస్థానాన్ని తయారుచేసినందులకు ధన్యవాదాలు. నిన్న ఈ అంశం వీలవనందున ఈ రోజు సమావేశంలో చేపట్టబడుతుంది. మీరు రాగలిగితే మరింత విస్తారంగా నేరుగా సభ్యులతో మీరే పంచుకోగలరు. --అర్జున (చర్చ) 23:39, 10 ఏప్రిల్ 2013 (UTC)Reply

మూసల గురించి

మార్చు

మొదట మూసల గురించి తెలియక చేర్చాను. తర్వాత రాజశేఖర్ గారితో మాట్లాడి ఆపివేశాను. ప్రస్తుతం వ్యాసాలను వృద్ధిచేస్తున్నాను.--  కె.వెంకటరమణ చర్చ 17:00, 4 మే 2013 (UTC)Reply

సూచనకు ధన్యవాదాలు. వ్యాసాల మొలక వ్యాసాల విస్తరణ పై దృష్టి పెడతానని తెలియజేసుకుంటున్నాను.--  కె.వెంకటరమణ చర్చ 17:06, 4 మే 2013 (UTC)Reply
వ్యాస స్థాయి చూడకుండా మూసలు పెట్టడం నా తప్పు అని నాకు తెలిసిన తర్వాత నేను ఆ పని ఎలా చేయగలుగుతాను. మీరు సరైన సలహా యిచ్చి యిపుడు ఎలాంటి మూసలైనా పెట్టమనండం లో అర్థమేముంది. వ్యాస స్థాయి చూసి పెట్టమనడంలో అర్థముంటుంది కదా. మీ అభిప్రాయాన్ని గౌరవించి నేను వ్యాస విస్తరణలు చేస్తున్నాను.--  కె.వెంకటరమణ చర్చ 15:47, 5 మే 2013 (UTC)Reply
రమణ గారు, నేను చురుకుగా ఉన్నప్పుడు వందలాది కొత్తసభ్యులకు ఎన్నో సూచనలు చేశాను. నా సూచనలు, అభిప్రాయాలు పాటించారు, గౌరవించారు. కాని ఇటీవల కాలంలో నేను ఏమి చేసిననూ సీనియర్ సభ్యులు వ్యతిరేకంగానే చూస్తునారు. ప్రతిఒక్కరు వారికి నచ్చినది చేస్తుంటే తెవికీ సమాజం ఎందుకు? అందరికీ ఆమోదమోగ్యమైనట్టుగానే చేయాలని మీకూ తెలుసు కదా! ఇలా ఎవరికి వారి నచ్చినదే చేస్తుండబట్టి నేను కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను. నిన్న నేను చేసిన సూచన మీకు నచ్చింది కాని వైజాసత్యకు నచ్చలేదట! అతను మనకు పేద్ద అధికారి కదా!! ఆయన విలువైన సూచన మేరకు నేను నిన్న చేసిన సూచనను ఉపసంహరించుకుంటున్నాను. ఇక ఎవరైనా ఏమైనా చేయవచ్చట!! పెద్దమార్పులే చేయాల్సిన అవసరం లేదట! అది నాకు తెలుసు కాని, మరి బాటులెందుకు? సరే నాకూ చిన్నమార్పులు చేయవచ్చని చూపిస్తాను. ధన్యవాదములతో సి. చంద్ర కాంత రావు- చర్చ 15:56, 5 మే 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

మార్చు
 
నమస్కారం C.Chandra Kanth Rao గారూ. మీకు T.sujatha గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 17:07, 5 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

t.sujatha (చర్చ) 17:07, 5 మే 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

మార్చు
 
నమస్కారం C.Chandra Kanth Rao గారూ. మీకు T.sujatha గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 17:35, 5 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

t.sujatha (చర్చ) 17:35, 5 మే 2013 (UTC)Reply

అధికార హోదా ప్రతిపాదన

మార్చు

చంద్రకాంతరావు గారూ, మిమ్మల్ని అధికార హోదా కొరకై ప్రతిపాదించాను. ప్రతిపాదనకు మీ సమ్మతిని ఇక్కడ తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 05:15, 6 మే 2013 (UTC)Reply

వైజాసత్య గారూ, అధికారి హోదాకొరకు నా పేరు ప్రతిపాదించినందులకు కృతజ్ఞతలు. కాని ఈ హోదా స్వీకరించుటకు నాకు ఆసక్తి లేనందున మీ ప్రతిపాదనపై సమ్మతి తెలుపడం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:04, 8 మే 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకై విజ్ఞప్తి పై వివరణ

మార్చు

మీరు నన్ను నిర్వాహక హోదాకై ప్రతిపాదించుటకు సిద్ధమైనందుకు ధన్యవాదములు. కానీ నేను ప్రస్తుతం నిర్వాహక హోదాను కోరుకొనుటలేదు. తెవికీలో వ్యాసాల నాణ్యతను పెంచుటకు, అభివృద్ధికి నిర్వాహకులే కానక్కర్లేదని నా అభిప్రాయం. మీ వంటి అనుభవజ్ఞులైన నిర్వాహకులు సెలవు నుండి తిరిగివచ్చి క్రియాశీలకంగా పనిచేస్తారని మీ అధ్వర్యంలో సహ సభ్యులు మరింత కృషిచేస్తారని ఆశిస్తాను. --  కె.వెంకటరమణ చర్చ 13:53, 9 మే 2013 (UTC)Reply

సరే మీ ఇష్టం. ఇక నా గురించి చెప్పాలంటే నేను సెలవెందుకు పెట్టానో మీకు తెలుసేననుకుంటాను. ఇక్కడ సెలవులో ఉన్ననూ నేను పురాతన గ్రంథాలు, క్షేత్రపర్యటనల ద్వారా పాలమూరు జిల్లాకు చెందిన సమాచారం సేకరిస్తూ దానిపై పరిశోధన చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు సమయం లభించినప్పుడు తెవికీని కూడా దర్శిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:03, 10 మే 2013 (UTC)Reply

