సహాయం:వికీపీడియాలో ప్రయాణం గురించి పరిచయం/అంతా
This help page is a how-to guide. It details processes or procedures of some aspect(s) of Wikipedia's norms and practices. It is not one of Wikipedia's policies or guidelines, and may reflect varying levels of consensus and vetting. |
వికీపీడియా చాలా పెద్దది!
ప్రస్తుతం ఇక్కడ 1.01 లక్షల వ్యాసాలున్నాయి. వీటికి తోడు మరో 2.64 లక్షల అదనపు పేజీలున్నాయి. ఇవి ప్రధాన పేజీలకు సహాయపడే పేజీలు.
అన్ని భాషల్లోనూ ఉన్న వికీపీడియాలను కలిపితే మానవ చరిత్ర లోనే అతి పెద్ద విజ్ఞాన సర్వస్వం అవుతుంది. ఈ మొత్తం విజ్ఞానసర్వస్వాన్నీ ముద్రిస్తే అది 2,841 సంపుటాలౌతుంది.
ఈ పాఠం మీకు ఒక అవగాహన ఏర్పరుస్తూ, మీకు కావలసిన దాన్ని ఎలా పట్టుకోవాలో చెబుతూ, కొన్ని ముఖ్యమైన పేజీలను మీకు పరిచయం చేస్తుంది.
పేరుబరులు
మార్చువికీపీడియా లోని పేజీలను పేరుబరులుగా విభజించారు. ప్రతీ పేరుబరి లోని (ప్రధాన పేరుబరిని మినహాయించి) పేజీకి ముందు ఒక ఆదిపదం ఉంటుంది. దాని తరువాత ఒక కోలను (:), ఆ తరువాత పేజీ పేరు ఉంటుంది. వికీపీడియాలో మీకు ఎదురయ్యే కొన్ని పేరుబరులు, వాటి వివరణ, ఉదాహరణలూ కింది పట్టికలో ఉన్నాయి, చూడండి:
పేరుబరి | ప్రయోజనం | ఉదాహరణ (లు) |
---|---|---|
ప్రధానబరి / వ్యాసం ఉపసర్గ ఏమీ ఉండదు |
వ్యాసాలు | అల్లూరి సీతారామరాజు |
పాఠకులు వెతుకుతున్న పేజీని కనుగొనడంలో సహాయపడే అయోమయ నివృత్తి పేజీలు | అన్నవరం (అయోమయ నివృత్తి) | |
వికీపీడియా: అనగా "ప్రాజెక్టు" |
విధానాలు, మార్గదర్శకాలు | వికీపీడియా:తటస్థ దృక్కోణం వికీపీడియా:శైలి |
ప్రాసెస్ పేజీలు | వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు | |
చర్చా వేదికలు, నోటీసుబోర్డులు | వికీపీడియా:రచ్చబండ | |
వికీప్రాజెక్ట్ కమ్యూనిటీలు - ఒక నిర్దిష్ట అంశంపై దృష్టి సారిస్తాయి. | వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు | |
వాడుకరి: | వినియోగదారుల గురించి వ్యక్తిగత పేజీలు | వాడుకరి:వైజాసత్య |
ప్రయోగశాలలు, వ్యక్తిగత చిత్తుప్రతులు | వాడుకరి:ప్రయీగశాల | |
సహాయం: | సహాయం పేజీలు | సహాయం:సూచిక |
మూస: | మూసలు. వీటిని ఇతర పేజీలలో చేర్చవచ్చు లేదా సబ్‌స్టిట్యూట్ చేయవచ్చు | మూస:మూలాలు అవసరం మూస:ఇన్ఫోబాక్స్ ఆల్బమ్ |
వర్గం: | పేజీలను వాటి సారూప్యతలను బట్టి సమూహాలుగా చేసి నిర్వహిస్తారు | వర్గం: చిత్రలేఖనం వర్గం:వికీపీడియా నిర్వహణ |
దస్త్రం: | నిల్వ చేసిన బొమ్మలు, ఇతర ఫైళ్ళు | దస్త్రం:Wiki.png |
మీడియావికీ: | వికీ సాఫ్ట్‌వేర్‌లో కనిపించే సందేశాలు (నిర్వాహకులు సవరించేవి) | మీడియావికీ:Recentchanges-legend-watchlistexpiry |
ప్రత్యేక: | సాఫ్ట్‌వేర్‌లో భాగమైన పేజీలు | ప్రత్యేక:ఇటీవలిమార్పులు ప్రత్యేక:అభిరుచులు |
"ప్రత్యేక" పేరుబరి మినహా మిగతా అన్ని పేరుబరులలోని ప్రతి పేజీకీ అనుబంధంగా చర్చ పేజీ ఉంటుంది. ఉదాహరణకు, మీరు అల్లూరి సీతారామరాజు వ్యాసాన్ని చర్చ:అల్లూరి సీతారామరాజు పేజీలో చర్చించవచ్చు. వికీపీడియా:తటస్థ దృక్కోణం పేజీ గురించిన చర్చ వికీపీడియా చర్చ:తటస్థ దృక్కోణం పేజీలో చెయ్యవచ్చు. ఎగువ ఎడమ వైపున ఉన్న ట్యాబ్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు సాధారణ పేజీ మరియు చర్చా పేజీ మధ్య మారవచ్చు. పేజీలో పైన ఎడమ వైపున ఉన్న రెండు ట్యాబుల్లో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మామూలు పేజీ చర్చ పేజీల మధ్య మారుతూ ఉండవచ్చు.
