వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం
ఆధారాలపై అభిప్రాయం
మార్చుGood work! — వీవెన్ 14:00, 20 జూన్ 2007 (UTC)
సత్యా గారు ముందు నాకు అర్థం అయ్యింది కాదు. బొమ్మ ఏమిటి అని అనుకొన్నాను. కాని ఇది చాలా మంచి ఆలోచన, ప్రక్క ప్రక్క ఉండి రాయడానికి చాలా అనువుగా ఉంది. మీ శ్రమ కు అభినందనలు.--మాటలబాబు 14:18, 20 జూన్ 2007 (UTC)
- నేన్నది ఏకవచన ప్రయోగం గురించి మంచి ఆధారం సంపాదించినందుకు.--వీవెన్ 14:24, 20 జూన్ 2007 (UTC)
- ఏమిటో నా బుర్ర అసలు పని చేయదు. బొత్తిగ నాకు మెదడు లేదు.--మాటలబాబు 15:51, 20 జూన్ 2007 (UTC)
శైలి
మార్చురవీ, దీన్ని మన వికీపీడియా:శైలి పేజీలో పెడితే బాగుంటుంది. దీనిలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు చెయ్యదలచారా? __చదువరి (చర్చ • రచనలు) 16:48, 20 జూన్ 2007 (UTC)
- అవును "శైలి మాన్యువల్"లో పెట్టండి. కాని శైలి విషయంలో నాకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
- "లక్ష్మణరావు ఇలా అన్నాడు" - అని వ్రాయడానికి అలవాటు పడ్డాను (నేను మొదట్లో వ్రాసిన మహాత్మా గాంధీ వ్యాసం చూస్తే ఈ సమస్య అర్ధమౌతుంది.)
- "అతను చెప్పాడు" అని వ్రాయటంలేదు. "ఆయన చెప్పాడు" అని వ్రాస్తున్నాను. తెలుగు భాషకు ఇదే అనువనిపిస్తుంది. అంతే కాక ఒకసారి చదువరి ఉదాహరించిన హిందీ వికీ చర్చలో కూడా "ఆయన చెప్పాడు" తరహాలోనే వ్రాయడాన్ని సమర్ధించారు. ఏమయినా ఈ విషయంలో శైలి సూచనలను మరొకసారి పునఃపరిశీలించండి.
--కాసుబాబు 17:05, 20 జూన్ 2007 (UTC)
- నేను శైలిలో పెట్టడానికే ఈ వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. సరైన పేరు తోచితే..దీన్ని అక్కడికి తరలించి మీరూ తగిన మార్పులు చేర్పులు చేయండి. దీనిలో కొంత పత్రికలకు, విజ్ఞాన సర్వస్వాలు ఇదే విషయాన్ని ఎలా వేరువేరుగా డీల్ చేస్తాయి అని పోల్చి చూపిద్దామనుకుంటున్నా..ఇంక కొంత వివరణ కూడా ఇవ్వాలి. ఎవరు రాసినా ఓకే
- కాసుబాబు గారూ మీరన్న విషయం నాకూ ఈ బొమ్మలు తయారు చేస్తూ ఈరోజే వెలిగింది..నేనూ చాలాసార్లు (చాలాసార్లేంటి..అన్నిసార్లూ) ఆయన..ఆవిడ ప్రయోగించాను. ఒక స్థాయిని చేరిన తర్వాత..తెవికీని సాంప్రదాయ విజ్ఞానసర్వస్వాలతో పోల్చటం ప్రారంభిస్తారు..ఇప్పుడు కొంచెం కష్టమైనా..అప్పుడు శైలి ప్రామాణికంగా ఉంటే బాగుంటుంది..ఏదేమైనా నాకంగీకారమే.
- వీవెన్, మాటలబాబు అభినందనలకు కృతజ్ఞతలు..చాలా రోజులనుండి ఇలాంటి ఒక పేజీ చేయాలని ఆలోచన ఉన్నది..కానీ బద్దకించా..ఇక ఈ రోజు నాగార్జున సాగర్ వ్యాసంలో ఒక సభ్యుడు ఈ విషయంలో చేసిన మార్పులు చూసి..ఇక లాభంలేదని ఇలా ప్రారంభించా. --వైజాసత్య 19:22, 20 జూన్ 2007 (UTC)
- ఆయన, ఆమె అనడంలో శైలి భంగం లేదేమో!!? అవి వాడడం సబబే ననుకుంటున్నాను! నేననేది తప్పైతే సవరించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 10:32, 21 జూన్ 2007 (UTC)
- నాకు కూడా అలాగే అనిపిస్తుంది; అతడు(అతగాడు), అది, అని బదులుగా ఆయన, ఆమె కొంచెం బాగున్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 10:43, 21 జూన్ 2007 (UTC)
- ఒకే! అయితే ఆమె, ఆయన, ఈయన, ఈమె పదాలను ఇక్కడ వాడటానికి అంగీకరిద్దామా? --వైజాసత్య 10:59, 21 జూన్ 2007 (UTC)
- నాకు కూడా అలాగే అనిపిస్తుంది; అతడు(అతగాడు), అది, అని బదులుగా ఆయన, ఆమె కొంచెం బాగున్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 10:43, 21 జూన్ 2007 (UTC)
ఎలా వ్రాస్తె బాగుంటుంది
మార్చు( వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం నుండి ఇక్కడికి ఈ వ్యాఖ్య కాపీ చేశాను - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:53, 28 మార్చి 2008 (UTC) )
ఎవరి గురించి అయినా వ్రాసెటప్పుడు, ఆయన వచ్చాడు అని వ్రాయటం బాగుండదు. ఆయన వచ్చారు ఒని వ్రాస్తె బాగుంటుంది."అతను" అనివ్రాయటం బాగుండదు."ఆయన" అని వ్రాస్తెనె బాగుంటుంది. అలాగె, స్తీ గురించి వ్రాసెటప్పుడు, ఆవిడ "వచ్చింది" బదులు ఆవిడ "వచ్చారు" అని వ్రాస్తె బాగుంటుంది."ఆమె" బదులుగా "ఆవిడ" అని రాస్తెనే మర్యాదపూర్వకంగ ఉంటుంది.--SIVA 14:45, 9 మార్చి 2008 (UTC)
ఏక వచన ప్రయోగం
మార్చుఈ విషయం గురించి తప్పకుండా మరికొంత చర్చ కొనసాగాలి. మనకున్న మహా నాయకులు, రచయితలు, నటుల గురించి వ్రాసేటప్పుడు, "అతను" వచ్చాడు" అని వ్రాయటం ఎబ్బెట్టుగా ఉన్నది. దిన పత్రికలలో కూడా చూస్తుంటాము, ఏ విశ్వనాధ సత్యనారయణగారి గురించో వ్రాసేటప్పుడు "అతను" అని, ఏ నక్సలైటు నాయకుడి గురించి వ్రాసేటప్పుడు "ఆయన" అని వ్రాస్తుంటారు. ఇలా వ్ర్రాయటం ఆ పత్రికల సంపాదకీయ విధానమో లేక ఆ వ్రాసిన విలేఖరి యెక్క సొంత ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంటుందో తెలెయదు. ఆంగ్ల భాషలో వ్యక్తుల గురించి, ఏకవచన ప్రయోగం మానేసి శతాబ్దాలవుతోంది( thou art లాంటివి). దీని వల్ల ఇప్పుడు ఆంగ్ల భాషలో అసలు ఏక వచన ప్రయోగం లేదనుకొంటున్నారు. మన తెలుగులో అలా వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఏకవచన ప్రయోగం కాకుండా (రాముడు వచ్చాడు అంటామా లేక రాముడు వచ్చారు అంటామా అనే వితండవాదనకు దిగకుండా{ఎందుకంటే రాములవారు వచ్చారు అనేవారు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు})బహువచనంలో వ్రాస్తే (వారు జీవించి ఉన్నాలేక స్వర్గస్తులయినాకూడా)మన సొమ్ము ఏమి పోయింది??? మనం ఇతరులను గౌరవిస్తున్నాము కదా అంతకన్నా ఇంకా ఏమీ చేయటంలేదుకదా!! తక్కువలో తక్కువ, బహువచనంలో ఎవరయినా వ్రాస్తే పట్టుబట్టి అదే పనిగా అన్నీ మార్చకుండా ఉంటే చాలు.--SIVA 18:53, 28 మార్చి 2008 (UTC)
- మొదటిగా, వికీపీడియా ఒక ఇంటర్నెట్టు పత్రిక కాదు. రెండోది ఏకవచన ప్రయోగాన్ని అగౌరవానికి సూచకంగా చూడరాదు. ఎవరయినా ప్రముఖుని గురించి రాసేటప్పుడు, మనకు ఆ వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికే బహువచనాన్ని ప్రయోగిస్తాము. వికీపీడియాలో వ్యక్తుల గురించి రాసేటప్పుడు బహువచనంలో రాస్తుంటే, అది ఒక రకంగా మన సొంత అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దుతున్నట్లవుతుంది. వికీపీడియాలో ఉన్న వ్యాసాలు, అభిప్రాయాలను పంచుకునే వేధిక కాదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:38, 19 ఏప్రిల్ 2008 (UTC)
ఏకవచన ప్రయోగం అగౌరవం
మార్చుఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా డా.జయగోపాల్ గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.
