కొత్తపల్లి (బాలకొండ మండలం)

తెలంగాణ, నిజామాబాదు జిల్లా, ముప్కాల్ మండలం లోని గ్రామం

కొత్తపల్లి, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలంలోని గ్రామం.[1]

కొత్తపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం
కొత్తపల్లి is located in తెలంగాణ
కొత్తపల్లి
కొత్తపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°54′31″N 78°22′36″E / 18.90861°N 78.37667°E / 18.90861; 78.37667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం ముప్కాల్
ప్రభుత్వం
 - సర్పంచి ప్రస్తుతం ఖాళీగా ఉంది
 - శాసనసభ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి
 - లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్
వైశాల్యము
 - మొత్తం km² (3.1 sq mi)
ఎత్తు 333 m (1,093 ft)
జనాభా (2011)
 - మొత్తం 2,661
 - సాంద్రత 332.8/km2 (861.9/sq mi)
 - పురుషుల సంఖ్య 1,230
 - స్త్రీల సంఖ్య 1,431
 - గృహాల సంఖ్య 709
కాలాంశం UTC+5:30 (UTC)
పిన్ కోడ్ 503218
ఎస్.టి.డి కోడ్ 08463

ఇది మండల కేంద్రమైన ముప్కాల్ నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం నిజామాబాదు జిల్లా లోని పాత బాలకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ముప్కాల్ మండలం లోకి చేర్చారు.[2] ప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడు ప్రాజెక్టు) నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయభూమితో సహా గ్రామ మొత్తం వైశాల్యం 8 చ.కి.మీ. ఉంటుంది. గోదావరి నది గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర

మార్చు

చెఱువుకు పడమర దిక్కు గట్టు పైన ప్రాచీన వీరగల్లు విగ్రహాలు ఉన్నాయి. వీటిని గ్రామ ప్రజలు మహాదేవునిగా భావిస్తారు, ఇందులో ఒక విగ్రహం దాదాపు రెండు అడుగుల ఎత్తుతో డాలు కత్తి పట్టుకున్న వీరుడిది, రెండవ విగ్రహం ఒక అడుగు ఎత్తున్న నల్లరాతి శిలతో మలచబడింది ఇది విల్లు పట్టుకున్న వీరుడిది, మూడవ విగ్రహం ముఖభాగం ధ్వంసమైన ఒక అడుగు ఎత్తున్న నంది విగ్రహం, ఇవన్నీ చెఱువు గట్టు మీదున్న ఒక చిన్న వేదికపైన ఉన్నాయి, చాలా ఏళ్ళు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న వీటిని కొన్ని సంవత్సరాల క్రితం కొందరు గ్రామస్థులు మహాదేవునిగా భావించి విగ్రహాలకు సింధూరాన్ని పూసి, ఎండ వానల నుండి రక్షణ కొరకు చిన్న రేకుల షెడ్డు వేశారు.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా వీరగళ్ళు శిలలు ప్రాచీన, మధ్యయుగాల్లో యుద్ధాల్లో మరణించిన వీరుల గ్ఞాపకార్థం ప్రతిష్ఠించినవి కాబట్టి ఈ ఊరికి ప్రాచీన లేదా మధ్యయుగాల నాటి చరిత్ర ఉన్నట్టుగా భావించబడుతుంది.

 
వీరగల్లు శిల్పాలు

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 709 ఇళ్లతో, 2661 జనాభాతో 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1230, ఆడవారి సంఖ్య 1431. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 678 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 295. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 570796[3].పిన్ కోడ్: 503218.

జనాభా గణాంకాలు (వృద్ధి/క్షీణత)
జనాభా లెక్కలు మొత్తం ఇళ్ళు పురుషులు స్త్రీలు మొత్తం జనాభా అక్షరాస్యత
2001 673 1382 1469 2851 -
2011 709 (+05.35%) 1230 (-11.00%) 1431 (-02.59) 2661 (-06.66%) 1,474 (55.39%)

సమీప గ్రామాలు

మార్చు

ముప్కాల్, నల్లూరు, మెండోర, వెల్కటూర్ తాండ, నాగంపేట, రెంజర్ల, వన్నెల్-బి, వేంపల్లి సమీప గ్రామాలుగా ఉన్నాయి.

దేవాలయాలు

మార్చు

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం-:

 
పురాతన సహజ రాతి నిర్మాణ శిథిలాలు
 
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం

ఈ గ్రామంలో చెఱువు కట్ట దగ్గరున్న చిన్న గుట్ట పైన విసిరివేయబడ్డట్టున్న రాళ్ళు, గుట్ట నిండా సహజంగా పెరిగిన అనేక చింత చెట్ల మధ్యన, వెనకనే చెఱువు కలిగిన రమ్యమైన సుందరమైన ప్రశాంత ప్రదేశంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయ వెనక భాగంలో పురాతన సహజ రాతి నిర్మాణాలు కలవు, ఈ ఆలయంలోని శివలింగం అత్యంత పురాతనమైంది.

ఇంకా గ్రామంలో ఒక హనుమాన్ ఆలయం,ఒక చిన్న రామేశ్వరాలయం,వివిధ వర్గాల ప్రజలకు చెందిన దాదాపు తొమ్మిది నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి.ఇవి కాకుండా పోచమ్మ, శుక్రవారపు దేవి, ఇంకా ఇతర గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి.

