అబూ బక్ర్ (అరబ్బీ ابو بكر الصديق, అబూ బక్ర్ సిద్దీఖ్) (సా.శ. 573 - సా.శ.ఆగస్టు 23 634) మహమ్మద్ ప్రవక్త ఇస్లాం దీన్ (ధర్మం) గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు. మహమ్మద్(శాంతి, శుభాలు ఆయన పై కురుయగాక) తొలి సహచరుడు (సహాబీ), తన కుమార్తె ఆయేషాను ఇచ్చి వివాహం చేసి మహమ్మద్ కు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) మామ కూడా అయ్యాడు. అబూ బక్ర్ అన్న తన పేరును అబ్దుల్లా (అల్లాహ్ సేవకుడు అని అర్థం) మార్చుకున్నాడు. తొలి దశలో ఇస్లాంని వ్యాప్తి చేయడానికి ఇతను కృషిచేశాడు. ఇస్లాంలోకి మక్కాలోని ప్రజలను ఆహ్వానిస్తూ తొలి బహిరంగ ప్రసంగం చేసిందీ ఇతనే. ఈ కారణాల వల్ల ఇస్లాంకు అప్పట్లో వ్యతిరేకులైన ఖురేష్ తెగ వారి వేధింపులు ఎదుర్కొన్నాడు. మహమ్మద్(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక ) మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళినప్పుడు అనుసరించాడు. అతనితో పాటు యుద్ధాల్లో పాల్గొన్నాడు. తొలిసారిగా మదీనావాసులను మహమ్మద్ (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) హజ్ కు పంపినప్పుడు నాయకత్వం వహించే గౌరవాన్ని అబూ బక్ర్ కి ఇచ్చాడు. మహమ్మద్ (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) మరణాంతరం ప్రథమ ఖలీఫాగా నియమితుడయ్యాడు (రాషిదూన్ ఖలీఫాలులో ప్రథముడు). ఇతను ఖలీఫాగా పరిపాలించిన కాలం రెండు సంవత్సరాల మూడు నెలలు. ఇతను ఖురాన్ కి లిఖిత రూపాన్ని కల్పించాడు. ఇతని కాలంలో ముస్లింసామ్రాజ్యం పటిష్ఠమైంది, విస్తరించింది. అరేబియా అంతటా శాంతి నెలకొంది.

అబూ బక్ర్ సిద్దీఖ్
The caliphate under Abu Bakr at its greatest extent
Born 573, మక్కా, సౌదీ అరేబియా
Died ఆగష్టు 23 634, మదీనా, సౌదీ అరేబియా
Reign జూన్ 8 632ఆగష్టు 23 634
Title (s) అల్-సాదిఖ్", సాదిఖ్ అల్-అక్బర్, ఖలీఫా రసూల్
Buried మస్జిద్-ఎ-నబవి, మదీనా
Predecessor -
Successor ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్
edit
Abu Bakr
Successor of the Messenger
(Khalifat-ul-Rasūl)
Rashidun Caliph Abu Bakr as-Șiddīq (Abdullah ibn Abi Quhafa) - أبو بكر الصديق عبد الله بن عثمان التيمي القرشي أول الخلفاء الراشدين
పరిపాలన8 June 632 – 23 August 634
పూర్వాధికారిNone
ఉత్తరాధికారిUmar bin al-Khattab
జననంc. October 573
Mecca, Arabia
మరణం634 ఆగస్టు 23(634-08-23) (వయసు 61)
Medina, Arabia
Burial
Wives
Names
Abū Bakr
(أبو بكر الصديق)
తండ్రిUthman Abu Quhafa
తల్లిSalma Umm-ul-Khair
Brothers
  • Mu'taq (Presumably the Middle)
  • Utaiq (Presumably the Youngest)
  • Quhafah ibn Uthman
Sisters
  • Fadra
  • Qareeba
  • Umme-e-Aamer
DescendantsSiddiqui
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ప్రారంభ జీవితం

మార్చు

అబూ బక్ర్ మక్కాలో సా.శ.573 పరిసర ప్రాంతాలలో ఖురేష్ ఆదివాసి శాఖ అయిన బనూ తైమ్ శాఖలో జన్మించాడు. అబూ బక్ర్ తండ్రి పేరు ఉస్మాన్ అబూ ఖహాఫ. ఇతనికే అబూ ఖహాఫ అని ముద్దు పేరు. తల్లి సల్మా ఉమ్-అల్-ఖైర్కి ఉమ్-ఉల్-ఖైర్ అనే ముద్దు పేరు ఉండేది. అబూ బక్ర్ కి పుట్టినపుడు పెట్టిన పేరు అబ్దుల్ ఖాబా'(ఖాబా సేవకుడు అని అర్థం) అతను 610లో ఇస్లాం లోనికి మారినపుడు 'అబ్దుల్లా' (అల్లాహ్ సేవకుడు అని అర్థం)గా మారింది. తన ఇబ్న్ సాద్ అల్ బగ్దాది నివేదికలో సుయూతి అబూ బక్ర్ గురించి ఇలా వివరిస్తారు :

అతను చక్కని మేని ఛాయకలిగి, సన్నగా చిక్కినపోయి, పలుచని గడ్డంతో, వంగిపోయిన ఆకృతితో, లోతుకుపోయిన కన్నులు పొడుచుకువచ్చిన నుదురు, వెండ్రుకలు లేని చేతివేళ్ళతో ఉండేవాడు.

