వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/తొలిదశ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం తెవికీలో అత్యంత ముఖ్యమయిన ప్రాజెక్టుగా భావించబడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక బాటు నిర్మించబడినది. ఆ బాటు సహాయంతో అనేక గ్రామాలకు పేజీలు తయారు చేయబడినవి. ప్రస్తుతం బాటు తయారు చేసిన పేజీలు సరిగ్గానే ఉన్నాయా లేవా అనేది పరిశీలించడం జరుగుతుంది. అందువలన ఇక్కడ బోలెడంత పని ఉంది. మీ అందరి సహాయం చాలా అవసరం.
మార్చి 2007 - బాట్లతో పేజీలు తయారుచేయడంతో ఈ ప్రాజెక్టు ఆగితే ప్రయోజనం లేదు. ఒకో గ్రామం గురించి ఒకో పేజీ తయారుచేయాలన్నది మన గమ్యం. అయితే జనానీకం నుండి ఆశించిన స్పందన ఈ విషయంలో కరవైంది. కనుక దీనిని ఒక ప్రచారోద్యమంగా నిర్వహించాలని తలపెట్టాము.
ఇప్పటికి జరిగింది
మార్చు- బాటు ద్వారా చాలా గ్రామాలకు పేజీలు చేయబడ్డాయి. వాటి తనిఖీ జరుగుతున్నది. మిగిలిన పేజీలు చేయబడుతాయి.
కొన్ని గ్రామాలు, పట్టణాలకు సంబంధించి కాస్తో కూస్తో వ్యాసాలున్నాయి. (అంచనా: ఒక పేజీ మించిన వ్యాసాలున్న వూళ్ళు 100లోపే కావచ్చును.)కాని ఎక్కువ గ్రామాలకు - ఫలానా మండలము, ఫలానా జిల్లా - అని తెలిపే ఒకే ఒక వాక్యం మాత్రం ఉంది. ఇదే వాక్యం వ్యాసంగా కూడా లెక్కించబడుతున్నది.- బాటు ద్వారా గ్రామ వ్యాసాలలో రెవెన్యూ గ్రామం అనే మూస జోడించి, వ్యాస నిడివిని ౩ కేబీగా పెంచడం.
- సమాచారపెట్టె ను చేర్చి ఖాళీలు ఉంచడం, ఔత్సాహికులను ఆ ఖాళీలు నింపేలా ప్రోత్సాహించడం.
ఇప్పుడు ఏమి చేయాలి
మార్చువీలయినన్ని గ్రామాలగురించి వ్యాసాలు వ్రాయడం ఒక ఉద్యమం + ప్రచారం + అనువాదం కార్యక్రమంగా చేపట్టాలి.
మనం ఆశించినంతగా సాధారణ ప్రజానీకం నుండి స్పందన రాలేదు. కాని గ్రామాల గురించిన సమాచారం ఆ వూరివాళ్ళే వ్రాయగలరు. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వెతికితే దొరికే సమాచారం కాదు. (కాని త్వరలో మన తెలుగు వికీ ఆ లోటును భర్తీ చేస్తుంది!)
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మీ సహకారాన్ని అందించండి.
ఎలా చేయాలి?
మార్చు- అందరి దృష్టినీ ఆకర్షించేలాగా మనం ఒకటి రెండు ప్రచార వ్యాసాలను తయారు చేద్దాము. ఇవి తెలుగులోను, ఇంగ్లీషులోను కూడా ఉండాలి.
- ఈ వ్యాసాలను వీలయినంతమందికి అందచేద్దాము.--- ఎలా?
- మెయిలింగ్ లిస్టులు, గుంపులు అందరికీ సుపరిచితమైన మాధ్యమం. సభ్యులంతా ఈ వ్యాసాలను తమకు అందుబాటులో ఉన్న మెయిలింగ్ లిస్ట్‌లకు పంపించండి.
- కాని ఇటీవల ప్రజలు ఇంటర్నెట్ సమాచారాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరొక అదనపు ప్రచారంగా ఈ ప్రచార వ్యాసాలను కాపీలు తీయించి మీరు పనిచేసే చోట్ల, నివశించే చోట్ల తెలుగువారికి పంచిపెట్టండి.
- వివిధ విద్యా, సమనాచార సంస్థలవద్ద నోటీసు బోర్డులలో నోటీసులు అతికించండి. ముఖ్యంగా కాలేజీలలో, కంప్యూటర్ శిక్షణా సంస్థలలో (యువతరాన్ని వికీవైపు ఆకర్షించాల్సిన అవసరం చాలా ఉంది.)
