సాళువ నరసింహదేవ రాయలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సాళువ నరసింహ రాయ భూపతిసవరించు
విజయ నగర సింహాసాధిపతికి ముందు ఇతని చరిత్రసవరించు
ఇతను పెనుగొండ దుర్గాధిపతి, అప్పటికే సంగమ వంశము క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు బహుమనీ సుల్తానులూ లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి విజయనగరము పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకోని పొయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించాడు.
ఉదయగిరి స్వాతంత్ర్యము తెచ్చుటసవరించు
1470నందు నరసింహరాయలు ఉదయగిరి పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన కంటంరాజు తమ్మరాజును ఓడించాడు. దీనితో కపిలేశ్వర గజపతి కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తమ తీరాంధ్ర భూభాగాలను గజపతులనుండి పునస్వాధీనము చేసుకున్నాడు.
బహుమనీ సైనికులను ఓడించుటసవరించు
తరువాత గజపతులు అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను బహుమనీలకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్ధాల తరువాత బహుమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ షా దండయాత్రకు బయలుదేరి రాజమహేంద్రవరమును గజపతుల నుండి ఆక్రమించి, కొండవీడును జయించి, కాంచీపురంను జయించి, విశేష ధనముతో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.
ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించాడు, తుళువ ఈశ్వర నాయకుడు అను గొప్ప శూరుడైన సేనానిని పంపి కందుకూరు వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో పెనుగొండ సిరిసంపదలతో తులతూగసాగినది.
మచిలీ పట్నం ఆక్రమణసవరించు
తరువాత స్వయంగా నరసింహరాయలు మచిలీపట్నంపైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు.
బహుమనీ ప్రతీకారంసవరించు
బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరల గొప్పసైన్యంతో దండయాతకు బయలుదేరి మచిలీపట్నం జయించి పెనుగొండను మాత్రం ఏమీ చేయలేకపొయినారు.
విజయ నగర సింహాసనము అధిస్టించుటసవరించు
సంగమ వంశీయులు చేతకానివార, చేవ చచ్చి, వ్యసనపరులై, సామంతుల నమ్మకాన్ని కోల్పోయినారు. సామంతుల కోర్కెపై సింహాసనం అధిస్టించాడు.
సింహాసనం అధిస్టించగానే సామంతుల తిరుగుబాటు అణిచివేసినాడు. తరువాత ఉదయగిరి యుద్ధములో ఓడిపోయి దానిని గజపతులస్వాధీనము చేసాడు.
వారసులుసవరించు
ఇతనికి ఇద్దరు కుమారులు, చివరి క్షణాలలో తన సేనాని అయిన తుళువ నరసనాయకునికి, కుమారులనూ రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు, బహుమనీల ఆధీనంలోని విజయనగర రాజ్య ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు.
సినిమాలలో ఈ రాజుసవరించు
అన్నమయ్య సినిమా చూసిన వారికి "గండరగండ, ....పెనుగొండ దుర్గాధిపతి ... సాళువ నరసింహ రాయ భూపతి ..." అంటూ స్టైలుగా మీసం మెలేసే మోహన్ బాబు పాత్ర గుర్తు ఉండే ఉంటుంది, ఆ సాళువ నరసింహ రాయ భూపతే, ఈ సాళువ నరసింహ రాయలు, ఇతని ఆస్తానంలోనే అన్నమయ్య ఉన్నారు, ఇతనే అన్నమయ్యను గొలుసులతో బంధించినాడని చిన్నన్న తన అన్నమయ్య చరిత్ర అను ద్విపద కావ్యంలో వ్రాసినారు.
ఇంతకు ముందు ఉన్నవారు: ప్రౌఢరాయలు |
విజయనగర సామ్రాజ్యము 1485 — 1491 |
తరువాత వచ్చినవారు: తిమ్మ భూపాలుడు |