తమ్మారెడ్డి లెనిన్ బాబు
తమ్మారెడ్డి లెనిన్ బాబు (1946-1997) తెలుగు చలనచిత్ర దర్శకుడు.
తమ్మారెడ్డి లెనిన్ బాబు | |
---|---|
జననం | 1946 జూలై 31 |
మరణం | 1997 |
జాతీయత | భారతీయుడు |
విద్య | బి.ఎస్.సి. |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1965-1981 |
గుర్తించదగిన సేవలు | దత్తపుత్రుడు, డాక్టర్ బాబు |
తల్లిదండ్రులు | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
బంధువులు | తమ్మారెడ్డి భరద్వాజ (సోదరుడు) |
విశేషాలు
మార్చుఇతడు 1946, జూలై 31న జన్మించాడు.[1] ఇతని తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి చలనచిత్ర నిర్మాత, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అధినేత. అతడు రైతుకుటుంబం నుండి వచ్చి వామపక్షభావాలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.యువజన సంఘాలకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత సినిమా రంగం వైపు ఆకర్షితుడై ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలోనే లెనిన్ బాబు జన్మించాడు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే లెనిన్ బాబు తన తండ్రితో పాటు స్టూడియోలకు వెళుతూ షూటింగ్ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించేవాడు. తరచూ స్కూలు ఎగగొట్టి షూటింగులకు హాజరయినా చదువులో ఎన్నడూ వెనుకబడలేదు. పరీక్షలు అన్నీ మొదటి క్లాసులో పాస్ అయ్యేవాడు. ఇతడు కళాశాల విద్య భోపాల్‌లో చదువుతూ ఎవరికీ చెప్పకుండా బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక హిందీ సినిమా నిర్మాత ఇతనికి తగిన ప్రోత్సాహమిచ్చాడు. ఇంతలో ఇతని తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి సినిమా నిర్మాణానికి పూనుకోవడంతో ఇతడు మద్రాసుకు వచ్చి ఆ సినిమాలలో ప్రొడక్షన్, డైరెక్షన్ శాఖలలో ముఖ్యుడిగా కృషి చేశాడు. చలన చిత్ర నిర్మాణంలోని అనేక మెళకువలను ఆకళింపు చేసుకున్నాడు. జమీందార్, బంగారు గాజులు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు సినిమాలకు సహ నిర్మాతగా, సహకార దర్శకుడిగా పనిచేసి ఆ సినిమాల విజయానికి కృషి చేశాడు. తరువాత దత్తపుత్రుడు సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.
విడుదల సం. | సినిమా పేరు | ప్రధాన తారాగణం | నిర్మాణ సంస్థ | వివరాలు |
---|---|---|---|---|
1972 | దత్తపుత్రుడు | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, నాగభూషణం | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ | దర్శకుడిగా తొలి సినిమా |
1973 | డాక్టర్ బాబు | శోభన్ బాబు, జయలలిత, ఎస్.వి.రంగారావు | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ | |
1975 | చిన్ననాటి కలలు | కృష్ణంరాజు, జయంతి, అల్లు రామలింగయ్య | ధృవచిత్ర | |
1976 | అమ్మానాన్న | కృష్ణంరాజు, ప్రభ, చంద్రమోహన్ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ | |
1979 | లవ్ మ్యారేజ్ | రంగనాథ్, జయచిత్ర, చంద్రమోహన్ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ | |
1981 | మరో కురుక్షేత్రం | మాదాల రంగారావు, శారద, నూతన్ ప్రసాద్ | చరిత చిత్ర |
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (25 June 1972). "పరిచయం:శ్రీ టి.లెనిన్ బాబు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 7 జనవరి 2023. Retrieved 7 January 2023.
- ↑ వెబ్ మాస్టర్. "All Movies Thammareddy Lenin Babu". ఇండియన్ సినిమా. Retrieved 8 January 2023.