- మీకు డా.జయగోపాల్ గారంటే గౌరముండచ్చు కానీ అందరినీ గౌరవించమని రుద్దటం అనవసరం. దాన్నే పాక్షికత అంటారు. ఇది వరకు తెవికీ నిష్పక్షపాత తటస్థ వైఖరిని అలవంబిస్తుందని చెప్పుకున్నాం కదా అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. నేను చర్చాపేజీలలో ఎక్కడా మీమ్మల్ని ఏకవచనంతో సంబోధించలేదని గమనించండి. తెవికీ సభ్యులకు గౌరవం మర్యాద లేదని కాదు. --వైజాసత్య 15:38, 12 డిసెంబర్ 2008 (UTC)
- డా.జయగోపాల్ గారితో వ్యక్తిగతంగా చనువుగా మాట్లాడిన నేనే అతన్ని ఏకవచనంతో సంభోదించలేదు. వేరే వాళ్ళు అతని పై ఏక వచన ప్రయోగం చెయ్యడం ఎలా ఉంటుంది?
- జయగోపాల్ గారు ఆ పేజీ చదివితే చెడుగా భావించరనే నేను అనుకొంటాను. వ్యక్తిగత సంభాషణ వేరు. విజ్ఞానసర్వస్వం వ్యాసం వేరు. నేను పైన వ్రాసిన చర్చ కూడా ఒకమారు చూడగలరు. ఏకవచనం మొదట్లో నాకు ఇబ్బంది అనిపించింది కాని అలవాటయినాక ఏకవచనమే సరైనది అనిపిస్తుంది. ఇది తేలికగా తేలే విషయం కాదు. ఇందుకు ప్రమాణాలు లేవు. ఈ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు గనుక ఇతరులు వ్రాసినవాటిని మార్చడంలేదు. కాని నేను పరిశీలించిందేమంటే "గారు" తొ మొదలై "శ్రీ .. గారు" నుండి "మాన్యశ్రీ శ్రీ శ్రీ .. జీ .. గారు" వరకూ ఈ గౌరవార్ధాలు సాగుతాయి. "మేడమ్ శ్రీ సోనియాజీ" అని కాంగ్రెసు నాయకులు సంబోధించడం ఎన్నిసార్లు చూడడంలేదు? ఏకవచనం పుట్టినప్పుడు పెట్టిన పేరు. గౌరవార్ధ తోకలు తరువాత తగిలించినవి. విజ్ఞాన సర్వస్వంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండడమే మెరుగు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:13, 13 డిసెంబర్ 2008 (UTC)
- నా దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ని నేను మీరు అని పిలుస్తుంటాను. ఆమె నా కంటే వయసులో చిన్నదో పెద్దదో నాకు తెలియదు. వయసు, హోదా లాంటి వాటితో పని లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతుంటాను. చివరికి ఆటో డ్రైవర్ ని కూడా మీరు అని అంటుంటాను. నా వయసు 26 ఏళ్ళు. జయగోపాల్ గారి వయసు 70 ఏళ్ళకి పైనే. ఇంటర్నెట్ తెలిసిన వాడు మినిమమ్ టెంత్ క్లాస్ కుర్రాడైనా అయ్యుంటాడు. ఆ వయసులో ఉన్నవాళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళ పైన ఏకవచనం ప్రయోగించే పరిస్థితి ఉండకూడదు.
- పొట్టకూటి కోసం ఆటో నడిపే ఆటో డ్రైవర్ ని నువ్వు అని పిలిచినప్పుడు అతనికి నచ్చకపోయినా బేరం వదులుకోలేక వస్తాడు. అయినా నేను ఆటో డ్రైవర్ ని మీరు అనే పిలుస్తాను. ఉద్యమాలలో పని చేసే వాళ్ళు అలా మనసు చంపుకోరు. పైగా నాస్తిక ఉద్యమం అనేది రాజకీయ పార్టీ లాంటిది కాదు. దీని వల్ల డబ్బేమీ రాదు, వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు కూడా రావు. అయినా ఓర్పుతో జయగోపాల్ గారు నాస్తిక ఉద్యమం నడుపుతున్నారు. ఏకవచనం ఉపయోగించి అతన్ని ఇన్సల్ట్ చెయ్యడం సరైనది కాదు.
- విజ్ఞానసర్వస్వానికి వయసుండదు. దానికి రాజు, పేద, చిన్నా, పెద్దతో సంబంధంలేదు. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. --వైజాసత్య 04:30, 14 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వ్యాకరణం
మార్చుడు ము వు లు ప్రధమా విభక్తి.నామవాచకాలన్నీడు ము వు ల తోటే ముగుస్తాయి.రాముడు భీముడు లాగా.కానీ కాలక్రమేణా ఈ పిలుపులను ప్రజలు అగౌరవసంబోధకాలుగా పరిగణిస్తున్నారు కాబట్టి తెలుగు వ్యాకరణసుత్రాలను నేటికాలానికి తగ్గట్లు రు,ను,ము, వు, లుగా మార్చాలని కొందరు వాదిస్తుంటే,దాడి వీరబధ్రరావు లాంటికొందరు అసలు తెలుగు వ్యాకరణాన్నే తీసెయ్యండి భాషా సూత్రాలు ప్రజల వాడుకవల్ల వాటికవే ఏర్పడుతుంటాయి అంటున్నారు. --Nrahamthulla 07:28, 13 డిసెంబర్ 2008 (UTC)
పునః పరిశీలించాలి
మార్చుమనం ఈ పాలసీని ఉంచాలా వద్దా అని మళ్లీ ఇంకో సారి పరిశీలించాలి. ముఖ్యంగా తెలుగులోని మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆధారంగా అసలే వాడకూడదనుకుంటా. అందుకు ఉదాహరణ: అప్పారావు నడవడికను చాలా రసికతకు ఔదార్యమునకు పేరుపడినవాఁడు. సమాజమున తన ప్రతిభచేతను, మంచితనముచేతను, చమత్కారకలిత మగు సంభాషణముచేతను చాలా చిత్తాకర్షణము చేయువాఁడు. ఈ వాక్యంలో ఏకవచణ ప్రయోగం ఉన్నా కూడా అగౌరవ పరుస్తున్నట్లు అనిపించదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఈ కాలపు తెలుగులో ఏకవచన ప్రయోగం వాడి రాస్తే, అప్పారావుకు నడవడిక, రసికతక, ఔదార్యం వలన మంచి పేరుంది. సమాజంలో అతని ప్రతిభకు, మంచితనానికి, చమత్కారభరిత సంభాషణానికి అందరి మన్ననలను పొందాడు. రెండింటిలోనూ ఏకవచన ప్రయోగం ఉన్నాకూడా, మొదటిదాంట్లో సంభోధం అగౌరవంగా అనిపించడంలేదు, కానీ రెండో దాంట్లో మటుకు 'డు' అని అంటున్నప్పుడు అగౌరవంగా ద్వనిస్తుంది. కారణం మొదటి విజ్ఞాన సర్వస్వం కొంత గ్రాంధికంలో ఉంది కాబట్టి. గ్రాంధికంలో ఏకవచనం అగౌరవంగా లేదా అసభ్యంగా అనిపించదు.
తటస్థదృక్కోణం వలన అక్కరలేని గౌరవం ఇవ్వకూడదు, అలాగే అగౌరవంగా కూడా ద్వనించకూడదు కదా... అలాగే చనిపోయిన వారిని ఏకవచనంలో ప్రయోగిస్తాము అనే దాంట్లో కూడా అంత తార్కికత లేదు అనుకుంటా. మనం పక్కనున్న వ్యక్తితో పీవీ.నరసింహారావుగారు చనిపోయారు అని అంటాను కానీ చనిపోయాడు అని మాత్రం అనను. ఇంకో ఉదాహరణ: నాకు ఇష్టంలేని వ్యక్తులు చనిపోయినప్పుడే నేను చనిపోయాడు (ఏకవచణం అని గమనించండి) అని అంటూ ఉంటాను, కానీ నాకు ఇష్టం అయిన వారి గురించి, ఎటువంటి అభిప్రాయం లేని వారి గురించి కూడా వారు, వీరు అనే సంభోదిస్తాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 08:17, 1 నవంబర్ 2009 (UTC)
- మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తాను. —రవిచంద్ర (చర్చ) 15:01, 1 నవంబర్ 2009 (UTC)
- మనకు వ్యవహారికంలో (వార్తాపత్రికల్లో) భాషలో సామాజిక స్థాయిని బట్టి కూడా ఏకవచన, బహువచన ప్రయోగాలు కనిపిస్తాయి. ఉదాహరణ మీరన్నట్టు పి.వీ.నరసింహారావు గారు అని ప్రయోగిస్తారు. అంతెందుకు, మామూలు చిన్నచితకా అధికారులకు కూడా గారు అని ప్రయోగిస్తారు. కానీ ఏ కూలీ"వాడి" (చూశారా అప్పుడే ఎంతతేడా ధ్వనిస్తుందో) గురించో, కార్మికుని గురించో అయితే ఏకవచనం చక్కా ప్రయోగించేస్తాం. అంటే వ్రాసేవారి దృష్టిలో ఆ ఏదుటి వ్యక్తి ఎంతస్థాయో దాన్నిబట్టి ఏకవచన, బహువచన ప్రయోగాలు సంభవిస్తాయి. కాబట్టి బహువచన ప్రయోగం చాలా కష్టం. --వైజాసత్య 02:35, 2 నవంబర్ 2009 (UTC)
- కొంతమందిని వాడు, వీడు అని మనం వ్యవహారికంగా అంటూవుంటాము కాబట్టి, అందరినీ ఏకవచన ప్రయోగంతోనే సంభోదిస్తున్నాం. ఈ వాదనను ఇంకో విధంగా చూద్దాం... కొంతమందిని గౌరవ సూచకాలతో పిలుస్తున్నాం కాబట్టి, అందరికీ అదే వర్తింపజేసి గౌరవ సూచకాలతో పిలుద్దాం. కూలీ అనేది ఒక వృత్తిపేరు. ఆ వృత్తి చేస్తున్న వ్యక్తి గురించి వ్యాసం రాస్తున్నప్పుడు గౌరవ సూచకాలు వాడొచ్చనుకుంటా. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 05:08, 2 నవంబర్ 2009 (UTC)
- ప్రదీప్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంగ్లీషు వికీతో కొన్ని విషయాలలో మనం విభేధిస్తే తప్పుకాదు తప్పులేదు. తెలుగు సంస్కృతిలో పెద్దవారిని, స్త్రీలను, విద్యావేత్తలను, గురువులను ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఇతరులను అందరినీ ఏకవచనంతో సంబోధించడం నా ఉద్దేశంలో, మరియు విజ్ఞానుల అభిప్రాయంలో అగౌరవ పరచడమే అని భావిస్తారు. వీరందరినీ బహువచనంలో సంబోధించడం సమంజసం అని, అంతకు ముందు జరిగిన చర్చను పునఃపరిశీలించి అభిప్రాయాన్ని మార్చితే బాగుంటుందని నా గాఢ విశ్వాసంRajasekhar1961 04:20, 2 నవంబర్ 2009 (UTC)
- ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేముందు ఈ విషయంపై నాకెలాంటి శాసనాధికారాలు కానీ, ఈ విషయంపై పాండిత్య స్థాయి అవగాహాన కానీ లేవని, ఏ పద్ధతి సరైనదో ఖచ్చితంగా నాకూ తెలియదని చెప్పదలచుకొన్నాను.
- ప్రదీపు గారూ, ఏకవచన ప్రయోగం గ్రాంధికం కనుమరుగైన ఆధునిక కాలంలో (80,90వ దశకాల్లో) కూడా విజ్ఞానసర్వస్వాల్లో ఏకప్రయోగించారని చెప్పటానికే అక్కడ రెండవ ఉదహారణ (టోనీ మారిసన్ గురించినవ్యాసం) ఇవ్వబడింది.
- మీరు గ్రాంథికాన్ని వ్యవహారికంలో వ్రాసి అసభ్యంగా ధ్వనించింది అన్న వాక్యాన్ని రెండు, మూడు సార్లు చదివినా అది నాకు అసభ్యంగా అనిపించలేదు. నిజానికి గ్రాంథికంలోని వాక్యమే నాకు ఇంకా ఎబ్బెట్టుగా తోచింది (దానికి కారణం ఆ వాక్యంలో డు అనే విభక్తితో కాకుండా ఏకంగా వాఁడు అంటు స్పష్టంగా పలికించడం అనుకుంటా). ఇలా ఒక్కో వాక్యాన్ని ఎండగట్టినా ఆ వాక్యంలో అసభ్యత ధ్వనిస్తుందాలేదా అన్నది వ్యక్తిగత అభిరుచి అని మాత్రం చెప్పగలను. (ఈ వ్యక్తిగత అభిరుచులను సామాజిక, ప్రాంతీయతలు కొంత ప్రభావితం చేస్తాయనుకోండి)
- ఇష్టంలేని వ్యక్తులు చనిపోయినప్పుడు ఏకవచనం ప్రయోగించడం కూడా వ్యక్తిగత/ప్రాంతీయ అభిప్రాయమేమో. మళ్లీ నా ఉదాహరణే తీసుకుంటే నేను పెరిగిన ప్రాంతంలో ఆత్మీయులని బహువచనంతో ప్రయోగించే అలవాటులేదు. బహువచనం ప్రయోగించారంటే గౌరవమిస్తూనే మీకు, మాకు మధ్య కొంత దూరముందని చెప్పినట్టవుతుంది. అందుకే ఈ జీవితంలోనూ, పైజీవితంలోనూ ఎప్పుడూ నాన్నని బహువచనంలో పిలవరు. "నాన్నగారు చనిపోయారు" అని అనకపోయినా, "నాన్నగాడు చనిపోయాడు" అనిమాత్రం అనరు. మా ప్రాంతంలో సాధారణ వాడుకేంటంటే "నాన్న చనిపోయాడు" (ఇది వికీపీడీయాలో నియమానికి కాదండి..కేవలం ప్రాంతీయ బేధాలను చెప్పటానికే) - ఇప్పుడు గురజాడ గ్రాంథికవాక్యం నాకు ఎబ్బెట్టుగా ఎందుకు తోచిందో మీకు అర్ధం అయ్యుంటుంది.
- రాజశేఖర్ గారూ, ఇంగ్లీషు వికీపీడీయాకి ఇలాంటి చిక్కేలేదండి. వాళ్ళకి మనలాగా బహువచన, ఏకవచన వ్యవహారాలే లేవు కదా. అందర్నీ హి, షి అని పిలిచెయ్యటమే! అవును మన సంస్కృతిలో పెద్దవారిని గౌరవించాలి కానీ అప్పుడు ఎందుకు పెద్దవారు, ఎవరికంటే పెద్దవారు అన్న సవాలక్ష చిక్కులొస్తాయి. వీటిని ప్రదీపుగారు పైనే ఏకరువుపెట్టారు.
- అయితే దొంగల్ని, దొరల్ని ఒకేగాటిన కట్టి ఏకవచనం ప్రయోగించడం కంటే అందరికీ బహువచనం ఎందుకు ప్రయోగించకూడదు అని ప్రదీపు గారు అడుగుతున్నారు. నాకు సమాధానం తెలీదు. --వైజాసత్య 09:30, 3 నవంబర్ 2009 (UTC)
- ఇది ఈ రోజు ఈనాడు పత్రికలోని అనంతపురం జిల్లా సంచిక అధికారుల గురించి వ్రాయటానికి ఎలా బహుప్రయోగమున్నూ, సాధారణ వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఎలా ఏకవచనానికి మారారో గమనించండి --వైజాసత్య 09:55, 3 నవంబర్ 2009 (UTC)
ఈ చర్చ అంత తేలికగా ఒక కొలిక్కిరాదు. రానక్కరలేదుకూడాను. నాకు తోచిన విషయాలు మరికొన్ని
- వైజాసత్య అన్నట్లుగానే నేను చాలా టి.వి. ఛానళ్ళలో చూశాను. సామాన్య వ్యక్తులతో మాట్లాడేటపుడు రిపోర్టర్లు ఏకవచన ప్రయోగం వాడుతున్నారు. నేను కూడా బస్ కండక్టరును మీరు అని, రిక్షా"వాడి"ని నువ్వు అని పిలుస్తుంటాను.
- తెలుగులో ఈ వచన వ్యత్యాసం తెలుగు భాషకున్న ఒక అదనపు అందం అని, సందర్భోచితంగా దానిని వాడవచ్చునని, అందువలన మన జర్నలిజమ్‌లో క్రొత్త సొంపులు వస్తాయని విద్వాన్ విశ్వం (లేదా నార్ల) వ్రాసిన ఒక వ్యాసం నేను చాలా కాలం క్రితం చదివాను. కాని జర్నలిజమ్ శైలి విజ్ఙానసర్వస్వం శైలి ఒకటి కాదు. మరియు ప్రస్తుత మన పత్రికారంగంలోను, టెలివిజన్ రంగంలోను తెలుగు చాలా అధోగతిలో ఉంది. అది మనకు మార్గదర్శకంగా తీసుకోనక్కరలేదు.
