వికీపీడియా చర్చ:నిర్జన గ్రామాల సృష్టిపై విధానం

తాజా వ్యాఖ్య: నిర్జన గ్రామాల తయారీ సరికాదు టాపిక్‌లో 9 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

నిర్జన గ్రామాల తయారీ సరికాదు

మార్చు

గమనిక: రచ్చబండలో జరిగిన చర్చ ఇక్కడ చేర్చాను
ఇటీవల మన సహసభ్యుడు వాడుకరి:Nrgullapalli, గతంలో పలువురు వికీపీడియన్లు కూడా మండలాలలో గ్రామాల జాబితాలో ఉన్న ఎర్ర లింకులపై నొక్కి కొత్త గ్రామాల వ్యాసాలు సృష్టించడం చూశాను. వారు సదుద్దేశంతోనే సృష్టిస్తున్నారు, ఐతే ఇక్కడొక ధర్మసూక్ష్మం (నిజానికి పరిపాలనా సూక్ష్మం) ఉంది
మనం 2006లో బాట్‌తో సృష్టించినవీ, భారత జనగణన జరిగేదీ రెవెన్యూ గ్రామం మౌలిక యూనిట్‌గా తీసుకుని. అంటే రెవెన్యూ గ్రామాల్లో జనగణన చేసి, ఇదిగో సమాచారం అని ప్రభుత్వం ఇస్తుందన్న మాట. ఐతే ఈ రెవెన్యూ గ్రామం అన్నది బ్రిటీష్ కాలం నాడు పన్నులు స్వీకరించడానికి వారికి సౌలభ్యంగా ఉండేందుకు తయారుచేసిన యూనిట్. ఈ రెవెన్యూ గ్రామంలో పలు శివారు గ్రామాలు ఉంటాయి, ఈ శివారు గ్రామాల్లో కొన్ని పంచాయితీ హోదా కూడా ఉన్న గ్రామాలు, కొన్ని అసలు గ్రామం కన్నా పెద్దవి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారేమో, ఆ విషయానికే వస్తే:

