బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం 2010, అక్టోబరు 29న విడుదలైన తెలుగు చలన చిత్రం. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్, లక్కీ మీడియా పతాకంపై[2] రూపేష్ డి గోహిల్, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో గొల్లపాటి నాగేశ్వరరావు[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శివాజీ, కల్యాణి, ఆర్తి అగర్వాల్, సోనియా దీప్తి[4] తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది.[5][6] ఈ చిత్రం యమలోక్ అనే పేరుతో హిందీలోకి అనువాదమయింది
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం | |
---|---|
![]() బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | గొల్లపాటి నాగేశ్వరరావు |
రచన | గొల్లపాటి నాగేశ్వరరావు |
నిర్మాత | రూపేష్ డి గోహిల్ బెక్కెం వేణుగోపాల్ |
తారాగణం | రాజేంద్రప్రసాద్, శివాజీ కల్యాణి ఆర్తి అగర్వాల్ సోనియా దీప్తి |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థలు | యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ లక్కీ మీడియా |
విడుదల తేదీ | 2010 అక్టోబరు 29[1] |
సినిమా నిడివి | 158 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
బ్రహ్మా (రాజేంద్ర ప్రసాద్), భార్య సరస్వతి (కళ్యాణి)తో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వివాహం చేసుకున్న తక్షణమే ఆమె చనిపోతుందని విధిని తప్పుగా వ్రాస్తాడు. బ్యాచిలర్ అయిన సీను (శివాజీ) డిగ్రీ పూర్తిచేస్తే ఎవరైనా అమ్మాయిని ప్రేమించవచ్చిన ఆశతో కాలేజీలో చేరుతాడు. కాలేజీలో శ్వేత (సోనియా)ను చూసి, ఆమెను ఇష్టపడతాడు. దాంతో శ్వేత అన్న జాక్సన్ (రఘుబాబు) వచ్చి సీనుకు వార్నింగ్ ఇస్తాడు. శీను స్నేహితుతు శోభన్ బాబు (వేణుమాధవ్) ఒక సోమరి, అడవిలోని కొంతమంది సాధువుల సలహా మేరకు బ్రహ్మ కోసం ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. బ్రహ్మ కూడా శోభన్ బాబు తపస్సుతో సంతోషించి ప్రత్యక్షమై ఒక విచిత్రమైన వరం ఇస్తాడు. బ్రహ్మ శోభన్ బాబుకు 'కలశం' ఇచ్చి, దానిలో ఉన్న పాలు తాగితే భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చని చెపుతాడు. జాక్సన్ చేతిలో గాయపడిన శీను కలశం ఉన్న అదే స్థలంలో పడతాడు. అనుకోకుండా అతను కలశంలోని పాలు తాగుతాడు. దాంతో శీను భవిష్యత్తు సంఘటనల గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. శోభన్ బాబు, సీను ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి భవిష్యత్తు చెప్పడం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఆ సమయంలో బ్రహ్మ రాసిని శ్వేత విధి కూడా వారికి తెలుస్తుంది. ఒక పాఠశాల బస్సు ప్రమాదంతో పడబోతుందని తెలుసుకున్న శీను ఆ ప్రమాదం నుండి పిల్లలను రక్షిస్తాడు. పాఠశాల పిల్లలు ఇంకా యమలోకం చేరుకోలేదని యమధర్మరాజు (జయ ప్రకాష్ రెడ్డి) తెలుసుకుని, బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మతో విషయాన్ని చెపుతాడు. తాను శోభన్‌కు ఇచ్చిన వరం వల్లనే ఇదంతా జరిగిందని బ్రహ్మ గ్రహించాడు. అతను యమ, చిత్రగుప్త (ఎవిఎస్) తో కలిసి తన వరం (కలశం)ను తిరిగి తీసుకోవడానికి భూలోకం వద్దకు వస్తాడు. ఆది పరశక్తి (లయ) దేవత వారికి కలశం తిరిగి పొందటానికి ఒక నెల గడువు మాత్రమే ఇస్తుంది. ఈ ముగ్గురూ భూలోకం వచ్చి ఇక్కడ ఏమి చేసారు, భూమిపై ఏమి జరిగిందో అన్నది మగతా కథ.