అతను అన్ని విధాలా అందమైనవాడు, ఆ అందంతోనే ఆతిఖ్ అనే ముద్దుపేరును సంపాదించుకున్నాడు. అతను ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తన బాల్యపు తొలిభాగాన్ని ఆ రోజుల్లోని తక్కిన అరబ్బు పిల్లలలాగనే బదూయిన్ అని తమను తాము పిలుచుకునే అహ్ల్-ఇ-బా'ఈర్ (ఒంటె జనం)తో గడపటంవల్ల ఒంటెలంటే ఒక విధమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు.

పసిసంవత్సరాలలో ఒంటెపిల్లలతోను మేకలతోను ఆడుతూ వాటిపట్ల అతడు చూపించిన ప్రేమవల్ల అతనికి అబూ బక్ర్- ఒంటెపిల్లల పిత అనే ముద్దుపేరు సంపాదించిపెట్టింది.[1] చిన్నతనం నుంచి కూడా అతను ఎప్పుడూ విగ్రహారాధన చేయలేదని చెబుతారు. అబూబక్ర్ కు పదేళ్ళ వయసున్నపుడు తండ్రితో కలసి వ్యాపారస్తుల కారవాన్తో సిరియా వెళ్ళాడు. ఈ కారవాన్ తో అప్పటికి పన్నెండేళ్ళవాడైన ముహమ్మద్(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) కూడా ఉన్నారు. తక్కిన అరబ్బు పిల్లలవలె అతను కూడా చదువురానివాడే కాని అరబ్బు కవిత్వం అంటే ఇష్టాన్ని పెంచుకుని ఉన్నాడు. 'ఉకజ్' అనే ప్రతి ఏడూ జరిగే జాతరకు హాజరయి, కవిసమ్మేళనాల్లో పాల్గొనేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేదతనికి. 591లో పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో అబూబక్ర్ వ్యాపారంలోకి దిగి తన కుటుంబ వృత్తియైన బట్టల వ్యాపారం మొదలుపెట్టేడు. తరువాతి సంవత్సరాలలో అబూబక్ర్ కారవాన్లతో విధృతంగా పర్యటింఛాడు. వ్యాపారప్రయాణాలు అతనిని యెమన్, సిరియాలాంటీ చాలా ప్రాంతాలకి తీసుకునిపోయేయి. ఈ యాత్రలు అతనికి సంపదలను తెచ్చిపెట్టి, అనుభవాన్ని పెంచేయి. వ్యాపారం వృద్ధి చెంది, సాంఘిక శ్రేణుల్లో అతను ప్రముఖునిగా ఎదిగాడు. అతని తండ్రి ఉస్మాన్ అబూ ఖహాఫ జీవితకాలంలోనే, అబూబక్ర్ తన తెగకు ముఖ్యునిగా గుర్తించబడ్డాడు. హత్య సంఘటనల్లో బ్లడ్ మనీ ప్రకటించే బాధ్యత అబూబక్ర్ కు ఇవ్వబడింది. అతని కార్యాలయం ఒక గౌరవ న్యాయమూర్తి కార్యాలయంలాగా ఉండేది.[2] మనుషుల వంశ చరిత్రల పరిజ్ఞానం విషయంలో అబూబక్ర్ ది అందెవేసిన చెయ్యి కావటంవల్ల మక్కాలో ఏ వ్యక్తి ఎవరో వారి తాతలూ తండ్రులూ ఎవరో చాలా వివరంగా తెలిసి ఉండేవాడు.

మహమ్మద్ ప్రవక్త జీవన కాలంలో

మార్చు

మహమ్మదు ( శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) పెళ్ళి ఖదీజా (ఖతీజా) తో జరిగిన పిదప, ఖదీజా ఇంటిలోనే మహమ్మద్(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) నివాసం ఏర్పరచుకొంటారు. వీరి నివాసం ప్రక్కనే అబూబక్ర్ నివాసం. మహమ్మద్, అబూబక్ర్ పొరుగువారై మంచి మిత్రులౌతారు. వీరిరువురూ సమాన వయస్కులు, మంచివర్తకులూనూ. అబూబక్ర్ ఇల్లు హుందాగలిగిన రెండస్తుల మేడ.