  • నిర్జన గ్రామాలు: రెవెన్యూ గ్రామాలు కొన్నిటిలో పదుల ఏళ్ళు గడిచిపోయిన ఈ స్థితిలో పలు కారణాలతో (ముంపు వల్ల వలసలు, కరువు వల్ల వలసలు, చుట్టుపక్కల వేరే పెద్ద గ్రామం ఏర్పడడం, వగైరాలు ఎన్నైనా ఉండొచ్చు) జనం లేచి వెళ్ళిపోయారు. రెవెన్యూ వ్యవస్థకు అవసరమైన పన్నులు ఇచ్చే పంటలు, చెరువులు అక్కడ ఉన్నాయి కదా అందుకే ఆ రెవెన్యూ గ్రామంలో జనం లేకపోయినా వ్యవస్థలో కొనసాగుతోంది. ఈ సూక్ష్మాంశాలను పట్టించుకోకో, తెలిసినా సరేలెమ్మని వదిలేసో భారత జనగణన వారు ఆ గ్రామాన్ని కూడా తమ లెక్కల్లో పెట్టుకుంటున్నారు. కాకపోతే సమాచారం ఖాళీగా ఉంటుంది. రెవెన్యూ వారి, జనగణన వారి లెక్కల కోసం మాత్రమే ఉన్న ఈ ఖాళీ ఊళ్ళు జనగణన జాబితా ద్వారా తయారుచేసిన మండలాలలో గ్రామాల జాబితాలోకి ఎక్కాయి. (పంచాయితీ, తండా గ్రామాల గురించి మాట్లాడట్లేదు. అవి రెవెన్యూ, జనగణన గుర్తించని, జనమున్న ఊళ్ళు. ఇవి జనం లేని రెవెన్యూ వ్యసవ్థ కోసమే ఉన్న ఊళ్ళు)
  • ఏం చేయవచ్చు: నా అభిప్రాయం ప్రకారం, మనుషులు లేని ఊళ్ళకు సంబంధించి మహా అయితే రెవెన్యూ లెక్కలే ఉంటాయి, విజ్ఞానదాయకమైనవీ, జనం తెలుసుకోదగ్గవి అక్కడ ఏమీ ఉండవు. మనుషులు లేని ఊళ్ళకు వ్యాసాలను మనం సృష్టించరాదు, సృష్టించితే చేర్చేందుకు సమాచారం కానీ, చదివేందుకు మనుషులు కానీ లేరు కాబట్టి. కాబట్టి ఆ గ్రామాల వ్యాసాలు ఇప్పటివరకూ తయారైనవి తీసేయాలి. సృష్టించినవారి పొరబాటు ఏమీ లేదనే తలుస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఈ వివరాలు తెలిసివుండవకపోవచ్చు కాబట్టి. అలానే భవిష్యత్తులో మరెవరూ సృష్టించే వీలు లేకుండా మండలం పేజీలో గ్రామాల జాబితాలోకి వెళ్ళి, సదరు గ్రామాల పేర్లు తొలగించి, ఈ మండలంలో ఇన్ని నిర్జన రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్న ముక్క రాసి ఊరుకోవాలి.
  • ఎలా తెలుస్తుంది: ఈ గ్రామాలను గుర్తించడానికి ఉన్న ముఖ్యమైన మార్గం, జనాభా లెక్కల్లో ఏ సమాచారం లేని గ్రామాలు కావడమే. ఈ విషయంలో మరిన్ని ఆలోచనలు పంచుకోమని జనగణన సమాచారం వికీపీడియా వ్యాసాల్లోకి తేవడంలో విస్తృతంగా పనిచేసిన వాడుకరి:Chaduvari, గతంలో గ్రామ పరిపాలన వ్యవస్థలో పనిచేసిన వాడుకరి:యర్రా రామారావు, తొలినాళ్ళ నుండీ గ్రామాల వ్యాసాల్లో ఇప్పటిదాకా పనిచేస్తున్న వాడుకరి:Bhaskaranaidu, వంటివారిని కోరుతున్నాను.

ఇక సముదాయ సభ్యులు ఈ అంశంపై తమ పరిశీలను, అభిప్రాయాలు పంచుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 03:20, 24 జూలై 2018 (UTC)Reply

