బంగ్లాదేశ్‌లో హిందూమతం

2011 జనాభా లెక్కల ప్రకారం, బంగ్లాదేశ్‌లో, హిందూమతం రెండవ అతిపెద్ద మతం. సుమారు 1.273 కోట్ల మంది ప్రజలు హిందువులమని ఆ జనగణనలో చెప్పారు. మొత్తం 14.97 కోట్ల జనాభాలో ఇది 8.5%.[3][4] జనాభా పరంగా, భారతదేశం, నేపాల్ ల తరువాత బంగ్లాదేశ్ లోనే ప్రపంచంలో అతిపెద్ద హిందూ జనాభా ఉంది.

బంగ్లాదేశ్‌లో హిందూమతం
డాకేశ్వరీ ఆలయంలో దుర్గాపూజ
మొత్తం జనాభా
1,27,30,651 (2011 Census)
(8.54% of the country's population)Decrease
Regions with significant populations
బంగ్లాదేశ్ అంతటా, ముఖ్యంగా సిల్హెట్, చిట్టగాంగ్, ఖుల్నా
సిల్హెట్14,43,182 (17.8%)
ఖుల్నా24,19,010 (16.45%)
రంగాపూర్18,74,904 (13.54%)
చిట్టగాంగ్30,72,733 (12.65%)
డాకా27,21,416 (6.97%)
మతాలు
హిందూమతం (మెజారిటీ)[1]
Tribal religions identified as Hindus (minority)[2]
భాషలు
సంస్కృతం (Sacred)
బెంగాలీ, ఇతర గిరిజన భాషలు
Related ethnic groups
Indian Bengali Hindus

బంగ్లాదేశీ హిందూమతం భారత సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్తో పోలి ఉంటాయి. దేశ విభజన ముందు వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కలిసే ఉండేవి. [5] విస్తారమైన బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో మెజారిటీ బెంగాలీ హిందువులే. [6]

దుర్గ లేదా కాళికను విస్తృతంగా పూజిస్తారు.[7] సాధారణంగా బంగ్లాదేశ్‌లోని ఉన్నత కులాలలో శివుని ఎక్కువగా అరాధిస్తారు.[8] విష్ణువును మాత్రం (సాధారణంగా అతని అవతారాలు లేదా అవతారమైన రాముడు లేదా కృష్ణుడి రూపంలో ) కులాతీతంగా అందరూ ఆరాధిస్తారు.[9] బెంగాల్‌లో విష్ణు ఆరాధన, ప్రేమ, భక్తి సంప్రదాయంలో స్త్రీ పురుషుల కలయికను వ్యక్తపరుస్తుంది.[9][10] హిందూ విశ్వాసం లోని ఈ రూపం, ఇస్లాం లోని సూఫీ సంప్రదాయం బెంగాల్‌లో ఒకదానినొకటి ప్రభావితం చేసుకుని వ్యవహరించాయి.[9] బ్రాహ్మణులు లేదా ఉలేమాల మూస పద్ధతులు కాకుండా మత పెద్దలు-శిష్యుల వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెప్పే ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉద్యమాలే ఈ రెండు.[9][11] బెంగాలీ ఇస్లామిక్ సంప్రదాయం లాగానే, విష్ణు ఆరాధన తరచుగా చిన్నచిన్న భక్తి సమూహాల్లో (సమాజ్) జరుగుతుంది.[9] ఇద్దరూ దైవంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రేమ భాషను ఉపయోగిస్తారు.[9][12] రెండు సంప్రదాయాలలోనూ, బెంగాలీ భాష లోని గొప్ప సౌందర్యం భావోద్వేగ ప్రభావం కలిగిన ఆధ్యాత్మిక సాహిత్యమే మౌలిక వాహనం.[9] [13]

