వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు
బాటుతో గ్రామాలకు పేజీలు
మార్చుఎందుకీ ప్రతిపాదన: ఇలాంటివి పునరావృతమవకుండా చూడడంకోసం.(ఇందుకోసం నమోదుకానివారు దిద్దుబాటు చేస్తున్నప్పుడు చూపించే సందేశంలో తెలుగులో రాయడానికి లేఖిని వాడండి అనికూడా చేర్చవచ్చు.)
బాటు ఏంచేస్తుంది: జిల్లా, మండలం తో ఆ గ్రామం గురించి ఒక వాక్యం రాస్తుంది. మరియు జిల్లా గ్రామాల వర్గంలోకి ఈ గ్రామాన్ని చేరుస్తుంది. ఊదాహరణ పేజీ --వీవెన్ 09:29, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- గ్రామాలకు కూడా మండలాల లాగానే ఒక మూసను చేద్దాం. జనాభా వివరాలు మన దగ్గర ఉన్నాయి. __చదువరి (చర్చ, రచనలు) 12:34, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- చాలా బాగుంది, నేను బాటును చెయ్యగలను. ఇందులో పనంతా ఇక్కడ ఒక్కొక్క మండలములో తెలుగులో ఉన్న గ్రామాల పేర్లను జనాభా వివరాలున్న ఎక్సెల్ షీట్లలో ఆంగ్లములో ఉన్న గ్రామాల పేర్ల స్థానములో సరిచూసుకుని అతికించడమే --వైఙాసత్య 13:50, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- తొలివిడతగా అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేసేందుకు బాటును తయారుచేశాను. దాన్ని ఉపయోగించి అదిలాబాదు జిల్లాలో దాదాపు 800 గ్రామాలకు పేజీలు చేర్చాను. అయితే ప్రస్తుత బాటు దారిమార్పు పేజీ తగిలితే చతికిలపడుతుంది. దాన్ని దారిమార్పు పేజీలను కుడా తీసుకునే విధంగా మార్చి మిగిలిన జిల్లాలకు పేజీలు చేర్చుతాను --వైఙాసత్య 14:21, 18 సెప్టెంబర్ 2006 (UTC)
- చాలా బాగుంది, నేను బాటును చెయ్యగలను. ఇందులో పనంతా ఇక్కడ ఒక్కొక్క మండలములో తెలుగులో ఉన్న గ్రామాల పేర్లను జనాభా వివరాలున్న ఎక్సెల్ షీట్లలో ఆంగ్లములో ఉన్న గ్రామాల పేర్ల స్థానములో సరిచూసుకుని అతికించడమే --వైఙాసత్య 13:50, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- దారిమార్పులుతో పనిచేసే విధంగా మార్చాను. కానీ క్యామెల్ కేసు తొడిగిన లింకులతో ([[ఉదాహరణ|ఏదొ ఒకటి]] ) బాటు పనిచెయ్యడములేదని గ్రహించా. కొంత మార్పు చెయ్యాలి. --వైఙాసత్య 00:01, 21 సెప్టెంబర్ 2006 (UTC)
ఈ విషయం గురించి గూగుల్ తెలుగు వికి గుంపులో జరిగిన చర్చ
మార్చుచైతన్య వ్యాఖ్య
మార్చుI opened Telugu wikipedia today and was shocked to see the total article count to be well over 26,000. The last time I checked, which was 6 months back, I remember the count to be 2600!
A look at the stats was even more surprising.
http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm
Observing the stats, sept/oct 2006 had more 200-300 new article
creations each day.
On the whole, the count today is 26k, out of which only about 5000 articles have more than 200 characters. This is a very bad ratio. I am wondering how many of these articles are genuine. Could some one throw light on what happened? If it is true that we have 26K good articles, then it is great news. No other Indian language is close to be doing better than this! Mailing on this list, as I couldn't find anyone on IRC!