- మొదట్లో ఏకవచన ప్రయోగం నాకు చాలా కష్టమనిపించింది. కాని తరువాత అలవాటయింది.
- వికీలో ఏకవచన ప్రయోగాన్ని కొందరు సభ్యులు, సందర్శకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.
- ఈ విషయంలో ప్రమాణాలు మనకు అందుబాటులో లేవు. ఉన్నరెండు ప్రమాణాలు ఏకవచన విధానాన్ని సమర్ధిస్తున్నాయి. మరియు "తటస్థత" విషయంలో కూడా ఏకవచన విధానానికే మొగ్గు కనిపిస్తుంది అని నేను అనుకొంటున్నాను.
- నన్నయ, తిక్కనలకు (చారిత్రిక వ్యక్తులకు) ఏకవచనం అలవాటులో ఉంది. కనుక జీవించి ఉన్నవారికి కూడా అదే వర్తింపజేయడం లాజికల్ అనిపిస్తుంది. ఎందుకంటే విజ్ఞాన సర్వస్వం పది కాలాలపాటు (ఇప్పుడు జీవించి ఉన్నవారి జీవితకాలంకంటే ఎక్కువ) ఉండాలని మన ప్రయత్నం కదా!
అస్తు - --కాసుబాబు 18:59, 3 నవంబర్ 2009 (UTC)
- ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను.
1) తెవికీలో అందరినీ ప్రస్తుతం ఏకవచనం ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొందరిని ఏకవచనంలో మరి కొందరిని బహువచనంలో ఉపయోగిస్తే బాగుండదు. పిల్లలను సాధారణంగా బహువచనంలో ప్రయోగించం. అతడు పాఠశాలకు పోయాడు అంటాం కాని పోయారు అనము, అతనికి పిల్లవాడు పుట్టాడు అంటామే కాని పిల్లవారు పుట్టారు అని అనం.
2) భగవంతులనే ఏకవచనంలో ప్రయోగిస్తున్నప్పుడు సాధారణ మానవులను తప్పనిసరిగా బహువచనంలో పిలువాలనే నిబంధన అవసరం లేదు.
3) వైజాసత్యగారు చెప్పినట్లు కుటుంబంలో పెద్దవారిని వారి కుటుంబ సభ్యులే బహువచనంలో పిలవడం జరుగదు. అయిననూ అది తప్పు కానప్పుడు తెవికీలో తప్పెలా అవుతుంది.
4) ఒక వ్యక్తిని 4 రకాలుగా పిలువవచ్చు. 1.ఎక్స్ వచ్చారు, 2.ఎక్స్ వచ్చాడు, 3.ఎక్స్ గారు వచ్చారు, 4.ఎక్స్ గాడు వచ్చాడు. తటస్థ దృక్కోణం వల్ల గౌరవం ఇవ్వకూడదు మరియు అగౌరవంగా ధ్వనించకూడదు కాబట్టి 3,4 తొలిగిద్దాం, ఇక మిగిలింది 1,2 లే కదా. కాబట్టి రెండూ సమానమే రెండోదీ వాడవచ్చు. నాకు తెలిసిన/ తిరిగిన ప్రాంతాల గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రజలే కాకుండా పట్టణవాసులు కూడా ఏకవచనంలో ప్రయోగిస్తారు. సభలు, సమావేశాలలో కూడా వేదికపై ఉన్న పెద్దలను కూడా ఏకవచనంలోనే పేర్కొంటారు. ఇక్కడ ఇది సామాన్యమే.
5) కొన్ని వాక్యాలు బహువచనంలో వాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మరియు వాక్యం తప్పు అవుతుంది కూడా. ఉదా: పాలవాడు వచ్చాడు అనే బదులు పాలవాడు వచ్చారు అని అనం కదా. అలాగే కూరగాయలమ్మే మనిషి వచ్చింది అంటాం దీనికీ బహువచనం పనికిరాదు. తెవికీలో ఇలాంటి వాక్యాలు వ్రాసేటప్పుడు బహువచనం ఎలా ప్రయోగిస్తాం! ఇంకోటి ఏరా తీసుకొచ్చావా? అంటే అతనికే అడుగుతున్నట్లు ప్రశ్న ఉంది. అదే బహువచనం ఉపయోగిస్తే ఆ పని అతనికే అప్పగించామా లేక ఇతరుల పని గురించి అతనికి అడుగుతున్నామా అనేది అర్థం కాదు.
6) మరోముఖ్యవిషయం, ప్రస్తుతం మనం ఒకే విమర్శను ఎదుర్కొంటున్నాం, దానికీ సమాధానం ఇస్తున్నాం (ఏకవచనం అనేది తెవికీ నియమం), అది కూడా అలవాటుగా మారితే ఏమీ అనిపించదు, బహువచనంలోకి మారితే సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 20:01, 3 నవంబర్ 2009 (UTC)
- ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను.
నా తరపున (గౌరవసూచకాల బడి తరపున) ఇంకొంత వాదన :) మొదటగా నేను కూడా ఏకవచనవాదినే, అందుకు నాకున్న ఏకైక కారణం పాత వికీపీడియాలలో ఏకవచనం వాడటం. కానీ ఆలోచిస్తే...
- వ్యవహారికంలో మనకు ఎటువంటి పరిచయంలేని వ్యక్తితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గౌరవవాచకాలను వాడతాము, అలా వాడకపోతే నేనయితే అగౌరవ పరుస్తున్నట్లే అనుకుంటాను.
- "ఎక్స్ వచ్చారు", "ఎక్స్ వచ్చాడు" రెండూ ఒకటే ఎలా అవుతాయి, మొదటి దానితో సంభోదిస్తున్నప్పుడు గౌరవసూచకంగా ఉంది.
- వేదిక మీద పెద్దలను ఏకవచన ప్రయోగాలతో పిలవడం నేనయితే ఎప్పుడూ చూడలేదు.
- తల్లితండ్రులను ఏకవచనంతో సంభోధిస్తున్నప్పుడు అక్కడ ఆత్మీయత లేదా వారితో ఉన్న దగ్గరితనం వలన అలా సంభోదిస్తాము. ఈ లాజిక్కుని వ్యక్తుల వ్యాసాలకు కూడా ప్రయోగించలేమనుకుంటా. వ్యక్తుల వ్యాసాలు చదువుతున్న వారికి, ఆ వ్యక్తుల మీద అలాంటి ప్రేమను కలిగించనవసరం లేదనుకుంటా, అది కూడా POV కిందకు వస్తుందేమో. అదే వ్యాసాలలో వ్యాసాలలో గౌరవసూచకాలు వాడితే, వ్యాసం ఇంకా formalగా ఉంటుంది అని కూడా నా అభిప్రాయం.
- "పాలవాడు వచ్చాడు", "కూరగాయలమ్మే మనిషి వచ్చింది"; లాంటి ప్రయాగాలు (అంటే ఫలానా వృత్తి చేసుకునే వాళ్లలో ఒక వ్యక్తి ఫలా పని చేసాడు) వికీపీడియాలో వాడే సందర్భం ఏముంటుంది?
- అందరూ నన్నయ గారు, తిక్కన్న గారు, రాములవారు అంటూ సంభోదించే వాళ్లు కూడా ఉంటారు.
__మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:03, 5 నవంబర్ 2009 (UTC)
- ఏకవచన ప్రయోగంలో నాకెలాంటి పట్టు లేదు సమాధానం కొరకు వ్రాయవలసి వస్తుంది.
1) వ్యవహారంలో మనకు పరిచయం లేని వ్యక్తితో సంభోధించడానికి తెవికీలో వ్రాయడానికి చాలా తేడా ఉంది.
2) గౌరవ వాచకాలు వాడినంత మాత్రాన గౌరవం ఇచ్చినట్లు కాదు, వాడనంత మాత్రాన ఇవ్వనట్లూ కాదు.
3) వచ్చారు, వచ్చాడుకు మరీ అంత తేడా కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రాంతాల మధ్య తేడాల ప్రభావం ఉండవచ్చునేమో!
4) వేదికపై పెద్దలను ఏకవచనంలో ప్రయోగించడం చాలా ప్రాంతాలలో సాధారణమే. టివిలలో వచ్చే రచ్చబండ, ప్రజలతో ముఖాముఖిలాంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, మంత్రులస్థాయి వ్యక్తులతో కూడా సామాన్యులు ఏకవచనంలో ప్రయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.
5) నిజజీవితంలో నేనూ బహువచనమే ఉపయోగిస్తా, అయిననూ దానికీ వ్యాసాలలో వ్రాయడానికి తేడా ఉంటుంది. నిజ జీవితంలో ఉపయోగించే బాషనే వ్యాసాలలో వ్రాయడం లేదు కదా!