బంగ్లాదేశ్ హిందూమతంలో తీర్థ స్నానాలు, మొక్కులు, పవిత్ర నదులు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలకు చేసే తీర్థయాత్రలూ సాధారణంగా ఆచరించే పద్ధతులు. ఒక సాధారణ హిందువు ముస్లిం పీర్ల పుణ్యక్షేత్రాల వద్ద కూడా పూజలు చేస్తాడు, ఆ స్థలం ఏ మతానికి చెందినదనే దానితో సంబంధం లేకుండా.[9][13] హిందువులు చాలా మంది పవిత్ర పురుషులు, సన్యాసులను గౌరవిస్తారు.[9] గొప్ప పవిత్ర వ్యక్తి దర్శన మాత్రం చేత ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతామని కొందరు నమ్ముతారు.[9] సెప్టెంబరు-అక్టోబరులో జరిగే దుర్గా పూజ బంగ్లాదేశ్ హిందువుల అతి ముఖ్యమైన పండుగ. ఇది బంగ్లాదేశ్ అంతటా విస్తృతంగా జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకుని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వేల సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేస్తారు. కాళీ పూజ, జన్మాష్టమి, హోలీ, సరస్వతి పూజ, శివరాత్రి, రథయాత్ర, శతాబ్దాల నాటి ధామరాయ్ రథయాత్ర అత్యంత ప్రసిద్ధమైన ఇతర పండుగలు.

గొడ్డు మాంసం తినడానికి వ్యతిరేకంగా దాదాపు విశ్వవ్యాప్తంగా ఆచరించిన నియమాలలో అహింసా సూత్రం వ్యక్తమౌతుంది. బంగ్లాదేశ్ హిందువులందరూ శాకాహారులేమీ కాదు, కానీ అన్ని రకాల మాంసాహారానికి దూరంగా ఉండటం "ఉన్నత" ధర్మంగా పరిగణిస్తారు.[9][14] బంగ్లాదేశ్ బ్రాహ్మణులు దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల వారి మాదిరిగా కాకుండా, చేపలు, చికెన్ తింటారు. [15] [9] ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పోలి ఉంటుంది, ఇక్కడ హిందువులు చేపలు, గుడ్లు, చికెన్, మటన్ కూడా తింటారు. బంగ్లాదేశ్‌లో బెంగాలీయేతర హిందువులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని హజోంగ్, రాజ్‌బాంగ్షి ప్రజలు, త్రిపురిలలో ఎక్కువ మంది హిందువులు.[16]

జనాభా వివరాలు

మార్చు
బంగ్లాదేశ్‌లో హిందూమత శాతం, జనాభా
సంవత్సరం శాతం (%) హిందూ జనాభా ( ) మొత్తం జనాభా గమనికలు
1901 33.00 95,46,240 2,89,27,626 బెంగాల్ ప్రాంతం
1911 31.50 99,39,825 3,15,55,363 విభజనకు ముందు
1921 30.60 1,01,76,030 3,32,54,607
1931 29.40 1,04,66,988 3,56,04,189
1941 28.00 1,17,59,160 4,19,99,221
1951 22.05 92,39,603 4,20,62,462 పాకిస్తాన్ కాలంలో
1961 18.50 93,79,669 5,08,04,914
1974 13.50 96,73,048 7,14,78,543 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం తరువాత
1981 12.13 1,05,70,245 8,71,20,487
1991 10.51 1,11,78,866 10,63,15,583
2001 9.60 1,18,22,581 12,31,51,871
2011 8.54 1,27,30,651 14,97,72,364
 
ఢాకా విశ్వవిద్యాలయంలో సరస్వతి విగ్రహం,

2001 బంగ్లాదేశ్ జనాభా లెక్కల ప్రకారం, బంగ్లాదేశ్‌లో దాదాపు 1.182 కోట్ల మంది హిందువులు ఉన్నారు మొత్తం జనాభా 12.315 కోట్లలో ఇది 9.6%.[17] 2011 జనాభా లెక్కల ప్రకారం, దాదాపు 1.273 కోట్ల మంది ప్రజలు హిందువులు. మొత్తం 14.977 కోట్ల జనాభాలో ఇది 8.54% .[18] బంగ్లాదేశ్‌లోని స్థానిక దినపత్రిక ప్రచురించిన నివేదిక ప్రకారం, 2001 - 2011 మధ్య కాలంలో దేశంలో హిందువుల జనాభా దాదాపు పది లక్షలు తగ్గింది.[19] ఈ తగ్గింపు ప్రధానంగా తొమ్మిది జిల్లాల్లో జరిగింది.[20] యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ తాజా 2016 గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 7% మాత్రమే ఉన్నారు.[21] 2000 ల చివరలో బంగ్లాదేశ్‌లోని హిందువులు గోపాల్‌గంజ్, దినాజ్‌పూర్, సిల్హెట్, సునమ్‌గంజ్, మైమెన్‌సింగ్, ఖుల్నా, జెస్సోర్, చిట్టగాంగ్, చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో దాదాపు సమానంగా విస్తరించి ఉన్నారు. రాజధాని నగరం ఢాకాలో, ముస్లింల తర్వాత హిందువులు రెండవ అతిపెద్ద మత సమాజం. హిందువులు అత్యధిక సంఖ్యలో పాత నగరం లోని శంఖరి బజార్ చుట్టుపక్కల ఉంటారు.

