కొరియర్ బాయ్ కళ్యాణ్

2015లో ప్రేమ్‌సాయి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు.[1][2] ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో గౌతమ్ మీనన్ నిర్మించాడు.[3] జై హీరోగా తమిళసెల్వనం తనియార్ అంజలం పేరుతో తమిళ భాషలో తెలుగుతోపాటే చిత్రీకరణ జరుపుకుంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరుతోనే హిందీలోకి అనువాదమయింది.

కొరియర్ బాయ్ కళ్యాణ్
Courier Boy Kalyan Movie Poster.jpg
కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రేమ్‌సాయి
రచనప్రేమ్‌సాయి
నిర్మాతగౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటల, సునీత తాటి
నటవర్గంనితిన్, యామీ గౌతం
ఛాయాగ్రహణంసత్యా పోన్మార్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంకార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
ఫోటాన్ కథాస్
విడుదల తేదీలు
2015 సెప్టెంబరు 17 (2015-09-17)
నిడివి
104 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

డిగ్రీ ఫెయిలై ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ (నితిన్) కావ్య (యామి గౌతమ్)ను చూసి ప్రేమించి, తన కోసమే కొరియర్ బాయ్‌ గా పనిచేస్తుంటాడు. విదేశాల్లో పేరుగాంచిన డాక్టర్ అశుతోష్ రానా అధిక డబ్బు కోసం ఓ పరిశోధన చేస్తూ, దానికోసం ఇక్కడి డాక్టర్ల సహాయం తీసుకుంటాడు. డెలివరీ కోసం తమ, తమ హస్పిటల్స్ కు వచ్చిన గర్భవతులను వారికి తెలియకుండానే అబార్షన్ చేసి వారిలోని స్టెమ్ సెల్స్ ను సేకరించి అశుతోష్ రానా కు పంపుతుంటారు ఇక్కడి డాక్టర్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డుబాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. అదే కొరియర్ ..కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న నితిన్ చేతిలో పడుతుంది. చివరకు కళ్యాణ్ ఆ కొరియర్ ను సత్యమూర్తికి ఎలా చేర్చాడు అనేది మిగతా సినిమా.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

విడుదలసవరించు

2015, సెప్టెంబరు 11న విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు.[4] 2015, సెప్టెంబరు 17న విడుదల అయింది.[5]

పాటలుసవరించు

కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు, సోని మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మాయ ఓ మాయ (రచన: శ్రేష్ట)"  కార్తీక్ 4:20
2. "బంగారమ్మ (రచన: అనంత శ్రీరామ్, శ్రీచరణ్ కస్తూరిరంగన్)"  శ్రీచరణ్ కస్తూరిరంగన్, కార్తీక్, మేఘ 3:58
3. "మందు మందు (రచన: సాహితి)"  కార్తీక్, బాబా సెహగల్ 3:14
4. "వాటు కళ్ళ పిల్ల (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  అనూప్ రూబెన్స్, సుచిత్ర 3:30
15:02

మూలాలుసవరించు

  1. "Nitin's Courier Boy Kalyan on floors soon". 29 June 2012. Retrieved 6 September 2019.
  2. "Jai & Richa in 'Tamil Selvanum Thaniyaar Anjalum'?". IndiaGlitz. 11 June 2012. Retrieved 6 September 2019.
  3. "Hero Nitin's new movie "Courier Boy Kalyan"". Times of India. 11 June 2012. Archived from the original on 18 జూన్ 2013. Retrieved 6 September 2019.
  4. "Nithin's Courier Boy Kalyan gets its release date"
  5. "'Courier Boy Kalyan' postponed yet again"

ఇతర లంకెలుసవరించు