Chaitanya
రమణ, వైఙాసత్య వివరణ
మార్చుYes they are all genuine articles. But, most of them were added by bots. For example we have a page for every village of Andhra Pradesh which contains placeholder text that says "this village belongs to xxxx mandal and yyyy district". People are working on writing bots to expand those pages to contain various other details about the villages. Similary such pages exist for many telugu movies also. Ravi vyzasatya can give you more info on this. -ramana.
You are right..out of 26,000 i estimate about 1000 articles to be worthwile reading..
lot of the rest are framework articles, movie info pages and village stubs and mandalpages added with the help of bots..(of course lot of manual checking of these things went on later and is still going on) that's why we need more people like you contributing information
chaitanya garu.. if you ask me what's the use of those rest of the village pages and mandal pages...tons..yet to be discovered.. for an example... Arudra in his Samagra Andhra Sahityamu contemplating about the birthplace of vemana..declared that mugachintapalli is only in certain district (cant remember where off my head right now..think chittoor)..but a simple search in tewiki can return more mugacintala/ mugacintapalli other than the only one declared by Arudra...does the help anyone doing some research in vemana?..think so.. ----(రవి వైజాసత్య)
సుధాకరబాబు సూచన
మార్చు(పానకంలో పుడకలాగా!)
తెలుగు వికీ వ్యాసాల సంఖ్య గురించి జరుగుతున్న చర్చ ఈ ఆలోచనకు నాంది.
- నిస్సందేహంగా గ్రామాలకు బాట్లద్వారా చేసిన పేజీల వలన "మొలక" పేజీలు పెరిగి పోయాయి. కాని మన లక్ష్యం - ఒకోవూరి గురించీ ఒకో పేజీ అయినా వికీలో పొందు పరచాలని. -- అందుకోసం ఈ బాట్ల పేజీలు కేవలం పొలం చుట్టూ గట్లలాంటివి. లోపల పంట కాదు. వికీలో వీటిని వ్యాసాల క్రింది పరిగణిస్తారు గాని అది మన ఉద్దేశ్యం కాదు. ఇది తాత్కాలికమైన దశ మాత్రమే.
- ఏమైనా సరే - ఇక ఈ మళ్ళలో విత్తులు నాటే ఏర్పాట్లు చేయాలి. నడుం కట్టండి. ఈ పనిని ఒక "ప్రాజెక్టు + ప్రచారం" గా నిర్వహించాలి.
- "మీ వూరిగురించి వికిపీడియాలో వ్రాయండి" అన్న నినాదంతో ఒక ప్రచారాన్ని మొదలుపెడదాము. లక్ష్యంగా కాలేజీలను, మండలి ఆఫీసులను, కంప్యూటర్ కోర్సు సెంటరులను, జర్నలిజమ్ సంఘాలను, స్కూళ్ళను ఎంచుకొందాము.
- ఈ ప్రాజెక్టు కోసం ఒక తాత్కాలిక e-mail సృష్టిద్దాము. ఆ మెయిల్ చిరునామాకు ఆంగ్లంలో కూడా సమాచారాన్ని, ఫొటోలను పంపించే వీలు కలుగజేద్దాము. దానిని అనువదించే పని తరువాత ఆలోచిద్దాము. (నా అభిప్రాయం - వికీలో తెలుగులో వ్రాయడం కంటే - ఆంగ్లంలో మెయిల్ పంపడానికి ప్రజలు త్వరగా ఉత్సాహం చూపుతారని)
- వికీలో మీవూరు గురించి వ్రాయండి - ఎందుకు, ఏమిటి, ఎలా - అన్న విషయాలపై ఒక వ్యాసాన్ని త్వరలో వికీలోనే మొదలు పెడదాము. దానిని అందరూ ప్రచారం నిమిత్తం వాడుకోవచ్చును.
మీ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయండి. ఉగాది తరువాత ఈ ప్రాజెక్టు మొదలు పెడదాము.
ఎన్నెన్ని వూళ్ళు?