పేజీల్లో వెతకడం
మార్చుప్రతీపేజీ లోనూ పైన కుడి వైపున వెతుకు పెట్టె ఉంటుంది. అందులో టైపు చెయ్యడం మొదలు పెట్టగానే అది, సంబంధిత పేజీలను చూపించడం మొదలు పెడుతుంది; వాటిలో ఒకదానిపై నొక్కితే, ఆ పేజీకి నేరుగా తీసుకు వెళ్తుంది. లేదా, పేజీ పేరు పూర్తిగా టైపు చేసి, ↵ Enterకొడితే, నేరుగా ఆ పేజీకి తీసుకు వెళ్తుంది.
మీరు ఏదైనా పదం ఇచ్చి ↵ Enterకొట్టినపుడు, ఆ పేరు శీర్షికగా పేజీ ఏదీ లేకపోతే, అన్వేషణ ఫలితాలను చూపిస్తూ మీకు పూర్తి అన్వేషణ పేజీ కనిపిస్తుంది. మీరిచ్చిన పదం ఉన్న పేజీలన్నీ ఫలితాల్లో కనిపిస్తాయి. వెతుకు పెట్టెలో భూతద్దాన్ని నొక్కినా, సూచనల కింద చూపించే "కలిగియున్న.." అనే దాన్ని నొక్కినా ఈ అన్వేషణ పేజీకి తీసుకు వెళ్తుంది. ఉదాహరణకు, శ్రీశ్రీ అనే పేజీకి నేరుగా వెళ్లకుండా శ్రీశ్రీ అనే పదం ఏయే పేజీల్లో వచ్చిందో చూడాలంటే పైన చెప్పినట్లుగా చెయ్యాలి.
అన్వేషణ పేజీలో, మీ వెతుకులాటను కొన్ని పేరుబరులకు మాత్రమే పరిమితం చెయ్యవచ్చు. ముందే సెట్ చేసుకున్న వికల్పాన్ని (కంటెంటు పేజీలు, మల్టీమీడియా, అన్నీ) ఎంచుకోవచ్చు. లేదా కావాల్సిన పేరుబరులను ఎంచుకోవచ్చు.
వర్గాలు
organisms | ||
---|---|---|
/ animals |
\ plants | |
/ dogs |
\ cats |
పేజీలను కనుగొనడానికి మరొక పద్ధతి వర్గాలు. ఒకదానికొకటి సంబంధం ఉన్న పేజీలను సమూహాలుగా చేసే పద్ధతే వర్గీకరణ. ఈ వర్గాలు పేజీకి అడుగున ఉంటాయి. ఈ వర్గాలు - అత్యంత సామాన్యమైన స్థాయి నుండి అత్యంత ప్రత్యేకించిన స్థాయి వరకూ ఒక పారంపర్య వృక్షం లాగా ఉంటాయి. కాబట్టి పేజీల్లో అత్యంత ప్రత్యేక స్థాయి వర్గాలు మాత్రమే ఉండాలి. ఉదాహరణకు, [[Category:గుంటూరు జిల్లా కవులు]]
అనే వర్గంలో చేర్చిన పేజీని మళ్ళీ [[Category:ఆంధ్రప్రదేశ్ కవులు]]
అనే వర్గంలో కూడా చేర్చకండి .
దారిమార్పులూ అడ్డదారులూ
మార్చుదారిమార్పులు
Some pages on Wikipedia are దారిమార్పులు — వాటికంటూ స్వంతంగా పాఠ్యమేమీ ఉండదు. కానీ పాఠకులను మరొక పేజీకి పంపుతుంది. ఉదాహరణకు అమెరికా అనే పేజీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు పేజీకి దారి మళ్లిస్తుంది. కాబట్టి, మీరు వెతుకు పెట్టెలో అమెరికా
అని ఇస్తే, అది మిమ్మల్ని నేరుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు వ్యాసానికి తీసుకెళుతుంది. (ఆ పేజీలో వ్యాసం శీర్షిక క్రింద, "(అమెరికా నుండి దారిమార్పు చెందింది)" అనే గమనిక కూడా ఉంటుంది.