2013లో, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1990లలో బంగ్లాదేశ్‌లో మరింత స్పష్టమైన ఇస్లామిస్ట్ రాజకీయ నిర్మాణాల పెరుగుదల ఫలితంగా చాలా మంది హిందువులు బెదిరింపులకు, దాడికి గురయ్యారు. చాలా గణనీయమైన సంఖ్యలో దేశం విడిచి భారతదేశం వెళ్తున్నారని నివేదించింది.[22]

1901లో, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది బ్రిటిషు భారతదేశంలో భాగంగా, బెంగాల్‌గా ఉండేది. అపుడు జనాభాలో హిందువులు 33% ఉండేవారు. కానీ 1931లో, అంటే బెంగాల్ విభజనకు ముందు, బ్రిటిష్ పాలనలో ఉండగానే హిందువుల శాతం 29.4%కి తగ్గింది. 1941లో హిందువులు జనాభా దాదాపు 28% మంది ఉన్నారు. ఇది భారతదేశ విభజన తర్వాత 1951లో 22.05%కి తగ్గింది, 1947లో భారతదేశ విభజన తర్వాత ధనిక, అగ్రవర్ణ హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. తూర్పు బెంగాల్ ఎవాక్యూ చట్టం ద్వారా వలస వచ్చిన సంపన్న హిందువులు తమ భూమిని, ఆస్తులనూ కోల్పోయారు. వెనుకబడిన పేద, మధ్యతరగతి హిందువులు కొత్త చట్టాల వల్ల వివక్షకు గురి అయ్యారు. 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, డిఫెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్డినెన్స్, తరువాత ఎనిమీ (కస్టడీ, రిజిస్ట్రేషన్) ఆర్డర్ II ద్వారా హిందువులను "శత్రువు"ల లాగా ముద్ర వేసారు. వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.[23] అప్పటి నుంచి దాదాపు సగానికి పడిపోయింది. 1974 బంగ్లాదేశ్ జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 13.5%కి పడిపోయింది. స్వాతంత్ర్యం తరువాత కూడా, హిందువులకు "భారతీయ తొత్తుల"నీ, నమ్మదగని పౌరులనీ ముద్ర వేసారు.[24] 1947లో విభజన జరిగిన వెంటనే తూర్పు పాకిస్తాన్ ఉనికిలోకి వచ్చినపుడు పట్టణ హిందూ జనాభాలో గణనీయమైన మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు బంగ్లాదేశ్‌గా ఉన్న ప్రాంతాన్ని విడిచి భారతదేశానికి వలస వెళ్ళింది. వీరిలో చాలా మంది తూర్పు బెంగాలీ శరణార్థులు తమ వలసల తర్వాత భారతీయ సమాజంలో చురుకైన పాత్ర పోషించారు. 1971లో, పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసిన యుద్ధం సమయంలో, ఇదే విధమైన దృశ్యం జరిగింది.[25]

1971 నుండి, హిందువుల శాతం తగ్గుతూనే ఉంది, 2011 నాటికి జనాభాలో 8.96% మంది ఉన్నారు. జనాభాలో వాటాలో ఈ పతనానికి బాహ్య వలసలే కారణమని చెప్పారు. హిందువుల సంతానోత్పత్తి రేటు ముస్లింల కంటే స్థిరంగా తక్కువగా ఉంది (2014 నాటికి హిందువుల్లో 2.1, ముస్లిముల్లో 2.3).[26][27]