ఇస్లాం స్వీకరణ

మార్చు

యెమెన్ నుంచి ఒక వ్యాపార యాత్రనుంచి తిరిగి వచ్చాక, తను లేనపుడు ముహమ్మద్ (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) తనని తాను దేవుని ప్రవక్తగా ప్రకటించుకుని, ఒక కొత్త మతాన్ని స్థాపించాడని అతనికి తన స్నేహితులద్వారా తెలిసింది. అబు బక్ర్ ఇస్లాంకు మారాడు.[3] ఇస్లాం స్వీకరించిన నాలుగవ వ్యక్తి, ముస్లింగా మారిన ముహమ్మద్ (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) కాని మొదటివ్యక్తి కూడా అతనే. అబూబక్ర్ ఒక ధనిక వ్యాపారియే కాక

నేను ఎవరికైన ఇస్లాంను ఇచ్చినపుడుల్లా, ఆ వ్యక్తి కొంత విముఖతను, సంశయాన్ని చూపి వాదనకు దిగాలని చూసేవాడు.[4] అలాంటి విముఖత, సంశయము లేకుండా, వాదన అనేదే లేకుండా ఇస్లాంను అంగీకరించిన కొద్దివ్యక్తులలో అబూబక్ర్ ఒకరు.

ఇస్లాం స్వీకరణ తరువాయి

మార్చు

ఇతని పుట్టుకపేరు అబ్దుల్ కాబా, ఇది పాగనుల సంస్కృతికి చిహ్నమని భావించి తనపేరును అబ్దుల్లాగా మార్చుకున్నాడు. ఇతని భార్య ఖుతైలా బిన్తె-అబ్దుల్ ఉజ్జా ఇస్లాంను స్వీకరించలేదు, కావున ఆమెను విడాకులిచ్చాడు. రెండవ భార్య ఉమ్మ్ రూమాన్ భర్త అబూబక్ర్ సూచనమేరకు ఇస్లాం స్వీకరించింది. అబూబక్ర్ కుమారులందరూ ఇస్లాం స్వీకరించారు ఒక్క అబ్ద్ అర్-రహ్మాన్ తప్పించి. అబూబక్ర్ ఇతన్ని తన నుండి వేరుచేశాడు. అబూబక్ర్ యొక్క కృషివలన ఎందరో ఇస్లాంను స్వీకరించారు. ఇతను తన మిత్రులందరినీ ఇస్లాం స్వీకరించమని ఆహ్వానించాడు.[5] ఇతడి ప్రేరణవలన ఎందరోతనమిత్రులు ఇస్లాంను స్వీకరించారు. వీరిలో కొందరి పేర్లు ఉదహరించబడ్డవి:

  • ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (3వ ఖలీఫాగా ఎన్నుకోబడ్డాడు)
  • అల్-జుబేర్
  • తల్హా
  • అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్ (రాషిదూన్ సామ్రాజ్యంలో ముఖ్యమైన వాడుగా పరిగణింపబడ్డాడు.)
  • సాద్ ఇబ్న్ వఖ్ఖాస్
  • ఉమర్ ఇబ్న్ మసౌన్
  • అబూ ఉబైదా ఇబ్న్ అల్-జర్రాహ్ (సిరియాలోని రాషిదూన్ సైన్యంలో కమాండర్ గావున్నాడు)
  • అబ్దుల్లా బి అబ్దుల్ అసద్
  • అబూ సల్మా
  • ఖాలిద్ ఇబ్న్ సాద్
  • అబూ హుజైఫా ఇబ్న్ అల్ ముఘీరా

అబూబక్ర్ ఇస్లాంను స్వీకరణ ఒక మైలురాయి. మక్కాలో బానిసత్వం సర్వసాధారణం, చాలామది బానిసలు ఇస్లాంను స్వీకరించారు. ఒక సాధారణ స్వతంత్రమనిషి ఇస్లాంను స్వీకరిస్తే, బయట ఎన్ని అవాంతరాలు ఎదురైననూ, తనజాతివారుకాపాడేవారు. కాని బానిసలకు కాపాడువారు ఎవరూ లేరు, శిక్షలు మాత్రం మెండు. దీనిని గుర్తించిన అబూబక్ర్, బానిసలను కొని మరీ స్వతంత్రులను చేయడం ప్రారంభించారు. ఇలా క్రింది ఎనిమిది మందిని కొని బానిసత్వంనుండి విముక్తుల్ని చేశాడు. ఇందులో నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలు గలరు.

పురుషులు :

  • బిలాల్
  • అబూ ఫకీహ్
  • అమ్మార్ ఇబ్న్ యాసిర్
  • అబూ ఫుహార్యా

స్త్రీలు :

  • లుబైనా
  • అల్-నహ్దియా
  • ఉమ్మ్ ఉబైస్
  • హారిసా బిన్ తె అల్-ముఅమ్మిల్.

పెక్కుమంది బానిసలను అబూబక్ర్ విముక్తి గావించాడు, అందు స్త్రీలూ పురుషులూ గలరు.[6] అబూబక్ర్ తండ్రి ఒకసారి అబూబక్ర్ ను ప్రశ్నించాడు "నీవెందుకు బలిష్ఠులైన యువక బానిసలకు విముక్తుల్ని చేయడంలేదు, వారు నీకు శక్తిగా వుంటారుగదా"యని, జవాబుగా అబూబక్ర్ "నేను నాశక్తికొరకు బానిసలను విముక్తిచేయడంలేదు, నేను అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తున్నాను" అన్నాడు. దీనిననుసరించే క్రింది ఖురాన్ సూక్తులు వెలువడ్డాయని ముస్లింలు భావిస్తారు:

ఎవడైతే అల్లాహ్ దారిలో దాన ధర్మాలు చేస్తాడో , అల్లాహ్ కు భయపడివుంటాడొ, మంచికార్యాలు సత్యమైనవని భావిస్తాడో, అతడికి సుళువైనదారులను ప్రసాదిస్తాము. (92:5-7).

