శతమానం భవతి
శతమానంభవతి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.
శతమానంభవతి | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
రచన | సతీష్ వేగేశ్న |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | మధు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 2017 |
సినిమా నిడివి | 2 గం. 15 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 8 కోట్లు |
కథ
మార్చుఅందమైన 'ఆత్రేయపురం ' అనే పల్లెటూరులోని రాజుగారు(ప్రకాష్ రాజ్), జానకమ్మ(జయసుధ) మనవడు రాజు(శర్వానంద్)తో కలిసి నివసిస్తూ ఉంటారు. రాజుగారి ఇద్దరి కొడుకులు, ఒక కూతురు అమెరికాలో ఉంటారు. ఎప్పుడో కానీ తమను చూడటానికి రాని పిల్లలకోసం రాజుగారు బాధ పడుతూ ఉంటారు. ఓ పథకం వేసి తన పిల్లలను సంక్రాంతికి వచ్చేలా చేస్తారు రాజుగారు. ఇంటికి వచ్చిన కొడుకులు, కూతుళ్ళతో సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో రాజుగారి మనవరాలు నిత్యా(అనుపమ పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. ఈలోపు రాజుగారి వేసిన పథకం జానకమ్మకు తెలియడంలో కుటుంబంలో విబేదాలు వస్తాయి. అసలు రాజుగారు వేసిన పథకం ఏమిటి? అనే విషయం మిగిలిన కథలో భాగం. [1]
తారాగణం
మార్చు- శర్వానంద్
- అనుపమ పరమేశ్వరన్
- ప్రకాష్ రాజ్
- జయసుధ
- ఇంద్రజ
- రాజా రవీంద్ర
- ప్రవీణ్
- రచ్చ రవి
- సిజ్జు
- శ్రీరాం
- మధురిమ
- నీల్యా
- ప్రమోదిని
- మహేష్
- భద్రం
- హిమజ
- ప్రభు
పాటల జాబితా
మార్చుమెల్లగా తెల్లారిందో, రచన: శ్రీమణి, గానం.అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
నాలో నేను , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం . సమీర భరద్వాజ్
నిలవదే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం
హైలో హైలెస్సారే , రచన: శ్రీమణి, గానం.ఆదిత్య అయెంగార్ , రోహిత్ పరిటాల , మోహన భోగరాజు, దివ్య దివాకర్
శతమానం భవతి , రచన : రామజోగయ్య శాస్త్రి,గానం.విజయ్ యేసు దాస్, కె ఎస్ చిత్ర.
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థః శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- ఛాయాగ్రహణంః సమీర్ రెడ్డి
- సంగీతంః మిక్కీ జె. మేయర్
- సాహిత్యంః సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
- కూర్పుః మధు
- కళా దర్శకుడుః రమణ వంక
- కథ, కథనం, మాటలు, దర్శకత్వంః వేగేశ్న సతీష్.
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ దర్శకుడు | సతీష్ వేగేశ్న | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ సహాయనటి | జయసుధ | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఎస్.వి.రంగారావు క్యారెక్టర్ అవార్డు | నరేష్ | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ "సినిమా రివ్యూ: శతమానం భవతి". ఆంధ్రజ్యోతి. 2017-01-14. Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-14.