మార్చువైఙాసత్య గారూ! ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రామాల సమాచారం సేకరణ ఒక ప్రాజెక్టుగా మొదలుపెట్టాలని అనుకొంటున్నాను. త్వరలో ఇది రచ్చబండలో పెడతాను. (నవీన్ కృషివలన సినిమా ప్రాజెక్టు మంచి పురోగతి సాధించింది. ఇక సినిమా ప్రాజెక్టు, అతను ఒప్పుకుంటే, నవీన్‌కు అప్పజెపుదాం) ముందుగా కొంత సమాచారం కోరుతున్నాను.
- మొత్తం ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
- మీ సూచనలు ఏమిటి?
- గ్రామాలగురించి మంచివి ఏవైనా రెండు మూడు వ్యాసాలు (తెలుగు గాని, మరో భాషలో గాని) చెప్పగలరా?
- ఈ ప్రాజెక్టుకు విస్తృతమైన ప్రచారం అవుసరం. ఎలా చేయాలి? ఆలోచించండి. వివిధ మెయిలింగ్ లిస్ట్ గ్రూపులను టార్గెట్ చేద్దాము.
- ఈ ప్రాజెక్టు బాగా పెద్దది గనుక ప్రత్యేకంగా సభ్యులుగా ఎవరినీ చేర్చవద్దు. ఆంతా సభ్యులే అనుకొందాం.
--కాసుబాబు 06:44, 18 మార్చి 2007 (UTC)
- ఎన్నెన్ని మండలాలు అంటే 1124 ఉండాలి. ఇక గ్రామాలు దాదాపు 24000 వేలకు పైగా ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే సాధారణంగా మండలాల పేజీలలో ఉన్నవి కేవలం రెవిన్యూ గ్రామాలు / పంచాయితీ గ్రామాలు. అయితే ఒక్కొక్క పంచాయితీ కింద కొన్ని పంచాయితీలు కానీ గ్రామాలు కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది మండలాల పేజీలలో అదనపు గ్రామాలు చేర్చటం చూస్తున్నాం. ఈ చిన్న గ్రామాల సమాచారం సేకరించటం కష్టం. అదీగాక ప్రభుత్వ గణాంకాలలో ఒక పంచాయితీ గ్రామ గణాంకాలలో ఆ పంచాయితీలో ఉన్న గ్రామాల అంకెలన్నీ కలిపి లెక్కవేస్తారు. మనం విడదీయటం కష్టం. ఇక ఈ పంచాయితీలు కాని గ్రామాలు చేర్చాలో లేదో నిర్ణయించాలి.
- అవును అందరు సభ్యులు పనిచేస్తేనే బాగుంటుంది.
- మంచి గ్రామ వ్యాసాలంటే వికీపీడియాలో వ్యాసాలా?
- ఇక ప్రాజెక్టు ప్రచారానికి కొన్ని ఆలోచనలలో మనం ఒక చిన్న సహాయ అభ్యర్ధన సందేశంతో ఒక ఈ-మెయిల్ తయారు చేద్దాం. ఆ ఈమెయిల్ని మన స్నేహితులకి పంపి..వాళ్ల స్నేహితులకి అలా గొలుసుకట్టు లాగా పంపమందాం. దాన్లో గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు తప్పకుండా ఉండాలి. దాని కింద వాళ్లకు తెలిసిన సమాచారం రాసి పంపించొచ్చు. మీరు తయారు చేసిన జీమెయిల్ ఐడీ పాస్వర్డును వికీపీడియాలో నిర్వాహకులు మరియు చురుగ్గా పనిచేస్తున్న వారందరికి ఇవ్వండి. బ్లాగు సైట్లన్నింటీలో పెట్టిద్దాం, ఆర్కూట్లో, యాహూ, గూగుల్ గ్రూపులకు రాద్దాం. ఫ్లికర్లో తెలుగు ఫోటోగ్రాఫర్లందరిని వారి దగ్గర ఉన్న గ్రామాల ఫోటోల గురించి అడుగుదాం. ప్రస్తుతానికి ఇవి..మరికొన్ని ఆలోచిస్తా. --వైఙాసత్య 14:44, 21 మార్చి 2007 (UTC)
గ్రామాల వ్యాసాల గురించి మరికొంత చర్చలు
మార్చు(వివిధ చర్చా పేజీలనుండి ఇక్కడికి కాపీఈ చేస్తున్నాను - --కాసుబాబు 16:36, 16 మే 2007 (UTC) )
