Namboori గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 19:05, 5 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మ:Kviyer.jpg వివరాలు మార్చు

ఈ బొమ్మకు సంభందించి ఒక చిన్న వివరం తప్ప మిగతావన్నీ బగానే చేర్చారు. మీకు గుర్తుంటేగనక ఆ బొమ్మను ఏ పత్రిక (పేరు) నుండీ తీసుకున్నారో కూడా తెలుపండి. కేవీఐయ్యార్ వ్యాసం బాగుంది. ఆయన గురించి నేను ఇప్పటి వరకూ వినలేదు! __మాకినేని ప్రదీపు (+/-మా) 16:18, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నేను చేర్చేసాను లెండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:22, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నేను కండలు పెంచాలని కలలు కంటున్న రోజుల్లో నాకు అయ్యర్ వ్రాసిన ఒక పుస్తకం దొరికింది. అప్పటినుండి అయ్యర్ ఫ్యాన్ అయిపోయాను. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి ఆ రోజుల్లో అలాంటి పేరు సాధించడం గర్వకారణమే కదా. ఆ ఫోటో కూడా ఆ పుస్తకంలోనిదే. 1936 లొ వ్రాసిన 'Perfect physique' by K.V. Iyer ఆ పుస్తకం పేరు. దాని కాపే హక్కులు ప్రస్తుతం అప్రస్తుతమైపోయంటాయని నా భావన. ఆయన ఫోటోలున్న పేజీ లింకును ఎవరో, ఎందుకో తొలగించారు. కారణం చెబితే సంతోషిస్తాను. ఇంకా మన కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ఒక వ్యాసం వ్రాయాలి తీరిక దొరికినప్పుడు. Namboori 22:43, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

దేశభాషలందు తెలుగు లెస్స మార్చు

నంబూరిగారు నమస్తే, తెవికి లో మిమ్మల్ని కలుసుకోవడం ఆనందదాయకం. వికిపీడియాపై మీఅభిప్రాయాలు లో మీ అభిప్రాయాలను చూసి మీ బాధ్యతాయుతస్పందన మరియు తపన చూసి మీకు వ్రాయాలనిపించింది. నేను గత ఐదారు నెలలుగా తెవికి కొరకు కృషిచేస్తున్నాను. ఒకసారి ఓపత్రికలో చూశాను ప్రపంచంలోని చాలా భాషలు నశిస్తున్నాయి అందులో తెలుగు కూడా ఒకటి అని, ఈ వార్త నాకు నా కర్తవ్యాన్ని బోధించింది. నాప్రియమయిన తెలుగుభాష కొరకు ఏదో కొంత సేవ చేసి కాస్త తృప్తిపడదామని తెవికి సభ్యుడయ్యాను. ఇవికిని విజ్ఞానసర్వస్వంగా వాడుతూ వుండేవాడిని. తెవికిగూడా పరిచయమే. కాని తెవికి ద్వారా ఇంతమంది మంచి తెలుగువారిని కలుసుకోవడం శుభప్రదం. మీకృషికి ఇవేనాధన్యవాదాలు. మిత్రుడు, తెలుగుభాషాభిమాని --అహ్మద్ నిసార్, మదనపల్లె, చిత్తూరు జిల్లా, (ప్రస్తుతం పూనె మహారాష్ట్ర లో నివాసం) nisar 16:49, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:35, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply