విశాఖపట్టణం మెట్రోపాలిటన్ ప్రాంతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం

విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఈ ప్రాంతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది 4,873 చదరపు కిలోమీటర్ల (1,881, చదరపు మైళ్ళు) వైశాల్యాన్ని కలిగివుంది. ఈ ప్రాంతాన్ని విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, రవాణా, గృహాల బాధ్యత నిర్వర్తించే అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 50.18 లక్షల జనాభా ఉంది.[1][2]

విశాఖపట్టణం మెట్రోపాలిటన్ ప్రాంతం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాలువిశాఖపట్టణం, విజయనగరం
Area
 • Metro
4,873 km2 (1,881 sq mi)
Population
 (2011)
 • Metro
50,18,000
Time zoneUTC+5:30 (IST)

చరిత్ర మార్చు

బంగాళా ఖాతం ఒడ్డున ఉన్న విశాఖపట్టణం నగరంలో భారతదేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. శివ పార్వతుల కుమారుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి.

7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు వంటి వివిధ వంశాల రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది.

బంగాళాఖాతాన్ని ఆనుకొని సముద్రపు ఒడ్డున ఈ విశాఖపట్నం ఉంది. ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన తూర్పు కనుమలు వంటివి విశాఖపట్నానికి ఎల్లలుగా ఉన్నాయి. ఈ నగర అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం, తీరప్రాంతాలతో ఉంది.

అధికార పరిధి మార్చు

విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ అధికార పరిధిలోని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతం, విశాఖపట్నం నగరాన్ని, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిగి ఉంది.[3] ఇందులో 2 నగరపాలక సంస్థలు, 1 పురపాలక సంఘం, 1 నగర పంచాయితీ, 38 మండలాలు ఉన్నాయి.[4]

విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పట్టణ ప్రాంతాల జాబితా:

అధికార పరిధి
సెటిల్మెంట్ రకం పేరు మొత్తం
నగరపాలక సంస్థలు జివిఎంసి, విజయనగరం 2
పురపాలక సంఘాలు ఎలమంచిలి 1
నగర పంచాయతీలు నెల్లిమర్ల 1

విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలోని మండలాల జాబితా:

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రాంతాలు
జిల్లా మండలాలు మండలాల సంఖ్య
విజయనగరం చీపురుపల్లి, గరివిడి, గుర్ల, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి, విజయనగరం, నెలిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం 16
విశాఖపట్నం భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, విశాఖపట్నం (గ్రామీణ), సీతమ్మధార, మహారాణిపేట, గోపాలపట్నం, మాడుగుల, గాజువాక, పెదగంట్యాడ, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, యస్. రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట 22

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Upgradation of VMRDA". Times of India. Visakhapatnam. 13 August 2018. Retrieved 12 October 2020.
  2. "VMRDA loses 1,628 sq.km to new urban development body". Visakhapatnam: Times of India. Retrieved 12 October 2020.
  3. "districts of VMRDA". Visakhapatnam: The Hans India. Retrieved 12 October 2020.
  4. "GOs issued on merger of two civic bodies, 10 panchayats". The Hindu. Visakhapatnam. 31 July 2013. Retrieved 12 October 2020.