కాసుబాబు గారు, వ్యాసం పేరులో బ్రాకెట్లు పెట్టవలసి వచ్చినప్పుడు మొదటి (అంటే opening) బ్రాకెట్టుకి ముందు ఒక ఖాళీ వదలండి. అలా లేని పేజీలు కొన్ని: గొల్లవలస(కురుపాం మండలం), గొల్లవలస(పోలాకి మండలం), అన్నాసాగర్(దామరగిద్ద మండలం), కొండపల్లి(కుక్కునూరు మండలం), కొమరాడ(భీమవరం మండలం). ఇవి చూడడానికి బాగోవు మరియు వ్యాకరణపరంగా కూడా సరికాదు. —వీవెన్ 09:22, 19 ఏప్రిల్ 2007 (UTC)
- అలాగే! ఈ విషయం నేను ఇంతకు ముందు పట్టించుకోలేదు. చాలా పేజీలు బ్రాకెట్టు లేకుండా తయారైనాయి. ఇకముందు జాగ్రత్త పడుతాను.--కాసుబాబు 09:29, 19 ఏప్రిల్ 2007 (UTC)
కాసుబాబు గారూ, అయోమయ నివృత్తి పేజీలకు దారిమార్పు పేజీలు అవసరం లేదు. ఉదాహరణకు బొడ్డపాడు పేజీనే అయోమయ నివృత్తి పేజీగా పనిచేయగలదు. దాన్ని మళ్ళీ బొడ్డపాడు (అయోమయ నివృత్తి) పేజీకి దారిమార్పు చేయడం అనవసరం. మీరు మూస:అయోమయం కొరకు అ.ని. పేజీని సృష్టిస్తున్నారా? ఆ మూసని మార్చాల్సిన అవసరం ఉంది. --వీవెన్ 01:36, 16 మే 2007 (UTC)
- ఎన్వికీలో en:Template:Dablinkకు తెవికీలో మూస:అనిలింకుని తయారుచేసా. ఒక వ్యాస సందర్శకులని మరో వ్యాసాన్ని చూడమనడానికి దీన్ని వాడవచ్చు. ఈ మూస ఆధారంగా మరింత ప్రత్యేకమైన మూసలు తయారుచేసుకోవాలి. --వీవెన్ 07:16, 17 మే 2007 (UTC)
పశ్చిమ గోదావరి
మార్చుమాజిల్లా పేరు అసలు లేదే??? అర్థం కావడం లేదు़02:41, 16 ఆగష్టు 2007 (UTC)~
తనిఖీలు పూర్తి చేసినందుకు అభినందనలు
మార్చుగ్రామాల పేజీలకు తనిఖీలు పూర్తయ్యాయని తెలుస్తున్నది. ఈ బృహత్కార్యాన్ని బాట్ల ద్వారాను, నేరుగా తనిఖీల ద్వారాను పూర్తి చేసినవారందరికీ అభినందనలు. ముఖ్యంగా వైజా సత్య, ప్రదీప్, వీవెన్, చదువరి, ఇంకా నాకు గుర్తులేనివారందరికీ (నేను కూడాను!) అభినందనలు. పదండి ముందుకు! - --కాసుబాబు 17:40, 19 సెప్టెంబర్ 2007 (UTC)
- ప్రదీప్ గారి బాటు చాలా బాగా నచ్చింది. టకటకా పేజిలు మాయం అయిపోయాయి.బాటు తయారు చేసిన రోజు --మాటలబాబు 17:43, 19 సెప్టెంబర్ 2007 (UTC)
- దాదాపు అన్ని కలిపి ఒక మూడువేల దాకా పేజీలు తనిఖీ చేసినట్టున్నాం. అవన్నీ ఎలా తనిఖీ చేస్తామా అనిపించింది.. కానీ సమిష్టి కృషితో సాధించాము. ఈ ప్రాజెక్టులో ఒక పెద్ద అంకము ముగిసినట్టే. బాటు తయారు చేసి పనిని చాలా సులువు చేసిన ప్రదీపుగారికి ప్రత్యేక అభినందనలు --వైజాసత్య 18:43, 19 సెప్టెంబర్ 2007 (UTC)
తరువాత గణాంకాలు ఎలా మారతాయి
మార్చు- ఇప్పటి నుండి ఇక పేజీలకంటే వేగంగా దిద్దుబాట్లు పెరుగుతాయి. (అయోమయం లింకులు సరిచేయటం వంటి వాటివలన). గణాంకాలు చేర్చేసరికి దిద్దుబాట్లు పెరగటంతో బాటు చాలామటుకు వ్యాసాలు 2 కేబీలు దాటుతాయి. వెరసి సగటు దిద్దుబాట్ల సంఖ్య 5-6 మధ్యకు చేరుతుంది.