ఎవడైతే తన ధనాన్ని స్వీయ ప్రక్షాళనకొరకు, ఎలాంటి ఆపేక్ష లేకుండా, కేవలం అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడానికి మాత్రమే ఖర్చుచేస్తాడో, అతడు తప్పక దగ్గరలోనే సంపూర్ణంగా సంతుష్టుడౌతాడు.(92:8-21).

ఖురేష్ చే వేధింపులు

మార్చు

ఇస్లాం అవతరణకు మూడు సంవత్సరాల వరకు, ముస్లిములు తమ విశ్వాసాన్ని రహస్యంగానే ఉంచి, రహస్యంగా ప్రార్థనలు జరిపారు. 613లో ముహమ్మద్(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) కు ఇస్లాంలోకి ప్రజలను బహిరంగంగా పిలవాలని ఆలోచన ఉదయించింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను అందించేందుకు ప్రజలను ఆహ్వానిస్తూ మొట్టమొదటి బహిరంగ ఉపన్యాసము అబూబక్ర్ చే ఇవ్వబడింది. ఖురైష్ ఆటవికతెగకు చెందిన కొందరు యువకులు అబూబక్ర్ పై దాడిచేసి, అతను స్పృహతప్పేవరకు నిర్దాక్షిణ్యంగా కొట్టారు.[7] ఈ సంఘటన తరువాత అబూబక్ర్ తల్లి ఇస్లాంకు మారిపోయారు. అబూబక్ర్ ను అనేకసార్లు ఖురైషీయులు వేధించారు

మక్కాలో ఆఖరి సంవత్సరాలు

మార్చు

ఖురేషులు 617 లో బనూ హాషిం లపై నిషేధాజ్ఞలు విధించారు. ప్రవక్త (సల్లం) గారి మాట పై కొందరు సహబిలు మక్కాను వీడారు. కొందరు ఇథియోపియాకు వలస వెళ్ళారు. అబూబక్ర్ కూడా ముందు యెమన్ వెళ్ళాడు, తరువాత అబిసీనియా ఇలా వెళ్ళి తిరిగి మక్కాకు చేరాడు. ప్రవక్త ముహమ్మద్ (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) గారితో మక్కానుండి మదీనాకు వలసవెళ్ళాడు.

మదీనా కు ప్రవాసము

మార్చు

622లో మదీనా ముస్లిముల ఆహ్వానము మేరకు, మదీనాకు వలసపొమ్మని ప్రవక్తగారు ముస్లిములను ఆదేశించెను. జట్లలో ఈ వలస మొదలయ్యింది. ఈ మదీనా వలసలో అబూబక్ర్ ప్రవక్త ముహమ్మద్(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) గారిని అనుసరించినారు. ఖురేష్ అపాయం ఉండటం వల్ల, మదీనాకు వారు రహదారిని అనుసరించలేదు. వ్యతిరేక దిశలో కదలి, మక్కాకు సుమారు ఐదు మైళ్ళ దూరాన ఉన్న సౌర్లోని ఒక గుహలో తలదాచుకున్నారు. ఖురేష్ యుక్తులను సంభాషణలను అబూబక్ర్ కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ అబి బక్ర్ విని, రాత్రులలో ఈ వార్తలను గుహలోని శరణార్థులకు చేరవేసేవాడు.[8] ఆమిర్ అనే అబూబక్ర్ సేవకుడు ఒకరు గొర్రెల మందను గుహ ద్వారం వద్దకు ప్రతి రాత్రి తీసుకువస్తే, వాటి నుంచి పాలు పితుకుకునేవారు. మరొక ప్రక్క అన్ని దిశలా ఖురేష్ తన శోధకగణాలను పంపింది. అందులో ఒక గుంపు ఈ గుహ ద్వారముకు దగ్గరకు వచ్చినప్పటికీ, వీరిని కనిపెట్టలేకపోయింది. దీని కారణంగానే ఖురాన్లోని ఈ క్రింది సూక్తులు చెప్పబడ్డాయి:

మీరు మీ నాయకుడికి సహాయం చెయ్యకపోతే (పోండి): అల్లాహ్ తప్పక సహాయం చేస్తాడు; ఎపుడైతే అవిశ్వాసులు ఇతడిని బహిష్కరిస్తారో: ఇతడికి ఒకడికంటే ఎక్కువ అనుచరులుండరు: గుహలో వారిద్దరేయుంటారు, అతను అనుచరునితో చెబుతాడు "భయపడకుము, అల్లాహ్ మనతో వున్నాడు": అపుడు అల్లాహ్ తన కరుణను అతనిపై పంపాడు,, అతనికి బలమును సమకూర్చాడు, ఇవి మీకు కానరావు, అవిస్వాసుల వచనాల మెడలను వంచేశాము. కాని అల్లాహ్ వాక్కులు ఉన్నతమైనవి: అల్లాహ్ అందరికంటే మహాబలుడు, జ్ఞాని (ఖురాన్ 9:40

గుహలో మూడు రోజులు మూడు రాత్రులు ఉన్నాక, మదీనా పరిసర ప్రాంతమైన ఖుబాలో కొంతసేపు గడిపి మదీనాకు సాగారు.

మదీనాలో జీవనం

మార్చు

మదీనాలో మహమ్మదు ప్రవక్త (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) ఒక మస్జిద్ను నిర్మింపతలపెట్టారు. దీని కొరకు ఒక స్థలాన్ని ప్రతిపాదింపగా దాని మూల్యాన్ని అబూబక్ర్ చెల్లించాడు. ముస్లింలందరూ కలసి మస్జిద్-ఎ-నబవి నిర్మించారు. ఈ నిర్మాణంలో అబూబక్ర్ కూడా పాలుపంచుకొన్నాడు. అబూబక్ర్ సహచరునిగా ఖారిజ్ బిన్ జైద్ అన్సారీని అప్పజెప్పారు. ఖారిజ్ తో సంబంధబాంధవ్యాలు చాలా చక్కగా సాగాయి. ఖారిజ్ తన కుమార్తె హబీబాను అబూబక్ర్ నిచ్చి వివాహంగావిస్తాడు.

మక్కాలో వాతావరణం పొడిగా వుండేది, మదీనాలో తడిగా వున్నందున మదీనాకొచ్చిన సహాబీలు చాలామంది అనారోగ్యం పాలయ్యారు. అబూబక్ర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. మక్కాలో అబూబక్ర్ బట్టలవ్యాపారి, మదీనాలో కూడా అదేవ్యాపారం కొనసాగించాడు. ఇతని వర్తకం చక్కగా అభివృద్ధి చెందింది. 623 లో అబూబక్ర్ తన కుమార్తె ఆయెషా సిద్దీఖాను మహమ్మదు ప్రవక్తతో వివాహం గావిస్తాడు. దీనితో అబూబక్ర్, మహమ్మదు ప్రవక్త మధ్య సంబంధం మరీ గాఢమౌతుండి.

624 లో ముసింలకు, ఖురేషులకు జరిగిన మొదటి యుధ్ధం బద్ర్ యుధ్ధంలో అబూబక్ర్ పాల్గొన్నాడు. 625 లో ఉహద్ యుధ్ధంలో పాల్గొన్నాడు. అబూబక్ర్ కుమారుడు అబ్దుల్ రహిమాన్ ఇస్లాంను స్వీకరించక ఖురేషీయుల పక్షాన యుధ్ధంచేస్తూ తండ్రితో సవాలు చేశాడు, అబూబక్ర్ దీన్ని స్వీకరించి యుధ్ధానికి సిధ్ధంకాగా మహమ్మదు ప్రవక్త (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) వద్దని వారిస్తారు. ఆ తరువాత ఇతను కూడా ఇస్లాంను స్వీకరిస్తాడు.

తరువాత 627 లో అబూబక్ర్ అగడ్త యుధ్ధం పాల్గొన్నాడు, తదనంతరం బనూ ఖురైజా యుధ్ధంలో కూడా పాల్గొన్నాడు.[9].628 లో ఇతను హుదైబియా సంధిలో పాల్గొన్నాడు. ఈసంధిలో ఒక సాక్షిగా కూడా పాల్గొన్నాడు.[9]

628 సం.లో ఖైబర్ యుధ్ధంలో కూడా పాల్గొన్నాడు. 629 లో మహమ్మదు ప్రవక్త (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) అమీర్ ఇబ్న్ అల్ ఆస్ ను జాత్ ఉల్ సల్లాసల్ కు, అబూ ఉబైదాహ్ ఇబ్న్ జర్రాహ్ ను తరువాత పంపారు. అబూబక్ర్, ఉమర్ను ఈ యుధ్ధానికి పంపారు కానీ ఓడిపోయారు. పిదప అలీని పంపగా ఆ యుధ్ధం గెలిచారు.[10]

630 లో ముస్లిం సైన్యం మక్కావైపు వెళ్ళినపుడు అబూబక్ర్ ఆసైన్యంలోనూ ఉన్నాడు. మక్కాపై విజయం తరువాత అబూబక్ర్ తండ్రియైన ఉస్మాన్ అబూ ఖహాఫా ఇస్లాం స్వీకరించాడు. 630 లో హునైన్ యుధ్ధం, తాయిఫ్ ముట్టడిలో పాల్గొన్నాడు. తబూక్ యుధ్ధం లోనూ ముస్లింసైనికులలో అబూబక్ర్ ఉన్నాడు. ఈ యుధ్ధ సన్నాహాలకొరకు అబూబక్ర్ తన యావదాస్తిని ధారపోశాడు.

