జ్యోతివర్మ
జ్యోతివర్మ తెలుగు చలనచిత్ర, టెలివిజన్ డబ్బింగ్ కళాకారిణి. నచ్చావులే సినిమాలో కథానాయిక స్నేహితురాలు పాత్రకు తొలిసారిగా డబ్బింగ్ జ్యోతివర్మ, రంగస్థలం సినిమాలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా గుర్తింపు పొందింది.[1][2]
జ్యోతివర్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | డబ్బింగ్ కళాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | దిలీప్‌వర్మ, శారదా మహేశ్వరి |
బంధువులు | కిషోర్ (భర్త) |
జననం
మార్చుజ్యోతివర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో జన్మించింది. ఈవిడ తల్లిదండ్రలు దిలీప్‌వర్మ, శారదా మహేశ్వరి. హైదరాబాదులో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది.
సినిమారంగ ప్రస్థానం
మార్చుతన నాన్న ప్రెండ్, కాస్ట్యూమ్ డిజైనర్ఐన జగదీశ్వర్ సలహాతో డబ్బింగ్ ఆర్టిస్టు ప్రయత్నాలు సాగించింది. తనకు మొదట బృందంలోని సభ్యులకు డబ్బింగ్ చెప్పే అవకాశంరావడంతో సూపర్, తులసి, సైనికుడు మొదలైన సినిమాలలో బృందంలోని సభ్యులకు డబ్బింగ్ చెప్పింది. తరువాత చిన్నచిన్న సన్నివేశాల్లోని పాత్రధారులకు చెప్పడం ప్రారంభించి, స్టాలిన్, లక్ష్మీకల్యాణం, అన్నవరం వంటి సినిమాల్లో బిట్స్ చెప్పింది.
నచ్చావులే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలికి డబ్బింగ్ చెప్పడంతో బిజీగా మరి, క్రమంగా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే స్థాయికీ చేరుకొని, ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది. 2018లో వచ్చిన రంగస్థలం సినిమా జ్యోతివర్మకు మంచి పేరు తీసుకువచ్చింది.
చిత్రాలు
మార్చుసంవత్సరం | చిత్రం పేరు | నటి పేరు | ఇతర వివరాలు |
---|---|---|---|
2008 | నచ్చావులే | హీరోయిన్ ఫ్రెండ్ | |
2010 | వేదం | అనుష్క | సూపర్ హిట్ మూవీస్ అవార్డు |
2012 | రెబల్ | దీక్షా సేథ్ | |
2013 | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | రకుల్ ప్రీత్ సింగ్ | |
2015 | జేమ్స్‌బాండ్ | సాక్షి చౌదరి | |
2015 | కంచె | ప్రజ్ఞా జైస్వాల్ | |
2016 | నాయకి | త్రిష | |
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | రకుల్ ప్రీత్ సింగ్ | |
2017 | రాజు గారి గది 2 | సీరత్ కపూర్, అభినయ | |
2018 | రంగస్థలం | సమంత |
ధారావాహికలు
మార్చుఈటీవీ, జెమినీ, జీతెలుగులలో ప్రసారమయిన అనేక సీరియల్స్ లోని నాయిక, ప్రతినాయిక పాత్రలకు డబ్బింగ్ చెప్పడమేకాకుండా 2011లో పసుపుకుంకుమ సీరియల్‌కి నంది అవార్డు కూడా అందుకుంది
ధారావాహిక పేరు | ఛానల్ పేరు | నటి పేరు | ఇతర వివరాలు |
---|---|---|---|
ఆడదే ఆధారం | ఈటీవి | ||
తూర్పు వెళ్లేరైలు | ఈటీవి | ||
దేవత | జెమినీ టీవీ | ||
కొత్తబంగారం | జెమినీ టీవీ | ||
కల్యాణ తిలకం | జెమినీ టీవీ | ||
పసుపు కుంకుమ | జీ తెలుగు | నంది అవార్డు |
మూలాలు
మార్చు- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి, సినిమా (9 April 2018). "లచ్మికి గొంతిచ్చిన అమ్మాయి". వైజయంతి. Archived from the original on 9 ఏప్రిల్ 2018. Retrieved 9 April 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ వెబ్ ఆర్కైవ్, ఈనాడు వసుంధర, యువ హవా. "తెరవెనక... నేనే రామలక్ష్మిని!". స్వాతి కొరపాటి. Retrieved 9 April 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)