అధికార హోదాకు మద్దతు

మార్చు

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:00, 13 మే 2013 (UTC)Reply


కుశలమా

మార్చు

చంద్రకాంతరావు గారూ నమస్తే, అధికారిక హోదాకు మీరు అన్నివిధాలా అర్హులే, ఇంకోసారి ఆలోచించి మీ సమ్మతినివ్వండి. అహ్మద్ నిసార్ (చర్చ) 12:01, 20 మే 2013 (UTC)Reply

నమస్తే నిసార్ గారూ, చాలా రోజుల తర్వాత చర్చలలోకొచ్చాము. నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:34, 20 మే 2013 (UTC)Reply

మూసలు

మార్చు

కొన్ని మూసలు కుంచించుకు పోయినట్లు కనిపిస్తున్నవి. దానికి కారణం తెలియదు. వీలుంటె సరిచేయగలరు. ఉదా: {{భారతీయ గణిత శాస్త్రవేత్తలు}}-- -- కె.వెంకటరమణ చర్చ 18:23, 16 జూలై 2013 (UTC)Reply

అవును, కొన్ని మూసలు కుంచించడమే కాకుండా చాలా మూసల వెడల్పు అధికమైంది. ఇటీవల కాలంలో మూసలలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా తెవికీలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర వికీల నుంచి దిగుమతిచేస్తున్న మూసల వల్ల కూడా వైరుధ్యం ఏర్పడే అవకాశముటుంది. దీన్ని పరిశీలించి సరిచేయాలంటే కొద్దిగా సమయం అవసరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:40, 16 జూలై 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకు మద్దతు

మార్చు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:36, 18 జూలై 2013 (UTC)Reply

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు

మార్చు

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:52, 22 జూలై 2013 (UTC)Reply

బ్లాగు లింకులు

మార్చు

మీరు తెలియజేసిన బ్లాగులింకుల వలన కలిగే యిబ్బంది తెలుసుకొన్నారు. యికపై సమాచారం చేర్చేటప్పుడు వాటి మూలమైన లింకులు యిస్తాను. ఈ బ్లాగులలో కూడా పత్రికలలో గల వ్యాసాలు కాపీచేసినవె ఉన్నాయి. పత్రికల వెబ్ సైటులలో వ్యాసం ఉంటే వాటి లింకులు యివ్వవచ్చా? తెలియజేయగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 17:58, 6 సెప్టెంబర్ 2013 (UTC)

కొన్ని పోస్టుల చివరన పత్రికల పేర్లు ఇచ్చారు. అంటే అసలు మూలం అదే కావచ్చు. కాబట్టి మనం ఆ మూలాలను ఇవ్వవచ్చు. కాని అట్టి సమాచారం నుంచి తెవికీలో కొన్ని వాక్యాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. పేరాలు లేదా అధిక సమాచారం తీసుకోవడానికి వీలుండదు. వాక్యం చివరన <ref></ref> మధ్యలో అసలు మూలం పేర్కొనవచ్చు. వాటివల్ల ఇబ్బంది ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:05, 6 సెప్టెంబర్ 2013 (UTC)

బొమ్మలగూర్చి

మార్చు

సరే! మీరు తెలియజేసినట్లు ఆ వెబ్ నుండి చిత్రాలను చేర్చను. కానీ వివిధ వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే చిత్రాలనూ చేర్చవచ్చా? కొన్ని వెబ్‌సైట్లలో గల చిత్రాల కాపీహక్కులు కలవి, సార్వజనీనమైనవో ఎలా తెలుసుకోవాలో తెలియజేయగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 18:00, 9 సెప్టెంబర్ 2013 (UTC)