631 లో, మహమ్మదు ప్రవక్త 300 మంది మదీనావాసులకు హజ్ కొరకు మక్కాకు పంపారు. వీరిలో అబూబక్ర్ వీరి నాయకుడిగా పాల్గొన్నాడు. ఈ విధంగా అబూబక్ర్ పేరు "అమీరుల్ హుజ్జాజ్"గా చరిత్రలో లిఖించబడింది. 632 లో "హజ్జతుల్ విదా" కొరకు ప్రవక్త ను అనుసరించాడు.

మహమ్మద్ ప్రవక్త మరణం

మార్చు

'హజ్జతుల్-విదా' నుండి తిరిగొచ్చిన తరువాత ప్రవక్తగారు అనారోగ్యం పాలయ్యారు. 8 జూన్ 632 నాడు ముహమ్మద్ ప్రవక్త (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) పరమదించారు. సుఖ్ ప్రాంతంలోని తన ఇంటిలో యున్న అబూబక్ర్ కు ఈసమాచారం అందింది. ముస్లింలందరూ మస్జిద్-ఎ-నబవి వద్ద గుమిగూడారు, మదీనా అంతటా విషాదఛాయలు కమ్ముకున్నాయి. చాలా మంది సహాబాలు ప్రవక్త మరణాన్ని నమ్మలేక పోయారు. అబూబక్ర్ మస్జిద్ కు వచ్చి ప్రజలవద్ద ఇలా ప్రసంగించాడు;

మీలో ఎవరైతే మహమ్మదు ప్రవక్తను (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) పూజించారో వారి కొరకు మహమ్మదు ప్రవక్త మరణించారు; మీలో ఎవరైతే అల్లాహ్ ను పూజించారో అల్లాహ్ వారి కొరకు జీవించి యున్నాడు, అల్లాహ్ కు ఎన్నటికీ మరణం లేదు.

అబూబక్ర్ క్రింది ఖురాన్ సూక్తులను వినిపించాడు:

మహమ్మద్ కేవలం అల్లాహ్ యొక్క వార్తాహరుడే, అల్లాహ్ యొక్క వార్తాహరుడు అతని ముందే మరణించాడు; అతను మరణించిననూ చంపబడిననూ ఏమౌతుంది? మీరు వెనుదిరుగుతారా? మీరు వెనుదిరిగి అల్లాహ్ కు ఏలాంటి నష్టం కలుగజేయలేరు, ఎవరైతే అల్లాహ్ కు ధన్యవాదాలర్పిస్తారో వారికి అల్లాహ్ తప్పక ప్రతిఫలాలిస్తాడు.

అబూబక్ర్ ఖలీఫాగా ఎన్నిక

మార్చు

ప్రవక్తగారి మరణం తరువాత ముహాజిర్లు, అన్సార్ మధ్య ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. ఉమ్మహ్ (ముస్లింల సమూహం) చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. అన్సార్ ల నాయకుడు తన తెగలను 'సఖీఫా' అనే పెద్ద హాలులో సమావేశపరచి, ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి? ఎవరికి మద్దతునివ్వాలి? అనేవిషయాలపై చర్చసాగించడం ప్రారంభించాడు. అబూబక్ర్ కు ఈ సమావేశం గూర్చి తెలిసింది. అబూబక్ర్, ఉమర్, ఉబైదా ఇబ్న్ జర్రాహ్, కొందరితో కలసి అన్సార్ నాయకునికి అతని అసంబద్ధమైన పనిని నివారించారు. ప్రముఖులందరూ సమావేశమయ్యారు. ముస్లింల కొత్త నాయకుడిని ఎన్నుకొనే చర్చ ప్రారంభమయింది. ఈ సమావేశంలో ఉమర్ తన నిర్ణయాన్ని తెలియజేశాడు "అబూబక్ర్" తమ నాయకుడని. అందరూ ఉమర్ యొక్క ప్రతిపాదనను నిర్ణయాన్ని హర్షంతో ఆమోదించారు.

సమావేశం ముగిసిన తరువాత, ఎవరైతే సమావేశానికి హాజరు కాలేదో వారిని అబూబక్ర్ను తమనాయకుడిగా ఎన్నుకొన్నామని దానికి తమ మద్దతునివ్వాలని కోరుతూ అందరి ఆమోదముద్రనూ పొందారు. షియా ముస్లింల ప్రకారం అలీకు అన్ని అర్హతలు గలవని అలీని నాయకునిగా చేయాలని కానీ ఇచ్చట గమనించవలసిన విషయం, అలీ కూడా తన మద్దతును అబూబక్ర్ కు చాటాడు.

ఖలీఫాగా పరిపాలన

మార్చు

ఖలీఫా పదవిని స్వీకరించి 27 నెలలకాలం పదవిలో ఉన్నాడు.