దారిమార్పు పేజీని సృష్టించేందుకు విజువల్ ఎడిటరు లోని మెనూను వాడి, అక్కడున్న Page settings నొక్కి లక్ష్యం పేజీని ఎంచుకోవచ్చు. లేదా మామూలు వికీటెక్స్టు ఎడిటరులోనైతే, వికీ మార్కప్ కోడు: #REDIRECT [[లక్ష్యం పేజీ]]
అని రాయవచ్చు.
అడ్డదారులు
వికీపీడియనులు అంతర్గత వికీపీడియా పేజీలను అడ్డదారి పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. టైపింగు చకచకా అయ్యేందుకు వారు ఈ పని చేస్తారు. వికీపేడియా పేరుబరిని సూచించే ఆదిపదాన్ని కూడా వికీపీడియా: అనే బదులు WP:
అని పొట్టిగా రాయవచ్చు. అడ్డదారి పేజీ అంటే మరేమిటో కాదు, దారిమార్పు పేజీయే!
ఉదాహరణకు, వికీపీడియా:తటస్థ దృక్కోణం కు లింకు ఇవ్వాలంటే WP:NPOV
అని రాస్తే సరిపోతుంది. లేదా వెతుకు పట్టీలో WP:NPOV అని టైపు చేసి వెతకవచ్చు. పేజీకి ఉండే అడ్డదారులు సాధారణంగా ఆ పేజీకి పైన కుడి భాగంలో ఉన్న పెట్టెలో ఉంటాయి.
ఉపయోగపడే లింకులు
మార్చుపైన
మీరు లాగిన్ అయి ఉంటే, మీ తెరకు పైన కుడి పక్కన కొన్ని లింకులను చూడవచ్చు:
- మీ వాడుకరిపేరు మీ వాడుకరి పేజీకి తీసుకువెళ్తుంది. అక్కడ మీ గురించిన సమాచారాన్ని చేర్చుకోవచ్చు.
- చర్చ మీ చర్చ పేజీ. మీకు సందేశం ఇవ్వదలచినవాళ్ళు అక్కడే రాస్తారు.
- ప్రయోగశాల మీ వాడుకరి స్థలంలో ఉన్న ప్రయోగశాల. ఇక్కడ మీరు వికీపీడియా చెడిపోతుందేమోనన్న బెంగేమీ లేకుండా దిద్దుబాటుకు సంబంధించిన ప్రయోగాలు చేసుకోవచ్చు.
- అభిరుచులు మీ అభిరుచులకు అనుగుణంగా సెట్టింగులు చేసుకునే స్థలం.
- వీక్షణ జాబితా మీరు గమనిస్తూ ఉన్న పేజీల్లో ఇటీవల జరిగిన మార్పులను చూపిస్తుంది (ఏ ఈ జాబితా లోకి చేర్చాలంటే ఆ పేజీకి పైన ఉన్న నక్షత్రం గుర్తును నొక్కండి.)
- నా మార్పులు మీరు చేసిన దిద్దుబాట్లన్నిటినీ చూపిస్తుంది.
- లాగౌటవండి మీఖాతా నుండి లాగౌటవుతారు.
ఎడమ వైపున
ప్రతి పేజీకీ ఎడమ వైపున మరో లింకుల జాబితా ఉంటుంది:
- సహాయం వికీపీడియా సహాయం పేజీలకు ముఖద్వారం.
- సముదాయ పందిరి వికీలో మీరు ఎక్కడెక్కడ తోడ్పడవచ్చో చూడవచ్చు. ఏయే వికీప్రాజెక్టుల్లో చేర్చవచ్చో చూడవచ్చు.
- ఇక్కడికి లింకున్న పేజీలు ఏదైనా వ్యాసానికి ఏయే పేజీల నుండి లింకులున్నాయో చూడవచ్చు.
- సంబంధిత మార్పులు వ్యాసానికి లింకున్న ఇతర పేజీల్లో ఇటీవల ఏమేం మార్పులు జరిగాయో చూడవచ్చు
మరిన్ని పనికొచ్ఛే లింకులు
వికీపీడియాలో మరికొన్ని పనికొచ్చే పేజీలివి:
- సహాయ కేంద్రం లో మీ సందేహాలను అడగవచ్చు (వికీపీడియాను వాడుకోవడం గురించీ, ఇక్కడ దిద్దుబాటు చెయ్యడం గురించీ)
- రచ్చబండ కేంద్రీయ చర్చావేదిక.