నాగాలాండ్ జిల్లాల జాబితా

నాగాలాండ్ లోవి జిల్లాలు

భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం, 2022 నాటికి 16 పరిపాలనా జిల్లాలను కలిగి ఉంది. అవి చుమౌకెడిమా, దిమాపూర్, కిఫిరే, కోహిమా, లాంగ్‌లెంగ్, మోకోక్‌చుంగ్, మోన్, నియులాండ్, నోక్లాక్, పెరెన్, ఫేక్, షామటోర్, టుయెన్‌సాంగ్, త్సెమినియు, జున్ వోక్హెటో.[1]

నాగాలాండ్ జిల్లాలు
స్థానంనాగాలాండ్
సంఖ్య16 జిల్లాలు
ప్రభుత్వంనాగాలాండ్ ప్రభుత్వం

చరిత్ర

మార్చు

1957 డిసెంబరు 1న, అస్సాంలోని నాగా హిల్స్ జిల్లా, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్) టుయెన్‌సాంగ్ ఫ్రాంటియర్ డివిజన్ కేంద్ర పాలిత నాగా హిల్స్ టుయెన్‌సాంగ్ ప్రాంతాన్ని ఏర్పరిచాయి. ఆ సమయంలో మునుపటి ఉపవిభాగాలు కోహిమా జిల్లా, మోకోక్‌చుంగ్ జిల్లా, ట్యూన్‌సాంగ్ జిల్లాగా మారాయి.1961 ఫిబ్రవరిలో నాగా హిల్స్ ట్యూన్‌సాంగ్ ప్రాంతం పేరు "నాగాలాండ్"గా మార్చబడింది. భారతదేశం లోని 16వ రాష్ట్రంగా నాగాలాండ్ 1963 డిసెంబరులో అవతరించింది .

1973 డిసెంబరు 19న మొకోక్‌చుంగ్ జిల్లా నుండి కొన్ని భూభాగాలు విభజించుట ద్వారా వోఖా జిల్లా, జున్‌హెబోటో జిల్లా, ట్యూన్‌సాంగ్ జిల్లా విభజించుట ద్వారా మోన్ జిల్లా, కొహిమా జిల్లా విభజించుట ద్వారా ఫేక్ జిల్లా సృష్టించబడ్డాయి. [2]

1997 డిసెంబరు 2న, కోహిమా జిల్లా విభజించుట ద్వారా దిమాపూర్ జిల్లా ఏర్పడింది.ఇది 1998 ఏప్రిల్లో ప్రారంభించబడింది [3] [4]

2003లో అక్టోబరు 24 న కిఫిరే జిల్లా, లాంగ్‌లెంగ్ జిల్లా, పెరెన్ జిల్లా అనే మరో మూడు జిల్లాలు కొత్తగా జోడించబడ్డాయి. [5] కిఫిరే, లాంగ్‌లెంగ్ జిల్లాలు తుయెన్‌సాంగ్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడ్డాయి. పెరెన్ జిల్లా కొహిమా జిల్లా నుండి విభజింపబడింది. [6]

నోక్లాక్ జిల్లా 2021 జనవరి 20న సృష్టించబడింది. గతంలో ఇది ట్యూన్‌సాంగ్ జిల్లాకు ఉప-జిల్లాగా ఉంది. [7]

2021 డిసెంబరు 18న మూడు కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి: దిమాపూర్ జిల్లాను విభజించగా చమౌకెడిమా జిల్లా, నియులాండ్ జిల్లా. అలాగే కొహిమా జిల్లా విభజించగా త్సెమినియు జిల్లా ఏర్పడ్డాయి. [8]

2022 జనవరి 19 న, ట్యూన్‌సాంగ్ విభజించంగా షామటోర్ జిల్లా నాగాలాండ్‌లోని 16వ జిల్లాగా సృష్టించబడింది. [9]

జిల్లాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[10] నాగాలాండ్‌ లోని పదహారు జిల్లాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, జనాభా, విస్తీర్ణం వివరాలు దిగువ విరంచబడ్డాయి.