- ఆ వ్యాసంలోనే వారు తమ వూళ్ళగురించిన సమాచారాన్ని ఎలా వికీలో కూర్చవచ్చునో వివరిద్దాము.
- రెండు విధాలుగా ఉత్సాహం కలవారు సమాచారాన్ని అందించే సదుపాయం
- నేరుగా వారే వికీలో వ్రాయడం. ఇది అన్నివిధాలా ఉత్తమం.
- కాని కొంతమంది అందుకు ముందుకు రాకపోవచ్చును. అయితే ఈ-మెయిల్ పంపడాననికి ఎక్కువమంది అలవాటు పడ్డారు. అటువంటివారు తమ వూరిగురించి teluguwiki@yahoo.co.in కు తమ వ్యాసాన్ని (తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని) మెయిల్ చేయవచ్చును.
- వికీ సభ్యులు ఆ వ్యాసాలను అనువదించి వికీలో చేర్చాలి. (ఇది పెద్దపనే! కాని మనం వెనుకాడితే అసలు గ్రామాల సమాచారం ఒక వాక్యం వ్యాసాలకు పరిమితమయ్యేలా ఉంది. ఇది మనకు చాలా నామోషీగా అనిపిస్తుంది.)
ఎప్పుడు?
మార్చుఇది దీర్ఘకాలం నడపాల్సిన ప్రాజెక్టు. 20వేల పైగా గ్రామాలున్నాయని మనం గుర్తించాలి. ఏడాదికి వేలల్లో గ్రామాలపై వ్యాసాలు సమకూర్చాలని ఆకాంక్ష. అయితే ప్రచార కార్యక్రమం మాత్రం ఏటా ఒక నెల ఉధృతంగా నడిపితే సత్ఫలితాలనిస్తుంది. 2007లో ప్రాజెక్టు సమయ ప్రణాళిక:
- మార్చి 2007: ఈ ప్రాజెక్టు ప్లానింగ్ (ఇప్పుడు జరుగుతున్నది). మీ సూచనలను విరివిగా ఇక్కడే వ్రాయండి. అవసరమనిపిస్తే చర్చాపేజీలో చర్చించండి.
- ఏప్రిల్ 2007: ప్రయోగ దశ
- ప్రచార వ్యాసాలు తయారు చేయడం. కనీసం నాలుగు ప్రచార వ్యాసాలు ఉంటే మంచిది. ఎవరి అభిరుచిని పట్టి వారు తమకిష్టమైన వ్యాసాన్ని ప్రచారానికి వాడుకొనవచ్చును.
- ప్రయోగాత్మకంగా తమ తమ పరిధిలో (మెయిలింగ్ లిస్ట్‌ల జోలికి వేళ్ళకుండా) ప్రచారాన్ని మొదలు పెట్టడం
- వచ్చిన స్పందనను బట్టి ప్రచార వ్యాసాలు తిరగవ్రాయడం
- మే 2007: విస్తారంగా ప్రచారాన్ని నిర్వహించడం.
- జూన్ 2007: అనువాదాలు, సవరణలు మొదలు పెట్టాలి.
ప్రచారం
మార్చుమీ సూచనలను ఇక్కడ వ్రాయండి.
ఇందుకు ముందుగా కొన్ని ప్రచార వ్యాసాలను తయారు చేద్దాము. ఈ క్రింది మొలకలలో మీ వ్యాసాలు వ్రాయండి.
వ్యాసం తెలుగులోను, ఇంగ్లీషులోను కూడా ఉంటే మంచిది.
అనువాదం
మార్చుఫొటోలు
మార్చుపూర్ణ గ్రామాల జాబితా
మార్చుభారతదేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి. సామాన్యంగా పరిపాలన సౌకర్యం కోసం 5 లేక 6 చిన్న పల్లెలను కలిపి ఒకే పేరుతో పిలుస్తూంటారు. ఈ క్రింది లింకు "ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన" కోసం తయారు చెయ్యబడింది. ఇందులో ప్రతి ఒక్క చిన్న గ్రామం పేర్లు కూడా క్రమబద్దంగా ఇవ్వబడ్డాయి.
- ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
- ఉదాహరణకు మదనపల్లె అనే చిన్న పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల జాబితా చూడండి
గ్రామాల పేజీలను సృస్టించడానికి కొన్ని సూచనలు
మార్చుమీరు ఏదయినా జిల్లాకు సంబందించిన గ్రామాలకు పేజీలను తయారు చేయాలనుకుంటే ఈక్రింది సూచనలను పాటించండి.
చెయ్యవలసిన పనులు
మార్చుతొలివిడతగా ఒక బాటును నిర్మించి దాని సహాయముతో అన్ని గ్రామాలకు పేజీలు చేర్చడముఒకే పేరుతో అనేక గ్రామాలున్నా, ఇదివరకే ఆ గ్రామ పేజీలో సమాచారమున్నా ఆ గ్రామ పేజీలో బాటు {{తనిఖీ}} అనే మూసను చేర్చుతుంది. ఇలాంటి పరిశీలించవలసిన వ్యాసాలు వర్గం:పరిశీలించవలసిన గ్రామ పేజీలు లో ఉంటాయి. అవి పరిశీలించి తగిన మార్పులు చేయాలి
- ఎట్టకేలకు అన్ని పంచాయితీ గ్రామాలకు పేజీలు చెయ్యటం, అయోమయ నివృత్తి పేజీలు చెయ్యడం పూర్తయ్యింది. అయోమయ నివృత్తి లింకులు సరిచేయటం తరువాయి పని. --వైజాసత్య 17:13, 19 సెప్టెంబర్ 2007 (UTC)
- మండల సమాచారానికి ఒక సమాచార పెట్టె ఉన్నట్టు గ్రామానికి కూడా ఒక సమాచార పెట్టె తయారు చేయాలి
- కొత్త మూస తయారీ అవసరం లేదు. కానీ భారతీయ స్థల సమాచారపెట్టె మూసను గ్రామాలకు అనుగుణంగా మలచుకొని ప్రయోగించి చూడాలి
- మలివిడతలో అన్ని గ్రామాల పేజీలకు బాటు సహాయముతో గణాంకాలు చేర్చాలి
ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు
మార్చు- మూస:తనిఖీ
- మూస:గ్రామం (ఈ మూసను ఏ పేజీల్లోనూ వాడవద్దు)
- మూస:ఇతరప్రాంతాలు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/గ్రామాల మూస (ఈ మూస ఇంకా అభివృద్ధిలో ఉన్నది)
పరిశీలించవలసిన వ్యాసాలు
మార్చుఈ వర్గములో చూడండి వర్గం:పరిశీలించవలసిన గ్రామ పేజీలు
- రెండు మండలగ్రామాల మూసలున్న మండలాల పేజీలు రెండు మూసలున్న మండలాల పేజీలు - వీటిని పరిశీలించి సరిచేయాలి.
జిల్లాల వారిగా ప్రగతి
మార్చుపూర్తి | పాక్షికము | చేయాలి |
1. | అదిలాబాదు | |||
2. | అనంతపురం | |||
3. | చిత్తూరు | |||
4. | కడప | |||
5. | తూర్పు గోదావరి | |||
6. | గుంటూరు | |||
7. | కరీంనగర్ | |||
8. | ఖమ్మం జిల్లా | |||
9. | కృష్ణా జిల్లా | |||
10. | కర్నూలు | |||
11. | మహబూబ్ నగర్ | |||
12. | మెదక్ | |||
13. | నల్గొండ | |||
14. | నెల్లూరు | |||
15. | నిజామాబాదు | |||
16. | ప్రకాశం | |||
17. | రంగారెడ్డి | |||
18. | శ్రీకాకుళం | |||
19. | విశాఖపట్నం | |||
20. | విజయనగరం | |||
21. | వరంగల్ | |||
22. | పశ్చిమ గోదావరి | |||
23 | హైదరాబాదు |
జిల్లాలు ఇన్ఫోబాక్సులు
మార్చు- {{subst: అనంతపురం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: ఆదిలాబాదుజిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: మెదక్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: కరీంనగర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: నల్గొండ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: హైదరాబాదు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: రంగారెడ్డి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: నిజామాబాదు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: గుంటూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: కడప జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: వై.ఎస్.ఆర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: విశాఖపట్నం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: ప్రకాశం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: చిత్తూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: ఖమ్మం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: విజయనగరం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: కర్నూలు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: కృష్ణా జిల్లా ఇన్‌ఫోబాక్స్}}
- {{subst: శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}