ఆయిల్ పామ్

(ఆయిల్‌ పాం నుండి దారిమార్పు చెందింది)

ఆయిల్‌ పామ్ పామే కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలోనున్న వంటనూనెల్లొ, మిగతా నూనెలకన్న తక్కువ ధరలో, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనానికి అందుబాటులో వున్న వంటనూనె పామాయిల్. పామాయిల్‌ను ఆఫ్రికాలో 5 వేల సంవత్సరాల క్రితం నుండే వాడుచున్నట్లు తెలుస్తున్నది. అక్కడి స్థానికులు పామాయిల్‌ పళ్లను (Fruits) వేడి నీళ్లలో బాగా మరగించి, రోకళ్ళ వంటి వాటితో నలగ్గొట్టి, గుజ్జును పిండి నూనెను వడగట్టి తీసి వాడేవాళ్ళు. ఆయిల్‌పాంకు జన్మస్థానం దక్షిణాప్రికా లోని గునియాలోని వర్షాయుత, ఉష్ణమండల అరణ్యాలు.[1] 14-17 శతాబ్ది మధ్యకాలంలో అమెరికా ఖండానికి, అక్కడినుండి తూర్పుదేశాలకు వ్యాప్తి చెందినదని కొందరి వాదన. 1910 లో స్కాట్మెన్‌ విలియం సిమో అనే ఇంగ్లీష్‌ బ్యాంకరు ద్వారా మలేసియాకు తీసికెళ్లడం జరిగిందని, అక్కడినుండి ఇండోనేసియా, పశ్చిమ ఆసియా,, దక్షిణ అమెరికాకు వ్యాపించినదని మరి కొందరి వివరణ. కాని 1870 నాటికే మలేసియా తదితర దేశాలలో పామాయిల్ తోటల పెంపకం మొదలైనదని మరి కొందరి అంచనా. మలేసియా, ఇండోనేసియాలలో పామాయిల్‌ తోటల పెంపకం వలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఊహ కందనంతగా ఆభివృద్ది చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుచున్న పామాయిల్‌లో సగం శాతం ఈదేశాల పామాయిల్‌ ఉత్పత్తియే. అభివృద్ధి చెందితున్న దేశాలన్ని ఈరెండు దేశాల నుండియే అధికశాతం పామాయిల్‌ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఆయిల్ పామ్
African Oil Palm (Elaeis guineensis)
Scientific classification
Kingdom:
Family:
Subfamily:
Tribe:
Genus:
Elaeis

Species

Elaeis guineensis
Elaeis oleifera

పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నదేశాలు

మార్చు

పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాలు మలేసియా, ఇండోనేసియా, థాయ్ లాండ్, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, శ్రీలంక, పిలిప్పైన్, పాపువాన్యూగినియా, మెక్సికో, కోస్టారికా, పనామా, అమెరికా, ఇండియా, ఆఫ్రికా దేశాలు. భారత దేశ ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితమే, అప్పటికి దేశంలో సాగులో వున్న నూనె గింజల పంట విస్తీర్ణం, పెరుగుతున్న జనాభాను దృష్టిలో వుంచుకుని, భారతదేశంలో పామాయిల్‌ తోటల పెంపకానికి అనువైన వ్యవసాయ భూములను ఎంపిక చేసి, పామాయిల్‌ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టినది. భారతదేశ జనాభా కీ.శ. 2010 నాటికి 100 కోట్లు దాటింది.ఒక మనిషి సం//కు 18 కే.జి.ల ఆయిల్‌ను ఆహారంలో తీసుకున్నచో, సం//కు 180 లక్షల టన్నుల వంటనూనె అవసరం. భారతదేశంలో సం//కు ఆయిల్ సగటు ఉత్పత్తి 80-85 లక్షల టన్నులు మాత్రమే. అనగా సం//కు 100 లక్షల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. భారతదేశంలో ఆంధ్ర, గోవా, గుజరాత్‌, కర్నాటక, మిజోరాం, ఒడిషా, తమిళనాడు,, త్రిపుర లలో పామాయిల్‌ తోటల పెంపకం మొదలైనది. ఆంధ్రలో మలేసియా, ఇండోనేసియాల నుండి ముడి పామాయిల్‌ను (crude palm oil) దిగుమతి చేసుకుని రిపైండ్‌ ఆయిల్ గా చేయు రిఫైనరీలు కాకినాడ,, కృష్ణపట్నం వద్ద ఉన్నాయి.

ఆయిల్ పామ్‌ సాగు వివరాలు

మార్చు

ఆయిల్ పామ్‌చెట్టు, పళ్ళు

ఆయిల్‌పాం చెట్టు కొబ్బరి చెట్టువలె వుంటుంది. ఇది పామే (palme) కుటుంభానికి చెందిన మొక్క. పిల్లవేరు మండలం కలిగి, నిటారుగా పెరిగే, బలమైన కాండం కల్గి, కాండం చివర పత్ర విన్యాసం కలిగి వుండును. కొమ్మలుండవు. దేశిరకం చెట్టు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగును. సంకరజాతి (hybrid) చెట్టు 4-5 మీట్ల ఎత్తు మాత్రమే పెరుగును. ఎత్తు తక్కువగా వుండటం వలన పండిన పళ్లను కోత కొయ్యడం సులభంగా వుంటుంది. పామాయిల్‌ కమ్మ (ఆకు, పత్రం-Leaf) 3-5 మీట్ర్ల పొడవుండును. బలమైన మధ్యఈనెకు ఇరువైపుల సన్నని పచ్చని పత్రకాలుండును. పత్రకాల చివరలు మోనదేలి వుండును. యుక్త వయసు చెట్తు సం.కు 30 ఆకులు వేయును. పెరిగిన మధ్యవయసు చెట్టు సం.కు 20 ఆకులు (మట్టలు) వేయును. పూలు దట్టమైన గుత్తులు/గుఛ్ఛాలుగా పూచును. పూలు పరాగ సంపర్కం ద్వారా పండ్లగా మారుటకు 5-6 నెలలు పట్టును.

దస్త్రం:Oil palm-fruit bunch.jpg
ఆయిల్ పామ్ పండ్ల గెల

పండు పైభాగం (pericarp) నూనెకలిగిన గుజ్జు (pulp) భాగం, లోపలి భాగాన (endocarp) గట్టిపెంకు (shell) కలిగిన మెత్తటిగింజ/బీజం (Kernel) వుండును. కెర్నల్ (గింజ) లో కూడా ఆయిల్ వుండు ను. కాని కెర్నలులోని ఆయిల్‌ పామాయిల్‌ కన్న భిన్నమైనలక్షణాలు, ఫ్యాటిఆమ్లాలను కలిగి వుండును. పామ్‌కెర్నల్‌ఆయిల్, కొబ్బరినూనెకు దగ్గరి లక్షణాలు కల్గిఉంది.పక్వానికి వచ్చిన తాజా పళ్లగెల (Fresh fruit bunch) 20-30 కీ.జి ల బరువుండును. ఒక గెలలో సుమారు 1600-2000 పళ్ళుండును. పళ్ళు/ఫలాలు ఎర్రగా వుండి నేరెడు పండు పరిమాణంలో వుండును. పళ్లలో70-80 శాతం గుజ్జు (mesocarp/pulp) వుండును. ఈగుజ్జులో పామాయిల్‌ వుండి, మిగిలిన భాగంలో గట్టిపెంకు (shell) వున్న గింజ (kernel) వుండును, తేమ (moisture), పీచు పదార్థం (fibre) వుండును. ఆయిల్‌ పామ్‌లో పలు రకాలున్నాయి. ఎక్కువ ఆయిల్‌ దిగుబడి ఇచ్చేరకం టెనెరా (Tenera). టెనెరా ఒక సంకర వంగడం. డురా (dura), పెసిఫెర (pesifera) వంగడాలను సంకరంచేసి టెనెర సంకర వంగడం (Hybrid) ను సృష్టించారు. డురా రకం బాగా మందమైన పెంకుగల గింజను, తక్కువ గుజ్జును కల్గి వుండగా, పెసిఫెరలో పెంకులేని గింజ వుండును. ఈరెండింటి సంకర వంగడం టెనెరాలో గుజ్జు అధికంగా వుండి, పలుచని గట్టి పెంకు న్న గింజవుండును. గుజ్జుభాగంలోనే నూనె వుండును.

తోటల సాగు వివరాలు

పామ్‌ తోటల పెంపకానికి సం.కు 1800-2000 మి.మీ.వర్షపాతం వుండే ప్రాంతాలు అనుకూలం. సంవత్సరం మొత్తం అడప దడప వర్షం పడుచున్నచో చాలా మంచిది. నీటిని పీల్చుకుని, నిల్వ వుంచుకునే స్వభావం వున్న తేలికపాటి వ్యవసాయ భూములు సాగునకు అనుకూలం. నీటి సదుపాయం గల గరప, ఎర్రమట్టి, నల్లరేగడి భూములుసాగునకు అనుకూలం. మొక్కపాదులో నీరు ఎక్కువ నిల్వ వుండరాదు. నేల సమతలంగా వుండాలి. మొక్కపాదులో 3 అడుగుల లోతు వరకు గ్రావెల్, రాళ్ళు వుండరాదు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో నీటిసాగు సదుపాయం (irrigation) ద్వారా కూడా తోటల పెంపకం చెయ్యొచ్చును. బిందుసేద్యం (Drip irrigation) వలన 20% నీటిని ఆదా చెయ్యవచ్చును. మిగతా పంటలతో పొల్చిన పామాయిల్‌ పంటకు చీడ, పీడల (pests) దాడి తక్కువయే. మొక్క సంవత్సరానికి 1-2 అడుగుల ఎత్తు పెరుగును. 5 సం.ల. వరకు ఏడాదికి 30-35 మట్టలు (ఆకులు), ఆ తరువాత ఏడాదికి 20-25 మట్టలను వేయును. ఆడ, మగ పుష్పాలు ఒకే మొక్కకు పూయును. కాని వేరు వేరు పుష్పగుఛ్ఛాలుగా పూస్తాయి. ఆకు/మట్ట ఈనె మొదలులో పూలు పూయును. మగ పుష్పగుఛ్చంలో (male inflorecence) 700-1200 ల వరకు మగ పుష్పాలుండును. ఆడపుష్పగుఛ్చంలో పూలు వేల సంఖ్యలో వుండును. పరాగ సంపర్కం వలన పూలు పలధీకరణ చెందిన తరువాత పళ్ళు పక్వదశకు రావటానికి 5-6 నెలలు సమయం పడుతుంది. పళ్ళు ఫక్వదశకు వచ్చుటకు 2-4 వారాల ముందే పళ్లలో అధికశాతంలో నూనే ఏర్పడం జరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత గరిష్ఠ 29-33 డిగ్రీలు/సెంటిగ్రెడ్, కనీష్టం 18-24 డిగ్రీల సెంటిగ్రెడ్‌ వుండాలి. సరాసరి ఉష్ణోగ్రత 22-24 డిగ్రీల సెంటిగ్రెడ్‌ వుండాలి. ఉష్ణోగ్రత ఎక్కువ వున్న ప్రాంతాలలో కూడా సాగు చెయ్యొచ్చు. కాని పంట దిగుబడి తగినంతగా రాదు. సూర్యరశ్మి రోజుకు కనీసం 5 గంటలు ఆందేలా వుండాలి. భూమధ్యరేఖకు ఉత్తరదక్షిణంగా 8-12 డిగ్రీలలోపు ప్రాంతాలు పామాయిల్‌ తోటల పెంపకానికి ఆనుకూలం. మొక్కకు మొక్కకు మధ్య 3 మీటర్ల (త్రిభుజాకారంలో) ఎడం (దూరం) వుండేలా మొక్కలను నాటాలి. హెక్టరుకు పై విధంగా 143 మొక్కలను నాటవచ్చును. అనగా ఎకరానికి 58 మొక్కల వరకు నాటవచ్చును. 12-15 నెలలు వచ్చు వరకు మొక్కలను నర్సరిలో సంరక్షించి, ఆ తరువాత తోటలో పైన పెర్కొన్న పద్ధతిలో మొక్కని నాటాలి. నర్సరిలోని ఆరోగ్యకరమైన 8 నెలల మొక్కం. 8-1 మీతరు ఎత్తు వుండి, 5-8 మట్టలను కలిగి వుండును. మొక్కపాదు/ గుంట 3X3X3 అడుగుల వుండేలా త్రవ్వాలి. మొక్కను పాదుగుంటలో నాటిన తరువాత పాదులో సారవంతమైన మట్టి (soil), సేంద్రియ ఎరువు (manure) నింపాలి. వర్షాధార తోటలలో 5 సం//లనుండి, నీటిసాగు సదుపాయం గల తోటలలో 3 సం//లనుండి మొక్కపూతకు వచ్చును. పంట దిగుబడి 5 సం//లనుండి మొదలవ్వుతుంది. తగినంత వర్షపాతం లేనిచో మొక్క ఎదుగుదల సరిగా వుండదు. మొక్క గిడసబారి, ఆకులు ముడుచుకు పోవును. పూత సరిగా రాదు. పూత వచ్చినను త్వరగా రాలి పోవును. పూతరాలడం వలన పళ్ల దిగుబడి బాగా తగ్గిపొవును. కావున వర్షపాతం తగినంత లేక వర్షాభావస్దితి వచ్చినప్పుడు, తోటకు నీరు తప్పనిసరిగా ప్రత్యమ్నాయ పద్ధతిలో పెట్టవలెను. మొక్కల పాదువద్ద కలుపు మొక్కలు లేకుండగా జాగ్రత్త తీసుకోవాలి. ఎదిగిన మొక్కల పాదు చుట్టు 6 అడుగులు వ్యాసం వరకు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. పొడినేలలో ఎరువులు వెయ్యరాదు. కనీసం 150మి.మీ./నెలకు వర్షంపడిన తరువాత మాత్రమే ఎరువులను వాడలి. వర్షపాతం తక్కువ వున్న సమయంలో పంటను ఆశించు ఎలుకలు, గొంగళి పురుగులవంటి వాటినుండి మొక్కలను సంరక్షించవలెను. మొక్కల మొదల్లలోని ఎండిన ఆకుమట్టల్ను తొలగించాలి.

పళ్ళ దిగుబడి వివరాలు

మార్చు
గెల దిగుబడి 3-5 టన్నులు/హెక్టారుకు/సం.కు
చెట్టు జీవితకాలం* 25-50 సంవత్సరాలు
పళ్ళగెలలు/మొక్కకు 8-12 గెలలు/సం.కు
గెల బరువు 20-30 కిలోలు.
గెలలో పళ్ల సంఖ్య 1600-2000
పళ్ళ్లలోని గుజ్జు శాతం 50-70%
నూనె దిగుబడి శాతం 21-24%
గింజ (kernel) % 30%
పీచు పదార్థం (Fibre) 12-13%
పెంకు (shell) 6-8%
ఖాళిగెల 20-30%
  • 25 సంవస్తరాలతరువాత దిగుబడి తగ్గును, పాతచెట్లను కొట్టి వేసి కొత్తమొక్కలను నాటవలెను.

100కేజిల గెలనుండి 20 కేజిల పామాయిల్‌, 2 కేజిల కెర్నల్ ఆయిల్‌, 2 కేజిల కెర్నల్‌కేకు వచ్చును. ప్రపంచంలోని మొత్తం రకాల వంటనూనెల ఉత్పత్తి (దాదాపు 17 రకాలు) 140-150 మిలియన్‌ టన్నులు కాగా, అందులో పామాయిల్ ఉత్పత్తి 40-50 మిలియన్‌ టన్నులు. ఇందులో మలేసియా 18-20 మిలియన్ టన్నులు, ఇండోనేసియా 15-18 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేశాయి. 1976లో అన్నిరకాల వంటనూనెల ఉత్పత్తి 48 మిలియన్‌ టన్నులు కాగా, అందులో పామాయిల్‌, పాంకెర్నల్‌ ఆయిల్‌వాటా 3.5 మిలియన్‌ టన్నులు మాత్రమే. 2008 లో 160 మిలియను టన్నుల వంటనూనె ఉత్పత్తి చేయగా, అందులో పామాయిల్‌ వాటా 48 మిలియన్‌ టన్నులు. అనగా 30.52%.25 సంవత్సరాల కాలంలో పామాయిల్‌ ఉత్పత్తి, వినియోగం చాలా వేగంగా పెరిగింది. తవుడునూనె మినహ మిగతా అన్ని వంటనూనెలను నూనెగింజల నుండి (oilseeds) ఉత్పత్తి చెయ్యబడగా, పామాయిల్‌, ఆలివ్‌ నూనెలు మాత్రమే పళ్ళ గుజ్జు నుండి తీయబడుచున్నవి. హెక్టరుకు వచ్చేదిగుబడి, మిగత ఆయిల్‌ గింజల దిగుబడితో పోల్చిన పామాయిల్‌ దిగుబడి అధికం. హెక్టారుకు 3-5 టన్నుల పామాయిల్‌ గెలలు దిగుబడిరాగా, నూనెగింజల దిగుబడి 0.8-2 టన్నులు/హెక్టరుకు వుండును. సోయాబీన్‌ మాత్రం 2-2.25 టన్నులు/హేక్టరు దిగుబడి వచ్చును.నూనె గింజలు ఏక వార్షికాలు, పామాయిల్‌ మాతం బహువార్షికం. కనీసం 25-30 సంవత్సరాలు దిగుబడి పొందవచ్చును. పామాయిల్‌ కొలెస్ట్రాల్‌ రహిత (cholesterol free), ట్రాన్స్‌ఫ్యాటిఆసిడ్‌ లుప్త (Trans fatty acid free) నూనె కూడా.

పామాయిల్‌ తోటల పెంపకం

మార్చు

పామాయిల్‌ తోటల పెంపకమును మూడు రకములుగా విభజింప వచ్చును.

చిన్నతరహ వ్యవసాయక్షేత్రాలు:

2-10 హెక్టారులు (5-25 ఎకరాలు) వున్న పామాయిల్‌ తోటలను సాగుచెయ్యడం. చిన్నయంత్రాలతో లేదా సంప్రదాయ పద్ధతి (Traditional) లో పళ్ల నుండి నూనెను తీయడం, లేదా దగ్గర్లో వున్న అధునాతన మిల్‌కు పంపించెదరు. ఆప్రికాలో ఇలాంటి చిన్న వ్యవసాయ క్షేత్రలున్నాయి.

మధ్యతరహ వ్యవసాయ క్షేత్రాలు:

10-300 హెక్టారులలో (25-750 ఎకరాలు) తోటల పెంపకం జరుగును.ఈ క్షెత్రాలలో దిగుబడి అగు పళ్లనుండి నూనెను తీయుటకు కావసిన పరిశ్రమను స్వంతంగా కలిగి వుండును.లేదా మరేదైన పెద్ద ఆయిల్‌మిల్‌కు తమ దిగుబడిని అమ్మకం చేస్తారు

బారీ వ్యవసాయ క్షేత్రాలు:

500 హెక్టరులు (1200ఎకరాలు) అంతకు మించి పామాయిల్ తోటలను సాగుచెయ్యుదురు.వీరికి స్వంతంగా 'ఫ్రూట్‌బంఛ్‌'లనుండి నూనెను బారీ స్దాయిలో ఉత్పత్తి చెయ్యకలిగిన యంత్రాలున్న పరిశ్రమ (Industry) కలిగి వుండును,, ముడిపామాయిల్‌ (crude palm oil) ను శుద్ధికరించు పరిశ్రమ (Refinery) వుండును.ఈ రిఫైనరిలో క్రూడ్‌పామాయిల్‌లోని ఎఫ్.ఎఫ్.ఎ., గమ్స్, కలరును తొలగించి 'రెఫైండ్‌ఆయిల్'ను తయారు చేస్తారు.భారీ తరహ వ్యవసాయ క్షేత్రాలు ప్రభుత్వ ఆధీన సంస్దలఆధీనంలో కాని, కార్పొరెటరి సంస్దల నిర్వహణలో కాని వుండును.

ఆప్రికాలోని కొన్ని ప్రాంతాలలో చిన్న తరహ వ్యవసాయ క్షేత్రాలనుండి సంప్రదాయ పద్ధతిలో నూనెను తీయుదురు.రోజుకు 1-10టన్నుల ఫ్రెష్‌ఫ్రూట్‌బంచ్‌లను ప్రాసెస్‌చెయ్యగల యంత్రాలను (machinery) ఫ్రూట్‌ బంచ్‌ను స్టెరిలైసన్‌కు డ్రమ్‌స్టెరిలైజరు, డైజెస్ట్‌ చెయ్యుటకు, ఫ్రూట్స్‌నుండి ఆయిల్‌ఎక్స్‌ట్రాక్ట్‌చెయ్యుటకు హైడ్రాలిక్‌ప్రెస్‌ (hydraulic press) లను తయారు చెయ్యు పలు సంస్దలు ఆప్రికాలో ఉన్నాయి.ఈ విధంగా కుటీర లేదా లఘు పరిశ్రమ స్దాయిలో ఉత్పత్తి అయ్యిన పామాయిల్‌ఎర్రగా వుండటం వలన ఈ ఆయిల్‌ను'రెడ్‌పామాయిల్'ఆందురు.క్రూడ్ పామాయిల్‌లో వున్న కెరొటిన్స్‌ వలన పామాయిల్‌కు ఎర్ర/ఆరెంజి రంగు వచ్చింది. కెరొటిన్స్‌ అనేవి 'ప్రొ విటమిన్ A".అందుకే రెడ్‌పామాయిల్‌కు కూడా మార్కెటింగ్ ఉంది.

ముడిపామాయిల్‌ఉత్పత్తి

మార్చు

పక్వానికి వచ్చిన పళ్లలో 22-24% వరకు పామాయిల్‌ వుండును. ఫ్రూట్‌బంచ్‌ను మిల్లింగ్‌ చేసినప్పుడు 19-20% వరకు పామాయిల్‌ లభిస్తుంది.అయితే సరిగా పక్వానికి (rippen) పళ్లనుండి మాత్రమే తగిన రేషియాలో నూనె దిగుబడి లభిస్తుంది.ఫక్వానికి రాని ఫ్రూట్‌బంఛ్‌ను మిల్‌లో ప్రాసెస్‌చేసిన నూనె దిగుబడి తగ్గిపోతుంది.బాగా పండిపోయిన, మగ్గిపోయిన లేదా గెలను దింపునప్పుడు పళ్లభాగం దెబ్బతిన్నపళ్లనుండి తీయు నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల (F.F.A.) శాతం ఎక్కువుండి 'రిపైనింగ్" (Refining)చెయ్యునప్పుడు రిపైండ్‌ ఆయిల్‌ తక్కువ ఉత్పత్తవును. చెట్టుకు పళ్లగెల (Fresh fruit Bunch)వున్నప్పటి కన్న గెలను చెట్టునుండి వేరు చేసిన తరువాత F.F.A.చాలా వేగంగా పెరుగును.పామాయిల్‌ పళ్లగెల ఫక్వానికి వచ్చి, కోతకు సిద్ధమైనట్లు గుర్తించుటకు రెండు,మూడు పద్ధతులున్నాయి.కఛ్ఛితమైన పద్ధతి అంటూ ఏదిలేదు. ఆనుభవము మీదే తెలుస్తుంది.గెలనుండి 5-10 పళ్లు వదులుగా అయ్యి, రాలి క్రిందపడిన గెల కోతకు (harvesting)సిద్ధమైనట్లుగా నిర్ణయిస్తారు.అలాగే పళ్ళ రంగులో వచ్చిన తేడాను బట్టికూడ గెల కోతకు వ చ్చినది, లేనిది నిర్ణ యిస్తా రు. పండిన పళ్లగెలను వీలున్నంత త్వరగా చెట్తునుండి కోత కోసి ప్రాసెసింంగ్‌చేసి ఆయిల్‌ తీయనిచో,"హైడ్రొలిసిస్‌" (Hydrolysis) చర్యవలన పళ్లలోని పామాయిల్‌యొక్క ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం పెరిగిపోతుంది.అలాగే దెబ్బతిన్న పళ్లనుండి తీయు నూనెలో కూడా F.F.A.% పెరిగి పోతుంది.సరిగా ఫక్వానికి వచ్చిన పళ్లనుండి తీసిన నూనెలో F.F.A.శాతం 1.2-3.0% వరకు వుండును.ఫ్రీఫ్యాటి ఆమ్లాలనగానేమి?.ఆయిల్ అనేది ఫ్యాటి ఆమ్లాల, గ్లిసెరిన్ సమ్మేళనం వలన ఏర్పడును.మూడణువుల (Molecules) ఫ్యాటి ఆమ్లాలు, ఒక అణువు గ్లిసెరిన్ రసాయనిక సమ్మేళనం వలన ఒకాణువు ఆయిల్ మాలిక్యుల్‌, మూడు నీటి బిందువులు ఏర్పడును. నూనెలో వుండే 'లిపేజ్' (Lipase) అనే ఎంజైమ్‌, తగిన ఊష్ణొగ్రత, తేమ వున్నప్పుడు, ఆయిల్ను తిరిగి ఫ్యాటి ఆమ్లాలుగా, గ్లిసెరిన్‌గా వియోగం చెందించును. ఈ విధంగా ఏర్పడిన ఫ్యాటి ఆమ్లాలు, నూనెలో స్వేచ్ఛాయుయస్దితిలో వుండటం వలన 'స్వేఛాయుత ఫ్యాటిఆమ్లాలు' (free fatty acids) (F.F.A.) అంటారు.ఎక్కువ శాతంలో ఫ్రీఫ్యాటి ఆమ్లాలున్న నూనె నేరుగా (Direct) వంట నూనెగా పనికి రాదు.

పళ్ళగెలను కోసెటప్పుడు వీలున్నంత వరకు గెలలోని పళ్ళ ఉపరితల భాగం ఎక్కువ దెబ్బతినకుండగా కోత చెయ్యాలి.దెబ్బతగిలిన, పైపొర నలగిన పళ్లలో'లిపెజ్'చర్య వలన F.F.A.త్వరగా పెరుగుతుంది.కోతకు వచ్చిన తాజా పళ్లగెలలోని పళ్ల గుజ్జులోని నూనెలో F.F.A.:0.3-0.8% వుండును. పళ్ల గెలలను కోతయ్యిన వెంటనే ఆయిల్‌మిల్‌కు తరలించి, స్టెరిలైజసన్‌చేసిన2-3%F.F.A.వున్నఆయిల్‌ ఉత్పత్తి చెయ్య వచ్చు ను. స్టెరిలైజే సను ఆలస్యమైనను, సరిగా స్తెరిలైజసను చెయ్య కపోయిన, బాగాపండి, రాలి పడిన పళ్లనుండి తీయునూనెలో F.F.A.5% మించి వుండును.ఎక్కువ F.F.A.వున్న ఆయిల్‌ను రిఫైనింగ్ చెయ్యడం వలన ఎక్కువ శాతం నూనెను ఫ్యాటిఆమ్లాలుగా నష్టపోవల్సివుంది.ఆందుచే తక్కువ ఎఫ్.ఎఫ్.ఎ.వున్న క్రూడ్ పామాయిల్‌ ఉత్పత్తి అయ్యెలా తగుజాగ్రతలు తీసుకుందురు.పామాయిల్‌ పళ్లగెలనుంచి నూనెను తీయడం పలు దశలుగా జరుగును.ఆ దశలను దిగువన వివరంగా ఇవ్వడం ఇవ్వడమైనది.