6) ఎక్స్ ప్రముఖ రాజకీయ నాయకుడు, సచిన్ టెండుల్కర్ ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఇలాంటి వాక్యాలకు బహువచనం ఎలా వ్రాయాలి, వ్రాయకుంటే ఇలాంటి వారిని భిన్నంగా చూసినట్లు కాదా!
7) వికీపీడీయాలో ఏ వాక్యం వ్రాయవలసిన సందర్భమైనా రావచ్చు, అలాంటి వాక్యాల అవసరం ఉండదని అనుకోవడానికి వీలుండదు.
8) వ్యక్తులకు ఎంతగౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇచ్చే గౌరవం పెరిగితే అసలుకే మోసం రావచ్చు. తెవికీలో కూడా కొంతవరకు ఈ సూత్రం పనికివస్తుందనుకుంటా. మనం తెవికీలో ఎవరినీ అగౌరవపర్చడం లేదుకదా!
8) 20-25 సంవత్సరాల కిందటి వార్తాపత్రికలను జ్ఞప్తికి తెచ్చుకుంటే మనకు అందులో వ్యక్తులకు ముందు శ్రీ అనే గౌరవపదం కనిపిస్తుంది. ఆ తరువాత వాటిని వదిలేశారు. త్వరలోనే అది (శ్రీ లేకున్నా ఏమీ కాదన్న భావన) అందరికీ అలవాటైపోయింది. ఇదీ అంతే. మనం ఇచ్చే సమాధానంలో ఉంటుంది.
9) వికీలో ఉన్న పటాలను చూస్తే జమ్మూకాశ్మీర్‌ను పూర్తిగా భారతదేశ భూభాగంలో చూపెట్టడం లేదు. ప్రారంభంలో నాకూ ఇది సరైనది అనిపించలేదు. త్వరలోనే అలవాటు పడ్డాను. ఈ విషయంలో ఎవరైనా అడిగితే ఏమని సమాధానమిస్తాం. దీనికీ అలాంటి సమాధానమే ఇవ్వాల్సి ఉంటుంది.
10) సంస్కృతిని పరిరక్షించడం కంటె విజ్ఞానాన్ని పెంపొందించడమే తెవికీ లక్ష్యం అని అన్నారు కదా అందరూ అదే లక్ష్యంతో పనిచేస్తే బాగుంటుంది.
11) బహువచనం వాడనంతమాత్రాన మన తెలుగు సంస్కృతి ఎక్కడకీ పోదు, వాడినంత మాత్రాన పోయే సంస్కృతి ఆగదు.
12) ఈ రోజుల్లో తెలుగువాళ్ళు కూడా ప్రతి దానికి అంతర్జాతీయ నిబంధనలు అనీ, యూరో నిబంధనలు అనీ పాకులాడుతున్నారు, మన వేషధారణ కూడా చాలా మారిపోయింది, మారిన అలవాట్లు మన సంస్కృతిలో భాగమయ్యాయి. అలాంటప్పుడు వెనక్కి వెళ్ళడం బాగుండదు.
13) రేపు మనలాగే వార్తాపత్రికలలో కూడా ఏకవచనమే ప్రయోగించే రోజు రావచ్చు. ఎవరుకాదంటారు?
14) మనం ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదుర్కోవాలి. ఇప్పుడు బహువచనం అంటాం, రేపు కొందరు మళ్ళీ ఏకవచనం అనవచ్చు. అలా మారుస్తే ఉంటే వ్యాసాలను వ్రాయడం వదిలి ఈ మార్పులే చేయడం సంగతి ఎలా ఉన్నా నలుగురిలో చులకనైపోతాం. (ఆయారాం గయారాం లాంటి రోజుకు నాలుగు పార్టీలు మారే వారున్నారంటారా, వారి సంగతి మనకొద్దు.) ప్రారంభంలో నాకూ ఏకవచన పద్దతి నచ్చలేదు, ఏదైనా సరే అలవాటు కావాలి. ఉన్న పద్దతికి గౌరవించాలి.
15) మనం ఎవరిగురించినైనా వ్యాసం వ్రాస్తున్నామంటే అతనికి తెవికీలో గౌరవం ఇచ్చినట్లే. గౌరవం ఇవ్వడంలో, తీసుకోవడంలో అర్థంచేసుకోవాల్సినదాన్ని బట్టి ఉంటుంది. వాక్యంలో ప్రత్యేకంగా గౌరవపదం లేకున్నంతమాత్రాన మనం అతనికి గౌరవం ఇవ్వనట్లు కాదు. అలా భావించడానికి వీలుండదు.-- C.Chandra Kanth Rao-చర్చ 18:34, 5 నవంబర్ 2009 (UTC)- చర్చ ఇలా ఏకవచనం ప్రయోగించడం బాగుంటుందా, బహువచనం బాగుంటుందా అన్న విషయానికొస్తేనే ఇలా పీఠముడిపడి ముందుకెళ్ళదు. ఇప్పటిదాకా జరిగిన ఇరుపక్షపు చర్చలలో గమనించినట్టు ఏకవచనం / బహువచన ప్రయోగం ప్రాంతాన్ని బట్టి, సామాజిక స్థాయిని బట్టి, ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి, చెప్పేవ్యక్తికి, విషయంలోని వ్యక్తిపై ఉన్న గౌరవం, వయోబేధం తదితర బోల్డన్ని అంశాలపై ఆధారపడుతుందని చూశాం.
- 1. ఏదైనా, అందరికీ వర్తింపజేసేట్టు ఉండాలి. గౌరవాగౌరవాల చర్చ అనవసరం. ఎందుకంటే ఏది గౌరవం ఏది కాదు అన్నది పైన చెప్పిన పరిస్థితులపై ఆధారపడుతుంది. నాలుగో తరగతి పాఠ్యపుస్తకంలో కూడా అగౌరవమనుకుంటే వివేకానందునికి ఎందుకు ఏకవచనం ఉపయోగిస్తారు? ఆ పాఠ్యపుస్తకం ముందుమాటలో దీన్ని తెలుగు ప్రామాణిక భాషలో వ్రాశాం. మాండలికాలు మాట్లాడే తల్లితండ్రులు అర్ధంచేసుకోగలరు అని కూడా ఒకముక్క వ్రాశారు (అలా ఏకవచనం ప్రామాణికం అని చెప్పలేదండోయ్)
- 2. దేవుళ్ళకు కూడా ఏకవచనం ప్రయోగిస్తాం కాబట్టి మిగిలిన వాళ్ళకు ఏకవచనం వర్తింపజేయాలి అనుకోవటం తర్కానికి నిలబడదు. (ప్రదీపన్నట్టు రాములోరు అనే వాళ్ళూ ఉంటారు. అలాగే రాముడు అన్నా అది అగౌరవంగా భావించరు. కాబట్టి మొదటి పాయింటులో చెప్పినట్టు గౌరవగౌరవాల తర్కం కూడా డొల్లే)
- 3. కాబట్టి గౌరవగౌరవాల చర్చను పక్కనబెట్టి నిజంగా దీన్ని ముందుకు నడిపించాలంటే గట్టి ఆధారాలేవైనా పట్టండి. ప్రతికాభాషశైలిపై గాని, విజ్ఞానసర్వస్వశైలిపై కానీ ఏవైనా తెలుగు పుస్తకాలు. తెలుగే కానక్కర్లేదనుకుంటా ఇతర భారతీయభాషల్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు. వాళ్ళ తర్కం, హేతువులేంటి? కష్టమే కాని ఇంతకంటే మరో మార్గం లేదు. ఎందుకంటే మనకిలాంటివి ముందు నుండి అలవాటులేదు. అతిశయోక్తాలంకారాలతో హిమశిఖరాలనెక్కించడం లేదా అంటే ఘాటైన మాటలతో అధోపాతాళానికి తప్ప నిష్పక్షపాతంగా, సూటిగా ఏ రచనలూ సాగలేదు. --వైజాసత్య 06:10, 6 నవంబర్ 2009 (UTC)
- ఏకవచన ప్రయోగంలో నాకెలాంటి పట్టు లేదు సమాధానం కొరకు వ్రాయవలసి వస్తుంది.