 
ఒక్కో ఉపజిల్లాలో హిందువుల శాతం

పరిపాలనా విభాగాల వారీగా హిందూ జనాభా

మార్చు
బంగ్లాదేశ్ విభజనల అంతటా హిందూ జనాభా (2011) [28]
విభజన హిందూ జనాభా ( </img> ) మొత్తం జనాభా శాతం (%)
బారిసల్ 7,61,779 8,248,404 9.24
చిట్టగాంగ్ 20,05,004 28,423,019 7.05
ఢాకా 24,85,910 36,433,505 6.82
ఖుల్నా 20,30,309 15,687,759 12.94
మైమెన్‌సింగ్ 4,64,232 10,990,913 4.22
రాజ్షాహి 10,81,584 18,484,858 5.85
రంగపూర్ 20,86,148 15,787,758 13.21
సిల్హెట్ 13,91,911 9,910,219 14.05
బంగ్లాదేశ్ జిల్లాల్లో హిందూ జనాభా (2011)[29]
జిల్లా హిందూ జనాభా ( ) మొత్తం జనాభా %
బర్గుణ 68,678 8,92,781 7.69
బారిసల్ 2,71,706 23,24,310 11.69
భోలా 61,162 17,76,795 3.44
ఝలోకటి 68,572 6,82,669 10.04
పటుఖాలీ 1,05,496 14,60,781 7.22
పిరోజ్‌పూర్ 1,86,165 11,11,068 16.76
బందర్బన్ 13,137 3,88,335 3.38
బ్రాహ్మణబారియా 2,11,899 28,40,498 7.46
చాంద్‌పూర్ 1,45,551 24,16,018 6.02
చిట్టగాంగ్ 8,61,494 76,16,352 11.31
కొమిల్లా 2,58,105 53,87,288 4.79
కాక్స్ బజార్ 97,648 22,89,990 4.26
ఫెని 83,773 14,37,371 5.83
ఖగ్రాచారి 1,03,195 6,13,917 16.81
లక్ష్మీపూర్ 59,417 17,29,188 3.44
నోఖాలి 1,40,541 31,08,083 4.52
రంగమతి 30,244 5,95,979 5.07
ఢాకా 5,66,368 1,20,43,977 4.7
ఫరీద్‌పూర్ 1,80,366 19,12,969 9.43
గాజీపూర్ 1,76,582 34,03,912 5.19
గోపాల్‌గంజ్ 3,53,794 11,72,415 30.18
కిషోరేగంజ్ 1,58,538 29,11,907 5.44
మదరిపూర్ 1,41,097 11,65,952 12.1
మాణిక్‌గంజ్ 1,30,095 13,92,867 9.34
మున్షిగంజ్ 1,14,655 14,45,660 7.93
నారాయణగంజ్ 1,44,105 29,48,217 4.89
నార్సింగి 1,25,769 22,24,944 5.65
రాజబరి 1,06,974 10,49,778 10.19
షరియత్పూర్ 41,330 11,55,824 3.58
టాంగైల్ 2,46,237 36,05,083 6.83
బాగర్హాట్ 2,70,874 14,76,090 18.35
చూడడంగ 26,514 11,29,015 2.35
జెస్సోర్ 3,10,184 27,64,547 11.22
జెనైదా 1,67,880 17,71,304 9.48
ఖుల్నా 5,25,727 23,18,527 22.68
కుష్టియా 56,792 19,46,838 2.92
మగురా 1,64,578 9,18,419 17.92
మెహెర్పూర్ 7,870 6,55,392 1.2
నరైల్ 1,48,339 7,21,668 20.56
సత్ఖిరా 3,51,551 19,85,959 17.7
జమాల్‌పూర్ 38,832 22,92,674 1.69
మైమెన్‌సింగ్ 1,83,026 51,10,272 3.58
నెట్రోకోనా 2,07,430 22,29,642 9.3
షేర్పూర్ 34,944 13,58,325 2.57
బోగ్రా 2,05,333 34,00,874 6.04
చపాయ్ నవాబ్‌గంజ్ 66,602 16,47,521 4.04
జోయ్‌పుర్హాట్ 80,696 9,13,768 8.83
నవోగావ్ 2,87,919 26,00,157 11.07
నాటోర్ 1,03,747 17,06,673 6.08
పాబ్నా 73,487 25,23,179 2.91
రాజ్షాహి 1,22,394 25,95,197 4.72
సిరాజ్‌గంజ్ 1,41,406 30,97,489 4.57
దినాజ్‌పూర్ 5,83,313 29,90,128 19.51
గైబంధ 1,67,897 23,79,255 7.06
కురిగ్రామం 1,35,484 20,69,273 6.55
లాల్మోనిర్హత్ 1,74,558 12,56,099 13.9
నిల్ఫమరి 2,93,385 18,34,231 15.99
పంచాఘర్ 1,63,404 9,87,644 16.54
రంగపూర్ 2,58,684 28,81,086 8.98
ఠాకూర్‌గావ్ 3,09,423 13,90,042 22.26
హబీగంజ్ 3,52,407 20,89,001 16.87
మౌల్వీబజార్ 4,71,974 19,19,062 24.59
సునమ్‌గంజ్ 3,19,376 24,67,968 12.94
సిల్హెట్ 2,48,154 34,34,188 7.23
సంవత్సరం శాతం పెంచు
1901 33% -
1911 31.5% -1.5%
1921 30.6% -0.9%
1931 29.4% -1.2%
1941 28% -1.4%
1951 22% -6%
1961 18.5% -3.5%
1974 13.5% -5%
1981 12.1% -1.4%
1991 10.5% -1.6%
2001 9.6% -0.9%
2011 8.5% -1.1%

ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న హిందూ జనాభా మొత్తం జనాభాలో 1940లో 28% నుండి 2011 నాటికి 8.5%కి తగ్గింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత, హిందూ సమాజం జనాభా శాతం క్షీణించడం కొనసాగింది-1974లో 13.5% నుండి 2011లో 8.5%కి [30][31] 2016 అధికారిక లెక్కల ప్రకారం, హిందువుల జనాభా 7%కి తగ్గిపోయిందని అంచనా.[32]

అంచనాలు

మార్చు

భవిష్యత్ జనాభా

మార్చు

ప్యూ పరిశోధనా కేంద్రం ప్రకారం, బంగ్లాదేశ్‌లో 2050 నాటికి 1.447 కోట్ల హిందువులు ఉంటారు. దేశ జనాభాలో ఇది 7.3%గా ఉంటుంది.[33] 2050 నాటికి బంగ్లాదేశ్ జనాభా కనీసం 23-25 కోట్లు ఉంటుందని మరొక సిద్ధాంతం సూచిస్తుంది,[34] అందులో దాదాపు 85.1-92.5 లక్షల మంది హిందువులు ఉంటారు. అంటే శతాబ్ది రెండవ సగం మొదట్లో కేవలం 3.7% మాత్రమే హిందువులు ఉంటారు.[35] సగటున, ఏటా 2,30,612 మంది హిందువులు బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారతదేశానికి శాశ్వతంగా వస్తున్నారు. కాబట్టి ఈ వలసలు ఇలాగే కొనసాగితే 2011-2051 మధ్య 92,24,480 మంది హిందువులు దేశం విడిచి వెళ్లిపోతారని అంచనా.[36]

బంగ్లాదేశ్‌లో భవిష్యత్ హిందూ జనాభా
సంవత్సరం మొత్తం జనాభా హిందూ జనాభా శాతం
2020 16,81,80,000 1,37,90,000 8.2%
2030 18,34,30,000 1,44,90,000 7.9%
2040 19,35,50,000 1,47,10,000 7.6%
2050 19,82,19,000 1,44,70,000 7.3%
మూలం:[33][37][38]

"మాయమైన" జనాభా

మార్చు

1947 దేశ విభజన తరువాత ప్రజలు భారతదేశం లోని పశ్చిమ బెంగాల్‌లోకి వలస వెళ్లడంతో తూర్పు బెంగాల్ జనాభాలోని మత నిష్పత్తి గణనీయంగా మారింది. ఇదే తరువాత బంగ్లాదేశ్‌గా మారింది. 1950 లు, 1960 లలో ఇక్కడ హింస కూడా పెరిగింది. ఇది పెద్ద సంఖ్యలో అగ్రవర్ణ బెంగాలీ హిందువులు పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలకు వలస వెళ్ళారు. అధికారిక భారత ప్రభుత్వ రికార్డుల ప్రకారం 41.2 లక్షల (హిందూ) శరణార్థులు 1947 - 1958 మధ్య తూర్పు బెంగాల్ నుండి వలస వెళ్ళారు.[39]

1947 నుండి 2001 వరకు 55 సంవత్సరాల కాలంలో జనాభా అధ్యయనాలను, ఇతర పద్ధతులనూ ఉపయోగించి, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన ప్రొఫెసర్ సచి దస్తిదార్, ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉండాల్సిన 4.9 కోట్లకు పైగా హిందువులు "లేర"ని లెక్కించాడు.[40][41][42] 1947 లో విభజన తరువాత జరిగిన సంఘటనలు జరక్కపోతే ప్రస్తుత బాంగ్లాదేశ్ హిందూ జనాభా సుమారు 6.273 కోట్లు, అంటే 31.4% ఉండేదని అతను తన నివేదికలో చెప్పాడు.[40][41][43][44][45]

జనాభా వివాదాలు

మార్చు

బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన 2011 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువుల అధికారిక సంఖ్య దాదాపు 1.273 కోట్లు లేదా 8.5%.[46] అయితే, కొన్ని సమయాల్లో వివిధ నాయకులు అలాగే బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వేర్వేరు అంచనాలను అందించారు.

బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువుల సంఖ్య (2013-2021 అంచనా. )
మూలం జనాభా (%) దావా వేసిన సంవత్సరం సూచన
బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పినది 1,55,00,000 (10.3%) 2014 [47]
బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పినది 1,70,00,000 (10.7%) 2016 [47]
బంగ్లాదేశ్ హిందూ జనజాగృతి సమితి చైర్మన్ రవీంద్ర ఘోష్ చెప్పినది 1,80,00,000 (11.04%) 2019 [48]
క్లెయిమ్ చేయబడిన బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (పరిచయం) 1,81,50,000 (12.1%) (తెలియదు) [49]
KMS నాయకుడు అఖిల్ గొగోయ్ చెప్పినది 1,90,00,000 (11.65%) 2019 [50]
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై 2019 నివేదిక: బంగ్లాదేశ్ (US స్టేట్ డిపార్ట్‌మెంట్) 1,52,80,000 (10%) 2019 [51]
బంగ్లాదేశ్ మహా హిందూ కూటమి నాయకుడు గోవిందో ప్రమాణిక్ చెప్పినది 2,50,00,000 (15.7%) 2019 [52]

హిందూ దేవాలయాలు

మార్చు

హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కాంతాజీ ఆలయం 18వ శతాబ్దపు ఆలయాలకు ఒక సొగసైన ఉదాహరణ. ఢాకాలో ఉన్న ఢాకేశ్వరి ఆలయం, ప్రాముఖ్యత పరంగా అత్యంత ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలో హిందూ సంస్థలు దుర్గాపూజ, కృష్ణ జన్మాష్టమిని చాలా ప్రముఖంగా ఏర్పాటు చేస్తారు. ఢాకాలోని ఇతర ప్రధాన ఆలయాలు రామకృష్ణ మిషన్, జాయ్ కాళి ఆలయం, లక్ష్మీ నారాయణ మందిరం, స్వామి బాగ్ ఆలయం, సిద్ధేశ్వరి కాళీమందిర్.[53]

19వ శతాబ్దపు ప్రారంభంలో నిర్మించిన, బ్రాహ్మణబారియాలోని కాల్ భైరబ్ ఆలయంలో దేశంలోనే అతిపెద్ద శివుని విగ్రహం ఉంది. బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రముఖ హిందూ దేవాలయాలు, ఆశ్రమాల్లో చంద్రనాథ్ ఆలయం, ఆదినాథ్ ఆలయం, సుగంధ, జెషోరేశ్వరి కాళీ ఆలయం, పంచ రత్న గోవింద ఆలయం, భబానీపూర్ శక్తిపీఠ్ , చత్తేశ్వరి ఆలయం, ధామ్రాయ్ జగన్నాథ రథ్, పుతియా ఆలయం కాంప్లెక్స్, కంతాజేవ్ ఆలయం, కొమిల్లా జగన్నాథ ఆలయం. శ్రీ శైల్, బిశ్వనాథ్ ఆలయం, బోరో కాళీ బారి ఆలయం, ముక్తగచా శివాలయం, శ్యాంసుందర్ ఆలయం, చంద్రబాతి ఆలయం, లాల్మాయి చండీ ఆలయం, జోర్బంగ్లా ఆలయం, సోనారంగ్ జంట దేవాలయాలు, జగన్నాథ ఆలయం, పాబ్నా, రాజు కాంగ్సా నారాయణ్ ఆలయం, బరోడి లోకేనాథ్ ఆశ్రమం, శ్రీ సత్యనారాయణ్ ఆశ్రమం మందిర్, శ్రీ అంగన్, వాహెద్‌పూర్ గిరిధామ్, చిట్టగాంగ్‌లోని రామకృష్ణ సేవాశ్రమం, రామ్ ఠాకూర్ ఆశ్రమం, రామ్‌గోంజ్‌లోని మా పింగళ ఆలయం, లక్ష్మీపూర్ మొదలైనవి ఉన్నాయి.

