దాస్యం వినయ్‌భాస్కర్

(దాస్యం వినయ్‌భాస్కర్‌ నుండి దారిమార్పు చెందింది)

దాస్యం వినయ్‌భాస్కర్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత్ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] 2015 నుండి ముఖ్యమంత్రి కార్యాలయపు పార్లమెంటరీ కార్యదర్శిగా,[2] తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నాడు.[3][4][5]

దాస్యం వినయ్‌భాస్కర్‌
దాస్యం వినయ్‌భాస్కర్


ఎమ్మెల్యే
నియోజకవర్గం పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-22) 1964 నవంబరు 22 (వయసు 60)
వరంగల్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం వడ్డేపల్లి, వరంగల్
మతం హిందూ

జననం, విద్యాభ్యాసం

మార్చు

వినయ్‌భాస్కర్‌ 1964, నవంబరు 22న రంగయ్య - శిలోత్రి దేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని పరకాలలో జన్మించాడు. ఇతని అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. వినయ్‌భాస్కర్‌ హైదరాబాదులోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల నుంచి తన 12వ తరగతిలో పట్టభద్రుడయ్యాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేశాడు.[6]

వ్యక్తిగత జీవితం

మార్చు

వినయ్‌భాస్కర్‌ కు రేవతితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

వినయ్‌భాస్కర్‌ 2004 లో హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. 2005లో టిఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2005-09 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో కార్పోరేటర్ గా ఉన్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారిగా ఎంఎల్ఏగా గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. 2010 ఉప ఎన్నికల్లో తిరిగి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2014, 2018 లలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[7][8]

2015 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు. 2019, సెప్టెంబర్ 7న ప్రభుత్వ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌ నియమితులయ్యాడు.[2][9][10]దాస్యం వినయ్ భాస్కర్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[11]

వినయ్‌భాస్కర్‌ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[12]

ఎన్నికల వివరాలు

మార్చు
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం పోలైన ఓట్లు ఓటు భాగస్వామ్యం% తేడా ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఇతర వివరాలు
1999 హన్మకొండ స్వతంత్ర ఓటమి 33,146 25.27% -19,426 ధర్మారావు మార్తినేని టీడీపీ - బీజేపీ 2వ రన్నర్‌గా, 1వ రన్నర్‌గా కాంగ్రెస్ కి చెందిన పి.వి. రంగారావు ప్రస్తుత స్థానంలో నిలిచారు.
2004 హన్మకొండ స్వతంత్ర ఓటమి 57,582 37.62% -3009 మందడి సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్
2009-10 వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ గెలుపు 45,807 39.64% 6,684 కొండపల్లి దయాసాగర్ రావు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు
2010-14 (ఉప ఎన్నిక) వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ గెలుపు 88,449 74.85% 67,524 కొండపల్లి దయాసాగర్ రావు కాంగ్రెస్ 2010లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ నిరసనల కారణంగా ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
2014-2018 వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ గెలుపు 82,496 59.31% 56,30,4 స్వర్ణ ఎర్రబెల్లి కాంగ్రెస్
2018-ప్రస్తుతం వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ గెలుపు 81,006 56.78% 36,451 రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ [13]

ఆస్తులు-కేసులు

మార్చు
  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 12,10,98,547 రూపాయలు.[14]
  • ఇతనిపై 1 కేసు కలదు.[14]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు. "Members of the Legislative Assembly". www.telangana.gov.in. Archived from the original on 2019-08-19. Retrieved 2017-02-01.
  2. 2.0 2.1 http://www.aponline.gov.in/tgportal/Parliamentarysecretaries.aspx Archived 2017-02-02 at the Wayback Machine Telangana Parliamentary Secretaries
  3. "List of MLAs" Archived 3 మార్చి 2016 at the Wayback Machine. APOnline
  4. "Four more MLAs may Join TRS - southindia - Andhra Pradesh - ibnlive". web.archive.org. 2011-11-04. Archived from the original on 2011-11-04. Retrieved 2021-10-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "TRS MLA resists arrest, tension in Warangal- Andhra Pradesh- IBNLive". web.archive.org. 2013-01-17. Archived from the original on 2013-01-17. Retrieved 2021-10-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  7. "Warangal West - Assembly Elections" Archived 2013-10-01 at Archive.today. Electionsone.com.
  8. ECI Results
  9. ఈనాడు, ప్రధానాంశాలు (8 September 2019). "బోడకుంటి, వినయ్‌కి కేబినెట్‌ హోదా - Warangal%2520Urban". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  10. Namasthe Telangana (1 May 2021). "ప్రభుత్వ పథకాలను కార్మికులు ఉపయోగించుకోవాలి". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  11. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  12. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  13. "Updated ECI results". Archived from the original on 2018-12-15. Retrieved 2021-10-27.
  14. 14.0 14.1 "Dasyam Vinay Bhasker(BRS):Constituency- WARANGAL WEST(HANUMAKONDA) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.