తిమ్మ భూపాలుడు
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
తిమ్మ భూపాలుడు, సాళువ నరసింహ రాయలుగారి పెద్ద కుమారుడు, తన ప్రభువునకు ఇచ్చిన మాట ప్రకారం తుళువ నరస నాయకుడు ఇతనిని సింహాసనాధిస్టుని చేసి రాజ్యభారం తానే వహించాడు, కానీ ఆరు నెలలలోనే ఇతను మరణించాడు.
సా.శ. 1485 నుంచి 1491 వఱకు సాళువ నరసింహదేవరాయలు, 1491లో కొంతకాలం తిమ్మ భూపాలుడు రాజ్యపాలన చేసాడు. తిమ్మ భూపాలుడు సాళువ నరసింహనాయకుని కొడుకులలో ఒకడైన పెరియ సంగముడు కావచ్చునని కొందరు ఊహించారు. సాళువ నరసింహరాయలకు తిమ్మ భూపాలుడనే మరొక కొడుకు ఉండినట్లు, అతను బహుగ్రంథకర్త అయినట్లు నేలటూరి వేంకట రమణయ్య గారు Further Sources of Vijayanagara History లో వ్రాశారు.[1]
సాళువ నరసింహదేవ రాయలు రెండవ కుమారుడు, అన్నగారు అయిన తిమ్మ భూపాలుడు మరణించిన పిదప ఇతను రాజ్యాధిపతి అయినాడు, కానీ తుళువ నరస నాయకుడు ఇతనిని పెనుగొండ దుర్గమున గృహనిర్భంధమున ఉంచి రాజ్యమునకు తానే అధిపతి అయినాడు.
మూలాలు
మార్చు- ↑ "Sujanaranjani". www.siliconandhra.org. Retrieved 2020-07-23.
ఇంతకు ముందు ఉన్నవారు: సాళువ నరసింహదేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1491 — 1491 |
తరువాత వచ్చినవారు: రెండవ నరసింహ రాయలు |