గ్రామంలో దాదాపు ఆరు ప్రదేశాలలో ముస్లిం సుఫీ దర్గాలు కూడా ఉన్నాయి, వీటిల్లో హిందువులు ప్రార్ధనలు, పండుగలు చేసుకుంటారు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో 55% అక్షరాస్యత రేటు ఉంది. ప్రాథమిక విద్య కోసం ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. ఉన్నత పాఠశాల‌ ముప్కాల్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బాల్కొండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల నిజామాబాద్ లోనూ, మేనేజ్మెంట్ కళాశాల ఆర్మూర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిజామాబాద్లోను, అనియత విద్యా కేంద్రం బాల్కొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఆర్మూర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

కొత్తపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో మూడు ప్రైవేటు వైద్య క్లినిక్ లు ఉన్నాయి. RMP డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు ఔషధ (మందుల) దుకాణాలు ఉన్నాయి. రెండు కి.మీ దూరంలోని ముప్కాల్లో పడకల సదుపాయం ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాల (మమత నర్సింగ్ హోం) ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార సౌకర్యాలు

మార్చు

కొత్తపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

44వ జాతీయ రహదారి(పాత NH 7) గ్రామంలోని పొలాల మద్యనుండి పోతోంది. గ్రామంలో తారు రోడ్లు, సిమెంటు రోడ్లు ఉన్నాయి.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఆర్మూర్ నుండి ఎల్కటూర్కు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సులు రోజుకు రెండుసార్లు గ్రామం గుండా తిరుగుతాయి. ఆటోలు కూడా తిరుగుతాయి.

సంస్కృతి

మార్చు

గ్రామంలో అచ్చమైన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. మహిళలు ధోతీ చీరకట్టు, పురుషుల ధోవతి ధరిస్తారు.ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనది, గ్రామంలో అధిక భాగం ప్రజలు రైతులు, వ్యవసాయ కూలీలు.మహా శివరాత్రి పండుగ నాడు జాతర గొప్పగా జరుపుకుంటారు, దసరా,వినాయకచవితి,ఉగాది,ఇతర గ్రామదేవతల పండగలు, మొహఱ్ఱం-పీరీల పండగ కూడా గొప్పగా జరుపుకుంటారు.హిందువులు వారి పండగలే కాకుండా ముస్లిం సుఫీ దర్గాల వద్ద కందూర్ పండగలను కూడా జరుపుకుంటూ హిందూ-ముస్లింల ఐకమత్యాన్ని చాటు తారు.వివిధ కులాలకు,వర్గాలకు చెందిన ప్రజలు ఐకమత్యంతో నివసిస్తున్నారు. ఈ గ్రామం క్రికెట్, కబడ్డీ వంటి ఆటలలో జిల్లాలో ప్రసిద్ధి చెందింది.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందాలు, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 2 కి.మీ. దూరంలో ఉన్నాయి.రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 2 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్తలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాళ్లు గ్రామం నుండి 20 కి.మీ.ల దూరంలో నిర్మల్, ఆర్మూరు లలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 12 గంటల పాటు వ్యవసాయానికి, 24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

కొత్తపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 184 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 15 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 38 హెక్టార్లు
  • బంజరు భూమి: 87 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 268 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 393 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

కొత్తపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.సాగు నీటికి బోర్ బావులు, వ్యవసాయ బావులు, కాలువల పై ఆధారపడుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి వస్తున్న లక్ష్మి కాలువ ఈ గ్రామం గుండా ప్రవహిస్తుంది. ఈ ఊర్లో రాజేశ్వర చెఱువు ప్రధానమైనది ఇదికాకుండా లింగం చెఱువు, రామేశ్వర కుంట, కుమ్మరి కుంటలు ఉన్నాయి.

  • కాలువలు: 387 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 6 హెక్టార్లు

వ్యవసాయ ఉత్పత్తులు

మార్చు
 
గ్రామంలో పసుపు పంట

కొత్తపల్లి గ్రామంలోని ప్రజలు చాలా భాగం రైతులు. ప్రధానంగా ఖరీఫ్లో వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్స్, వేరుశెనగ పంటలు, రబీలో వరి,జొన్న, మొక్కజొన్న అలాగే పసుపు తరువాతి పంటగా ఫిబ్రవరి మార్చి నెలలో సజ్జ, కూరగాయలు పండిస్తారు. తక్కువగా నువ్వులు,ఆవాలు కూడా పండిస్తారు.

ప్రధాన పంటలు

మార్చు

వరి,మొక్కజొన్న,సోయా చిక్కుడు,పసుపు,జొన్న,సజ్జ.

పాడి పశువులు

మార్చు

గ్రామంలో చాలా మందికి గేదెలు ఉన్నాయి, గ్రామంలోని అందరికీ తరతరాలుగా పాల కొరకు గేదెలే ప్రధాన వనరులు.కొన్ని సంవత్సరాల క్రితం వరకూ వ్యవసాయానికి ఎద్దులను ఉపయోగించేవారు, కానీ ఆధునిక యంత్రాల ఉపయోగం వలన ప్రస్తుతం ఎద్దులు కనుమరుగయ్యాయి.

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

గ్రామంలోని చాలా మంది ఆడవాళ్ళు ఇళ్ళల్లోనే బీడీలు చుడుతూ ఉపాది పొందుతున్నారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-30.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు