శ్రీరంగ దేవ రాయలు

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

శ్రీరంగ రాయలు అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు తిరుమల దేవ రాయలు రెండవ కుమారుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల విజయం సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు.

ఇతను గోల్కొండ నవాబు అయిన ఇబ్రహీం కుతుబ్ షాతో మంచి స్నేహం చేసాడు. 1576లో అలీ ఆదిల్షా పెనుగొండపైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించారు. 1577లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచాడు.

1578లో బీజాపూరు సేనలు మరలా యుద్ధానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్ధంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్ధం చేశాడు. 1578లోనే ఇబ్రహీం కుతుబ్ షా ఆక్రమించిన అహోబిళం ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు.

1579లో గోల్కొండ సుల్తానులతో యుద్ధమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.

శ్రీరంగదేవరాయలు 1586లో మరణించాడు. అతనికి వారసులు లేనందున చిన్నతమ్ముడు వేంకటపతి దేవ రాయలు రాజయ్యాడు.

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
తిరుమల దేవ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1572 — 1586
తరువాత వచ్చినవారు:
రామ రాజు