1.పళ్లగెలలకోత (Harvesting or fruit bunch cutting)

2.స్టెరిలైజసను (sterilization)

3.డిబంచింగ్ లేదా ఫ్రూట్‌ స్ట్రిప్పింగ్ (Debunching or stripping)

4.డైజెసన్ (Digesation)

5.ఫ్రూట్‌ప్రెసింగ్ (Fruit pressing)

6.ఆయిల్‌డికెంటింగ్ లేదా క్లారిఫికెసన్ (oil decanting or clarification)

7.ఆయిల్‌డ్రైయింగ్ (oil drying)

పామాయిల్‌పళ్ల గెలల కోత

మార్చు

కోతకు సిద్ధమైన పళ్ళ గెలలను గుర్తించి, పళ్ళకు వీలున్నంత వరకు దెబ్బతగలకుండ కోయ్యాలి.పామాయిల్‌చెట్ల నుండి పండిన గెలలను కోయుటకు/కత్తరించుటకు అనుభవమున్న పనివారిని వినియోగించాలి.గెలలను కోయుటకు ప్రత్యేకమైన పనిముట్లను (Tools) వుపయోగిస్తారు.కోసిన తాజా పళ్ళగెలలను (fresh fruit bunch) వీలున్నంత త్వరగా ఆయిల్‌మిల్లుకు చేర్చవలెను.

స్టెరిలైజసన్(sterilization)

మార్చు

ఆయిల్‌ను 'హైడ్రొలిసిస్'చర్య వల్ల ఫ్యాటిఆమ్లాలుగా, గ్లిసరిన్‌ను విడగొట్టే 'లిపేజ్'ఆధిక ఉషోగ్రతలో నిర్వీర్యం (deactivate) అవుతుంది. అందుచే పామాయిల్‌ పళ్లగెలలను స్టీమ్‌ద్వారా కుకింగ్ చేసిన, పళ్ళలోని 'లిపేజ్' ను క్రియారహితం చేసి, ఆయిల్‌లో F.F.A.పెరగకుండ చెయ్యుటను స్టెరిలైజసన్ ఆందురు.స్టెరిలైజసన్ చెయ్యు వెసల్‌ను స్టెరిలైజరు (steriliser) లేదా స్టెరిలైజన్‌ రియాక్టరు (sterilization reactor) ఆందురు. ఈ రియాక్టరులు చిన్న ఆయిల్‌మిల్‌లో నిలువుగా (vertical, పెద్ద ఆయిల్ మిల్లులో క్షితిజ సమాంతరంగా (Horizontal), వర్తులాకారంగా (cylindrical) వుండును. రియాక్టరును 12-16 మి.మీ. మందమున్న మైల్డ్ స్టీల్ (mild steel) తో చెయ్యబడి, లోపల వైపున 4మి.మీ.మందమున్నS.S.ప్లెట్ లైనింగ్‌చెయ్యబడి వుండును.వెనుక భాగం మూసివుండి, ముందువైపున ఒక డొరు/మూత (lid) వుండును. మిల్లుకు వచ్చిన తాజా పళ్లగెలను చక్రాలుండి, రైలు పట్టాలపై కదిలే ట్రాలిల వంటి కేజెస్ (cages) నింపి, కేజ్‌లను రియాక్టరులో వుంచి, రియాక్టరు మూతను గట్టిగా బిగించెదరు. కేజెస్‌ను ఎమ్.ఎస్.లేదా ఎస్.ఎస్ తో చెయ్యబడి వుండును. కేజెస్ 2-3 టన్నుల పళ్లగెలలు వుంచగల సైజులో వుండును.రియాక్టరులు మిల్‌కెపాసిటిని బట్టి 3-9 కేజెస్‌ లను వుంచగల సైజులో వుండును.రియాక్టరు భయాట హీట్‌లాస్‌ను తగ్గించుటకై/నిరోధిం చుటకై మినరల్/గ్లాస్‌వూల్‌తో ఇన్సులెసన్‌ చెయ్యబడి వుండును. పామాయిల్ పళ్ల గెలలున్న కేజెస్‌లను రియాక్టరులో వుంచి ముందు వైపువున్న మూతను గట్టిగా బిగించెదరు.రియాక్టరులోని గాలిని తొలగించెదరు.లేనిచో 1200C డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గాలిలోని ఆక్సిజన్తో ఆయిల్‌ ఆక్సీకరణ చెందు అవకాశముంది.అందుచే ముండుగా రియాక్టరులోని గాలిని తొలగించి, ఆ తరువాత 2.2-3.0 కే.జి.ల ప్రెజరుతో స్టీం (నీటి ఆవిరి) ను యిచ్చిఫ్రూట్స్‌ను వేడి చెయ్యుదురు.ఇలా 45-60 నిమిషాలు స్టీమ్‌ యిచ్చి స్టెరిలైజసను చెయ్యుదురు.ఇలా స్టీము ద్వారా వేడి చెయ్యడం వలన ఫ్రూట్స్‌లోని'లిపెస్'క్రియ రహితం అగును. మిల్లు కెపాసిటిని బట్టిని ఒక సారి 10-25 టన్నుల వరకు ఫ్రూట్‌బంచ్‌ను స్టెరిలైజను చెయ్యునట్లు రియక్టరుల సైజు వుండును. స్టీము కుకింగ్ వలన పళ్ళగుజ్జు లోని తేమ (Moisture) ను ఆవిరిగా మార్చడం వలన కొంతమేరకు ఆయిల్ సెల్స్‌ విఛ్ఛన్నం కావడంవల్లన నూనె,కణాలనుండి నూనెను సంగ్రహించడం మరింత సులభతరం అవుతుంది.స్టెరిలైజన్‌పూర్తి అయ్యిన తరువాత, రియాక్టరుకు యిచ్చు స్టీమును ఆపివేసి, రియాక్టరు 'స్టీము వెంట్‌ వాల్వు' ను ఒపన్ చేసి రియాక్టరులో వున్న స్టీమును బయటకు వదలి వేయుదురు.ఆ తరువాత కేజెస్‌లను బయటకు తీసి డిబంచింగ్‌ సెక్షనుకు పంపెదరు.

డిబంచింగ్‌లేదా ఫ్రూట్‌ స్ట్రిప్పింగ్(Debunching or fruit stripping)

