వేంకటపతి దేవ రాయలు

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

వెంకటపతి దేవ రాయలు (1585-1614) పెనుకొండ, చంద్రగిరి, వెల్లూరులలో స్థావరాలు కలిగిన విజయనగర సామ్రాజ్యానికి పాలకుడు. అతడు తిరుమల దేవరాయల చిన్న కుమారుడు, శ్రీరంగ దేవరాయల తమ్ముడు. అతడి తండ్రి, అళియ రామరాయలుకు తమ్ముడు.అతని మూడు దశాబ్దాల పాలనలో సామ్రాజ్య బలసంపదలు పునర్జీవనం పొందాయి. అంతర్గత కలహాలతోను, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లతోనూ అతను విజయవంతంగా వ్యవహరించాడు. దేశంలో ఆర్థిక పునరుజ్జీవనాన్ని సాధించాడు. తిరుగుబాటు చేసిన తమిళనాడు నాయకులను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భాగాలనూ అదుపులోకి తెచ్చాడు.

1605[permanent dead link], వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని ASI మ్యూజియంలో ప్రదర్శించబడింది

వెంకటపతి దేవ రాయలు కొంతకాలం పాటు పెనుగొండను, తర్వాత చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కాలంలోనే ఈస్టిండియా కంపెనీ వారు వర్తకం కోసం చెన్నపట్టణం ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద డచ్చివారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.

యుద్ధాలు

మార్చు

సుల్తాన్లతో పోరాటాలు

మార్చు

1588 లో అతను గోల్కొండ బీజాపూర్ సుల్తానులతో యుద్ధాని దిగాడు. తన పూర్వీకులు కోల్పోయిన కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు.[1] సుల్తానేట్ల సంయుక్త సైన్యాలను ఎదుర్కోడానికి రేచెర్ల వెలమ రాజవంశాంకి చెందిన కస్తూరిరంగ నాయకుడిని పంపించాడు. కస్తూరిరంగ, అతని కుమారుడు యాచమనేడు నేతృత్వంలోని సైన్యం వరుస పోరాటాలు చేసి విజయం సాధించింది. విజయనగర సైన్యం నుండి ఈ యుద్ధాలలో తప్పించుకున్న ముస్లిం సైనికులు పెన్నార్ ఎగువ ఒడ్డున తమ ప్రధాన దళాలలో చేరారు. సుల్తానుల సైన్యం 120,000 కన్నా ఎక్కువ అని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. వీరికి తోడుగా టర్కో-ఆఫ్ఘన్ గన్నర్లు వారి ఆర్టిలరీ యూనిట్లతో సిద్ధంగా ఉన్నారు. కస్తూరిరంగ సామ్రాజ్య దళాలను ఉత్తరం వైపుకు నడిపించి, పెన్నార్ నది ఎగువన శత్రువులను నేరుగా ఢీకొన్నాడు   .

ఈ ఘర్షణ 8 గంటలు చెలరేగింది, సుల్తానేట్ సైన్యం యొక్క ఫిరంగి దళాలు విజయనగర్ సైన్యంలో వినాశనం సృష్టించాయి. కాని యాచామనేడు తన దాడిని కొనసాగిస్తూ వత్తిడి పెంచాడు. రోజు ముగిసేసరికి, విజయనగర సైన్యం సుల్తానులపై గెలిచింది. విజయనగర సైన్యం తమ శత్రువులను గోల్కొండ భూభాగంలోకి తరిమాయి. కాని రాజు కొలువులో ఉన్న ఉన్నతాధికారుల మధ్య ఉన్న గొడవల కారణంగా గోల్కొండపై తదుపరి దాడులు చెయ్యలేదు.  

నాయకుల తిరుగుబాట్లు

మార్చు

జింజీ నాయకుడు

మార్చు

1586 లో జింజీ నాయకుడు, వెంకటపతిపై తిరుగుబాటు చేశాడు. వెంకటపతి అతన్ని పట్టుకుని జైలులో పెట్టాడు. పెనుకొండ దండయాత్రలో వెంకటపతికి సహాయం చేసిన తంజావూరు రఘునాథ నాయకుడు వెణ్కటపతికి చెప్పి జింజీ నాయకుణ్ణి విడుదల చేయించాడు

జింజీ నాయకుడు ఖైదులో ఉన్న సమయంలో, జింజీని మరొక వెంకట పాలించాడు.