గ్రామ వ్యాసాల అభివద్దిపై,రెవెన్యూ గ్రామం పై సవివరమైన వ్యాసం సృష్టించి గ్రామాలలో ఉన్న తేడాలు (రకాలు) తెలిపినందుకు మీ కృషి అభినందనీయం.ధన్యావాదాలు--యర్రా రామారావు (చర్చ) 03:44, 24 జూలై 2018 (UTC)Reply
నిర్జన గ్రామాల చేర్పు అనవసరమని నా అభిప్రాయంPalagiri (చర్చ) 04:04, 25 జూలై 2018 (UTC):Reply
వాటికి ఒక మూస పెట్టి ఉంచడం వల్ల ఆ సమాచారం కూడా వికీలో లభ్యం ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ తక్కువ సమాచారం కలిగినా కూడా, ఎవరైనా ఆ గ్రామ సమాచారంకోసం వెదికినా దొరకగలదు అని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ)
B.K.Viswanadh గారూ! అసలు అలాంటి గ్రామం రెవెన్యూ లెక్కల్లో తప్ప బయట ఉండదండీ. ఎవరు వెతుకుతారు, అసలు లేని గ్రామాన్ని? --పవన్ సంతోష్ (చర్చ) 10:14, 25 జూలై 2018 (UTC)Reply
విశ్వనాధ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:24, 25 జూలై 2018 (UTC)Reply
నిర్జన గ్రామాల చేర్పు అనవసరం. ఉన్నవాటిని తొలగించాలి. ప్రస్తుతం వికీలో ఎటువంటి సమాచారం లేకుండా మూలాలు లేకుండా విపరీతంగా కొత్త గ్రామవ్యాసాలను గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు సృష్టిస్తున్నారు. వికీ విధానాల ప్రకారం వాటిని వ్యాసాలుగా పరిగణించలేము. వాటిని కూడా తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 12:24, 25 జూలై 2018 (UTC)Reply
నిర్జన గ్రామాల్లో సమాచారం - ఇది ఫలానా మండలంలోని గ్రామం అనేది తప్ప వేరే ఏమీ ఉండదు. కొన్నిచోట్ల నీటిపారుదల సౌకర్యాల గురించి కూడా ఉంటుంది. ఇవి తప్పించి మరే సమాచారమూ ఉండదు. అసలు సమాచారమే లేని పేజీని ఉంచడం వలన ఏ ఉపయోగమూ లేదు. అయితే "అదొక నిర్జన గ్రామం అనే సంగతైనా వికీపీడియాలో ఉండాలి కదా" అంటే.. రాష్ట్రం లోని నిర్జన గ్రామాలన్నిటినీ ఒక పేజీలో జాబితాగా పెడితే సరిపోతుంది. రెండు రాష్ట్రాలకూ రెండు పేజీలు ఉంటాయి. లేదా జిల్లాకొక జాబితా పేజీ పెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:15, 25 జూలై 2018 (UTC)Reply
  1. సహజంగా గ్రామాలు అంటే అన్నీ ఒకటే కదా? కాకపోతే నిర్జన గ్రామాలు ఉంటాయి అనుకుంటాం.నాకు తెలిసినంతవరకు గ్రామాలు దిగువ తెలిపిన ప్రకారం ఉంటాయి.
  2. రెవెన్యూ గ్రామంతో కూడిన గ్రామ పంచాయతీలు.
  3. రెవెన్యూ గ్రామం కాని గ్రామ పంచాయితీలు.(ఇవి ఇంకొక రెవెన్యూ గ్రామానికి శివారు గ్రామంగా ఉంటుంది.రెవెన్యూ లెక్కలు లావాదేవీలకు))
  4. జనాభా నివసించని గ్రామాలు (రెవెన్యూ లెక్కలలో గ్రామంగా రికార్డు ఉంటుంది.)

భారత జనన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం నూతన జిల్లాల, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు ప్రకారం గ్రామ వ్యాసాల మూసలనందు, వ్యాసలో “మండలంలోని గ్రామాలు” అనే విభాగంలో చూపినవి అన్నీ రెవెన్యూ గ్రామాలు మాత్రమే. అంటే పైన వివరించిన మొదటి కోవకు చెందినవి. నేను పై విషయసూచిక వ.సం 27 లో రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు పై చర్చలో వివరించింది ఒక్క నిర్జన గ్రామాలు ఒక్క అంశమే కాదు.రెండవ కోవకు చెందిన గ్రామాలు (రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు) ఎలా చూపాలి అనే దానిమీద నా అభిప్రాయం పైన వివరించాను.

ఆలింకులో మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలంలో 17 గ్రామ పంచాయితీలు ఉన్నవి.కానీ ప్రభుత్వ ఉత్తర్వుల GO Ms No 241 ప్రకారం 14 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.ఆ మండలంలో 14 గ్రామాలు పైన చెప్పిన 1 ప్రకారం రెవెన్యూ గ్రామంతో కూడిన గ్రామ పంచాయతీలు. అందులో వ.సం 1,2,4, సుంకురంపల్లి,తిమ్మాయపల్లి తండా,రామచంద్రాపూర్ గ్రామాలు మూడు పైన చెప్పిన 2 ప్రకారం రెవెన్యూ గ్రామం కాని గ్రామ పంచాయతీలు. ఇవి రెండు ప్రభుత్వ ఉత్తర్వులలో కనపడవు.ఇక్కడ మరియెక విషయం చెప్పాలి.అందరికి తెలిసే ఉంటుంది.సందర్బం వచ్చింది కాబట్టి వివరిస్తున్నాను.గ్రామ పంచాయితీల పరంగా పరిపాలన సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతుంది.మండల పరిషత్ అధికారుల పర్వేక్షణ ఉంటుంది.రెవెన్యూకు సంబందించిన రెవెన్యూ గ్రామాలు పరిపాలన తహశీలుదారు నియంత్రణలో పనిజరుగుతుంది. పరిశీలించి చర్చించ గలరు.--యర్రా రామారావు (చర్చ) 16:33, 25 జూలై 2018 (UTC)Reply