మార్చు

గెలల నుండి పళ్ళను వేరు చెయ్యు ప్రక్రియను ఫ్రూట్ స్ట్రిప్పింగ్ లేదా డిబంచింగ్ ఆందురు. పళ్ళను గెల మొదలు (calyx) నుండి వేరు చెయ్యుటకు చిన్న మిల్లులలో బీటరుఆర్మ్‌స్ట్రిప్పరు (beater arm stripper ) ద్వారాను, ఆధునాత మిల్లులలో రోటరి డ్రమ్‌స్ట్రిప్పరు (rotary drum stripper) ద్వారాను చెయ్యడం జరుగుతుంది.రోటరి డ్రమ్‌స్ట్రిప్పరు భూసమాంతరంగా, కొంచెంఏటవాలుగా అమర్చబడి వుండును.రోటరి డ్రమ్‌ చుట్టు పొడవున పామ్‌పళ్ళు మాత్రమే వెళ్ళెంత ఖాళి వుండెలా లోహ పట్టిలు (steel flats) అమర్చివుండును.లోపల కూడా నిలువు అక్షాంశంగా లోహపట్టిలు వుండును. రోటరి డ్రమ్‌ తిరుగుచున్నప్పుడు గెలలు పైకి లేచి పడెలా డ్రమ్‌ లోపలకొన్ని పట్టిలమర్చివుండును.ఈ డ్రమ్ కొంఛెం ఎటవాలుగా వుండును.ఈ రోటరి డ్రమ్‌తిరుతున్నప్పుడు, పళ్ళగెలలను డ్రమ్‌లో ఒవర్‌హెడ్ క్రేన్‌ సహాయంతో ఫిడ్ చెయ్యుదురు. డ్రమ్‌నెమ్మదిగా తిరగడం వలన, గెలలు డ్రము లోపల పైకి, క్రిందికి కదలటం వలన, పళ్ళు గెలనుండి వేరుపడి, లోహపట్టిల ఖాళిలనుండి క్రిందికిజారి, హపరులో (hopper) పడును. హపరులో కలెక్ట్‌అయ్యిన పళ్లు కన్వెయరు (conveyor) ద్వారా డైజెస్టెరు విభాగానికి వెళ్ళును. రోటరి డ్రమ్‌రెండో చివరకు చేరిన ఖాళి గెలలను బాయిలరు (Boiler) కు పంపెదరు.అక్కడ ఈ గెలను ఎండ బెట్టి, గెలలోని తేమ శాతం తగ్గిన పిమ్మట, బాయిలరులో ఇంధనం (fuel) గా నుపయోగిస్తారు.

డైజెసన్(digestion)

మార్చు

ఫ్రూట్‌స్ట్రిప్పరులో గెలలనుండి వేరు కాబడిన పళ్లను డైజెస్టరుకు పంపెదరు.ఇది నిలువుగా వుండి, లోపల మధ్యలో తిరుగు అజిటెటరు (agitator) వుండి పళ్లను కలియతిప్పును. డైజెస్టెరులో పళ్లను 90-1100C డిగ్రిల సెంటిగ్రెడ్‌ వరకు జాకెట్‌, ఒపన్‌స్టీము ద్వారా వేడిచేసి కుకింగ్ చెయ్యుదురు.డైజెస్టరులో అజిటెటరువలన పళ్ళు మెత్తగా నలగగొట్టబదును.గుజ్జు, కెర్నల్‌ వేరు పడును.పల్ప్‌లోని నూనె కణాలు విఛ్ఛేధింపబడతాయి.

""డైజెస్టరు"": వీటి కెపాసిటి 5-15 టన్నులు/గంటకు ఉత్పత్తి సామర్ద్యం వుండును.ఇవి నిలువుగా స్తూపాకారం (vertically cylindrical) గా వుండును.డైజెస్ట్రు షెల్ (shell) 10-12 మి.మీ. మందమున్న M.S.ప్లేట్ తో చెయ్యుదురు.లోపల 6-9 మి.మీ.మందమున్న కార్బను స్టీల్‌ లైనింగ్‌ వుండును.ఈ కార్బను స్టిల్‌ప్లేట్ లైనింగ్, డైజెస్టరు షెల్‌ప్లెట్‌ త్వరగా అరిగిపోకుండగా నిలువరించును. డైజెస్టరులో, దాని ప్రాసెసింగ్ కెపాసిటిని బట్టి, 1నుండి 4 కంపార్టుమెంట్స్ (లేదా చాంబరుస్) వుండును. కొన్ని డైజెస్టరులకు జాకెట్‌హీటింగ్ సదుపాయం వుండును. డైజెస్టరులో మధ్యగా, నిలువుగా అజిటెటరు షాప్టువుండి, దానిలి స్విపింగ్‌ ఆర్మ్స్ (sweeping arms) అమర్చబడి వుండును.ఫ్రూట్స్‌ఒక చాంబరులో కుకింగ్ అయ్యిన తరువాత మరో చాంబరుకు వెళ్ళెలా అమరిక వుండును.క్రింది, చివరి చాంబరులో కుకింగ్‌అయ్యిన ఫ్రూట్స్‌ స్రూప్రెస్ (screw press) కు వెళ్ళును. 1.3మీ. వ్యాసం, 4మీ.ఎత్తు వున్న డైజెస్టరులో13టన్నుల ఫ్రూట్స్‌ను కుకింగ్‌ చెయ్యవచ్చును.అజిటెటరురోటెసన్ భ్రమణాలు 20-25/నిమిషానికి,,30H.P మోటారు అవసరం.తక్కువ కెపాసిటి డైజెస్టరులో ఒక చాంబరు మాత్రమే వుండును.డైజెస్టరులోని స్వీపింగ్‌ ఆర్మ్స్‌అమరిక పళ్లను బాగా కలియ తిప్పెలా 35-40 డిగ్రీల కోణంలో బిగించెదరు. హేట్‌రెడియొసన్ వలన లాస్‌అవ్వకుండ షెల్‌బయట మినరల్/రాక్‌వూల్‌తో ఇన్సులెసను చెయ్యుదురు.

స్క్రూప్రెస్‌(screw press)

మార్చు

డైజెస్టరులో కుకింగ్ అయిన పళ్లను స్క్రూప్రెస్ కు పంపించెదరు. ఈ స్క్రూప్రెస్‌ చూడటానికి, నూనె గింజలనుండి నూనెను తీయు ఎక్స్‌పెల్లరును పోలి వుండును. స్క్రూప్రెస్‌కు నిరంతరం (contineously) ఫ్రూట్స్‌ ఫిడింగ్‌ చెయ్యుదురు. స్క్రూప్రెస్‌లో క్షితిజ సమాంతరంగా, వర్తులాకారంగా వున్న బారెల్ (barrel) వుండి, చిన్న ఖాలీవుండెలా స్టీలు పట్టిలు బిగించబడివుండును. ఈ బారెల్‌ రెండు సమభాగాలుగా వుండి బోల్టులతో దగ్గరికి చేర్చిబిగింపబడి వుండును. బారెల్ మధ్యలో హరిజంటల్‌గా ఒక వర్మ్‌షాప్ట్ వుండి దానికి మరల వంటి వర్మ్స్ (warms) వుండును. ఈ వర్మ్స్ ఫీడింగ్‌ హపరువద్ద చిన్నవిగా వుండి డిచార్జ్‌ వైపునకు వెళ్లే కొలది పెద్దవిగా వుండును. బారెల్‌లో షాప్టు తిరుచున్నప్పుడు ఈ వర్మ్స్ గుండా పామాయిల్ ఫ్రూట్స్ మెటెరియల్ వెళ్లుచున్నప్పుడు ఎక్కువ వత్తిడితో దగ్గరికి నొక్కబడి, పళ్లలోని నూనె, బారెల్‌ కున్న పట్టిల ఖాళిల గుండ బయటకు వచ్చును. బారెల్‌ పట్టీల ఖాళిగుండ నూనెతో పాటు పళ్లలోని నీరు నూనెతో కలసి ద్రవరూపంలో బయటకు వచ్చును. స్క్రూప్రెస్‌కు ఒక వైపునుండి డైజెస్ట్‌ చేసిన పామాయిల్‌ ఫ్రూట్స్‌ను ఫిడింగ్ యివ్వగా రెండో వైపు చివర నుండి, నూనెతీసిన ఫ్రూట్‌పల్ప్‌ ఫైబరు,, కెర్నల్‌నట్స్ (kernel nuts) కేకుగా బయటకు వచ్చును. ఈ స్క్రూప్రెస్‌ల ఉత్పత్తి సామర్ద్యం1-18 టన్నులు గంటకు వుండును.స్క్రూప్రెస్‌ నుండి బయటకు వచ్చు ఫైబరులో 5% వరకు నూనె మిగిలి వుండును. స్క్రూ ప్రెస్‌లో పిక్కలు (kernel nuts) ఎక్కువగా నలిగి పగిలి పోకుండచూడాలి.నట్స్ ఎక్కువ శాతంలో పగిలిన నట్స్‌లోని కెర్నల్‌ ఆయిల్, పామాయిల్‌లో కలిసిపొయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఉత్పత్తి సమర్ద్యంకై రెండు వర్మ్‌షాప్టు లున్న స్క్రూప్రెస్‌లను వుపయోగిస్తారు. స్క్రూప్రెస్ నుండి రెండు రకాల ఉత్పత్తులు వచ్చును. ఒకటి ద్రవరూపంలో వున్న నూనె, నీటి మిశ్రమం, రెందు ఘనరూపంలో వున్నపీచు (fibre), ఇసుక (sand), పిక్కలు (nuts). ద్రవభాగంలో 66% నూనె, 24% నీరు, 10% నూనెకాని యితర మలినాలు (impurities) వుండును.