మరికొంత ఆధారంఅయోమయం
మార్చు
ఏది సరైన పద్ధతి అని వెతికే ప్రయత్నంలో నాకిది కనిపించింది. 1994లో ముద్రితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నాలుగవ తరగతి తెలుగు వాచకంలో వివేకానందుడి పాఠం. ఈ పుస్తకం సంపూర్ణంగా ఇక్కడ లభ్యమౌతుంది. ఈ పుస్తకంలో వివేకానందుడికి ఏకవచనమూ, వీరేశలింగం పంతులు పాఠంలో బహువచనమూ, మరలా రుద్రమదేవి పాఠంలో ఏకవచనమూ ప్రయోగించారు. :-( --వైజాసత్య 05:30, 4 నవంబర్ 2009 (UTC)
కొన్ని ఆలోచనలు
మార్చు- T-V distinction పైన ఒక చర్చలో శివగారన్నట్టు ఆంగ్లంలో thou అంతరించడంతో లోపించింది. కానీ ఫ్రెంచిలో అలాగే ఉండిపోయిందంట. ఫ్రెంచివికీలో ఏంచేస్తున్నారో చూడాలి. ఇది కుడా చదవండి (You) --వైజాసత్య 06:30, 6 నవంబర్ 2009 (UTC)
వికీ శైలి
మార్చు{{సహాయంకావాలి}} వికీ శైలికి అనుగుణం కాని మార్పులు రద్దు అని బెజవాడ గోపాలరెడ్డి వ్యాసములో [1] అర్జున రావు మార్పులను రద్దు చేశారు. వికీ శైలి యొక్క లింకులను తెలిసిన వారు పొందుపరచ గలరు. ముక్కూ, మొహము ఎవరు ఏమిటో తెలియని వారు, వారి వారి వయస్సు, స్థితి, పరిస్థితులు, (ఇలా చెప్పుకుంటూ పోతే..............సమయం, అన్నీ దండగ), అలాంటి వారిని అయ్యా, మీరు, తమరు, సారు, అండీ................. ఇలా ఇలా బహువచన రూపములో కేవలము ఒక తోటి సభ్యుడన్న భావనతో సంబోధించి, పిలుచుకుంటున్నాము. అలాంటిది గొప్ప గొప్ప వారి గురించి ఏక వచనముతో; చేసాడు, వచ్చాడు, వెళ్ళాడు, చూసాడు, తీసాడు, వ్రాసాడు,............., అలాగే స్త్రీ ల గురించి కూడా వచ్చింది, చూసింది, వెళ్ళింది, కనింది, పెట్టింది, అయ్యింది, పోయింది, వస్తానంది, వెళ్తానంది, ..................ఇలా అని వ్యాసాలు వ్రాయడము ఎంతవరకు సమంజసం ? స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:57, 27 మార్చి 2013 (UTC)
- యితరులను గౌరవించటం మన సాంప్రదాయం.మనల్నే ఏకవచనం గా సంభోధిస్తే అగౌరవ పరచినట్లు భావిస్తాము. అందువల్ల గొప్పవారిని గౌరవసూచకంగా బహువచనంలో ప్రయోగం చేయుటలో తప్పులేదని నా అభిప్రాయం. వికీ శైలి నాకు తెలియదు. వికీ లో నైనా గౌరవసూచకపదములు ఉపయోగించమనే ఉంటుందని అనుకుంటాను.-- - - కె.వెంకటరమణ చర్చ 05:05, 27 మార్చి 2013 (UTC)
- ఈ విషయంపై చాలా సార్లు చర్చ జరిగింది. ఇది చూడండి వికీపీడియా:ఏకవచన ప్రయోగం --వైజాసత్య (చర్చ) 05:10, 27 మార్చి 2013 (UTC)
- ఒకరి గురించి వ్యాసము వ్రాయాలనుకునే వారు, వారి గురించి మర్యాదగా వ్రాస్తే మంచిది. ఇప్పటి వరకు వ్యాసాలలో ఉన్న బహువచన ప్రయోగాలు తీసివేయమంటారా ? అలా చేస్తే ఎలా ఉంటుందో (ముఖ్యంగా అర్జున రావు లాంటి శైలి తెలిసిన వారు) ఊహించి చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:19, 27 మార్చి 2013 (UTC)
- మీరు నేనిచ్చిన లింకు యొక్క చర్చా పేజీ చూడలేదనుకుంటా. వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే, ఎటుమొగ్గాలో తెలియక చాలామంది సభ్యులు సతమతయ్యారు. --వైజాసత్య (చర్చ) 05:31, 27 మార్చి 2013 (UTC)
- చూసాను. అక్కడ స్పందించాను. మరి రాబోయే సమావేశముల గురించి ఒక వ్యాసము [2] తయారు చేశారు. మరి దానిలో ఏక వచనములు వాడలేదు. కేవలము బహువచనములు వాడారు. వికీ సభ్యులకు మాత్రము బహువచనములలో అన్ని విషయములు జరుగుతున్నాయి. ఇది వికీ శైలికి విరుద్ధము కాదా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:38, 27 మార్చి 2013 (UTC)
- ప్రసాద్ గారూ. అది విజ్ఞాన సర్వస్వాన్ని గురించి ఎక్కడో అచ్చయ్యే కరపత్రం. విజ్ఞాన సర్వస్వపు వ్యాసం కాదు. అందులోని వ్యక్తులెవరూ విజ్ఞానసర్వస్వంలో చోటుచేసుకునేంత ప్రసిద్ధి చెందినవారు కూడా కాదు. అలాగే చర్చా పేజీలకు, తదితర అనుబంధ పేజీలకు ఎలాంటి నియమాలు లేవు. --వైజాసత్య (చర్చ) 05:44, 27 మార్చి 2013 (UTC)
- నేనూ అనేది అదేనండీ ! మనము మనము మర్యాద ఇచ్చుకుంటాము, పుచ్చుకుంటాము. కాని బయటి వారికి వ్యాసాల రూపములో వారి వారి గురించి ఏక వచనములతో విషయములు తెలుసుకోవాలనుకునే వారికి అందిస్తున్నాము. ముందు తరాల వారిని మనమే చెడగొట్టిన వారమవుతాము. మీరన్నట్లు అది కరపత్రము కాదు. అది చాలా కాలము నుంచి వ్యాసరూపములోనే ఉంటోంది. మర్యాద మనమే నేర్పాలి ముందు. ఆ తర్వాతనే పుచ్చుకోవాలి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:50, 27 మార్చి 2013 (UTC)
- దీని గురించి ఆలోచించి చాలా తలబాదుకున్నాము. వికీపీడియా_చర్చ:ఏకవచన_ప్రయోగం చూసి. తటస్థ ధృక్కోణానికి, యూనిఫార్మిటీకి (సారూప్యత??), తెలుగు వాడుకకు, విజ్ఞానసర్వస్వపు శైలిని కలిపికట్టగల విధానమేదైనా ఉంటే చెప్పండి. అదే కొనసాగిద్దాం --వైజాసత్య (చర్చ) 05:57, 27 మార్చి 2013 (UTC)
- ఏ ఒక్కరి గురించి అయిననూ, వ్యక్తి గత వ్యాసము వ్రాయలనుకునే వారు, తప్పనిసరిగా బహువచన ప్రయోగములోనే వ్రాయాలి. ఏకవచనములో ఆ పెద్దల గురించి నా (మన) లాంటి వారు వ్రాసేటప్పుడు పడే మానసిక నరకం ఇంతా అంతా కాదు. అందుకనే ఆ విధముగా, అమర్యాదగా వ్రాయడము కన్నా, మానుకోవడము మంచిదని నేను వ్యాసాలలో వేలు పెట్టడము లేదు. అంతకంటే ఘోరం(అచ్చు లోపం), అవమానించటం మరొకటి లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:19, 27 మార్చి 2013 (UTC)
- దీని గురించి ఆలోచించి చాలా తలబాదుకున్నాము. వికీపీడియా_చర్చ:ఏకవచన_ప్రయోగం చూసి. తటస్థ ధృక్కోణానికి, యూనిఫార్మిటీకి (సారూప్యత??), తెలుగు వాడుకకు, విజ్ఞానసర్వస్వపు శైలిని కలిపికట్టగల విధానమేదైనా ఉంటే చెప్పండి. అదే కొనసాగిద్దాం --వైజాసత్య (చర్చ) 05:57, 27 మార్చి 2013 (UTC)