యర్రా రామారావు గారూ! మీరు చెప్పిన మూడు కోవల గ్రామాలతో పాటుగా పంచాయితీ, రెవెన్యూ హోదా లేని తండాలు, శివారు పల్లెలూ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించీ చర్చించి నిర్ణయం తీసుకోవాలి, నా వరకూ నా ఖచ్చితమైన అభిప్రాయం ఏమంటే - జనం నివసించే ప్రతీ గ్రామానికి పేజీ ఉండవచ్చు, జనం నివసించని దాన్ని గ్రామం అనుకుని వ్యాసం సృష్టించడం తగదు. అయితే రెవెన్యూ హోదా లేని పంచాయితీ గ్రామాలలో ఎలాంటి సమాచారం చేర్చాలి? పంచాయితీ, రెవెన్యూ హోదాల్లేని శివారు గ్రామాలకు వ్యాసం సృష్టించదగ్గ స్థాయి సమాచారం ఉంటుందా అన్న అనుబంధ ప్రశ్నలు విడిగా వేసుకుందాం. కింద ఒక విభాగం సృష్టించి వాటి గురించి విడిగా చర్చించి నిర్ణయం తీసుకుందాం. ఈ చర్చలో మాత్రం జనం లేని గ్రామాలను తెలుగు వికీపీడియాలో ఎలా ప్రతిబింబించాలి? అన్న అంశంపై పరిమితం అవుదాం అని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 26 జూలై 2018 (UTC)Reply
అలాంటి సంధర్భంలో చదువరి గారు తెలిపినట్టు ఒక పేజీలో అలాంటి గ్రామలను జాబితాగా చేసి అసలు గ్రామాలని ప్రక్కన లింక్‌గా ఇస్తే సరిపోతుంది. ఎవరికైనా అవసరం ఉన్నా దొరకవచ్చు...B.K.Viswanadh (చర్చ)
నిర్జన గ్రామాల విషయంలో చదువరి గారి అభిప్రాయం ప్రకారం జాబితాలో చేర్చి ఉన్న వ్యాసాలకు జాబితాలోనే లింకులు ఇస్తే సరిపోతుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 07:57, 26 జూలై 2018 (UTC)Reply
నిర్జన గ్రామవ్యాసాలు తెవికీలో ఉండరాదని ఖచ్చితంగా అనలేము. నిర్జనగ్రామానికి కారణాలు అనేక రకాలు. కొన్ని కారణాలు చరిత్రకే తెలియక పోవచ్చు మరికొన్ని ప్రకృతివైపరీత్యాలవల్ల, వలసల వల్ల జరగవచ్చు. ఇటీవలి కాలంలో నిర్మించే ప్రాజెక్టులు, భారీ జలాశయాలవల్ల కూడా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కారణమేదైనా సరే ఇప్పుడు ఆ గ్రామం లేకున్ననూ దాని చరిత్ర మాత్రం మనకుంటుంది. మనిషి మరణించాడనీ, ఇప్పుడు ఆ మనిషి లేడనీ ఒక వ్యక్తి వ్యాసాన్ని తొలగించడం