తన మొదటి ప్రసంగంలో ఇలా అన్నాడు;

నన్ను ఖలీఫాగా మీరు ఎన్నుకొన్నారు, నేను మీకంటే మిన్న యేమీ కాను. నేను మంచి చేస్తే, నన్ను సహాయం చేయండి; నేను చెడు చేస్తే, నన్ను సన్మార్గంలోకి తేండి. సత్యానికి గౌరవం అణకువ; అసత్యానికి గౌరవం ద్రోహం. మీలో అబలురు నాతో బలంగా వుంటే మీ హక్కులను నేను పటిష్టం చేయగలను, అల్లాహ్ దయదలిస్తే; మీలో బలవంతులు నాతో బలహీనంగా వుంటారు, ఇతరుల హక్కులను కాలరాస్తే మాత్రం, అల్లాహ్ దయదలిస్తే. నేను అల్లాహ్ కు అతని ప్రవక్తకు విధేయుడిగా ఉన్నంతకాలం, మీరు నాకు విధేయులుగా వుండండి. ఒకవేళ నేను అల్లాహ్ కు అతని ప్రవక్తకూ అవిధేయుడిగా వుంటే, నాకు విధేయత ప్రకటించకండి. ప్రార్థనల కొరకు లేవండి, అల్లాహ్ మీమీద దయదలుస్తాడు.

అరేబియాలోని అనేక తెగలు తిరుగుబాటు చేశాయి, అబుబక్ర్ ఈ తిరుగుబాట్లన్నీ రిద్దా యుద్ధాలతో అత్యంత సమర్థనీయంగా అణచివేశాడు. ససానిద్ సామ్రాజ్యం, బైజాంటియన్ సామ్రాజ్యం, తూర్పురోమన్ సామ్రాజ్యాలను జయించాడు. ఇస్లామీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. షరియా సూత్రాలను తూ.చా. పాటించాడు.

ఖురాన్ ను జాగ్రత్తపరచడము

మార్చు

అబూబక్ర్ ఖురాన్ లిఖితాలను గ్రంథరూపమిచ్చాడు. ఖురాన్ ను గ్రంథస్త పఠన చేయువారు చాలామందే ఉన్నారు. కాని వారు (సహబాలు) అనేక యుధ్ధాలలో మరణించడం చూసి, ఖురాన్ ను ఒక గ్రంథరూపాన్నివ్వడానికి సమాయత్తమయ్యాడు. సహాబాలు (ప్రవక్త వారి శిష్యుల) దగ్గరనుండి ఖురాన్ సూక్తులను, సూరాలను, క్రోడీకరించి గ్రంథరూపమిచ్చారు. మరణానికి ముందు అబూబక్ర్, అధికారికమైన ఒక 'ఖురాన్ గ్రంథం' ప్రతిని ఉమర్ కిచ్చాడు.[11]

సైన్యాన్ని పెంచడం

మార్చు

ఇస్లామీయ సామ్రాజ్య విస్తరణను దృష్టిలో వుంచుకొని సైన్యాన్ని, సైన్య బలగాలను పెంచాడు. అబూబక్ర్ ఇస్లామీయ రాజ్యవిస్తరణను ఇరాక్తో ప్రారంభించాడు. ససానిద్ సామ్రాజ్యాన్ని జయించడానికి అత్యంత సమర్థుడైన ఖాలిద్ బిన్ వలీద్ను పంపాడు.

ససానిదుల పర్షియాపై యుద్ధం

మార్చు

రిద్దా యుధ్ధాల తరువాత ససానిద్ సామ్రాజ్యంపై విజయం సాధించాడు. రాషిదూన్ సామ్రాజ్యం ఆ విధంగా విస్తరించింది.[12]

తూర్పు రోమన్ సామ్రాజ్యం (బైజాంటియన్) పై యుద్ధం

మార్చు

ససానిద్, ఇరాక్ లపై విజయాల పరంపర కొనసాగించిన ఖాలిద్ బిన్ వలీద్ ను ప్రశంసిస్తూ అబూబక్ర్ బైజాంటియన్ పై సైన్యాన్ని పంపాడు. ఖాలిద్ బిన్ వలీద్ ఈ బాధ్యతను భుజాన్ వేసుకొని ఆపనినీ చేసిపెట్టాడు.

ఆగస్టు 8, 634, అబూబక్ర్ అనారోగ్యం పాలయ్యారు. తరువాత కోలుకోలేదు. .[13]

తన తరువాయి ఖలీఫాగా 'ఉమర్' ను అందరి అభిప్రాయాలను తీసుకొని నియమించాడు. ఆగస్టు 23,634 న స్వర్గస్తులైనారు. ఇతని భౌతికకాయ ప్రార్థనలు (నమాజ్-ఎ-జనాజ) ఉమర్ జరిపించారు. ఇతని భౌతికకాయాన్ని మహమ్మద్ ప్రవక్త (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) సమాధి ప్రక్కనే మస్జిద్-ఎ-నబవిలో ఖననం చేశారు.

కుటుంబం

మార్చు

అబూబక్ర్ తండ్రి పేరు ఉస్మాన్ బిన్ ఖహాఫా, తల్లి సల్మా ఉమ్మల్-ఖైర్, తాతా అమీర్ ఇబ్న్ అమ్ర్.