- అప్పుడు గ్రామ పేజీలన్నింటి చర్చాపేజీలలో ప్రాజెక్టు మూసతో పాటు యాంత్రికంగా బేరీజు జరుగుతుంది. దీంతో వ్యాసాలు కాని పేజీల సంఖ్య ఒకేసారి ఘననీయంగా పెరుగుతుంది సగటు దిద్దుబాట్ల సంఖ్య 4+ లో స్థిరపడుతుంది. దీనితో పాటే తెవికీలోతు విపరీతంగా పెరిగిపోతుంది. (అక్కడితో చాలా మొలకలున్నాయి..ఒక లైను వ్యాసాలే, లోతు తక్కువ, దిద్దుబాట్ల సంఖ్య తక్కువ..సగటు దిద్దుబాట్లు అంత తక్కువనా.. అన్న వాళ్ళందరి నోళ్ళు మూతపడతాయి (1)
- ..కానీ మనం ముఖ్య ధ్యేయం వ్యాసాల నాణ్యత పెంచడమే అని మరువరాదు. --వైజాసత్య 18:43, 19 సెప్టెంబర్ 2007 (UTC)
- మొన్న జూలైలో ఒక సారి తీసుకున్న గణాంకాలు బట్టి మంచి వ్యాసాల(ఎక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు) పట్టికలో తెలుగు వికీపీడియా 3వ స్థానంలో ఉన్నట్లు అనిపించింది. ఈ రెండు నెలలో ఆ వ్యాసాలు గణనీయంగా పరిగినట్లనిపించింది, అంతే కాదు, ప్రతీరోజూ మార్పులు చేర్పులు చేసే సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఒక మంచి పరిణామం!! ఇకపోతే తాజాగా అటువంటి గణాంకాలను ఇంకో సారి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను గమనించిన ఇంకో విషయం ఈ మధ్యన తెలుగును telegu అని రాస్తున్నారు వేరే భాషల వాళ్ళు, ఎందుకో అర్ధం కావటం లేదు :( . __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 19:26, 19 సెప్టెంబర్ 2007 (UTC)
గ్రామాల వ్యాసాలు
మార్చురచ్చబండనుండి కాపీ చేసిన చర్చా భాగం
జిల్లా, మండలము తెలుప కుండా అనేక గ్రామాల వ్యాసాలు వున్నాయి. వాటిని గుర్తించాలంటే చాలా కష్టంగా వున్నది. వీటన్నిటినీ ఒక చోట చేర్చాలంటే వీటి కొరకు ఒక మూస అవసరం అని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ 11:13, 19 జూన్ 2009 (UTC)
- కొత్త సభ్యులు కొందరు ఇలాంటి వ్యాసాలను ప్రారంభించారు. నా గ్రామం/మా గ్రామం సుందరమైనది, మనోహరమైనది అంటూ వారికి తోచినదేదో చేర్చారు. "వారి" గ్రామాలు ఇదివరకు తెవికీలో ఉండవచ్చు కూడా. వీటికై మనం శ్రమ తీసుకునే అవసరం లేదనుకుంటా. ఈ వ్యాసాలలో అంత ప్రాధాన్యత కలిగిన వాక్యాలు కూడా లేవు. కాబట్టి తొలిగించడమే మంచిది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:33, 23 జూన్ 2009 (UTC)
ఆరు నెలల ప్రాజెక్టు
మార్చురచ్చబండనుండి కాపీ చేసిన చర్చా భాగం
పైన సభ్యులు తెలిపిన విషయాలన్నీ ఉపయోగకరమే. మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఎలా చూసినా గాని, ఆంగ్లవికీ మొదటి పేజీలో ఉన్నా లేకున్నా గాని, మొత్తానికి వ్యాసాల నాణ్యత పెంచడం నిస్సందేహంగా అవుసరం. ఇది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ కూడాను. అంతే కాకుండా వ్యాసాలు తొలగించడం అంత సులభం కాదు. కష్టపడి వ్యాసం ఎవరో ఒకరు సృష్టించి, మరొకరు చెరిపేస్తూ పోతుంటే ఎక్కడికి వెళతాము? మనముందున్న పెద్ద లక్ష్యం దృష్ట్యా సభ్యులను నేను కోరేదేమంటే
- జూలై-డెసెంబరు ఆరు నెలల కాలాన్ని నాణ్యత మెరుగు ఉద్యమ సమయం (Quality Improvement drive period)గా పరిగణించండి.
- ఈ సమయంలో గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు విస్తరణ ప్రధాన కార్యక్రమంగా భావించండి.
- సినిమాలు: సినిమాలకు పనికొచ్చే కొన్ని లింకులు పైన వ్రాశాను. అయినా తెలుగువారికి సినిమాల గురించి సమాచారం సేకరించడం కష్టం కాదనుకొంటాను.
- టౌనులు: en:Category:Cities and towns in Andhra Pradesh అనే ఆంగ్ల వికీ వర్గంలో చాలా పట్టణాలకు ఒకమాదిరి సమాచారం (ఒక పేరాకు సరిపడా) ఉంది. దానిని అనువదించడం మొదలెడితే కొంత ప్రగతి సాధించగలం. ఆంగ్లంలోను, తెలుగులోను అంతర్వికీ లింకులు ఇవ్వడం మరచిపోవద్దు.
- గ్రామాలు: ఈ ప్రాజెక్టు ముందుకు తీసికొని వెళ్ళడానికి "ప్రాక్టికల్"గా వీలయ్యే సూచనలు ఇవ్వండి. లేదా స్వయంగా అమలు చేయండి. పరిష్కారం లభింపకపోదు. ఇది మనవల్ల కాదు అని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే గ్రామాల పేజీలు తుడిచివేయడమే అంతిమ నిర్ణయం అవుతుంది. ఇప్పుడు కాకుంటే మరికొంతకాలం తరువాత.
--కాసుబాబు 09:46, 25 జూన్ 2009 (UTC)
- గ్రామాల వ్యాసాలను అన్నింటినీ అభివృద్ధి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చునని నా అభిప్రాయం. ఇది మన తెవికీ బాగా ప్రాచుర్యం పొందడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను గమనించిన రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను.
- గ్రామాల వ్యాసాలు తొలగించకుండా ఉండటం: ఇతర వ్యాసాల సంఖ్య పెరుగుతున్న వీటి శాతం తగ్గిపోతుంది.అదే సమయంలో వాటిని కూడా అప్‌డేట్ చేస్తూండవచ్చు. అయితే కొంచెం ఎక్కువ కాలం పడుతుంది.
