విరాట పర్వం (సినిమా)

2022లో విడుదలైన తెలుగు సినిమా
(విరాట పర్వము (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

విరాట పర్వం, 2022లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022, జూన్ 17న థియెటర్లలో విడుదలై[1], జులై1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో విడుదలైంది.[2]

విరాట పర్వం
సినిమా ప్రచార చిత్రం
దర్శకత్వంవేణు ఊడుగుల
రచనవేణు ఊడుగుల
నిర్మాతసుధాకర్ చెరుకూరి
దగ్గుబాటి సురేష్ బాబు
తారాగణంసాయి పల్లవి
దగ్గుబాటి రానా
ఛాయాగ్రహణండాని సాంచెజ్-లోపెజ్
దివాకర్ మణి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
2022 జూన్ 17 (2022-06-17)(థియేటర్)
2022 జూలై 1 (2022-07-01)(ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అయ్యి అతనిపై ప్రేమను పెంచుకుంటుంది. వెన్నెలను ఆమె బావ(రాహుల్ రామకృష్ణ)కు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు(సాయిచంద్‌, ఈశ్వరి రావు) నిశ్చయిస్తారు. తనకు పెళ్లి ఇష్టం లేదని అందరితో ధైర్యంగా చెప్పి తల్లిదండ్రులకు లేఖ రాసి అరణ్య కోసం ఇంటి నుంచి వెళ్లిపోతుంది. దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా గాలిస్తుంటారు. వెన్నెల త‌న‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు చేసి అడ‌విలోకి వెళుతుంది. అతణ్ణి చేరుకోవడం కోసం వెన్నెల ఎంత కష్టపడింది? వెన్నెల తనను ప్రేమిస్తుందని తెలిశాక రవన్న ఎలా స్పందించాడు? ర‌వ‌న్న‌తో వెన్నెల క‌లిశాక ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

తారాగణం మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

పాటలు మార్చు

Untitled
chronology
Guvva Gorinka
(2020)
విరాట పర్వం
(String Module Error: Target string is empty)
Power Play
(2021)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కోలు కోలు (రచన: చంద్రబోస్)"  దివ్య మల్లికా, సురేష్ బొబ్బిలి 3:47
2. "వీర తెలంగాణ (రచన: చంద్రబోస్)"  హేమచంద్ర 2:28
3. "నాగాదారిలో (రచన: ద్యావారి నరేందర్ రెడ్డి, సనాపతి భరద్వాజ్ పాత్రుడు)"  వరం 3:21
4. "చలో చలో- ది వారియర్ సాంగ్ (రచన: జిలకర శ్రీనివాస్ )"  సురేష్ బొబ్బిలి 1:55
 
విరాట పర్వం పోస్టర్

నిర్మాణం మార్చు

విరాట‌ప‌ర్వం సినిమా హైద‌రాబాదులోని రామానాయుడు స్టూడియోలో 2019 జూన్ 15న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.[13]

విడుదల మార్చు

ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయబడింది.[14][15] విరాట పర్వం సినిమా 2022 జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించి[16], ఆ తరువాత ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.[17]

మూలాలు మార్చు

  1. "'విరాటపర్వం' మూవీ రివ్యూ". Sakshi. 2022-06-17. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-17.
  2. V6 Velugu (29 June 2022). "జులై1న ఓటీటీలోకి విరాటపర్వం". Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (17 June 2022). "సినిమా రివ్యూ: 'విరాట పర్వం'" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  4. BBC News తెలుగు (17 June 2022). "విరాటపర్వం సినిమా రివ్యూ: సాయి పల్లవి, రానాలతో డైరెక్టర్ వేణు హిట్ కొట్టారా?". Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  5. Sakshi (14 December 2020). "కామ్రేడ్‌ రవన్నగా రానా విశ్వరూపం". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  6. V6 Velugu (18 June 2022). "సరళ పాత్ర చేసినందుకు గర్విస్తున్నా". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Sakshi (4 June 2020). "హ్యాపీ బర్త్‌డే 'కామ్రేడ్‌ భారతక్క'". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  8. Eenadu (18 February 2020). "'విరాట పర్వం'లో బహు భాషా నటి". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  9. Eenadu (19 June 2022). "నేను నాన్న.. ఆమె కన్నా". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  10. Andhra Jyothy (5 June 2022). "నా వెన్నెల... నా కలలోకి వచ్చేది!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  11. Sakshi (8 June 2022). "విరాటపర్వం రానా ఎందుకు చేస్తానన్నారో అర్థం కాలేదు: డైరెక్టర్‌". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  12. Namasthe Telangana (2 June 2022). "'విరాట‌ప‌ర్వం' నుంచి 'న‌గాదారిలో' సాంగ్ విడుద‌ల‌.. ఆక‌ట్టుకుంటున్న సోల్‌ఫుల్ ట్యూన్‌!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  13. The New Indian Express (15 June 2019). "Rana Daggubati, Sai Pallavi's Virata Parvam launched" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  14. EENADU. "'విరాట పర్వం' విడుదల వాయిదా - virataparavm post poned". www.eenadu.net. Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  15. TV9 Telugu (29 June 2020). "'విరాట పర్వం'కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  16. Andhra Jyothy (6 May 2022). "'విరాట పర్వం' విడుదల ఎప్పుడంటే?" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  17. Eenadu (30 May 2022). "'విరాటపర్వం' విడుదల తేదీ మార్పు.. జులై కాదు జూన్‌లోనే". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.

బయటి లంకెలు మార్చు