చరిత్రలో అబూబక్ర్ ఒకే తమ్ముడి గూర్చి వర్ణింపబడింది అతని పేరు ఖహాఫా బిన్ ఉస్మాన్.

  • తన పత్ని "ఖుతైలా బిన్తె అబ్దుల్-ఉజ్జా"తో ఒక కుమార్తె అస్మా బిన్తె అబీ బక్ర్, కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ అబీ బక్ర్, కలిగారు.
  • తన పత్ని "ఉమ్మ్ రూమాన్"తో ఒక కుమార్తె ఆయెషా, కుమారుడు అబ్దుల్ రహిమాన్ ఇబ్న్ అబీ బకర్, కలిగారు.
  • తన పత్ని "అస్మా బిన్తె ఉమైస్"తో ఒక కుమార్తె "ఉమ్మ్ ఎ కుల్సుమ్", ఒక కుమారుడు "ముహమ్మద్ ఇబ్న్ అబీ బక్ర్" జన్మించారు.
  • తన పత్ని "హబీబా బిన్తె ఖారిజా"తో ఒక కుమారుడు "ఖాసిమ్ ఇబ్న్ అబూ బక్ర్" జన్మించాడు.

నేటికినీ అబూబక్ర్ సంతానం ఎందరో ఉన్నారు. వీరి పేరు ప్రక్కన "సిద్దీఖీ" చేరి యుంటుంది.

చరిత్రకారుల అభిప్రాయాలు

మార్చు

ఇతడి ఔన్నత్యము మరియ ధీరత్వము ఒక క్రొత్త మతానికి జీవంపోసింది,[14] స్వాగత నిర్వచనాన్ని ఉదహరించింది.

  • విలియమ్ మూఇర్ ఇలావ్రాస్తాడు :

అబూబక్ర్ న్యాయం చాలా ధృడంగానూ నిష్పక్షపాతంగానూ వుంటుంది; అతని సమావేశాలూ అందరికీ ఆమోదయోగ్యాలు, అందుకే అతని పేరు నగరంలోనే ప్రముఖం. మహమ్మదు ప్రవక్త పట్ల అబూబక్ర్ విధేయత అచంచలమైనది, ఆవిధేయత జీవితాంతమూ ఉండినది.[15] అబూబక్ర్ లాంటి సహచరుడు వుండడం మహమ్మదు ప్రవక్తకు ఒక ధనాత్మక అడుగు.

  • విలియమ్ మాంట్ గామరి వాట్ ఇలా వ్రాస్తాడు :

622 నుండి 632 వరకు అబూబక్ర్, మహమ్మదు ప్రవక్త యొక్క ముఖ్యమైన సలహాదారు, కానీ ప్రజలలో అంతగా పరిచయంలేని వాడు. 631 లో జరిగిన తీర్థయాత్రలోనూ, మహమ్మదు ప్రవక్త అనారోగ్యంగా వున్నప్పుడు జరిగిన సామూహిక ప్రార్థనలలోనూ మాత్రమే పాల్గొన్నాడు.[16]


మూలాలు

మార్చు
  1. War and Peace in the Law of Islam by Majid Khadduri. Translated by Muhammad Yaqub Khan Published 1951 Ahmadiyyah Anjuman Ishaat Islam. Original from the University of Michigan. Digitized 23 October 2006
  2. The Middle East Journal by the Middle East Institute, Washington, D.C., published 1991
  3. M. Th. Houtsma et al., eds., E.J. Brill's first Encyclopaedia of Islam, 1913-1936, Leiden: E. J. Brill, 8 vols. with Supplement (vol. 9), 1991. ISBN 90-04-09796-1
  4. Sirah ibn Hasham vol:1 page 98
  5. Merriam-Webster's Encyclopedia of World Religions by Wendy Doniger ISBN 978-0-87779-044-0
  6. The Mohammedan Dynasties: Chronological and Genealogical Tables with Historical Introductions (1894) by Stanley Lane-Poole, published by Adamant Media Corporation ISBN 978-1-4021-6666-2
  7. Abu Bakr by Atta Mohy-ud-Din, published 1968 S. Chand Original from the University of Michigan, digitized 6 Jan 2006, ASIN B0006FFA0O.
  8. Islamic Culture by the Islamic Cultural Board Published 1927 [s.n. Original from the University of Michigan, digitized 27 Mar 2006.
  9. 9.0 9.1 Tabqat ibn al-Saad book of Maghazi, page no:62
  10. Sahih-al-Bhukari book of Maghazi ,Ghazwa Saif-al-Jara
  11. "The Quran compiled by Imam Ali (AS)". Al-Islam.org. Retrieved 2007-01-12.
  12. Tabari: Vol. 2, p. 554.
  13. Sidiq-i-Akbar Hazrat Abu Bakr by Masudul Hasan. Publisher: Lahore: Ferozsons, 1976.OCLC: 3478821
  14. Decline and Fall of the Roman Empire
  15. Life of Muhammad
  16. Encyclopedia Britannia, Vol. I, page 54, 1973

ఇవీ చూడుము

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అబూబక్ర్&oldid=3898798" నుండి వెలికితీశారు