జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం

(జహీరాబాదు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గములు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గ స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో బి. బి. పాటిల్ గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు

మార్చు

నియోజకవర్గపు గణాంకాలు

మార్చు
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,35,612 [1]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 17.61%, 7.72%.
  • ఓటర్ల సంఖ్య: 12,53,670.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952-2008 : నియోజకవర్గం ఉనికిలో లేదు
2009[2][3] సురేష్ షెట్కార్ భారత జాతీయ కాంగ్రెస్
2014[4] బి. బి. పాటిల్ తెలంగాణ రాష్ట్ర సమితి
2019 [5]
2024[6] సురేష్ షెట్కార్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

మార్చు

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు.[7]

2024 భారత సార్వత్రిక ఎన్నికలు : జహీరాబాద్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ సురేష్ కుమార్ షెట్కార్ 5,28,418
బీజేపీ బి. బి. పాటిల్ 4,82,230
బీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్ 1,72,078
నోటా పైవేవీ కాదు
మెజారిటీ 46,188
పోలింగ్ శాతం 74.63 4.93

సార్వత్రిక ఎన్నికలు, 2019

మార్చు
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : జహీరాబాద్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ బి. బి. పాటిల్ 434,244 41.58 -4.88
ఐఎన్‌సీ కె. మదన్ మోహన్ రావు 4,28,015 40.98 +7.73
బీజేపీ బాణాల లక్ష్మా రెడ్డి 1,38,947 13.30
నోటా పైవేవీ కాదు 11,640 1.07
మెజారిటీ 6,229 0.60
పోలింగ్ శాతం 10,44,504 69.70

సార్వత్రిక ఎన్నికలు, 2014

మార్చు
2014 భారత సార్వత్రిక ఎన్నికలు : జహీరాబాద్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ బి. బి. పాటిల్ 5,08,661 46.46 +9.27
ఐఎన్‌సీ సురేష్ కుమార్ షెట్కార్ 3,64,030 33.25 -5.65
టీడీపీ కె. మదన్ మోహన్ రావు 1,57,497 14.39 N/A
ఆర్‌పీఐ (ఎ) మర్రి దుర్గేష్ 18,027 1.64
వైసీపీ మహమూద్ మొహియుద్దీన్ 12,383 1.13
బీఎస్‌పీ సయ్యద్ ఫిరోజుద్దీన్ 8,180 0.74
నోటా పైవేవీ కాదు 11,157 1.02
మెజారిటీ 1,44,631 13.21 +11.50
పోలింగ్ శాతం 10,94,806 77.28 +2.61

సార్వత్రిక ఎన్నికలు, 2009

మార్చు
2009 భారత సార్వత్రిక ఎన్నికలు : జహీరాబాద్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ సురేష్ కుమార్ షెట్కార్ 3,95,767 38.90
టీఆర్ఎస్ సయ్యద్ యూసుఫ్ అలీ 3,78,360 37.19
పీఆర్‌పీ మల్కాపురం శివ కుమార్ 1,12,792 11.09
మెజారిటీ 17,407 1.71
పోలింగ్ శాతం 10,17,290 74.67

మూలాలు

మార్చు
  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
  2. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  3. Firstpost (2019). "Zahirabad Elections 2019: Telangana Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  4. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. Andhrajyothy (5 June 2024). "హస్తం హవా". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  7. EENADU (30 April 2024). "జహీరాబాద్‌ బరిలో 19 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.