సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]
జోను, డివిజను
మార్చుఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
మార్చురైలు నంబరు: 07618
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
మార్చుఈ రైలు వారానికి ఒక రోజు (బుధవారం) నడుస్తుంది.
ప్రత్యేక సేవలు
మార్చు2016
మార్చుప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 07618 సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, 27 వ జనవరి నుండి 19:20 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.[3] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/train/arrdephistory/arrival-departure-history-secunderabad-tirupati-tatkal-fare-special-07618-sc-to-tpty/37895/835/837[permanent dead link]
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103