కాదండి, పత్రికల చిత్రాలు కూడా కాపిరైట్ ఉన్నవే కాబట్టి దాన్నీ మనం ఇక్కడ చేర్చలేము. తెవికీలో సమాచారం కాని, బొమ్మలను కాని ఏదైనా సరే చేర్చాలన్ననూ ఎక్కడి నుంచి కాపీచేయరాదు. సమాచారంకైతే మాత్రం ప్రామాణిక గ్రంథాలనుంచి కొన్ని వాక్యాలు తీసుకొని రెఫరెన్స్ ఇవ్వవచ్చు కాని బొమ్మలకు ఆ అవకాశం కూడా లేదు. స్వయంగా మనం తీసిన లేదా సార్వజనీనమైన చిత్రాలనే ఇక్కడ వినియోగించాల్సి ఉంటుంది. మీరు కాపీచేసిన బొమ్మలకు సంబంధించిన సైట్ కిందుగా కాపీరైట్ హెచ్చరిస్తోంది కూడా. ఒకవేళ కాపైరైట్ లేకున్ననూ మనం కాపి చేయరాదు. వెబ్‌సైట్ వారు వారి సమాచారం/బొమ్మలు సార్వజనీనమని ఖచ్చితంగా ప్రకటిస్తే తప్ప మనం కాపీచేయరాదు. మరి సార్వజనీనం అని ఎలా తెలుసుకోవాలంటారా? అది సింపుల్ "ఇక్కడి సమాచారం/బొమ్మలు ఎవరైనా వినియోగించుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు" ఇలాంటి (లేదా ఈ అర్థంతో కూడిన) ప్రకటన గనుక ఉంటే నిరభ్యంతరంగా మనం కాపీచేసుకోవచ్చు. మన తెవికీలో ఉన్నది ఇదేకదా! సాధారణంగా ఇలా ఎవరూ ప్రకటించరు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరోవిషయం కూడా చెబుతాను మనం స్వయంగా తీసిన చిత్రాలకు కూడా పరిమితులున్నాయి. ఉదాహరణకు ఒక పుస్తకానికి ఫోటోలు తీసి దానికి సంబంధించిన పేజీలు పెట్టలేముకదా! ఒక రహస్య స్థలానికి సంబంధించిన బొమ్మ మనం రహస్యంగా స్వయంగా తీసిననూ దానికి ఇక్కడ అనుమతి ఉండదు. ఇదివరకు కొందరు సభ్యులు అంతగా అవసరమైతే కాపిరైట్ బొమ్మలు కూడా అప్లోడ్ చేసి ఫెయిర్‌యూజ్ లైసెన్స్ కింద చేర్చారు. నేను కూడా మీ బొమ్మలు అప్లోడ్ 3 రోజుల నుంచి గమనించే, చాలా సంఖ్యలో అప్లోడ్ చేయడం బట్టే సూచనలిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 9 సెప్టెంబర్ 2013 (UTC)
కాపీరైట్ కు విరుద్ధంగా నేను ఎక్కించిన బొమ్మలను తొలగించగలరు -- కె.వెంకటరమణ చర్చ 18:38, 9 సెప్టెంబర్ 2013 (UTC)
వాటిని నేను తొలిగించను. సాధారణంగా కొత్తసభ్యులు ఎవరైనా నిబంధనలు తెలియక అప్లోడ్ చేసియుంటే తొలిగించేవాడిని. మీకూ నిర్వాహకహోదా ఉంది, అనుభవముంది. కాపీరైట్ నిబంధనలు తెలుసే అనుకున్నాను. ఏదో ఒక వ్యాసంలో ఒక బొమ్మ మరీ అవసరం అయినప్పుడు ఫెయిర్‌యూజ్ లైసెన్స్ తో చేర్చిననూ ఆ బొమ్మ ఉపయోగించే ప్రతి సందర్భంగా ఈ విషయాన్ని తెలుపాల్సి ఉంటుంది. హెచ్చుసంఖ్యలో ఒకే సైట్ నుంచి కాపిరైట్ బొమ్మలు కాపిచేసి అప్లోడ్ చేయడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వ్యాసాలలో కాపిరైట్ మూసను ఉంచాను వారం లోపు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే బ్లాగు నుంచి కాపిచేసి చేర్చిన బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రభ పత్రికవారు నా బ్లాగు నుంచి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు కాపి చేసి ప్రచురించికొని నాచే చీవాట్లు తిన్నారు. (చూడండి) వారిపై లీగల్ కేసు కూడా పెట్టాలనుకున్ననూ ఫోన్ చేసి పత్రికలో కాపిచేయడం ఆపివేస్తామని చెప్పడంతో తాత్కాలికంగా వదులుకున్నాను. ఇలా కాపిచేయడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 9 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారూ, మీ మంచి సూచనలు సలహాలు యిచ్చినందుకు ధన్యవాదాలు. నేను మొదట్లో శాస్త్ర విజ్ఞాన వ్యాసాలు వ్రాస్తున్నప్పుడు స్వయంగా తయారుచేసి చిత్రాలను అప్‌లోడ్ చేయడం జరిగినది. అయితే నేను "వికీ ప్రాజెక్టు - తెలుగు ప్రకుఖులు" ప్రాజెక్టులో తెలుగు ప్రముఖుల వ్యాసాలను వృద్ధి చేయుటలో భాగంగా సమాచార పెట్టెలు చేర్చుట కొరకు చిత్రాలను చేర్చు నిమిత్తమై నాకు గల సందేహాలను కొంత మంది నిర్వాహకులకు అడగటం జరిగినది. వారు "ఫైర్ యూస్" లైసెన్సు కొరకు ఒక చిత్రం వాడుకోవచ్చు అని సలహానిచ్చినందువల్ల నేను చిత్రాలను చేరుస్తున్నారు. యిప్పటికి అనేక చిత్రాలను ఫైర్ యూస్ లో చేర్చడం జరిగినది. మీరు ఆప్పటికి నిర్వాహకులే కదా. మొదట్లో సభ్యుడనైన నాకు సరైన మార్గనిర్దేశం చేసి యుంటే బాగుండేది. గతం లో వైజాసత్య గారు కూడా నా చర్చాపేజీలో "కాపీహక్కులున్న బొమ్మలు" విభాగంలో తగు సూచనలిస్తూ, పైర్ యూజ్ కొరకు ఒక చిత్రం వాడుకోవచ్చు అని తెలియజేశారు. అందువలన నేను "లీలావతి కూతుళ్ళు" ప్రాజెక్టులో కూడా శాస్త్రవేత్తల వ్యాసాలలో సమాచార పెట్టెలు చేరుస్తున్నాను. ఈ విషయం గమనించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 13:03, 10 సెప్టెంబర్ 2013 (UTC)
ప్రారంభంలో మీరు స్వయంగా గణితశాస్త్రానికి, భౌతికశాస్త్రానికి సంబంధించిన బొమ్మలు తయారుచేయడం నేను గ్రహించాను. అది చాలా మంచి కార్యం. ఆ తర్వాత నేను తెవికీ సెలవులో వెళ్ళడం, చాలా అరుదుగా మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతోంది. కాబట్టి రోజూ ప్రతి సభ్యుని దిద్దుబాట్లు పరిశీలించడం, తగిన సూచనలివ్వడం సాధ్యం కావడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే సార్వజనీనం కాని బొమ్మలు తెవికీలోకి అప్లోడ్ చేయడం చాలాచాలా అరుదుగా మాత్రమే జరగాలి. ఫెయిర్‌యూజ్ బొమ్మలను అసలే వాడరాదని నేనుచెప్పడం లేదు, కాని ఒకే వెబ్‌సైట్ నుంచి హెచ్చుసంఖ్యలో బొమ్మలు అప్లోడ్ చేయడం మాత్రం సమంజసం కాదని మాత్రం చెప్పగలను, అది కాపిరైట్ నిబంధనలకు విరుద్ధంగా భావించబడుతుంది. ఇదివరకు వైజాసత్య గారు మీకిచ్చిన సూచన ఇప్పుడే చూశాను. బహూశా మీరు ఒకే వ్యాసంలో ఒకటికి మించి ఫెయుర్‌యూజ్ బొమ్మలను వాడే సందర్భంగా ఆయన అలా చెప్పి ఉంటారని అనుకుంటున్నాను, కాని ప్రతీపేజీలో ఫెయిర్‌యూజ్ బొమ్మ వాడటాన్ని మాత్రం చెప్పరు. మనం ఫెయిర్‌యూజ్ ట్యాగుతో అప్లోడ్ చేస్తూ ఒక వెబ్‌సైటులోని అన్ని బొమ్మలను వాడటాన్ని ఎవరూ హర్షించరు సరికదా తర్వాత కాపిరైట్ ఇబ్బందులు షరామామూలే! మీరు అప్లోడ్ చేసిన బొమ్మలు ఆ సైటువారికి తెలిస్తే మాత్రం లబోదిబోమనడం ఖాయం. ఎందుకంటే ఒక బొమ్మ కొరకు ఎంతకష్టపడాలో నాకు బాగా తెలుసు. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి సంపాదించిన బొమ్మలను సార్వజనీనం చేయడాన్ని వారు ఒప్పుకోరు. మనం లైసెన్స్ ట్యాగ్ పెట్టినా తెవికీలో ఉండేది సార్వజనీనమనే సాధారణంగా అందరూ అనుకుంటారు కాబట్టి ఫెయిర్‌యూజ్ బొమ్మలు కూడా దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ఫెయిర్‌యూజ్ బొమ్మ వాడడానికి ముందు అలాంటి బొమ్మ పొందడం మనకు సాధ్యమా? స్వయంగా సంపాదించుకోలేమా? ఇలాంటి బొమ్మలు సార్వజనీనంగా ఎక్కడైనా లభమౌతాయా? ఇలా రకరకాలుగా ఆలోచించి ఏదీ సాధ్యం కానప్పుడు, ఒక వ్యాసంలో ఖచ్చితంగా బొమ్మ పెట్టాల్సి వచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే నిబందనలకు లోబడి అలాంటి బొమ్మలు తీసుకోవడానికి ఫెయిర్‌యూజ్ ట్యాగ్ అవకాశం కలిస్తుంది, అంతేకాని ప్రతివ్యాసంలో ఫెయిర్ యూజ్ బొమ్మలు పెట్టడానికి అవకాశముండదు. అంతేకాకుండా ఫెయిర్‌యూజ్ తో వాడే బొమ్మలు మనం సైటు నుంచి తీసుకున్న వాటికంటే తక్కువ రెజుల్యూషన్‌తో వాడాల్సి ఉంటుంది. అలాంటి బొమ్మలను మొదటిపేజీలో ఎలాంటి పరిస్థితుల్లోను వాడరాదు. ఇలా వీటికి సవాలక్ష పరిమితులున్నాయి. నేను కూడా ప్రారంభంలో చాలా బొమ్మలను తెవికీలో చేర్చాను కాని అవన్నీ స్వయంగా తీసినవే. మీకు మరిన్ని ఏవైనా సందేహాలుంటే తప్పనిసరిగా అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 10 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీ నిర్వహణ