తారాగణంసవరించు
- రాజేంద్ర ప్రసాద్ (బ్రహ్మదేవుడు)
- సోనియా (శ్వేత)
- శివాజీ (నటుడు) (శీను)
- ఆర్తీ అగర్వాల్ (రంభ)
- వేణు మాధవ్ (శోభన్ బాబు)
- కళ్యాణి (సరస్వతి)
- లయ (ఆది పరాశక్తి)
- జయప్రకాశ్ రెడ్డి (యమధర్మరాజు)
- రఘుబాబు (జాక్సన్)
- ఏ.వి.ఎస్ (చిత్రగుప్తుడు)
- తెలంగాణ శకుంతల
- ఎం. ఎస్. నారాయణ
- సత్యం రాజేష్
- కొండవలస లక్ష్మణరావు (హం ఫట్ స్వామి)
- శివ ప్రసాద్
- శంకర్ మెల్కోటే
- జి. వి. సుధాకర్ నాయుడు
- రామచంద్ర
- చిత్రం శ్రీను
- గుండు సుదర్శన్
- తిరుపతి ప్రకాష్
- ఫిష్ వెంకట్
- సారిక రామచంద్రరావు
- అశోక్ కుమార్ (నారదుడు)
- జీవా
- ప్రగతి
- కౌష రచ్
- సునయన
- జ్యోతి
- గీతా సింగ్
- బండ జ్యోతి
సాంకేతిక సిబ్బందిసవరించు
- రచన, దర్శకత్వం: గొల్లపాటి నాగేశ్వరరావు
- నిర్మాత: రూపేష్ డి గోహిల్, బెక్కెం వేణుగోపాల్
- సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: వి. నాగిరెడ్డి
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్
- నిర్మాణ సంస్థ: యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్, లక్కీ మీడియా
పాటలుసవరించు
Untitled | |
---|---|
ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. చిత్రంలోని అన్ని పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాసాడు. మధుర ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7] జూబ్లిహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నాగఫణి శర్మ, దైవజ్ఞశర్మ, సినీ నటుగు అల్లరి నరేష్, వేణు మాధవ్, గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్, సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ, సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్, హీరో రామ్, అనుష్క, భూమిక దంపతులు, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు.[8]
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "నిను చూసి ఫ్లాటైపోయా" | హేమచంద్ర | 5:14 |
2. | "ఆడదాని ఊర చూపులో" | మనో, సాయి శివాని | 4:07 |
3. | "ఓ మనసా ఓ మనసా" | దీపు, శ్రావణ భార్గవి | 5:15 |
4. | "నాక్కొంచెం దూకుడెక్కువా" | కౌసల్య | 4:32 |
5. | "అమృతానికి" | ఎం.ఎం. శ్రీలేఖ | 3:24 |
6. | "బ్రహ్మలోకం" | శ్రీకాంత్ | 0:56 |
7. | "యమ శ్లోకం" | కోరస్ | 1:28 |
Total length: | 24:00 |
మూలాలుసవరించు
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Release Date)". Now Running.com. Archived from the original on 2020-07-27. Retrieved 2020-07-26.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Banner)". Gulte.com.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Direction)". 123 telugu.com.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Cast & Crew)". Know Your Films.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Music)". Indiaglitz.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Review)". The Cine Bay.
- ↑ "Brahmalokam To Yamalokam Via Bhulokam (Songs)". Raaga.
- ↑ తెలుగు వెబ్ దునియా, తెలుగు సినిమా. "బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో". www.telugu.webdunia.com. I Venkateswara Rao. Retrieved 27 July 2020.