- ఒకవేళ గ్రామాల వ్యాసాలు తొలగించదలుచుకుంటే నాదొక సలహా. ప్రస్తుతం మొలకల స్థాయి దాటిన గ్రామ పేజీలన్నీ అలాగే ఉంటాయి. ఇక మొలక స్థాయిలో ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా వ్యాసం అంటూ ఉండదు. ఉన్న ఒకటీ రెండూ లైన్లు సదరు మండలానికి సంభంధించిన వ్యాసంలో ఉంటాయి. ఏదైనా ఒక మండలం వ్యాసంలో ఒక గ్రామం గురించిన సమాచారం మొలక స్థాయిని దాటినప్పుడు దాన్ని మండలం వ్యాసం నుంచి విడదీసి ప్రత్యేక వ్యాసం సృష్టించవచ్చు.
- రవి చెప్పేది నిజమే. గ్రామాల పేజీలను తొలగించకూడదనే నా అభిప్రాయం. మరియు కొన్ని సంవత్సరాలు కూడా అవుసరమే. కాని వీటి ప్రగతికి కొన్ని ఉత్ప్రేరకాలు చాలా అవుసరం. లేకుంటే అభివృద్ది కష్టం. మరియు లోతు గురించి పైన జరిగిన చర్చలలాగానే మనం పునఃపునః పాలిసీ సమస్యలు ఎదుర్కొంటాము. --కాసుబాబు 07:13, 26 జూన్ 2009 (UTC)
- గ్రామాల పేజీలు తొలగించనవసరం లేదు. ప్రస్తుతం గ్రామాల సమాచారం వెతుక్కొనే వారికి ముందుగా దొరుకుతున్న లింకు తెవికీదే. అంటే మరెక్కడా ఈ మాత్రం సమాచారం కూడా లేదనే కదా. ముందులో కంటే కూడా అప్పుడప్పుడూ కొందరు సభ్యులు వారి గ్రామాల గురించి కొద్దికొద్దిగా రాస్తున్నారు. మెల్లగా అవి పెద్ద వ్యాసాలుగా మారుతాయి. విశ్వనాధ్.బి.కె. 10:46, 26 జూన్ 2009 (UTC)
గ్రామాల పేజీలు - రెండవ అంకం
మార్చుగ్రామాల పేజీలు రెండవ అంకం ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందనుకుంటా. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో భాగంగా మలివిడతలో అన్ని గ్రామాలకు గణాంకాలు చేర్చాలని ప్రతిపాదించబడింది. కానీ అది ఆలస్యమైంది. ప్రస్తుతం సభ్యులందరూ మొలకలపై కేంద్రీకరిస్తున్నారు కాబట్టి ఈ రెండవ విడతను ఒక ఆరు నెలల్లో మొదలుపెడదాం. అయితే క్రియాశీలకంగా రెండవ విడతను ముందునెట్టడానికి ఈ ఆరునెలల కాలంలో కావలసిన వనరులను సమకూర్చుకోవాలి. నాకు తోచినవి కొన్ని.
- గత ఐదారేళ్లలో అంతర్జాలంలో లభించే గణాంకాలు, సమాచారం చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ఏ ఏ సమాచారం ఎక్కడెక్కడా లభ్యమౌతుందో వెతికి పట్టుకోవాలి.