- నేనూ అనేది అదేనండీ ! మనము మనము మర్యాద ఇచ్చుకుంటాము, పుచ్చుకుంటాము. కాని బయటి వారికి వ్యాసాల రూపములో వారి వారి గురించి ఏక వచనములతో విషయములు తెలుసుకోవాలనుకునే వారికి అందిస్తున్నాము. ముందు తరాల వారిని మనమే చెడగొట్టిన వారమవుతాము. మీరన్నట్లు అది కరపత్రము కాదు. అది చాలా కాలము నుంచి వ్యాసరూపములోనే ఉంటోంది. మర్యాద మనమే నేర్పాలి ముందు. ఆ తర్వాతనే పుచ్చుకోవాలి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:50, 27 మార్చి 2013 (UTC)
- ప్రసాద్ గారూ. అది విజ్ఞాన సర్వస్వాన్ని గురించి ఎక్కడో అచ్చయ్యే కరపత్రం. విజ్ఞాన సర్వస్వపు వ్యాసం కాదు. అందులోని వ్యక్తులెవరూ విజ్ఞానసర్వస్వంలో చోటుచేసుకునేంత ప్రసిద్ధి చెందినవారు కూడా కాదు. అలాగే చర్చా పేజీలకు, తదితర అనుబంధ పేజీలకు ఎలాంటి నియమాలు లేవు. --వైజాసత్య (చర్చ) 05:44, 27 మార్చి 2013 (UTC)
- చూసాను. అక్కడ స్పందించాను. మరి రాబోయే సమావేశముల గురించి ఒక వ్యాసము [2] తయారు చేశారు. మరి దానిలో ఏక వచనములు వాడలేదు. కేవలము బహువచనములు వాడారు. వికీ సభ్యులకు మాత్రము బహువచనములలో అన్ని విషయములు జరుగుతున్నాయి. ఇది వికీ శైలికి విరుద్ధము కాదా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:38, 27 మార్చి 2013 (UTC)
- మీరు నేనిచ్చిన లింకు యొక్క చర్చా పేజీ చూడలేదనుకుంటా. వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే, ఎటుమొగ్గాలో తెలియక చాలామంది సభ్యులు సతమతయ్యారు. --వైజాసత్య (చర్చ) 05:31, 27 మార్చి 2013 (UTC)
- ఒకరి గురించి వ్యాసము వ్రాయాలనుకునే వారు, వారి గురించి మర్యాదగా వ్రాస్తే మంచిది. ఇప్పటి వరకు వ్యాసాలలో ఉన్న బహువచన ప్రయోగాలు తీసివేయమంటారా ? అలా చేస్తే ఎలా ఉంటుందో (ముఖ్యంగా అర్జున రావు లాంటి శైలి తెలిసిన వారు) ఊహించి చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:19, 27 మార్చి 2013 (UTC)
- ఈ విషయంపై చాలా సార్లు చర్చ జరిగింది. ఇది చూడండి వికీపీడియా:ఏకవచన ప్రయోగం --వైజాసత్య (చర్చ) 05:10, 27 మార్చి 2013 (UTC)
- యితరులను గౌరవించటం మన సాంప్రదాయం.మనల్నే ఏకవచనం గా సంభోధిస్తే అగౌరవ పరచినట్లు భావిస్తాము. అందువల్ల గొప్పవారిని గౌరవసూచకంగా బహువచనంలో ప్రయోగం చేయుటలో తప్పులేదని నా అభిప్రాయం. వికీ శైలి నాకు తెలియదు. వికీ లో నైనా గౌరవసూచకపదములు ఉపయోగించమనే ఉంటుందని అనుకుంటాను.-- - - కె.వెంకటరమణ చర్చ 05:05, 27 మార్చి 2013 (UTC)
- ఇది వికీ శైలి [3]లింకు. దీని గురించి చర్చ చాలా చేయాలి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:56, 27 మార్చి 2013 (UTC)
- ఒకరి గురించి వ్యాసము వ్రాయాలనుకునే వారు, వారి గురించి మర్యాదగా వ్రాస్తే మంచిది. ఇప్పటి వరకు వ్యాసాలలో ఉన్న బహువచన ప్రయోగాలు తీసివేయమంటారా ? అలా చేస్తే ఎలా ఉంటుందో (ముఖ్యంగా అర్జున రావు లాంటి శైలి తెలిసిన వారు) ఊహించి చెప్పండి. స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:57, 27 మార్చి 2013 (UTC)
- నాకు ఇప్పటికే వాడుకలో వున్న శైలికి దాని వెనుకనున్న కారణాలు, దృష్టాంతాలు చూచినతరువాత అభ్యంతరమగుపడలేదు. నిర్వాహకునిగా విధానం అమలుకి సహాయపడుతున్నాను. --అర్జున (చర్చ) 06:41, 27 మార్చి 2013 (UTC)
- ఈ క్రింద సూచించిన విధముగా వికీ శైలి ఉండాలన్నారు మన తోటి (వరిష్టులు) సభ్యులు. ' వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి . ఇదండీ! తెలుగు భాష యొక్క వికీ శైలి. దీని గురించి చర్చించుదామంటే స్పందన ఉండదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:06, 27 మార్చి 2013 (UTC)
- ఎంతమంది ఏకవచన ప్రయోగం :ఇప్పటి వరకు భారతదేశములో అచ్చు లో లభిస్తున్న పుస్తకాలలో ఎంతమంది ఎంతమందికి ఏకవచన ప్రయోగం చేశారు ? లెక్కపెడితే చాలా తక్కువ. గ్రహించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:25, 27 మార్చి 2013 (UTC)
- విజ్ఞానసర్వస్వానికి సాధారణ పుస్తకానికి అలాగే అవిరూపొందే మరియు మార్పులచెందే విధానానికి తేడా వుంది. --అర్జున (చర్చ) 06:56, 27 మార్చి 2013 (UTC)
- ఎక్కడయినా ఒకే విధానముండాలి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:40, 27 మార్చి 2013 (UTC)
- నేను అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశీలించాను. అన్నింటిలోనూ ఏక వచన ప్ర్రయోగం ఉన్నది. మరణించే వ్యక్తుల చరిత్రలన్నింటిలో ఏక వచన ప్రయోగం ఉంది. జీవించు ఉన్న మన మధ్య ఉన్న వ్యక్తులను వచ్చారు, అన్నారు, చెప్పారు అని వాడుట జరుగుతున్నది. వికీ శైలి సరియైనదని భావిస్తాను.-- - - కె.వెంకటరమణ చర్చ 09:22, 27 మార్చి 2013 (UTC)
ఏకవచనమే వాడిన మాస్టారు
మార్చుబూదరాజు రాధాకృష్ణ భాషా పండితుడిగా, భాషా శాస్త్రవేత్తగా, సాహితీ విమర్శకుడిగా, రచయితగా మనందరికీ సుపరిచితులే! తెలుగువారికి తెలుగు నేర్పిన మాస్టారాయన. శ్రీశ్రీ జీవిత కథను ఇంగ్లీషులో రాసి, దాన్ని తానే తెలుగులోకి అనువదించారు, మహాకవి శ్రీశ్రీ పేరుతో. సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. అందులో ఆయన ఏకవచనమే వాడారు. శ్రీశ్రీ గురించే కాక, ఆ పుస్తకంలో ప్రస్తావించిన విశ్వనాథ సత్యనారాయణ వంటి ఇతర వ్యక్తులను కూడా ఏకవచనంలోనే సంబోధించారు.
శ్రీశ్రీ గురించి ఆయన చెప్పిన గొప్ప మాటలు కొన్ని ఇక్కడ: "1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు." -అంత ప్రశంస కూడా ఏకవచనంలోనే! అతడు అని వాడారు, ఆయన అనలేదు. గమనించగలరు.
