వరం
వరలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారిణి, జానపద, తెలుగు సినిమా గాయని. ఆమె ‘హమ్ తుమ్’ సినిమా ద్వారా గాయనిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇస్మార్ట్ శంకర్, సీటీమార్, నారప్ప, విరాటపర్వం సినిమాల్లో, బతుకమ్మ పాటలు, 200కుపైగా జానపదాలు గీతాలు పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.[1]
వరం | |
---|---|
జననం | వరలక్ష్మి 1990 |
వృత్తి | గాయని |
తల్లిదండ్రులు | ఉప్పలయ్య, కనకలక్ష్మీ |
బంధువులు | సారయ్య (అన్నయ్య) |
జననం, విద్యాభాస్యంసవరించు
వరం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం, బేరువాడ గ్రామంలో జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ వరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తి చేసి హైదరాబాద్‌లోని బేగంపేట ఉమెన్స్ కాలేజీల ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. ఆమె ఇంటర్‌లో హాకీ నేషనల్స్‌కీ ఎంపికైంది.
సినీ జీవితంసవరించు
వరం 2012 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చి గాయకుడు హేమచంద్ర తల్లి శశికళ మాస్టారు దగ్గర సంగీతం నేర్చుకుంది. ఆ క్రమంలో 2014లో సంగీత దర్శకుడు బోలే షావలీ సంగీత దర్శకత్వం వహించిన హమ్‌తుమ్ సినిమాలో పడే అవకాశం కల్పించాడు. ఆలా ఆమె గాయనిగా సినీరంగంలోకి అడుగు పెట్టి వీ6 చానల్ కోసం పాడిన బతుకమ్మ పాటలు'మా బొట్టు బోనం', ‘కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్’, 'బోల్ బోల్' పాటలు, చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో పాడిన 'సుక్కురారమ్ మహాలచ్చిమి' పాట ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. వరం 2017 సంవత్సరంలో 20 ఛానల్స్‌కు బతుకమ్మ పాటలు పాడింది.[2]
గాయనిగాసవరించు
- హమ్ తుమ్ (2014)
- ధనలక్ష్మి తలుపు తడితే
- బంతిపూల జానకి (2016)
- సమయం
- లవర్స్
- ప్రేమ పందెం (2017)
- అరుపు
- ఇష్టంగా (2018)
- అంతా వి చిత్రం
- ఆర్ఎక్స్ 100
- సాగరతీరంలో (2018)
- బెస్ట్ లవర్స్ (2018)
- మిస్టర్ హోమానంద్(2018)
- కేఎస్ 100 (2019)
- కెప్టెన్ రాణా ప్రతాప్ (2019)
- కాలేజీ పోరగాళ్ళు (2019)
- ఆక్సిడెంట్ (2019)
- తుపాకీ రాముడు (2019)
- ఇస్మార్ట్ శంకర్ (2020)
- స్వేచ్ఛ (2020)
- ఎర్ర చీర (2021)
- సీటీమార్ (2021)
- నారప్ప(2021)
- విరాటపర్వం (2022)[3]
- సేవాదాస్(2022)
- స్టెపిని రిటన్స్ (హిందీ సినిమా)
- తూహి మేరా పెహలా ఫ్యార్ (హిందీ సినిమా)
డబ్బింగ్ ఆర్టిస్టుగాసవరించు
మూలాలుసవరించు
- ↑ Eenadu (12 December 2021). "నా పాట.. నాన్న వరం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Namasthe Telangana (28 April 2021). "స్వరమే.. నా వరం". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Namasthe Telangana (2 June 2022). "'విరాటపర్వం' నుంచి 'నగాదారిలో' సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న సోల్‌ఫుల్ ట్యూన్!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Mana Telangana (31 July 2018). "పాటలు పాడడమే వరం". Retrieved 5 June 2022.[permanent dead link]