లేదు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, కోటలు నాశనమైనా చరిత్రలో స్థానం ఉంది కాబట్టి ఆ వ్యాసాలూ మనం ఉంచుకున్నాం. అలానే నిర్జన గ్రామాలకు కూడా ఘనమైన చరిత్ర ఉండవచ్చు (ఉదా: మంగంపేట, బూడ్దిపాడు). కాకుంటే తగిన ఆధారాలతో తగినంత సమాచారం లభ్యమైతే తప్ప ఏకవాక్య వ్యాసాలు సృష్టించే అవసరం ఉండరాదు. కాబట్టి నిర్జన గ్రామాలన్నీ చరిత్ర లేనివనీ, వాటికి వ్యాసాలు ఉండరాదని కాకుండా ఆధారాలతో తగినంత సమాచారం ఉంటేతప్ప వ్యాసాలు సృష్టించే అవసరం ఉండరాదు, ఇప్పటికే ఉన్న తగినంత సమాచారం లేని నిర్జన గ్రామవ్యాసాల పేజీలను తొలగించవచ్చు. నిర్జన గ్రామవ్యాసాల పేజీలను తొలగించిననూ ఆయా మండలాలలోని గ్రామవ్యాసాల పట్టికలోనూ మరియు మండలాల మూసలలోనూ నిర్జనగ్రామ వ్యాసాల పేర్లు ఉంచవచ్చు కానీ లింకులు మాత్రం పెట్టే అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 26 జూలై 2018 (UTC)Reply
చంద్రకాంత రావు గారూ! ఏ నియమానికైనా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. మీరు చెప్పిన ఎక్సెప్షన్ సరైనది. ప్రస్తుతం నామమాత్రావశిష్టమైన గ్రామానికి ఉంటే చెప్పుకోదగ్గ చరిత్ర ఉంటుంది. అయితే మూలాలతో సమర్థించదగ్గ, విశేషంగా చెప్పవలసిన చరిత్ర కలిగిన కొన్ని గ్రామాలకే ఆ ఎక్సెప్షన్ వర్తిస్తుంది. ఒక ఉద్యమంలా నిర్జన గ్రామాలకు పేజీలు సృష్టించుకుంటూ పోయే ప్రయత్నం ఆపడానికి ఈ ఎక్సెప్షన్ అడ్డుపడదని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:40, 27 జూలై 2018 (UTC)Reply
లేనిగ్రామాల పేర్లను తొలగించడం మంచిదనుకుంటాను Nrgullapalli (చర్చ) 17:16, 30 జూలై 2018 (UTC)Reply
వివిధ కారణాల వలన నిర్జన గ్రామాలుగా ఉన్న కొన్నింటికి ఘనమైన చరిత్ర ఉండవచ్చు. కనుక అటువంటి వాటికి ఆధారాలతో తగినంత సమాచారం లభిస్తే వ్యాసంగా రాయవచ్చు. ఎటువంటి సమాచారం లేని ఏక వాక్య వ్యాసాలుగా ఉన్న/రాస్తున్న నిర్జన గ్రామాల వ్యాసాలను తొలగించి వాటిని జిల్లా/రాష్ట్రాల వారీగా జాబితాగా చేర్చితే సరిపోతుంది.--కె.వెంకటరమణచర్చ 14:12, 31 జూలై 2018 (UTC)Reply

చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. వెంకటరమణ గారు మొత్తం చర్చనంతా క్రోడీకరించి ఒక ఆమోదయోగ్యమైన సూచనకు తీసుకువచ్చారని భావిస్తున్నాను, కాబట్టి ఈ విషయంపై ఏకాభిప్రాయానికి అది ప్రాతిపదిక కాగలదని వ్యక్తిగతంగా భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ)

నిర్జన గ్రామాల తయారీ సరికాదనటం, సరికాదు. మరణించిన మనిషికి వికీలో పేజీ ఎందుకు? అన్నట్లుగానే భావించవలసి ఉంటుంది. కాల గమనంలో ఎన్నో ఏండ్లు నడిచి, ఎంతో మందికి జీవనాధారమై, కారణాంతరాలచే అంతర్ధానమైనంత మాత్రానా దాని చరిత్ర ముగిసిపోదు. నిర్జన గ్రామాల గురించి రాస్తే, ఎవరు చదువుతారు? అన్న ప్రశ్న కూడా అసంబద్దమే. ఎక్కువ మంది చదివే వాటిని మాత్రమే వికీలో వ్యాసాలుగా రాయాలి అన్న నిబంధన ఏమైనా ఉందో!లేదో? నాకు తెలియదు. కానీ నిర్జన గ్రామాల గురించి ఎవరు చదువుతారు? అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఉంది. ఊరు పోయినంత మాత్రానా, ఊరి జనమంతా అంతరించి పోయి ఉండరు. వారి వంశాలు ఎక్కడో ఒక చోట నివసిస్తూనే ఉంటారు. అట్లాంటి వారు ఎక్కడ ఉన్నా వారి మూలాలను వారు వెతుక్కుంటారు. వారికి అవసరం. ఎక్కడో సుదురాన ఉన్న వారికి అదొక పనికి రానిది కావొచ్చు. కాని దాని సమీప గ్రామాల వారికి దాని చరిత్ర అవసరం.

జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన మంగంపేట ఒక దశాబ్ధం కిందట అంతరించిపోయింది. కానీ ఆ ఊరికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద ఆధారపడిన ఆ గ్రామానికి చెందిన ప్రజలు పక్క గ్రామాల్లో జీవిస్తున్నారు. కృష్ణ, తుంగభద్రల సంగమ స్థల సమీపాన కూడవల్లి అని ఒక గ్రామం ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన అదీ అంతరించి పోయింది. ఆ గ్రామానికి చెందిన ప్రజలంతా దక్షిణ తెలంగాణలో దక్షిణ కాశిగా పిలువబడే అలంపూరు, దాని సమీప గ్రామాలలో నివసిస్తున్నారు. అక్కడ ఉన్న అతి పెద్ద సంగమేశ్వర దేవాలయాన్ని అలంపూరులో పునర్నిర్మించారు. దాన్ని కూడవల్లి సంగమేశ్వరాలయంగానే పిలుస్తారు. నిత్యం ఎందరో యాత్రికులకు ఆలయ పూజారులు కూడవల్లి గురించి చెబుతూనే ఉంటారు. ఆ ఊరి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాటికి వికీలో పేజీలు ఉండవు. ఉండకూడదు అని కూడా అంటారు. వికీలో ఇప్పుడున్న గ్రామాలు, వాటి పిన్ కోడ్‌లు, రోడ్లు, నీళ్ళు, మరుగుదొడ్లతో నిండిపోయిన గ్రామ వ్యాసాల కన్నా, ఇట్లాంటి ప్రత్యేక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలు రేపటి తరానికి ఎంతో అవసరమని నా భావన. --నాయుడు గారి జయన్న (చర్చ) 15:03, 5 ఆగస్టు 2018 (UTC)Reply

నాయుడు గారి జయన్న గారూ! పైన జరిగిన చర్చ సారాంశాన్ని వెంకటరమణ గారు క్రోడీకరిస్తూ వివిధ కారణాల వలన నిర్జన గ్రామాలుగా ఉన్న కొన్నింటికి ఘనమైన చరిత్ర ఉండవచ్చు. కనుక అటువంటి వాటికి ఆధారాలతో తగినంత సమాచారం లభిస్తే వ్యాసంగా రాయవచ్చు. అన్నారు కదా. ముందు చంద్రకాంతరావు గారూ లేవనెత్తిన అభ్యంతరాన్ని (అదే అభ్యంతరం మీరూ ఇప్పుడు వ్యక్తం చేశారు) పరిగణనలోకి తీసుకున్న వాక్యం. అయితే అటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామాలను ఉంచి, మూలాలతో విస్తరించి - వందలాదిగా ఏ ఇతర సమాచారమూ లేని గ్రామాల వ్యాసాల సృష్టి, చారిత్రక ప్రసిద్ధి కూడా లేని గ్రామంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామం ఇది అన్న తరహా ఏకవాక్య వ్యాసాలను తొలగించాలనే ఈ చర్చ ముగింపుకల్లా తేలింది. కాబట్టి ఈ రెండు అంశాల్లో దేనిపైన మీ అభ్యంతరమో సూటిగా చెప్పగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 02:10, 6 ఆగస్టు 2018 (UTC)Reply

జయన్న గారూ! చిన్న ఉదాహరణతో ఈ పనిచేద్దాం. పైన జరిగిన చర్చ చూస్తే మీ స్పందన కన్నా ముందే నిర్జన గ్రామాలు చారిత్రకంగా ప్రసిద్ధి కలిగినవైతే, తగిన మూలాలతో సమాచారాన్ని సమర్థించగలగితే నిస్సందేహంగా వ్యాసం ఉండాలన్న నిర్ణయం జరిగింది. ఆ విషయంలో చర్చ చర్వితచర్వణమే అవుతుంది. అయితే మీకు ముందు జరిగిన చర్చలో ప్రతిపాదన కాని, మీరన్న మరో అంశం - "కానీ ఆ ఊరికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద ఆధారపడిన ఆ గ్రామానికి చెందిన ప్రజలు పక్క గ్రామాల్లో జీవిస్తున్నార"న్నది. ఇలా ఈ నిర్జన గ్రామాల్లో కేవలం పంటలు, జలాధారాలు మాత్రమే ఉంటాయనీ, జనాభా లెక్కల్లో రెవెన్యూ విశేషాలే నమోదవుతాయని నేను పైన నా పరిశీలనలో రాయనైతే రాశాను కానీ అది వికీపీడియా వ్యాసం ఉండడానికి సమర్థన అనలేదు. నా అవగాహన చరిత్ర ప్రసిద్ధి కాని, కేవలం రెవెన్యూ వివరాలే లభ్యమయ్యే నిర్జన గ్రామాలకు వ్యాసాలు ఉండకూడదనేది. మీ వాదన తద్భిన్నం అనఅ అర్థమవుతోంది కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకూ సమాచారం లేకుండా ఇటీవలే సృష్టించిన ఓ ఖాళీ వ్యాసం రుద్రపురం (భద్రాద్రి). ఇందులో మీరన్నట్టు కనీసం పిన్‌కోడ్ వివరాలు కూడా లేవు. ఈ వ్యాసాన్ని ఏ ప్రకారం అభివృద్ధి చేయగలమన్నది ఉదాహరణగా వృద్ధి చేస్తే ఆ పద్ధతిలోనే ఇటీవల తామరతంపరగా సృష్టి అవుతూ, నిర్వహణాభారంగా ఉన్న అనేక వ్యాసాల మీద కూడా పనిచేయడానికి ప్రయత్నించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:41, 6 ఆగస్టు 2018 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ! "వందలాదిగా ఏ ఇతర సమాచారమూ లేని గ్రామాల వ్యాసాల సృష్టి, చారిత్రక ప్రసిద్ధి కూడా లేని గ్రామంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామం ఇది అన్న తరహా ఏకవాక్య వ్యాసాలను తొలగించాలనే" చర్చా ముగింపు సారాంశంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. వికీలో ఇప్పుడున్న గ్రామాలు, వాటి పిన్ కోడ్‌లు, రోడ్లు, నీళ్ళు, మరుగుదొడ్లతో నిండిపోయిన గ్రామ వ్యాసాల కన్నా, ప్రత్యేక చారిత్రక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలే రేపటి తరానికి ఎంతో అవసరమన్నదే నా భావన. అన్యధా భావించరని భావిస్తూ...సమాప్తి.---నాయుడు గారి జయన్న (చర్చ) 13:00, 6 ఆగస్టు 2018 (UTC)Reply
నాయుడు గారి జయన్న గారూ, ఎటువంటి మూలాలు లేని ఏక వాక్య వ్యాసాలుగా ఉన్న వ్యాసాలను తొలగించవచ్చు. మీరన్నట్లు ప్రత్యేక చారిత్రక నేపథ్యమున్న గ్రామ వ్యాసాలను సరైన మూలాలతో తగినంత సమాచారం దొరికితే వ్యాసాలను రాయవచ్చు.--కె.వెంకటరమణచర్చ 17:42, 6 ఆగస్టు 2018 (UTC)Reply
సరేనండీ నాయుడు గారి జయన్న గారూ, ఏ చారిత్రక ప్రసిద్ధీ లేని నిర్జన గ్రామాల తొలగింపు ప్రతిపాదన విషయమై ఏకాభిప్రాయానికి రాగలిగినందుకు సంతోషం. ఇది పక్కన పెట్టి 28 వేల గ్రామాల వ్యాసాల్లో మౌలిక వనరుల కన్నా చరిత్ర ప్రధానమని, అది రేపటి తరానికి అవసరమని అన్న మీ అభిప్రాయం మీ వ్యక్తిగత అభిరుచిగా స్వీకరిస్తున్నాను. అదలా ఉంచినా రెండవ దఫా గ్రామాల వ్యాసాలపై జరిగే కృషిలో గ్రామాల పేర్ల వెనుక ఉన్న చరిత్ర (typonomy), గ్రామాల చరిత్ర వంటివాటిపై పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నాం. అంటే మౌలిక సదుపాయాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన చరిత్ర, గ్రామనామ వివరణ వంటివీ పరిగణనలోకి తీసుకునే పనిచేస్తున్నామన్నమాట. ఈ అంశంపై మీకు వ్యక్తిగత అభిరుచి ఉందని అనిపిస్తోంది కాబట్టి దయచేసి వికీసోర్సులో ఈ ప్రకటన చూడండి. తెలుగు గ్రామాల పేర్లపై పరిశోధించి తెలుగులో సంబంధిత పరిశోధన గ్రంథం రాసిన తొలి పరిశోధకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథ రెడ్డి గారి కడప ఊర్ల పేర్లు గ్రంథాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించి, వికీసోర్సులో డిజిటైజేషన్ చేపట్టాం. దయచేసి సందర్శించి, మీకు ఆసక్తి ఉంటే పుస్తకాన్ని ఉపయోగించి గ్రామ నామ వివరణ విభాగాన్ని విస్తరించడం విషయంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:52, 7 ఆగస్టు 2018 (UTC)Reply
వికీపీడియా:నిర్జన గ్రామాల సృష్టిపై విధానం అన్న పేరుతో ఇక్కడ జరిగిన చర్చ ఫలితాలను (పలువురు వాడుకరుల చర్చలను సమీక్షించి, పలు దృక్కోణాలను ప్రతిఫలిస్తూ కె.వెంకటరమణ గారు చేసిన నిర్ణయాన్ని అనుసరించి) అనుసరించి విధానం పేజీ సృష్టించాను. ఈ చర్చను అక్కడి చర్చా పేజీలో పదిలపరిచాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:04, 23 ఆగస్టు 2018 (UTC)Reply

' నిర్జన గ్రామాల గూర్చి గుంటూరుకు చెందిన శివశంకర్ ఒక పుస్తక వ్రాసారు

103.224.154.193 13:00, 11 మార్చి 2024 (UTC)Reply

మీ సూచవకుధన్యవాదాలు.ఆ పుస్తకం గురించి తెలుసు.డేటా ఏమి లేని నిర్జన గ్రామాలు గురించి వికీలో రాయటానికి అవకాశంలేదు.పుస్తకంలో ఉదహరించిన గ్రామాలకన్నా రెండు రాష్ట్రాలలోని నిర్జన గ్రామాల పేర్లు జనగణన డేటాలో ఉన్నవి.వికీలో రాయలంటే ఆధారాలతో డేటా ఉండాలి. యర్రా రామారావు (చర్చ) 14:38, 11 మార్చి 2024 (UTC)Reply
Return to the project page "నిర్జన గ్రామాల సృష్టిపై విధానం".