శ్రేష్ఠ తెలుగు సినిమా సినీ గేయ రచయిత. ఆమె 2012లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా ద్వారా సినీ రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. శ్రేష్ఠ 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2][3][4]

శ్రేష్ఠ
జననం30 ఆగస్టు 1986 [1]
వృత్తికవియిత్రి,గేయ రచయిత
తల్లిదండ్రులు
  • జాన్‌ శామ్యూల్‌ వెస్లీ (తండ్రి)
  • చంద్రకళ (తల్లి)

జననం, విద్యాభాస్యం

మార్చు

శ్రేష్ఠ 30 ఆగస్టు 1986లో తెలంగాణ రాష్ట్రం , ఆదిలాబాద్ జిల్లా , మంచిర్యాల లో చంద్రకళ, జాన్‌ శామ్యూల్‌ వెస్లీ దంపతులకు జన్మించింది. ఆమె ఉన్నత విద్యాభాస్యంత మంచిర్యాలలోనే పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసింది. శ్రేష్ఠ విద్యార్థి దశలోనే ‘మై కాలేజ్‌ లైఫ్‌’ అనే కవితా సంపుటిని ప్రచురించింది.[5]

రచించిన పాటలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు సంగీతం పాట
2012 ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ప్రవీణ్ ఇమ్మడి అన్ని పాటలు
2012 కో అంటే కోటి శక్తికాంత్ కార్తిక్ "ఓ మధురిమవే ఎందుకు", "బంగారు కొండా"
2012 మైత్రి వికాస్ " ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలే నే"
2013 జబర్‌దస్త్ ఎస్.ఎస్. తమన్ "అరెరే అరెరే"
2013 వెయిటింగ్‌ ఫర్‌ యు ప్రవీణ్ ఇమ్మడి "ప్రాణం పురివిప్పిన వేళ"
2015 కొరియర్ బాయ్ కళ్యాణ్ కార్తీక్ - అనూప్ రూబెన్స్ "మాయ ఓ మాయ"
2016 పెళ్లి చూపులు వివేక్ సాగర్ "చినుకు తాకే", "మెరిసే మెరిసే"
2017 అర్జున్ రెడ్డి రధన్ "మధురమే" , "గుండెలోన"
2017 యుద్ధం శరణం వివేక్ సాగర్ "నీవాలనే", "ఎన్నో ఎన్నో భావాలే"
2017 హలో అనూప్ రూబెన్స్ "హలో","మెరిసే మెరిసే"
2018 ఆటగాళ్ళు సాయి కార్తీక్ "నీవల్లే నీవల్లే"
2018 ప్రేమకు రెయిన్ చెక్ దీపక్ కిరణ్ "ప్రాణమా"
2018 అభిమన్యుడు యువన్‌ శంకర్‌రాజా "అడిగే హృదయమే"
2019 నువ్వు తోపురా పీఏ దీపక్‌ "పద పదమని"
2019 దొరసాని ప్రశాంత్ ఆర్ విహారి "కళ్ళల్లో"
2020 ప్రెషర్‌ కుక్కర్‌ సునీల్ కశ్యప్ "నీ హృదయంతో నా హృదయం కలుసుకోనీ"
2020 మెరిసే మెరిసే కార్తీక్ కొడకండ్ల "కనులతో రచించు "
2021 ఈ కథలో పాత్రలు కల్పితం కార్తీక్ కొడకండ్ల "ఏమిటో ఏమిటో"
2021 డర్టీ హరి మార్క్ కె రాబిన్ "రాధా నీ రాధా"
2024 అలనాటి రామచంద్రుడు

సినీరంగంలో వేధింపులు

మార్చు

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల (కాస్టింగ్ కౌచ్) గురించి శ్రేష్ఠ స్పందిస్తూ తాను కూడా వేధింపులకు లోనయ్యామంటూ చెప్పింది. ఈ వేధింపుల కారణంగా ఆమె రెండు సంవత్సరాలకు పైగా కెరీర్‌ను వదులుకున్నాని చెప్పింది.[6][7][8]

అవార్డులు

మార్చు
  1. 2017లో ఉత్తమ సినీ గేయ రచయితగా జీ గోల్డెన్ అవార్డు
  2. 2019లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈటీవి వసుంధర పురస్కారం
  3. 2019లో సినారె - వంశీ ఫిలిం అవార్డు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (10 July 2021). "తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి 'శ్రేష్ఠ'". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  2. "Songwriter chronicles: Lyricist Shreshta". The Hindu. Retrieved 2017-09-26.
  3. ఈనాడు. "ఆమె పాటల వెనక... ఎన్ని పాట్లున్నాయో!". Archived from the original on 13 October 2017. Retrieved 30 September 2017.
  4. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  5. The New Indian Express (26 February 2020). "Lyricist Shreshta: There is gender discrimination in the Telugu film industry" (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  6. HMTV (4 January 2018). "ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలనిపించింది". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  7. BBC News తెలుగు (2 November 2017). "ఆ ప్రొడ్యూసర్ల భార్యలే 'ఒప్పుకోమనేవారు'". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  8. Sakshi (17 June 2018). "క్యాస్టింగ్‌ కౌచ్‌పై 'అర్జున్‌ రెడ్డి' ఫేం షాకింగ్‌ నిజాలు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రేష్ఠ&oldid=4287392" నుండి వెలికితీశారు