ఆ మాస్టారు చెప్పిన శైలిలోనే తెవికీ వ్యాసాలు కూడా రాయాలని మనం అనుకున్నాం. ఆయన గురించిన వ్యాసాన్నీ అలాగే మొదలుపెట్టాం.., కానీ కొంత కాలం తరువాత మనమే మార్చేసుకున్నాం, గౌరవవాచకాలతో.__చదువరి (చర్చ • రచనలు) 15:15, 27 జూలై 2016 (UTC)
- మాష్టారు ఏకవచనమే వాడాడు అని మీరూ రాయలేకపోయారు. ఆయన రాసినది పాత తరం వాళ్ళ గురించి, ఇప్పటీ తరం వాళ్లను గురించి తప్పక బహువచన ప్రయోగం చేయవలసి వస్తున్నది. వాళ్ళు చూసుకొన్నా, వాళ్లవాళ్ళు చదివినా ఇబ్బంది పడని విధంగా ఉంటుంది..ఏకవచనం రాసినంత వరకూ ఎలాగూ వదిలేసాం. ప్రస్తుతం కొందరు వాడుకరులు వాడుతున్న బహువచనం కొనసాగించుట వలన వ్యాసాలు బావున్నాయి, .--Viswanadh (చర్చ) 03:21, 28 జూలై 2016 (UTC)
- మనం చర్చా పేజీకి, విజ్ఞాన సర్వస్వ వ్యాసం పేజీకీ మధ్య గల తేడాను మర్చిపోకూడదండి. రెండింటి శైలి వేరు. విజ్ఞాన సర్వస్వ వ్యాసంలో ఏ శైలి వాడాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, మనం. అందుకే బూదరాజు గారు ఒక జీవిత చరిత్ర పుస్తకంలో రాసిన శైలిని ఉదహరించాను. __చదువరి (చర్చ • రచనలు) 04:53, 28 జూలై 2016 (UTC)
- మరొక్క సంగతి - శ్రీశ్రీ మరణించింది 1983లో, బూదరాజు గారు ఈ పుస్తకం రాసింది 1999 లో -పెద్దగా ఎడమేమీ లేదండి. శ్రీశ్రీ వారసులు చూసుకునే ఉంటారు. బహువచనం రాసాం కాబట్టి వ్యాసాలు బాగున్నాయని అనడం, లేక బాగోలేదనడం -ఇవి ఆత్మాశ్రయం (సబ్జెక్టివ్). వీటి ద్వారా మనం శైలిని నిర్ధారించుకోలేం. ఎందుకంటె మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు, మనిద్దరికీ నచ్చేది మరొకరికి నచ్చకపోవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 05:12, 28 జూలై 2016 (UTC)
- నా వరకు నేను మాత్రం ఏకవచనం మాత్రమే వాడాలని నిర్ణయించుకున్నాను. వేరొకరు బహువచనంలో రాసిన వ్యాసాన్ని కూడా ఏకవచనంలోకి మారుస్తుంటాను. --రవిచంద్ర (చర్చ) 05:38, 28 జూలై 2016 (UTC)
- చదువరి గారు, అనేక చోట్ల అనేక మంది బహువచనములు వాడిన సందర్భాలు కోకొల్లలు. ఏదో ఏకవచన ప్రయోగ పుస్తకం ఎవరిదో ఒకరిది ఎవరో ఒకరు ఉదాహారణగా చూపితే అదే ప్రమాణము కాదు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీకు తెలిసిన గొప్ప ప్రముఖమైన వారు ఎవరయిననూ మరియు స్త్రీ, పురుషులైననూ వారిగురించి ఏక వచనంతో మీరు వ్యాసాలు వ్రాయగలరా ? మనస్పూర్తిగా చెప్పండి. బూదరాజు రాసాడు అని మిగతా వాళ్ళు వ్రాస్తారు అని మీ అభిప్రాయములా ఉంది. ఒకరు ఏకవచనం బహువచనం చేస్తే, మరొకరు బహువచనం వ్యాసాలను ఏకవచనం చేస్తారు. మీకు తెలిసిన, మీరు గౌరవించే స్త్రీ, పురుషుల గొప్పవారి పేర్లు కొన్ని చెప్పండి. నేను ఏకవచనంలో ఉదాహరణకు వ్రాసి చూపిస్తాను. మీకు నేత్రానందం, శ్రవణానందంగా ఆ వాక్యములు ఉన్నాయో లేదో కాస్త చెప్పండి. వ్యాసములు అనేవి ఎక్కువ మంది చదువరులకి ఆమోదయోగ్యముగా ఉండాలి. వ్యాసము వ్రాసే ప్రక్రియలు ఎవరి అభిప్రాయము వారిదిలా ఉంది. నా మటుకు నేను ఎక్కడయినా పంటి క్రింద రాయిలా ఏకవచనం తగిలితే దానిని అతిగౌరవం, సొంత అభిప్రాయం, ఇలాంటి అర్థాలు వచ్చే విధంగా కాకుండా వీలయినంత వరకు కొత్తతరం వారికోసం బహువచనంలో మారుస్తాను.JVRKPRASAD (చర్చ) 05:50, 28 జూలై 2016 (UTC)05:42, 28 జూలై 2016 (UTC)
- ప్రసాదు గారూ,
- "అనేక చోట్ల అనేక మంది బహువచనములు వాడిన సందర్భాలు కోకొల్లలు. ఏదో ఏకవచన ప్రయోగ పుస్తకం ఎవరిదో ఒకరిది ఎవరో ఒకరు ఉదాహారణగా చూపితే అదే ప్రమాణము కాదు." -ఒప్పుకుంటానండి. అసలందుకేగా మన కీ సందిగ్ధత ఏర్పడింది! అందరూ ఒకే శైలిని అవలంబించి ఉంటే కళ్ళు మూసుకుని మనమూ అలాగే వెళ్ళిపోయేవాళ్లం.
- " మీకు తెలిసిన గొప్ప ప్రముఖమైన వారు ఎవరయిననూ మరియు స్త్రీ, పురుషులైననూ వారిగురించి ఏక వచనంతో మీరు వ్యాసాలు వ్రాయగలరా ?" మళ్ళీ మన స్వంత అభిరుచుల గోల లోకి వెళ్ళిపోతున్నాం. నా చుట్టాలు, స్నేహితుల్లో వికీకెక్కేంత ప్రముఖులు లేరు కాబట్టి, రాసే ప్రశ్న తలెత్తదు. కానీ బూదరాజు రాధాకృష్ణ, బాపు, రమణ, శ్రీరమణ, సావిత్రి, ఎస్వీ రంగారావు, రావు గోపాలరావు,.... ఇలా నాకు ఇష్టమైన వాళ్ళు ఎంతో మంది వికీకెక్కిన వాళ్ళు, ఎక్కగల వాళ్ళూ ఉన్నారు. నేను వాళ్ళ గురించి వ్యాసం రాయాల్సి వస్తే ఏకవచనంలో రాస్తాను. మీరు రాసినా సరే, చదివేందుకు నా కభ్యంతరం లేదు.
- "వ్రాసము వ్రాసే ప్రక్రియలు ఎవరి అభిప్రాయము వారిదిలా ఉంది. నా మటుకు నేను ఎక్కడయినా పంటి క్రింద రాయిలా ఏకవచనం తగిలితే దానిని అతిగౌరవం, సొంత అభిప్రాయం, ఇలాంటి అర్థాలు వచ్చే విధంగా కాకుండా వీలయినంత వరకు కొత్తతరం వారికోసం బహువచనంలో మారుస్తాను." - నామటుకు నేను అలా చెయ్యను. గౌరవ సూచికల పట్ల నాకేమీ ఏవగింపు లేదు. తెవికీ శైలి ఇదిగో ఇలా ఉండాలి అనేది తేల్చడానికే నా ప్రయత్నం. గౌరవపురస్సరంగా రాయాలి అని మనమంతా తీర్మానించుకుంటే, నేనూ అలాగే రాస్తాను, నా అభిప్రాయం వేరైనప్పటికీ. ఎందుకంటే, నేను రాసేది నాది కాదు, అది తెవికీ ఆస్తి, సార్వత్రికంగా అందరిదీను. ఇక్కడ కృతే ముఖ్యం, కర్తలకు ప్రాముఖ్యత లేదు. ఏదేమైనప్పటికీ, మన శైలి సంగతి తేలేవరకు గౌరవ శైలిలో రాసిన దాన్ని నేను పనిగట్టుకుని మార్చను. __చదువరి (చర్చ • రచనలు) 06:13, 28 జూలై 2016 (UTC)
- ప్రసాదు గారూ,
చదువరి గారు, నేను మిమ్మల్ని మీకు తెలిసిన గొప్పవారి గురించి పేర్లు చెప్పండి. అంటే చాలా చాలా గొప్పవారు మీరు సూచించిన వారు తప్ప మీకు వ్యక్తిగతంగా తెలిసిన వారు కాదండి ! మన జీవితంలో తెలిసిన పేర్లు అని నా భావన. ఉదా: కంచి పీఠాధిపతి, రాష్ట్రపతి, వేదవేదాంగాలు చదివిన వారు, అనేక విధములయిన శాస్త్రములు యందు ఔపోసన పట్టినవారు, రాజకీయం, సామాజికం, ఇంక మీ ఇష్టం ఎవరయిననూ సరే, వారి గురించి మనము ఏకవచనం ప్రయోగం చేస్తూ వ్రాస్తే వ్యాస రీతి ఏ విధంగా ఉంటుందో మనము చదువుతూ ఉంటే ఎలా ఉంటుందో అని మాత్రమే నా ఉద్దేశ్యం. మన దేశానికి సభ్యత, సంస్కారములు, సంప్రదాయములు, గౌరవం ఇలాంటి వాటిని పాటించేది. అది మన సంస్కృతి. మనము కొత్త తరానికి, చదివే వారికి గౌరవ, మర్యాదలు వ్యాస రూపములలో మనమే నేర్పాలి అని నా అభిప్రాయము. అందుకే నేను తెవికీ నియమములు భవిష్యత్తు అవసరాల రీత్యా కొత్తవి చాలా వ్రాసుకోవాలి అని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాను. ఇందులో ఎవరి అభిప్రాయము వారిది. కొంతకాలము ఎలాగోలా వ్యాసములు ముందుకు నడిపితే కొత్త వాడుకరులు మరికొంత మంది క్రియాశీలకంగా ఉంటే అప్పుడు చర్చలు మరికొంత అప్పుడప్పుడు చేసుకుంటుంటే ఎప్పటికయినా పరిష్కారము తప్పకుండా లభిస్తుంది. చర్చలు తప్పకుండా చేద్దాము. ఈ సందర్భముగా మీ స్పందనలకు అభిప్రాయములు తెలియజేసినందులకు మీకు నా ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:09, 28 జూలై 2016 (UTC)