మార్చు

తెవికీలో మళ్ళీ క్రియాశీలకంగా నిర్వహణను కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. --వైజాసత్య (చర్చ) 02:08, 11 సెప్టెంబర్ 2013 (UTC)

నా నిర్వహణపై వ్యాఖ్యానించినందులకు ధన్యవాదాలు. పాలగిరి గారు చెప్పినట్లు నిర్వహణ అనేది బాధ్యతగా చేపట్టాలి. అయితే తెవికీ కార్యం అనేది మనకు ప్రవృత్తి మాత్రమే కాబట్టి రోజూ వచ్చి రచనలు, నిర్వహణ చేయాలని ఏమీ లేదు. అయితే దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణను పట్టించుకోకపోవడం సమంజసం కాదు. మనం ఇక్కడ రచనలు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న రచనలను కాపాడుకోవడం మరియు రోజూవారి దిద్దుబాట్లను క్రమపద్దతిలో ఉంచడం అంతకంటె ముఖ్యమైనది. ఇవన్నీ క్రియాశీలకంగా ఉండే నిర్వాహకులే చేయాల్సిన బాధ్యత. నిర్వహణను ఎవరూ పట్టించుకోనప్పుడు జన సంచారంలేని వీధులు చెట్లు, పుట్టలలో నిండిపోయినట్లుగా లేదా కొంతకాలం మనుషులు నివశించని ఇల్లు చెత్తాచెదారంతో, సాలెగూళ్ళతో, దుమ్ము-ధూళితో కూడి ఉండినట్లుగా గోచరించడం ఖాయం. రోజూ ఎందరో కొత్తవారు వస్తుంటారు, వారందరూ రెగ్యులర్ సభ్యులు కారు, నియమాలు తెలియవు, తమ ఇష్టమున్నట్లు రాసుకుంటారు, వాటన్నింటినీ వికీకరణ, తొలిగింపులు చేయాల్సి ఉంటుంది. కొందరు పాతసభ్యులైనా వికీ నియమాలు అంతగా తెలియని వారుంటారు, వారికీ అప్పుడప్పుడూ గుర్తుచేస్తుండాల్సి ఉంటుంది. అవన్నీ నాకెందుకులే, నా దిద్దుబాట్లే నాకు ప్రధానం కదా అనుకునే వారు కూడా ఉండవచ్చు. అలాంటివారివల్ల కూడా పెద్దగా ప్రమాదం లేకపోవచ్చు కాని, నియమాలను విరుద్ధంగా ఉన్నప్పుడు ఎవరికైనా తెలియజేసినప్పుడు మాత్రం, నియమాలు తెలియజేసిన వారిపైనే ఎగరే వారూ ఉంటారు, వారితోనే తెవికీకి ప్రమాదం. వారు చెప్పరూ, ఇతరులకు చెప్పనీయరు. అయినా సరే మనపని మనం చేయాలి, మన బాధ్యత మనం నెరవేర్చాలి, మన లక్ష్యాన్ని మనం సాధించాలి, తెవికీ గమ్యాన్ని మనం చేర్చాలి. ఇక్కడ మనకు వ్యాసాలే ప్రధానం కాని సభ్యులు కాదుకదా! మన నిజ జీవితానికి మన తెవికీ ప్రస్థానానికి చాలా తేడా ఉంటుంది. మన లక్ష్యం తెవికీకి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాని మనం మంచివారమని పేరు తెచ్చుకోవడానికి ఇక్కడ పని చేయడం లేదుకదా! మనం మంచిపేరు తెచ్చుకోవాలని ఎవరికీ ఏమీ చెప్పకుండా ఉంటే నిర్వహకులుగా ఉండి ప్రయోజనమేమిటి? నిర్వహణహోదా అనేది అలంకారప్రాయ హోదా కాదుకదా! నిర్వహణ చేస్తున్నప్పుడు వ్యాసాలు, బొమ్మలు తొలిగిస్తున్నప్పుడు కొందరికి కోపం వచ్చి ఉన్న కోపమంతా మనపై కుమ్మరిస్తారు. నాలుగేళ్ల క్రితం నియమాలకు విరుద్ధంగా మొదటి పేజీలో బొమ్మ పెట్టడానికి ఒక సభ్యుడు ప్రయత్నిస్తే, ఆలా చేయడాన్ని నేను వాయిదా వేయదలిస్తే ఎంత ఎగిరాడో మీకు బాగా తెలుసు. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకులు ఎదిరిస్తేనే ముందుకు పోగలం. నియమాలకు విరుద్ధంగా ప్రయత్నించిననూ వారికి మనమేం చెప్పరాదనుకుంటే మరి నిర్వాహకులుగా ఉండి ప్రయోజనమేమిటి? నేను సెలవులో ఉన్నందున ఇక్కడికి రోజూ రావడానికి వీలుకావడం లేదు. 4 రోజుల క్రితం యాధృచ్ఛికంగా వచ్చి పాత కూర్పులు, ఇటీవలి కొత్త వ్యాసాలు చూస్తే చాలా రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పత్రికల సమాచారం ఉన్న బ్లాగుల నుంచి సమాచారం కాపీచేస్తున్నట్లుగా గమనించి రచ్చబండలో కొనసాగుతున్న చర్చకు భిన్నంగా సూచనలు చేశాను. ఇటీవలి కాలంలో నిర్వాహకులు రోజూవారీ నిర్వహణ చేయకపోవడంతో కొత్త సభ్యులకు నియమాలపై అవగాహన రావడం లేదు. కొందరు అనుభవమున్న సభ్యులు కూడా ఇప్పటికీ నియమాలకు విరుద్ధంగానే చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరికీ నియమాలపై వందశాతం అవగాహన ఉండదు కాని ఉన్న నియమాలు చెబుతూ, చెప్పించుకుంటూ ఉంటే మిగితావారికీ దీనిపై అవగాహన వస్తుంది. నియమాలు కూడా ఒక్కొక్కరు ఒక్కోరకంగా అర్థంచేసుకోవచ్చు, అది మామూలే. నియమాలు స్పష్టంగా ఉండటం, అలా చేయడం చాలా కష్టం. ఇక్కడే కాదు ప్రముఖ చట్టాలు కూడా స్పష్టంగా లేనందువల్ల ఒకే కేసుకు సంబంధించి ఒక్కో లాయరు ఒక్కో విధంగా వాదిస్తారు. క్రిందికోర్టులో వీగిపోయిన ఒక కేసు అవే చట్టాలు, నియమాలతో పై కోర్టులో ఎలా నెగ్గుతుంది అనే దానికి ఇదే కారణం. మళ్ళీ తెవికీ విషయానికి వస్తే మనం ఒక తెవికీ రాజ్యాంగాన్ని రచించుకొని నియమాలు ఇప్పడు ఉన్నవాటికంటే కాస్త స్పష్టంగా ఉండేటట్లుగా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై నేను ఇదివరకే ఆలోచించాను కాని సెలవులోకి వెళ్ళడం వల్ల వీలుకాలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:05, 11 సెప్టెంబర్ 2013 (UTC)
మీరు చెప్పినవాటిలో చాలామటుకు అంగీకరిస్తున్నాను. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వాళ్ళలో చాలామందికి ఇది తెలుగులో విషయాలు వ్రాసే వెబ్‌సైటుగానే అర్ధం అయ్యింది కానీ వికీస్ఫూర్తి అర్ధం కాలేదు. మీకు చాలా విషయాలు తెలుసు, మీరు కాస్తా కరుకుగా చెప్పినప్పుడు దాన్ని, నేను మీరు దృష్టికోణం నుండి చెబుతున్నారో చూపించడానికి ప్రయత్నించానే తప్ప, ఏదో మంచివాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయమేమీ లేదు. ముఖ్యంగా పట్టూ విడుపూ ఉండాలన్న వికీ ధోరణిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని ఆచరించాను. పోన్లెండి నా సోదెందుకు కానీ, ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటారు. విష్ణు గారికి నేను నియమనిబంధనలు, వికీపద్ధతులపై కొన్ని వీడియోలు తయారుచేసే క్రమంలో సమాచారం అందిస్తానని మాటిచ్చాను, ఇంకా క్రియాశీలక సభ్యులకు నియమనిబంధనలలో శిక్షణ కూడా ఇవ్వాలి. మీరు నాకు సహాయం చెయ్యగలరా? --వైజాసత్య (చర్చ) 04:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు, మీ వ్యాఖ్యకు స్పందించడం మరియు మీ చర్చాపేజీలో వ్రాయడంతో నేను చేసిన చర్చ మీ గురించేనని అనుకుంటున్నారు. అదేమీ కాదండీ, ప్రస్తుత తెవికీ పరిస్థితులకు అనుగుణంగానే, సాధారణ దృష్టితోనే చర్చ చేశాను కాని మీపై గాని మరే సభ్యునిపైగాని నేను ప్రత్యేకంగా దృష్టిపెట్టలేను. నిర్వహణలో భాగంగా కొన్నిసార్లు సభ్యులకు వివరంగా చెప్పవలసి వచ్చింది, దానికి అప్పటి పరిస్థితులు, సభ్యుల ధోరణులు కూడా దానికి కారణమయ్యాయి కాబట్టి వాటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అందరూ తలా కొద్దిగా నిర్వహణ బాధ్యత తీసుకుంటే ఇలాంటి సమస్యే ఉత్పన్నం కాదు. ప్రతి ఒక్కరు తాము చేసేదే సరైనదనుకునే ధోరణి కూడా ఉంది. సూచించిన పొరపాట్లను కూడా సభ్యులు మళ్ళీమళ్ళీ చేయడంతో తెవికీ నిర్వహణ చేయలేక, తెవికీలో జరుగుతున్న పొరపాట్లు, నియమనిబంధనల ఉల్లంఘనలు చూడలేక చివరికి సెలవులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రియాశీలక సభ్యులకు నియమనిబంధనలలో శిక్షణ ఇవ్వాలనే మీ అభిప్రాయానికి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తాను. నాకు చాలా విషయాలు తెలుసని అంటున్నారు అయితే విశాలమైన ఈ వికీ ప్రపంచంలో నేనెంత? నాకు తెలిసినదెంత? అయిననూ నాకు తెలిసిన కొన్ని నిబంధనలు సభ్యులకు సూచించడానికి ప్రయత్నించాను. అదేవిధంగా నాకు తెలిసిన తెవికీ నిబంధనలతో మీకూ తప్పకుండా సహాయపడగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:27, 12 సెప్టెంబర్ 2013 (UTC)