వ.సంఖ్య జిల్లా ప్రధాన కార్యాలయం విస్తీర్ణం
(చ.కి.మీ)
ఎలియనేషన్ (మీటర్లు) జనాభా
మొత్తం
(2011)
గ్రామీణ ప్రాంతాల జనాభా పట్టణ ప్రాంతాల జనాభా ఏర్పడిన సంవత్సరం రాష్ట్రంలో జిల్లా స్థానం సూచించే పటం
1 చమౌకెడిమా జిల్లా చమౌకెడిమా 610 171 125,400 81,884 43,516 2021  
2 దీమాపూర్ జిల్లా దీమాపూర్ 70 145 170,000 0 170,000 1997  
3 కిఫెరె జిల్లా కిఫెరె 1,130 896 74,004 57,517 16,487 2004  
4 కోహిమా జిల్లా కోహిమా 1,207 1,444 267,988 146,900 121,088 1957  
5 లాంగ్‌లెంగ్ జిల్లా లాంగ్‌లెంగ్ 562 1,066 50,484 42,871 7,613 2004  
6 మొకొక్‌ఛుంగ్ జిల్లా మొకొక్‌ఛుంగ్ 1,719 1,325 194,622 138,897 55,725 1957  
7 మోన్ జిల్లా మోన్ 1,786 655 250,260 215,816 34,444 1973  
8 నియులాండ్ జిల్లా నియులాండ్ n/a 154 11,876 11,876 0 2021  
9 నోక్‌లాక్ జిల్లా నోక్‌లాక్ 1,152 59,300 59,300 0 2017  
10 పెరన్ జిల్లా పెరన్ 2,300 1,445 95,219 81,429 13,790 2004  
11 ఫెక్ జిల్లా ఫెక్ 2,026 1,524 163,418 138,843 24,575 1973  
12 షామటోర్ జిల్లా షామటోర్ n/a n/a 12,726 n/a n/a 2022  
13 త్సెమిన్యు జిల్లా త్సెమిన్యు 256 1,261 63,629 60,766 2863 2021  
14 తుఏన్‌సాంగ్ జిల్లా తుఏన్‌సాంగ్ 2,536 1,371 137,296 100,522 36,774 1957  
15 వోఖా జిల్లా వోఖా 1,628 1,313 166,343 131,339 35,004 1973  
16 జునెబోటొ జిల్లా జునెబోటొ 1,255 1,852 140,757 113,160 27,597 1973  

మూలాలు

మార్చు
  1. "Districts of Nagaland". A Gateway to Districts of India on the Web. New Delhi: National Informatics Centre. Archived from the original on 3 March 2016. Retrieved 4 January 2013.
  2. "District Census Handbook Mokokchung" (PDF). Census of India. 2011. Archived from the original (PDF) on 14 November 2015.
  3. "Know Your Districts: Phek - The Morung Express". The Morung Express. 8 June 2016. Archived from the original on 6 June 2019. Retrieved 1 December 2017.
  4. "About Wokha". Wokha Dist Administration. 2010.
  5. Patra, S. C.; Vachhani, Ashish (2011). Socio-Economic Profile of Rural India (series II). Concept Publishing Company. p. 106. ISBN 9788180697241. Retrieved 2014-08-06.
  6. "Nagaland: Know Your Districts - An overview -III - The Morung Express". The Morung Express. 17 October 2017. Archived from the original on 20 May 2019. Retrieved 1 December 2017.
  7. "Noklak is Nagaland's youngest district". Eastern Mirror. 21 December 2017. Archived from the original on 24 జూలై 2019. Retrieved 9 అక్టోబరు 2023.
  8. "Nagaland to have 3 more districts". Nagaland Post. December 18, 2021. Archived from the original on 2021-12-19. Retrieved December 19, 2021.
  9. "Nagaland govt grants district status to Shamator". ThePrint. 19 January 2022. Retrieved 19 January 2022.
  10. "Primary Census Abstract". Office of the Registrar General & Census Commissioner, India. 2011. Select State Nagaland, Select District All, Submit

వెలుపలి లంకెలు

మార్చు