సండే సినిమా

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమం

తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువదర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయం చేసే ఉద్ధేశ్యంతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమం సండే సినిమా (ఎ విండో టూ వరల్డ్ సినిమా).[1][2] 2018, జనవరి 7న ప్రారంభమైన ఈ సండే సినిమా కార్యక్రమంలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రపంచ సినిమాల ప్రదర్శనతో పాటు వర్ధమాన సినీ కళాకారులకు ప్రపంచ స్థాయి సినిమాని పరిచయం చేసి, ప్రపంచ స్థాయి సినిమా నిర్మాణ విలువలు, విశేషాలు, మెళకువలను తెలియజేసేందుకు వివిధ రకాల వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు.[3]

రూపకల్పన

మార్చు

తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది.

ఈనాటి సినిమాను ఉన్నతమైన పంథావైపు నడిపించేందుకు... ప్రేమ, పెళ్లి, కోపం, పగ, ప్రతీకారంతో ఊరేగుతున్న తెలుగు సినిమాకు కొత్త ఒరవడి నేర్పేందుకు ఒక వేదికకు ఏర్పాటు చేయాలన్న హరికృష్ణ సంకల్పంతో సండే సినిమా మొదలయింది.[4] మంచి సినిమా అంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలైన ఉత్తమ చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు.

సినిమాల ఎంపిక

మార్చు

సుప్రసిద్ధ సినీ దర్శకుడు అకిరా కురసావా తెరకెక్కించిన 'రషమోన్‌' సినిమాను తొలి సినిమాగా ప్రదర్శించబడింది. సండే సినిమాలో ప్రదర్శించేందుకు సినిమాల ఎంపిక బాధ్యతను మామిడి హరికృష్ణ తీసుకున్నారు. విదేశీ సినిమాలపై గతంలో అనేక రివ్యూలు రాసిన హరికృష్ణ, సినీ విమర్శ విభాగంలో మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఏ వారం ఏ సినిమాలు ప్రదర్శించాలి, ఎవరు ఆ సినిమా చర్చలో ప్రసంగించాలో వంటివి హరికృష్ణ నిర్దేశిస్తారు.

నిర్వాహక బృందం

మార్చు

ఈ కార్యక్రమ నిర్వహణకు మామిడి హరికృష్ణ నేతృత్వంలో ఔత్సాహిక యువ సినీ కళాకారులచే ఒక నిర్వాహక బృందం ఏర్పాటుచేయబడింది.

ప్రత్యక్ష ప్రసారం

మార్చు

ప్రతివారం ప్రపంచ సినిమా ప్రదర్శన తర్వాత నిర్వహించే ఈ చర్చ కార్యక్రమాన్ని నిర్వాహకులు యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి, ఇతర ప్రాంతాల్లో ఉన్న సినీ అభిమానులు కూడా ఈ చర్చను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

100 వారాలు

మార్చు

2020, జనవరి 5వ (ఆదివారం) తేదినాటికి 100 వారాలు పూర్తయిన సందర్భంగా సండే సినిమా 100 వారాల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి కేక్ కట్ చేశాడు. ఈ వేడుకలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ బృందం, యువ సినీకళాకారులు పాల్గొన్నారు.[5]

200 వారాలు

మార్చు

2023 మార్చి 12న (ఆదివారం) తేదినాటికి 200 వారాలు పూర్తయిన సందర్భంగా అకిరా కురసావా తీసిన 'డ్రీమ్స్' సినిమా ప్రదర్శన జరిగింది. 200 వారాల సండే సినిమా నుండి 100శాతం ఫలితాల్ని సాధించామని, కొత్తతరం దర్శకులు సండే సినిమా నుండి స్ఫూర్తిని పొందడంతోపాటు ఎమోషన్, స్టోరీ లైన్, సీనిక్ ఆర్డర్, స్క్రీన్ ప్లే టెక్నిక్ వంటివి నేర్చుకొని కొత్తకొత్త కంటెంట్లతో వారివారి షార్ట్ ఫిలింలు, సినిమాలు తీస్తున్నారని, రాబోవు రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చూపించేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ముందుటుందని హరికృష్ణ పేర్కొన్నారు.[6]