- 2011 జనగణన సమాచారం
--వైజాసత్య (చర్చ) 08:50, 3 ఏప్రిల్ 2013 (UTC)
- గ్రామాలవారీగా 2011 జనాభా గణాంకాల వివరాలు ఇంకనూ అధికారికంగా వెలువడలేవు. త్వరలోనే వెలువడనున్నాయి. మండలాల వారీగా మాత్రం విడుదలైనాయి. ప్రతి జిల్లాలో జిల్లా పాలనాధికార్లచే మండలదర్శిని పుస్తకాలు ముద్రిస్తున్నారు. అందులో మండలాలకు చెందిన అన్ని వివరాలు లభ్యమౌతున్నాయి కాని అవి అంతర్జాలంలో అందుబాటులో లేవు. అవి కాకున్నా మనకు ఇదివరకే అందుబాటులో ఉన్న వివరాలతో మరియు గ్రామాలతో కూడిన మండల పటంతో గ్రామవ్యాసాల సమాచారంను పొడిగించవచ్చు. నేను రంగారెడ్డి జిల్లాలో తాండూరు, యాలాల, బషీరాబాద్, గండీడ్ మరియు మహబూబ్‌నగర్ జిల్లా మండలాలలో పటాలతో సహా సమాచారం విస్తరించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:29, 3 ఏప్రిల్ 2013 (UTC)
అస్తవ్యస్తమైన గ్రామాల పేజీలు
మార్చునేను ఇటీవలి కొన్ని గ్రామాల పేజీలు చూసినపుడు అస్తవ్యస్తంగా వున్నాయనిపించింది. (ఉదా:చీరాల (చర్చనాటిరూపం), పర్చూరు(చర్చనాటి రూపం) దేవరపల్లి (పర్చూరు) (చర్చానాటి రూపం) ) ఒకటి కంటె ఎక్కువ సమాచార పట్టికలలో నకళ్లుగా అంశాలు. జనాభా లాంటివి. గణాంకాలు సమాచారపెట్టెలలోను మరియు వ్యాసం పేజీలోను నకలు. వ్యాసంపేజీలో అవసరం లేదు. కొన్ని విభాగాలు నకళ్లు (ఉదా రాజకీయ ఎన్నికలు). గ్రామాల ప్రాజెక్టు ఒక టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి దిగజారింది. వాడుకరి:chaduvari, వాడుకరి:pavan santhosh.s పరిశీలించి తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరడమైనది.--అర్జున (చర్చ) 05:03, 13 మే 2018 (UTC)
- వాడుకరి:chaduvari, వాడుకరి:pavan santhosh.s రచ్చబండ వ్యాఖ్యలో వివరం కోరినట్లు , నా పాత వ్యాఖ్యకు లింకులు క్రింద జోడిస్తున్నాను.
- ఒకటి కంటె ఎక్కువ సమాచార పట్టికలలో నకళ్లుగా అంశాలు. పర్చూరు(చర్చనాటి రూపం). రెండు సమాచారపట్టికలు స్వల్పతేడాలతో.
- గణాంకాలు సమాచారపెట్టెలలోను మరియు వ్యాసం పేజీలోను నకలు. వ్యాసంపేజీలో అవసరం లేదు. తొలి వ్యాఖ్యలో పేర్కొన వ్యాసాలన్నింటిలో.
- కొన్ని విభాగాలు నకళ్లు (ఉదా రాజకీయ ఎన్నికలు) పర్చూరు(చర్చనాటి రూపం) లో నియోజక వర్గము కోసం వెతకండి.
- గ్రామాల ప్రాజెక్టు ఒక టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి పర్చూరు(చర్చనాటి రూపం) లో నియోజక వర్గము తరువాత బ్యాంకులు, ATMs, కళ్యాణ మండపములు, వైద్యశాలలు,Hair saloons లాంటి శీర్షికలు చూడండి. --అర్జున (చర్చ) 03:55, 24 ఏప్రిల్ 2019 (UTC)
- వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయండీ. నిజానికి, మీ వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతున్న కొన్ని మార్పుచేర్పులు మీరు గమనించలేదనీ, వాటికి లింకులు ఇస్తే సరిపోతుందనీ గమనించాను. జనగణన డేటాను సమాచారంగా మలచి వ్యాసాల్లో చేర్చినవి వికీపీడియా వ్యాసాల్లో ఉండదగినవి కావని మౌలికమైన చర్చొకటి మీరు మొదలుపెట్టి దానిపై నేనడిగిన స్పష్టత ఇంకా ఇవ్వవలసి ఉంది. ఒకే సమయంలో వేర్వేరు విషయాల మీద కలగాపులగంగా మాట్లాడుకుంటూ ఉండడం ప్రయోజనకరం కాదని, కాబట్టి ఆ స్పష్టత మీ నుంచి తీసుకున్నాకా క్రమవరుసలో వీటన్నిటినీ వివరించవచ్చనీ భావిస్తూ ఈ చర్చకొక కామా పెడుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:51, 24 ఏప్రిల్ 2019 (UTC)