క్రూడాయిల్‌ క్లారిఫికెసన్(oil clarification)

మార్చు

స్క్రూప్రెస్ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌ నుండి మొదటి దశలో వైబ్రెటరి స్క్రినరు (vibrator screener) నుపయోగించి క్రూడాయిల్‌లోని పీచు, ఇసుక, పిక్కలను వేరు చేస్తారు.మలి దశలో నిరంతర తేర్చు (continuous settling) టాంకులో నీరు, మలినాలను పామాయిల్‌ నుండి వేరు చేస్తారు.పామాయిల్‌, నీరు భిన్నమైన సాంద్రతలు (density) కలిగి వుండటం వలన సెటిలింగ్‌టాంకులో పైభాగంలో పామాయిల్, అడుగుభాగంలో నీరు, మలినాలు చేరును.త్వరగా సెటిల్ అవ్వటానికి అదనంగా కొంతనీరును చేర్చెదరు. సెటిలింగ్ టాంకులోని ఆయిల్ మిశ్రమాన్ని 85-870C డిగ్రిల వరకు వేడిచెయ్యడం వలన కూడా ఆయిల్‌ త్వరితంగా సెటిల్ ఆగును. క్లారిఫికెసన్ చెయ్యవలసిన క్రూడ్‌పామాయిల్ ను వరుస క్రమంలో వున్న సెటిలింగ్ టాంకులకు ఒకదానినుండి మరియొక దానికి పంపించుచు సెటిలింగ్ చేస్తారు. చివరిటాంకునకు ఆయిల్ చేరెటప్పటికి ఆయిల్‌లో తేమ శాతం 0.5%కు తగ్గిపోవును.

క్రూడ్‌పామాయిల్‌ నుండి నీటిని, మలినాలను తొలగించుటకు సేటిలింగ్ టాంకులలో తేర్చడం ద్వారానే కాకుండగా, 'సెంట్రిఫ్యూజ్'నుపయోగించి కూడా క్లారిఫికెసన్ చేస్తారు. స్లెడ్జ్‌సెంట్రిఫ్యుజ్ (sludge centrifuge),, 3-పెస్‌డెకెంటరు సెంట్రిఫ్యుజ్ (3-phase decanting centrifuge) లనుపయోగించి నితంతరాయంగా (continuously ) క్రూడ్‌పామాయిల్‌నుండి ఫైబరు, నీరు, మలినాలను తొలగించెదరు. సెంట్రిఫ్యుస్, డెకెంటరుల నుపయోగించడం వలన అయిల్ క్లారిఫికెసన్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో (quantity) నూనెను డెకెంటంగ్ చెయ్యవచ్చును.

"సెంట్రిఫ్యుజ్":డెకెంటింగ్ సెంట్రిఫ్యూజ్‌లో సెంట్రిఫ్యూజ్‌బౌల్‌, గొట్టంలాపొడవుగా (tubular) వుండి ఒకచివర శంకువు (cone) ఆకారంలో వుండును. ఈ బౌల్‌సెంట్రిఫ్యుజ్‌లో హరిజొంటల్‌గా బిగింపబడి వుండును. బౌల్‌కు మూడు ఔట్‌లెట్ (outlets) వుండును. ఒక అవుట్‌లెట్‌నుండి ఫైబరుతోకూడిన ఘనపదార్థాలు, రెండోఅవుట్‌లెట్‌నుండిఎక్కువ సాంద్రత వున్ననీరు, ద్రవ మలినాలు (liquid impurities, మూడో అవుట్‌లెట్‌నుండి క్లారిఫై అయిన పామాయిల్‌వచ్చును.బౌల్‌యొక్క 'కోన్'వద్దనుండి ఫైబరు, సాలిడ్ మలినాలు, బౌల్‌మధ్య దిగువ భాగంనుండి ఎక్కువ సాంద్రత వున్న నీరు, ద్రవ మలినాలు, బౌల్ యొక్క వెడల్పాటి భాగం నుండి క్లారిఫై అయిన పామాయిల్ వచ్చును.బౌల్‌ సెంట్రిఫ్యుగల్‌ ఫొర్స్ ఆధారంగా పనిచెయ్యును. సెంట్రిఫ్యుగల్‌ ఫొర్స్‌ వలన హేవి పార్టికల్ద్‌ బౌల్ యొక్క లోపలి వెలుపలి ఉపరితలంవైపు, తక్కువ సాంద్రత వున్న అయిల్, బౌల్ యొక్క సెంటరుభాగం (బౌల్‌కేంద్రియ భాగం) వైపుగా కదలును.బౌల్‌యొక్క అవుట్‌లెట్‌వాల్వులను సరియైన, కావల్సినరీతిలో నియంత్రించడం (valve control) ఆయిల్ క్లారిఫికెసన్ చేస్తారు. వాస్ఫలియ (wastfalia) వారు త్రీపేజ్‌ డెకెంటరులను తయారు చెయ్యుచున్నారు.

