కొండిపర్రు

భారతదేశంలోని గ్రామం

కొండిపర్రు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

కొండిపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
కొండిపర్రు is located in Andhra Pradesh
కొండిపర్రు
కొండిపర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′40″N 80°58′50″E / 16.327875°N 80.980546°E / 16.327875; 80.980546
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,595
 - పురుషులు 798
 - స్త్రీలు 797
 - గృహాల సంఖ్య 477
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

కొండిపర్రు గ్రామ చరిత్రసవరించు

నేను చదివిన పామర్రు మండల చరిత్ర పుస్తకం ప్రకారం, పూర్వం ఈ గ్రామంలో కొండిపర్తి వంశస్తులతో అంటే 3 శతాబ్దాల క్రిందట బ్రాహ్మణులూ దీనిని అగ్రహారంగా ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల ఈ గ్రామం, "కొండిపర్రు"గా పిలవబడింది. కౌండిన్య శాస్త్రి అనే పండితుడు తన పరివారంతో ఈ గ్రామంలో తొలత నివసిస్తూ కౌండిన్యపురిగా ఏర్పాటుకు దోహదపడినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరంలో మార్తి రామయ్య పాల్గొని ప్రసిద్ధి గాంచారు. హరికథా పితామహులు పొడుగు పండురంగాదాసు గజారోహణం, గండపిండేరంతో సత్కరింపబడి జాతీయ స్థాయలో గుర్తింపు పొందారు. 1850 లో కాశీ నుంచి తీసుకువచ్చి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి శివలింగ ప్రతిష్ఠ గావించారు.ఈ గ్రామంలో పూర్వం వెంకటరామ సిద్దశ్రమం వుండేది.అక్కడ ఆయుర్వేద వైద్యం,యోగ గురూజీ నిర్వహించేవారు.సినీ,నాటక, రంగస్థల సంగీత దర్శకుడుగా మార్తి సీతారామయ్య మృదంగ ఘనపతిగా నమ్మగడ్డ పరదేశి ఈ గ్రామానికి చెందినవారే.పోలీసు శాఖలో జి.తిలక్ ప్రముఖ అధికారిగా ఉన్నారు. సూర్యనారాయణ బొమ్మల తయారీలో ప్రసిద్ధి గాంచారు.గ్రామానికి సమీపంలోని వీరాంజనేయ పురానికి చెందిన ఆరేపల్లి నాగ రాజు సిద్దాంతి నేతృత్వంలో శ్రీ గణపతి లక్ష్మి సరస్వతి మూర్తుల ఎకపీట దేవాలయం 12 -2 -2001న శంకుస్థాపన జరిగి 7-4-2003 న ప్రారంభోత్సవం జరిపారు.

సినీ, రంగస్థల, టి.వి.నటుడైన సాక్షి రంగారావు గారు కూడా ఈ గ్రామానికి చెందినవారే. 1927 లో బాపట్లకు చెందిన భైరవపట్ల వంశీయలు అంజనేయ పరమహంస అనే అవధూతచే మామిడితోటలో ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. వారి శిష్యులు మధుసూదనరావు గారు 1977 లో గుడి కట్టించారు. అనంతరం 1986 లో ఆరేపల్లి నాగరాజు గుడి పున:నిర్మాణం చేపట్టి మామిడితోటలో మారుతీ భాక్తులుకు నేలవుగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. గాంధేయవాది యలమంచిలి వెంకటేశ్వర రావు కృషి ఫలితంగా "విద్యావనం పబ్లిక్ ట్రస్టు", అనే హిందీ పాఠశాలా,గ్రామీణ కుటీర పరిశ్రమల సంస్థ ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడు పుట్టకొక్కుల కేంద్రంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన మార్తి గంగాధరశాస్త్రి, ఉప్పలపాటి సత్యనారాయణ, సింగవరపు వీరభద్రయ్య గార్ల సహకారంతో 1947 జూలై 14 వ తేదిన విద్యావనం నిర్మాణానికి యలమంచిలి వెంకటేశ్వరరావు గారు శ్రీకారం చుట్టి దినదిన ప్రవర్ధమానం చేసి జాతీయోద్యమానికి కృషి చేశారు.ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొమ్మారెడ్డి కోటిరెడ్డి సమీప బంధువు గుజవర్తి శ్రీరామకృష్ణారెడ్డి (USA )వితరనత్వంతో గ్రామంలో 7వ తరగతి అత్యుత్తమ విద్యార్థులకు శాశ్వతంగా ఉపకారవేతనం ఇచ్చి పామర్రు ఉన్నత పాఠశాల నిర్మాణానికి భూరి విరాళాలు ఇచ్చి పేరు గాంచారు.

సీ ఆర్ డీ ఏసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 45 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గుజవర్తి ఉదయభాస్కరరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ భ్రమరాంబాసమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి దేవాలయంసవరించు

  1. ఈ దేవాలయంలో, 2014,ఏప్రిల్-14న స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [2]
  2. ఈ ఆలయానికి 2016 కృష్ణానదీ పుష్కర నిధులు 20 లక్షల రూపాయలతో అభివృద్ధిపనులు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాలిగోపురం ప్లాస్టరింగ్, ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం, వాహనశాల నిర్మాణం చేపట్టెదరు. ఈ పనులుగాక దాతల సహకారంతో నవగ్రహ మంటపం, భోజనశాల కొరకు ఒక షెడ్డ్ నిర్మించనున్నారు. [6]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2017,మాఎచ్-26వతేదీ ఆదివారంనాడు, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు అమ్మవారికి వేపాకు, పసుపు కలిపిన నీరు వారపోసి, టెంకాయలు సమర్పించారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, కొబ్బరితోటలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

  • జ్యోశ్యుల పరబ్రహ్మశాస్త్రి పాకశాస్త్ర ప్రవీణులు. జింటాన్ శాస్త్రి గా చిరపరిచితులు. [5]
 
సాక్షి రంగారావు- తెలుగు సినిమా నటుడు

గ్రామ విశేషాలుసవరించు

కొండిపర్రు గ్రామానికి చెందిన శ్రీ అల్లాడ వెంకటసుబ్బారావు, ధనలక్ష్మి దంపతులు, అతిపేద కుటుంబానికి చెందినవారు. వీరి కుమార్తె, రేణుకా తేజస్వి, పామర్రు మండల కేంద్రంలోని కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో, 10వ తరగతి చదివినది. ఆ పరీక్షా ఫలితాలలో ఆమె 9.7/10 గ్రేడ్ మార్కులు సంపాదించి, తన తల్లిదండ్రులకూ, గ్రామానికీ పేరుతెచ్చింది. [3]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,595 - పురుషుల సంఖ్య 798 - స్త్రీల సంఖ్య 797 - గృహాల సంఖ్య 477

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1637.[3] ఇందులో పురుషుల సంఖ్య 809, స్త్రీల సంఖ్య 828, గ్రామంలో నివాసగృహాలు 462 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Kondiparru". Archived from the original on 19 జూలై 2018. Retrieved 29 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014;ఏప్రిల్-14; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-27; 38వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-18; 24వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-6; 16వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-6; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-27; 1వపేజీ.