ప్రదర్శించిన సినిమాలు

మార్చు
తేది సినిమా పేరు భాష దర్శకుడి పేరు దేశం పేరు క్యూరేటర్ పేరు
07.01.2018 రషోమాన్ జపనీష్ అకిరా కురొసావా జపాన్ డా. అంబటి సురేంద్రరాజు
14.01.2018 ది సాక్రిఫైజ్ రష్యన్ తార్కి విస్కీ రష్యా కవి సిద్ధార్థ
21.01.2018 ఫిడ్లేర్ ఆన్ ద రూఫ్ ఇంగ్లీష్, రష్యన్, హీబ్రూ భాష నార్మన్ జ్యూసన్ యునైటెట్ స్టేట్స్ రఘురాములు తుమ్మలపల్లి
28.01.2018 అమేలి ఫ్రెంచ్ జీన్‌ పియర్‌ ఫ్రాన్సు, జర్మనీ వి.వి.శ్రీనివాసరావు
04.02.2018 వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం పర్షియన్ భాష అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ కేఎల్ ప్రసాద్
11.02.2018 సినిమా ప్యారాడిజో ఇటాలియన్, ఇంగ్లీష్, పోర్చుగీసు, సిసిలియన్ గియుసేప్ టోర్నాటోరే ఇటలీ తురగా ఉషా
18.02.2018 క్యాసాబ్లెంకా ఇంగ్లీష్ క్యాసాబ్లెన్స్ యునైటెట్ స్టేట్స్ మామిడి హరికృష్ణ
25.02.2018 రన్ లోలా రన్ జర్మన్ భాష టామ్‌ టైక్వెర్‌ జర్మనీ కెపి అశోక్ కుమార్
04.03.2018 సిటీ ఆఫ్ గాడ్ పోర్చుగీసు ఫెర్నాండో మైరైల్స్ బ్రెజిల్ శరత్ చంద్ర
11.03.2018 ఫైట్ క్లబ్ ఇంగ్లీష్ డేవిడ్ ఫించర్ యునైటెట్ స్టేట్స్, జర్మనీ వెంకట్ సిద్ధారెడ్డి
18.03.2018 హై అండ్ లో జపనీస్ అకిరా కురొసావా జపాన్ హరికృష్ణ బండారి
25.03.2018 ది బ్రిడ్జి ఆన్ ది రివర్ క్వయి ఇంగ్లీష్ డేవిడ్ లీన్ అమెరికా చిట్యాల్ వినోబా ఆంబోజి
01.04.2018 ఇవాన్స్ చైల్డ్‌హుడ్ ఇంగ్లీష్ ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ సోవియెట్ యూనియన్ దేవరాజు మహారాజు
08.04.2018 టాక్సీ డ్రైవర్ ఇంగ్లీష్ మార్టిన్ స్కార్స్స్ అమెరికా ప్రణీత్ పుట్ట
15.04.2018 లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఇటాలియన్ రాబర్ట్ బెనింగ్ ఇటలీ సంజీవ్ పటేల్
22.04.2018 ది సీక్రెట్ ఇన్ దేర్ ఐస్ స్పానిష్ భాష జువాన్ జోస్ కాంపేన్సెల్లా అర్జెంటైన్-స్పానిష్ జ్యోతి
29.04.2018 రూమ్ ఇంగ్లీష్ లెని అబ్రహంసన్ కెనడా, ఐర్లాండ్, యుకె, యుఎస్ మెర్సీ మార్గరెట్
06.05.2018 మోటార్ సైకిల్ డైరీస్ స్పానిష్ వాల్టర్ సలేస్ యునైటెడ్ కింగ్‌డమ్ నరేష్కుమార్ సూఫీ
13.05.2018 లిటిల్ సీక్రెట్స్ లక్సంబ్రిష్ పాల్ కృచ్టన్ లక్సెంబర్గ్ సెర్గే జాకోబి
20.05.2018 ది కింగ్స్ స్పీచ్ ఇంగ్లీష్ టామ్ హూపర్ యునైటెడ్ కింగ్‌డమ్ రుదవత్ మోహన్ సింగ్
27.05.2018 ది బాటిల్ అఫ్ అల్జీర్స్ అరబిక్, ఫ్రెంచి భాష గిల్లో పొంటెకోర్వో ఇటలీ-అల్జీరియన్ కస్తూరి మురళీకృష్ణ
10.06.2018 ది లైవ్స్ ఆఫ్ అదర్స్ జర్మన్ ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్ జర్మనీ శ్రీకాంత్ పుప్పాల
17.06.2018 లోలా ఫిలిప్పీన్స్ బ్రిల్లాంట్ మెన్డోజా ఫ్రెంచ్-ఫిలిపినో ఫిరోజ్ హాసన్
24.06.2018 నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్ జర్మన్ భాష థామస్ జాన్ జర్మనీ ఆడెపు లక్ష్మీపతి
01.07.2018 టూ ఉమెన్ ఇటాలియన్ విట్టోరియో డి సికా ఇటలీ, ఫ్రాన్స్ పింగళి చైతన్య

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (7 January 2018). "సండే సినిమా.. చూడండి!". Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 20 January 2018.
  2. Times of India, Hyderabad City (27 January 2019). "Lights, camera! Cinema in state set for a lot of action". Srirupa Goswami. Archived from the original on 27 January 2019. Retrieved 27 January 2019.
  3. Uddagiri, Nikisha (2023-04-02). "Ravindra Bharathi's Cinevaaram guiding, inspiring young Telugu filmmakers". newsmeter.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.
  4. నమస్తే తెలంగాణ (8 January 2018). "రవీంద్రభారతిలో సండే సినిమా". Retrieved 20 January 2018.[permanent dead link]
  5. 100 వారాల సండే సినిమా, సాక్షి, హైదరాబాదు ఎడిషన్, 07 జనవరి 2020, పుట.11.
  6. Sakshi (20 March 2023). "'సండే సినిమా'@ 200 వీక్స్‌". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.