శతమానం భవతి

2017 సినిమా

శతమానంభవతి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.

శతమానంభవతి
Sathamanam Bhavati poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంసతీష్ వేగేశ్న
నిర్మాతదిల్ రాజు
రచనసతీష్ వేగేశ్న
నటులుశర్వానంద్
అనుపమ పరమేశ్వరన్
ప్రకాష్ రాజ్
సంగీతంమిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుమధు
నిర్మాణ సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల
జనవరి  14, 2017 (2017-01-14)
నిడివి
2 గం. 15 ని
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు8 కోట్లు

కథసవరించు

అంద‌మైన 'ఆత్రేయ‌పురం ' అనే ప‌ల్లెటూరులోని రాజుగారు(ప్రకాష్ రాజ్), జాన‌క‌మ్మ‌(జయసుధ) మ‌న‌వ‌డు రాజు(శర్వానంద్)తో క‌లిసి నివ‌సిస్తూ ఉంటారు. రాజుగారి ఇద్ద‌రి కొడుకులు, ఒక కూతురు అమెరికాలో ఉంటారు. ఎప్పుడో కానీ త‌మ‌ను చూడ‌టానికి రాని పిల్ల‌ల‌కోసం రాజుగారు బాధ ప‌డుతూ ఉంటారు. ఓ ప‌థ‌కం వేసి త‌న పిల్ల‌ల‌ను సంక్రాంతికి వ‌చ్చేలా చేస్తారు రాజుగారు. ఇంటికి వ‌చ్చిన కొడుకులు, కూతుళ్ళ‌తో స‌ర‌దాగా సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో రాజుగారి మ‌న‌వ‌రాలు నిత్యా(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌), రాజుతో ప్రేమ‌లో ప‌డుతుంది. ఈలోపు రాజుగారి వేసిన ప‌థకం జాన‌క‌మ్మ‌కు తెలియ‌డంలో కుటుంబంలో విబేదాలు వ‌స్తాయి. అస‌లు రాజుగారు వేసిన ప‌థకం ఏమిటి? అనే విష‌యం మిగిలిన కథలో భాగం. [1]

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

అవార్డులుసవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2016 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడు సతీష్ వేగేశ్న విజేత
2016 నంది పురస్కారాలు ఉత్తమ సహాయనటి జయసుధ విజేత
2016 నంది పురస్కారాలు ఎస్.వి.రంగారావు క్యారెక్టర్ అవార్డు నరేష్ విజేత
2016 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి విజేత

మూలాలుసవరించు

  1. "సినిమా రివ్యూ: శతమానం భవతి". ఆంధ్రజ్యోతి. 2017-1-14. Retrieved 2017-1-14. Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: discouraged parameter (link)

బయటి లంకెలుసవరించు