వెల్లూరు నాయకులు

మార్చు

1601 లో వెల్లూరుకు చెందిన లింగమ నాయకుడు తిరుగుబాటు చేసాడు. అతణ్ణి ఆర్కాటు, చెంగల్పట్టుల్లో తన ప్రతినిధి అయిన యాచమనేడును పంపించి, తిరుగుబాటును అణచివేసాడు. లింగామ నాయకుని ఓడించి, వెల్లూరు కోటను వెంకటపతి రాయలు తన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. యాచమనేడు నేతృత్వంలోని మరో దండయాత్ర మదురై రాజ్యం లోకి వెళ్లి, తిరుగుబాటు చేసిన మదురై నాయకుని లొంగదీసుకున్నాడు.

రాజధానిని మార్చడం

మార్చు

1592 లో వెంకటపతి తన రాజధానిని పెనుకొండ నుండి చంద్రగిరికి మార్చాడు. ఇది తిరుపతి కొండల దగ్గర దక్షిణంగా ఉంది. 1604 తరువాత, అతను రాజధానిని చంద్రగిరి నుండి వెల్లూరు కోటకు మార్చాడు. అప్పటి నుండి దీనిని ప్రధాన స్థావరంగా ఉపయోగించారు.

అదుపు లోకి రాజ్యం

మార్చు

అతని సామ్రాజ్యం యొక్క ఉత్తర భూభాగాలను సుల్తాన్లు తరచూ ఆక్రమిస్తూ ఉండేవారు. పన్నుల చెల్లింపుకు సులువైన నిబంధనలు ఇవ్వడం, వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ఆ ప్రాంతాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. గ్రామ పరిపాలనను క్రమబద్ధీకరించాడు. న్యాయవ్యవస్థను కఠినంగా అమలు చేసారు.

డచ్చివారి రాక

మార్చు

1608 లో డచ్చి వారు పులికట్‌లో ఫ్యాక్టరీని స్థాపించేందుకు అనుమతి కోరారు. అప్పటికే వాళ్ళు గోల్కొండ, జింజీ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆంగ్లేయులు కూడా పులికాట్ నుండి డచ్ ద్వారా వ్యాపారం ప్రారంభించారు. 1586 నుండి పులికాట్, వెంకటపతి రాయల అభిమాన రాణి గొబ్బూరి ఓబాయమ్మ అధీనంలో ఉండేది.[2] పులికాట్ వద్ద స్థావరం నిర్మించుకోడానికి ఆమె డచ్చి వారికి అనుమతి ఇచ్చింది. పోర్చుగీస్ జెస్యూట్లకు కూడా ఆమె సహాయం అందించింది.

వారసుడు

మార్చు

వెంకటపతికి, అనేక మంది రాణులు ఉన్నప్పటికీ, ఒక కుమారుడు లేడు, అందువల్ల తన అన్నయ్య రాముడి కుమారుడు మొదటి శ్రీరంగ రాయలును తన వారసుడిగా నియమించాడు. రాణుల్లో ఒకరైన బాయమ్మ తన బ్రాహ్మణ పనిమనిషికి చెందిన శిశువును అరువుగా తీసుకొని, తన కుమారుడేనని రాజును మోసం చేసింది. ఆమెను అడ్డుకోవడానికే రాజు ఇది చేసాడు.  

వెంకటపతి రాయలు 1614 అక్టోబరులో మరణించాడు. అతని తరువాత మొదటి శ్రీరంగ రాయలు గద్దె నెక్కాడు.

మూలాలు

మార్చు
  1. Nayaks of Tanjore by V. Vriddhagirisan p.47
  2. "The Madras Tercentenary Commemoration Volume". Asian Educational Services. 1994. Retrieved August 4, 2017.


విజయనగర రాజులు  
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
రామ రాజు
విజయనగర సామ్రాజ్యము
1586 — 1614
తరువాత వచ్చినవారు:
శ్రీరంగ రాయలు