చిత్రాల అనుమతి

మార్చు

బ్లాగరు అనుమతినిస్తే ఆ బ్లాగులోని చిత్రాలను తీసుకోవచ్చా? -- కె.వెంకటరమణ చర్చ 17:31, 13 సెప్టెంబర్ 2013 (UTC)

బ్లాగులోని చిత్రాలు స్వయంగా బ్లాగరు తీసినవి లేదా తయారుచేసినవి అయితే ఆయన అనుమతితో తీసుకోవచ్చు. అలా కాకుండా ఇతర సైట్ల నుంచి కాపి చేసి బ్లాగులో ఉంచుకున్న చిత్రాలకైతే బ్లాగరు అనుమతి ఉన్ననూ అది కాపిరైట్ నిబంధనలకు లోబడి మనం కాపి చేయరాదు, ఎందుకంటే ఆ చిత్రాలపై కాపిహక్కులు ఆ సైటువారికే ఉంటాయి కాని బ్లాగుకు ఉండవు. బ్లాగులో ఉన్న చిత్రాలు బ్లాగరు స్వయంగా తయారుచేసిననూ దానిపై బ్లాగుపేరు కాని ఇతర ప్రకటనలు కాని ఉండరాదు. అసలు అది స్వయంగా చూస్తే తప్ప మరిన్ని విషయాలు చెప్పలేము. మీ తెవికీ అనుభవం ప్రకారం ఆలోచించండి. మరేదైనా సందేహం వస్తే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:41, 13 సెప్టెంబర్ 2013 (UTC)

బాటుచేసే మార్పులు

మార్చు

రెడ్డి గారు బాటు ద్వారా చేసే మార్పులను మానవశ్రమ ద్వారా చేసే అవసరం లేదని మీకు ఇదివరకు తెలియజేశాను. ఇప్పుడూ మీరు ప్రతీ గ్రామవ్యాసంలో మండలం పేరు కనిపించకుండా పైపు పెట్టి కుడివైపున గ్రామం పేరు వ్రాస్తున్నారు. ఇదీ బాటుచేసే పనే. దీనిబదులు వ్యాసంలో సమాచారం చేర్చితే బాగుంటుంది. అందరూ ఇలా చేస్తే నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:41, 27 సెప్టెంబర్ 2013 (UTC)

చంద్రకాంతరావు గారికి నమస్కారం,

మీరు నాకు సందేశం పంపే సమయానికి నేను దిద్దుబాటు చేస్తున్న గ్రామ వ్యాసంలో ఈ క్రింది విధంగా ఉన్నది.

మల్కాపురం (ఇబ్రహీంపట్నం), కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము

నేను పై వాక్యంలో లింకులు చెడిపోకుండా ఈ క్రింది విధంగా మార్పు చేసాను.

మల్కాపురం, కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామము

ఇదే సమయంలో నేను చేసిన మరొక మార్పు

కాండ్లపల్లి (పూడూర్‌) - గ్రామ వ్యాసంలో సారంగపూర్ మండలానికి సంబంధించిన మూస ఉంటే పూడూర్ మండలం మూస ఉంచి సరి చేసాను. అలాగే

కాండ్లపల్లి (సారంగాపూర్) - గ్రామ వ్యాసంలో పూడూర్ మండలానికి సంబంధించిన మూస ఉంటే సారంగపూర్ మండలం మూస ఉంచి సరి చేసాను.

మరొక విషయం నేను తదుపరి చేయబోతున్న మార్పు ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన మూసలో ఉన్న తుమ్మలపాలెం కాని ఈ లింకు అయోమయ నివృత్తి పేజికి దారితీసి ఉన్నది. దానిని సరి చేయవలసి ఉంది.

ఇటువంటివి చేస్తూనే వ్యాసాలలో నా దగ్గరున్న సమాచారం చేరుస్తూనే ఉన్నాను. చిన్న వ్యాసాలైనా ఫర్వాలేదు అంటే మరింత సమాచారం చేర్చగలను. అంతేకాక ఇవి చిన్న మార్పులు అన్పించినా చాలా ముఖ్యమైన మార్పులు. మీ YVSREDDY (చర్చ) 17:54, 27 సెప్టెంబర్ 2013 (UTC)

రెడ్డి గారూ, మీ వందలాది దిద్దుబాట్లు బాగా పరిశీలించే నేను చర్చచేశాను. నేను ఏ విషయమైనా తొందరపడి ఏ చర్చతీయను. గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చడానికి చాలా అవకాశం ఉంది (జనాభా లాంటివి కాకుండా, వాటినీ బాటుద్వారా చేయవచ్చు), అలాంటి సమాచారం పొందుపరిస్తే తెవికీకి ప్రయోజనకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:07, 29 సెప్టెంబర్ 2013 (UTC)


చంద్రకాంతరావు గారికి నమస్కారం,

మీరు నాకు సందేశం పంపిన దానికి ముందు చేసిన వరుస 5 మార్పులు గురించి.

  • కొండూర్ (సిరికొండ) - ఈ పేజి సృష్టించడానికి కారణం సిరికొండలో ఉన్న కొండూర్ పేజి నిజామాబాద్ మండలానికి దారి తీస్తున్నందున
  • మూస:సిరికొండ (నిజామాబాదు జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు‎; - ఈ మూసలో మార్పులు చేయడానికి కారణాలు నిజామాబాద్ మండలోని కొండూర్ కు వెళ్తున్న పేజిని సిరిపురం లోని కొండూర్ కు వెళ్లెందుకు
  • కొండూర్ (అయోమయ నివృత్తి)‎ - అయోమయ నివృత్తి కొరకు కొత్త పేజి
  • కొండూర్‎ - (అయోమయం మూస)
  • కొండూర్‎ (ఇతర మూసల తొలగింపు)

బాటు ద్వారా చేయగలిగిన పనులకు మానవ శ్రమ అవసరం లేదని మీరన్నారు, కాని బాటు తయ్యారయ్యేదే మానవ శ్రమతో - మీ YVSREDDY (చర్చ) 14:20, 29 సెప్టెంబర్ 2013 (UTC)

గ్రామవ్యాసాలలో సమాచారం అధికంగా లేదు. చాలా గ్రామవ్యాసాలలో కేవలం ఓకేఒక్క వాక్యం ఉంది. ఇలాంటి వ్యాసాలను సందర్శించడానికి సాధారణంగా ఎవరూ రారు. కాబట్టి ముందుగా సమాచారం చేర్చే బాధ్యత చేపట్టాలి. మీరు చేసే చిన్నచిన్న మార్పులు వద్దని చెప్పడం లేదు, సునాయాసపు మార్పులకే అభ్యంతరం తెలుపుతున్నాను. నిమిషానికి 5 దిద్దుబాట్లు చేసినవి కూడా చూశాను. ఇలాంటివి ఖచ్చితంగా బాటుద్వారా మాత్రమే చేయాల్సిఉంటుంది. తెవికీ భవిష్యత్తు దృష్ట్యా మీరు చేసే దిద్దుబాట్ల పరిణామం దుష్పలితాలకు దారితీస్తుంది. 5 చిన్న మార్పులు చేయడానికి వందరెట్ల సునాయాసపు మార్పులు చేస్తే, వాటినీ చూస్తూ వదిలితే తెవికీ నిర్వహణకై భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవే చిన్న మార్పులు మీరు ఇతరవ్యాసాలలో ఎందుకు చేయడం లేదో చెప్పగలరా? ఇదివరకు కొంత అభివృద్ధి చెందిన, సమాచారం ఉన్న వ్యాసాలలో ఇంతకు మించి పొరపాట్లు ఉన్నాయి. వాటినైనా సరిచేస్తే తెవికీకి, పాఠకులకు ప్రయోజనకరం. తెవికీ ప్రయోజనలకై దిద్దుబాట్లు చేయాలంటే ముందుగా అలాంటి వ్యాసాలపై పట్టుబట్టండి. ఇదివరకు రెండుసార్లు తెలియజేసిననూ మీరు అర్థంచేసుకోవడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:33, 29 సెప్టెంబర్ 2013 (UTC)

ఈ సందేశం అందే ముందు నేను చేసిన చివరి 5 మార్పులు

1.పెనుగొండ మూస నుంచి తామరడ కు సరైన దారిమార్పు లింకు ఇవ్వడం. 2. తామరడ గ్రామ వ్యాసంలో ఆ మండల మూస ఉంచడం. 3.తామరడ మరియు తామరాడ అని రెండు వేరు వేరు గ్రామాలు ఉన్నందున తామరడ కొత్తపేజిని ఏర్పాటు చేయడం. 4.తామరాడలో ఇతర మండల మూసలను తొలగించడం. 5.ఈ రెండు పేజిలలో అయోమయనివృత్తి పేజిలను ఉంచడం.