ఆయిల్ డ్రయింగ్

మార్చు

క్లారిఫికెసన్‌ చేసిన క్రూడ్‌పామాయిల్‌లో 1-0.5% వరకు తేమ (moisture, కొద్ది శాతంలో గమ్స్ (gums) వుండును.గమ్స్‌ను పాస్పాటైడ్స్ (phosphatides) అనికూడా అంటారు. క్రూడ్‌పామాయిల్‌ లోని ఈ తేమను తొలగించనిచో, గమ్స్‌తేమతో కలసి నూనెలో కరుగని పదార్థం (oil insolubles) లుగా టాంకుల అడుగున చేరిసెటిల్‌ అగును. ఈ విధంగా సెటిల్ అయ్యిన దాన్ని 'ఫూట్స్' (foots) అంటారు. క్రూడ్‌పామాయిల్‌ లోని తేమ శాతాన్ని 0.1-0.2% వరకు తగ్గించడం వుత్తమం.ఆయిల్‌లోని తేమను రెండువిధాలుగా తగ్గించవచ్చును. ఒకటి ఆయిల్‌ను మాములు ఉష్ణోగ్రత వద్ద 100-1050C సెంటిగ్రెడ్ డిగ్రిల వరకు వేడి చేసి నీటిని తొలగించడం (నీటి మరుగు ఉష్ణోగ్రత 100 °C) .కాని ఇలా వాతావరణ ఉష్ణోగ్రత వద్ద ఆయిల్‌ను వేడి చేసినచో, గాలిలోని ఆక్సిజనుతో అయిల్ ఆక్సీకరణ (oxidation) చెందు అవకాశం ఎక్కువ.ఆక్సీకరణ చెందిన నూనెను రిపైన్ చేసినప్పుడు ఆయిల్ కలరు అనుకున్నంతస్దాయిలో తగ్గదు.అందుచే రెండొ విధానంలో, వ్యాక్యుంలో ఆయిల్‌ను 80-850C డిగ్రిల వరకు వేడి చేసి మాయిచ్చరును తొలగించెదరు.

పామాయిల్

మార్చు

ముడి పామాయిల్ (crude palm oil) పసుపు లేదా ఆరెంజి రంగులో వుంటుంది.దీనికి కారణం పామాయిల్‌లో వున్న కెరొటెన్లు.ఇవీ పామాయిల్‌లో 1000ppm వరకు వుండును.ముడి పామాయిల్‌ద్రవ, ఘన మధ్యస్ద రూపంలో వుండును.తక్కువ ఉష్ణోగ్రత వద్ద పామాయిల్ త్వరగా గడ్దకట్టుతుంది.

క్రూడాయిల్ ద్రవీభవనఉష్ణోగ్రత 34-38 సెంటిగ్రెడ్/డిగ్రిలు
ఐయోడిన్ విలువ 52-54 మధ్య వుండును.
సాంద్రత 0.88-0.89కే.జి/లీటరు

పామాయిల్‌లో ట్రైగ్లిసెరైడ్స్‌తో పాటుఈ దిగువ పెర్కొన్న పదార్థాలు వుండును.

పాస్పటైడ్స్ 0.2-0.5%
కెరొటెనొయిడ్స్ 500-1000ppm
టొకొపెరొల్స్ 800 ppm
స్టెరొల్స్ 0.1-0.2%
క్లొరొఫిల్ 250-800ppm

పామాయిల్‌లో వుండు ఫ్యాటి ఆసిడులు.

సంతృప్త ఫ్యాటి ఆమ్లాలు (అందాజుగా)

లారిక్ ఆసిడ్ 0.2%
మెరిస్టిక్ ఆసిడ్ 1.1%
పామెటిక్ ఆసిడ్ 44.0%
స్టియరిక్ ఆసిడ్ 4.5%

అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు (అందాజుగా)

ఒలిక్ ఆసిడ్ 40.0%
లినొలిక్ ఆసిడ్ 10.0%
లినొలెనిక్ ఆసిడ్ 0.9%

పాస్పటైడ్స్(phosphatides)

మార్చు

వీటినే పాస్పోలిపిడులు అనికూడా ఆంటారు. పాస్పొలిపిడ్స్ నూనెలలో, ఆయిల్ కేకులలో వుండగా, పాస్పోలిపిడ్స్‌ జీవకణాలపొరలలో (cell membrane) వుండును. గ్లిసరొల్‌లేదా పాలి హైడ్రొక్షి ఆల్కహల్‌తో ఫ్యాటి ఆమ్లాలు, పాస్పర్‌, నైట్రొజన్‌ సమ్మేళనపదార్థం (nitrogen compound) లు సంయోగం చెందటం వలన పాస్పటైడులు ఏర్పడును. గ్లిసరిన్ లోని రెండు-OH గ్రూపులతో రెండు ఫ్యాటి ఆమ్లాలు, మూడో -OH గ్రూపుతో పాస్పర్‌, నత్రజని యుత సంయోగ పదార్థములు సంయోగం చెందటం వలన పాస్పాటైడులు ఏర్పడును.నత్రజని సంయోగ పదార్హాలు సాధారణంగా కొలిన్ (choline, బెటైన్ (betain, ఇథనొలైమైన్ (ethaolamine) అయ్యి వుండును.ముడి నూనెలలో ఆయిల్‌ను బట్టి 1-3% వరకు వుండును. కాని పామాయిల్‌లో 0.2-0.5% మాత్రమే వుండును.

కెరొటెనొయిడులు(carotenoids)

మార్చు

వీటినే కెరొటెనులు అనికూడా అంటారు.ఇవి బహు ద్విబంధాలున్న హైడ్రొ కార్బనులు కరొటెనుల వలననే నూనెలకు ఆరెంజి, పసుపురంగు ఏర్పడును.అల్పా, గామా కరొటెనులు విటమిన్‌ ఆక్టివిటి కలిగి ఉన్నాయి. కరొటెనులను'ప్రొ విటమిన్A'అని పిలుస్తారు.ఇవి జీవక్రియలో విటమిన్'A'గా మారును.వీటి ఫార్ములా: CnHx.కరొటెనుల హైడ్రొకార్బను గొలుసు చివర, హైడ్రొకార్బను వలయాలు వుండును. కరొటెనులు అధిక ఉష్ణోగ్రత (elevated temperature) వద్ద వునికిని కొల్పొవును, వివర్ణంగా మారును. ముడిపామాయిల్‌లో కరొటెన్లు 1000ppm వరకు లభించును.కాని పామాయిల్‌ను రెఫైండ్‌చేసి నప్పుడు ఇవి నశించిపోవును.

పామాయిల్‌వినియోగం

మార్చు
  • పామాయిల్‌ను రిపైండ్‌చేసి, వచ్చిన నూనెను పాక్షీకాంశికరణ (partial fractionation ) చేసి పామోలిల్‌ నూనెగా, పామ్‌ స్టియరిన్‌గాచేసి, పామోలిన్‌నూనెను వంటనూనెగా, సాలడ్ నూనెగా వాడెదరు.
  • పామ్‌స్టియరిన్‌ను ఇంటరుఎస్టరిఫైడ్‌ఫ్యాట్‌, బేకరి ఉత్పత్తులను తయారు చేయుదురు.
  • పామాయిల్ కొవ్వుఆమ్లాలను (పామాయిల్‌ను రిఫైనరి చేయ్యునప్పుడు, కొవ్వుఆమ్లాలు ఉప ఉత్పత్తిగా వచ్చును) సబ్బులతయారి, రబ్బరు టైర్ల పరిశ్రమలలో వాడెదరు.

మూలాలు

మార్చు
  1. Gledhill, David (2008). The Name of Plants (4 ed.). Cambridge: University Press. p. 279.

ఆధారాలు

మార్చు
  1. FAO document, 'small scale palm oil processing'
  2. Mark's 'Introduction of fruit crops'

బయటి లంకెలు

మార్చు