బాటు ద్వారా చేసే పనులు అని చెప్పే బదులు ఆ పని బాటు ద్వారా చేస్తే మేలు, నేను చేస్తున్నవి సునాయాసపు మార్పులు అయినా చేయవలసిన మార్పులు. మీ YVSREDDY (చర్చ) 16:22, 29 సెప్టెంబర్ 2013 (UTC)

ప్రత్యుత్తరం

మార్చు
 
నమస్కారం C.Chandra Kanth Rao గారూ. మీకు Kvr.lohith గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 16:50, 29 సెప్టెంబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

 -- కె.వెంకటరమణ చర్చ 16:50, 29 సెప్టెంబర్ 2013 (UTC)

మీ అభినందం-నా ధన్యవాదం

మార్చు

C.Chandra Kanth Rao గారు,అభిమానంగా మీరందిన ఈ అభినందన పతకానికి ధన్యవాదం.మీసహాయసహాకారాలు,ప్రోత్సాహాలు మునుముందుకూడా ఆశిస్తూ.పాలగిరి (చర్చ) 19:19, 8 అక్టోబర్ 2013 (UTC)

సహాయం కొరకు

మార్చు

పాలిటానా వ్యాస అనువాదం లో కొన్ని దోషములున్నవి. వైశాల్యం విషయంలో en:Palitana గమనించి సరిచేయగలరు.----K.Venkataramana (talk) 13:00, 16 అక్టోబర్ 2013 (UTC)

వీటితో పాటు చాలా వ్యాసాలలో మార్పులు చేయాల్సి ఉంది. సమయం చూసి తప్పకుండా సరిచేస్తాను. అలాగే "ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు" అనే వాక్యం ఈ వ్యాసంలో ఉంది. ఇస్లాంమతంలో విగ్రహారాధన ఉండదు కదా! ఇలాంటి వాక్యాలవల్ల ఇబ్బందులు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:18, 16 అక్టోబర్ 2013 (UTC)

మూలాల సందేహం

మార్చు

నేను గత సంవత్సరం లోకనాథం నందికేశ్వరరావు అనే వ్యాసాన్ని వ్రాసాను. ఆయనతో కలసి పాఠశాలలో పనిచేయుట చేత ఆయన చరిత్రను తెవికీలో చేర్చాను. ఆ వ్యాసం లోని అంశమంతా మన్యసీమ పత్రికలో ప్రచురితమైనది. ఈ పత్రికను మూలాలుగా చేర్చారు. మనం ఆ పత్రిక చూసి వ్రాయలేదు. వారు మన విషయాన్ని కాపీ చేశారు ఆ మూలాన్ని చేర్చవచ్చా! లేదా తొలగించాలా! సందేహ నివృత్తి చేయగలరు.----K.Venkataramana (talk) 17:14, 19 అక్టోబర్ 2013 (UTC)

ఎలాంటి బయటి ఆధారం లేకుండా ఆ వ్యాసాన్ని ఆ వ్యక్తి పరిచయాన్ని బట్టి మీరే రాశారు, ఆ తర్వాతనే పత్రికలో ప్రచురితమైంది, కాబట్టి మూలాలలో ఆ పత్రికను పేర్కొనే అవసరమైతే లేదు, కాని ఇక్కడి సమాచారం కంటే అందులో మరింత సమాచారం లభ్యమౌతున్నచో (నేను అక్కడి సమాచారం ఇంకా చూడలేను) బయటి లింకులలో చేర్చవచ్చు. వ్యాసంలో రెఫరెన్సులు ఉంటే వ్యాసానికి బలం చేకూరుతుంది కాబట్టి రెఫరెన్సులకోసం ప్రయత్నించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 19 అక్టోబర్ 2013 (UTC)
సందేహ నివృత్తికి ధన్యవాదాలు. మీ సూచన మేరకు కొన్ని మూలాలను చేరుస్తానుః--K.Venkataramana (talk) 17:31, 19 అక్టోబర్ 2013 (UTC)
వ్యాసం పరిశీలిస్తే ఆతని గురించి వార్తాపత్రికలో తప్పకుండా వచ్చియుంటుందనే అనుకుంటున్నాను. అలాంటి క్లిప్పింగులు వారి వద్ద ఖచ్చితంగా దొరుకుతాయి. వాటిని మూలంగా ఇస్తే సరిపోతుంది. తెవికీ వ్యాసాలను కాపీ చేసే పత్రికలు కనీసం "తెవికీ సౌజన్యం" అనే మాటకూడా ఇవ్వడం లేదు. నేను రచించిన చాలా వ్యాసాలు కూడా పత్రికలలో అచ్చయిననూ మనకెలాంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. మొదట ఆ పత్రికను చూసి తర్వాత మన వ్యాసాలు చదివినవారు మనమే అక్కడి నుంచి కాపీచేశామని అనుకొనే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఇలాంటివి ఉంటే వారే మన వ్యాసాలను కాపీ చేశారని చర్చాపేజీలో వ్రాయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులుండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ
పై చర్చనుసంబంధిత వ్యాస చర్చాపేజీలో రాసి నా స్పందనను చేర్చాను. ఇకపై అవసరమైతే అక్కడే చర్చను కొనసాగించవలసినది. అలాచేస్తే విషయానికి సంబంధించిన చర్చలు సునాయాసంగా లభ్యమవుతాయి, మరియు ఇతరులు చర్చలో పాల్గొనే అవకాశం ఎక్కువవుండి వ్యాస నాణ్యత పెంచడానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 23:57, 19 అక్టోబర్ 2013 (UTC)
Return to the user page of "C.Chandra Kanth Rao/పాత చర్చ 10".