స్థిరాస్తి చట్టం కారణంగా అనేక హిందూ దేవాలయాలు నష్టపోయాయి. ఈ చట్టం ద్వారా భూమి, చరాస్తులు వివిధ ప్రభుత్వాల తరపున వ్యవహరించిన్న ఏజెంట్ల కబ్జాకు గురయ్యాయి.[54] మత కలహాలు (ఇటీవల 1990, 1992, 2001లో) సంభవించినప్పుడు హిందూ దేవాలయాలు అధిక-ప్రమాదకర ప్రాంతాలుగా ఉండేవి. సున్నితమైన ప్రదేశాలను రక్షించడానికి సైన్యాన్ని పిలవడం తరచుగా అవసరమౌతూ ఉంటుంది.[55]

హిందూ వివాహ చట్టం

మార్చు
 
ఒక సాధారణ బంగ్లాదేశ్ హిందూ వివాహం .

హిందూ కుటుంబ చట్టం బంగ్లాదేశ్‌లోని హిందువుల వ్యక్తిగత జీవితాన్ని నియంత్రిస్తుంది. బంగ్లాదేశ్‌లో హిందూ పురుషుడు ఎంత మందిని పెళ్ళి చేసుకోవచ్చు అనే పరిమితి లేదు కాబట్టి బంగ్లాదేశ్‌లో హిందూ పురుషునికి బహుభార్యాత్వం చట్టబద్ధం.[56]

"బంగ్లాదేశ్ హిందూ (సివిల్) చట్టం ప్రకారం, పురుషులకు బహుళ సంఖ్యలో భార్యలు ఉండవచ్చు. కానీ అధికారికంగా విడాకులు తీసుకునే అవకాశం లేదు" అని నివేదిక పేర్కొంది.

హిందూ పౌర చట్టాల ప్రకారం మహిళలు వారసత్వంగా ఆస్తి పొందడం నిషేధించబడింది అని ఆ నివేదిక పేర్కొంది.

బంగ్లాదేశ్‌లోని రీసెర్చ్ ఇనిషియేటివ్స్, MJF సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో 26.7 శాతం మంది హిందూ పురుషులు, 29.2 శాతం హిందూ మహిళలూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, అయితే ప్రస్తుత చట్టాల కారణంగా అలా చేయడం లేదనీ తేలింది.[57]

సామాజిక సమస్యలు

మార్చు

బంగ్లాదేశ్‌లో ముస్లిం సమాజం ఎదుర్కొనే అనేక సమస్యలను హిందూ సమాజమూ ఎదుర్కొంటోంది. వీటిలో స్త్రీల హక్కులు, వరకట్నం, పేదరికం, నిరుద్యోగం తదితరాలు ఉన్నాయి. హిందూ సంస్కృతి, దేవాలయాల నిర్వహణ వంటివి హిందూ సమాజానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలు. హిందువులను రాజకీయంగా, సామాజికంగా వేరుచేయడానికి చిన్నపాటి ఇస్లామిస్టుల వర్గాలు నిరంతరం ప్రయత్నిస్తూంటాయి.[58] బంగ్లాదేశ్‌లోని హిందువులు అన్ని ప్రాంతాలలో (నారాయణగంజ్ మినహా) చెల్లాచెదురుగా ఉన్నందున, వారు రాజకీయంగా ఏకం కాలేరు.[59]అయితే, వివిధ ఎన్నికలలో హిందువులు స్వేచ్ఛా ఓటర్లుగా మారారు. హిందువులు సాధారణంగా బంగ్లాదేశ్ అవామీ లీగ్, కమ్యూనిస్ట్ పార్టీలకు పెద్ద ఎత్తున ఓటు వేస్తారు. ఎందుకంటే, దేశంలో లౌకికవాదానికి నామమాత్రపు నిబద్ధతైనా కలిగిన పార్టీలు ఇవి మాత్రమే;[60] ప్రత్యామ్నాయాలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జాతీయ పార్టీ వంటి ఇస్లామిస్ట్ అనుకూల సెంట్రిస్ట్ పార్టీలు (ఈ రెంటికీ బంగ్లాదేశ్ జాతీయవాద సంస్కరణలో ముస్లిం పార్టీలనే గుర్తింపు ఉంది) లేదా పూర్తిగా ఇస్లామిస్ట్ జమాత్-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ (పాకిస్తాన్ ఆధారిత జమాత్-ఇ-ఇస్లామీకి శాఖ) ఇస్లామిక్ చట్టాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. దీని ప్రకారం ముస్లిమేతరులుగా హిందువులకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అయితే, హిందువులు సాధారణంగా, ఉదారవాద ముస్లింలతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. దుర్గా పూజ ఈద్ అల్-ఫితర్ వంటి పండుగలలో ఇరువర్గాల వారూ పాల్గొంటారు.[61]

బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అట్రాసిటీస్ (1971)

మార్చు

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 20వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద మారణహోమానికి దారితీసింది. మరణించిన వారి సంఖ్య 2,00,000–30,00,000 కాగా, తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్తాన్ సైన్యం చేసిన దాడిలో హిందువులు దామాషాను మించి బలయ్యారని సహేతుకంగా కచ్చితంగా చెప్పవచ్చు.[63] విమోచన యుద్ధ సమయంలో పాకిస్తానీ సైన్యం చాలా మంది బెంగాలీ హిందువులను హతమార్చింది. బెంగాలీ హిందువుల యాజమాన్యంలోని చాలా వ్యాపారాలను శాశ్వతంగా నాశనం చేసారు. ఢాకాలోని చారిత్రిక రామనా కాళి దేవాలయం, ధామ్రాయ్‌లోని శతాబ్దాల నాటి రథాన్ని పాకిస్తానీ సైన్యం కూల్చివేసి దగ్ధం చేసింది. [65]

స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభ కాలం (1972–75)

మార్చు

కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశం యొక్క మొదటి రాజ్యాంగంలో, మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా, లౌకికవాదాన్నీ పౌరులందరికీ సమానత్వాన్నీ పొందుపరచారు. [66] విముక్తి పొందిన బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, షేక్ ముజిబుర్ రెహమాన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగంలో, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో హిందూ జనాభా యొక్క అసమాన బాధలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 1972 ఫిబ్రవరిలో భారతదేశంలోని కోల్‌కతా పర్యటనలో, ముజీబ్ ఇప్పటికీ అనేక లక్షల మంది బంగ్లాదేశ్ హిందువులకు ఆతిథ్యం ఇస్తున్న శరణార్థి శిబిరాలను సందర్శించి, వారిని బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని, దేశాన్ని పునర్నిర్మించడానికి సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశాడు.

షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం లౌకికవాదాన్ని, ముస్లిమేతర మత సమూహాల హక్కులను పునఃస్థాపనకు నిబద్ధతతో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితులకు సంబంధించి అతని పాలనలోని రెండు ముఖ్యమైన అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి.[67] మొదటిది ఢాకాలో చారిత్రికంగా అత్యంత ముఖ్యమైన ఆలయమైన రామనా కాళీ మందిర్ ప్రాంగణాన్ని ఆస్తిని కలిగి ఉన్న మతపరమైన సంస్థకు తిరిగి ఇవ్వడానికి అతను నిరాకరించడం. శతాబ్దాల నాటి ఈ హిందూ దేవాలయాన్ని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది. దాదాపు వంద మంది భక్తులు హతులయ్యారు. శత్రు ఆస్తి చట్టంలోని నిబంధనల ప్రకారం, వారసత్వ హక్కులను క్లెయిమ్ చేయడానికి జీవించి ఉన్న సభ్యులు లేనందున ఆస్తి యాజమాన్యాన్ని స్థాపించలేమని ప్రభుత్వం నిర్ధారించింది. భూమిని ఢాకా క్లబ్‌కు అప్పగించారు.[68][69]

రెండవది, ముజీబ్ పాలనలో శత్రు ఆస్తి చట్టంలోని నిబంధనల ప్రకారం హిందువుల యాజమాన్యంలోని ఆస్తిని ప్రభుత్వం జప్తు చేయడం ప్రబలంగా ఉండేది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన అబుల్ బర్కత్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందాక 35 సంవత్సరాలలో షేక్ ముజీబ్‌కు చెందిన అవామీ లీగ్ పార్టీ హిందువుల ఆస్తులను బదిలీ చేయించుకున్న అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది.[70] పాకిస్తాన్ సైన్యం చేసిన మారణహోమంలో బంగ్లాదేశ్ హిందువులు అనుభవించిన ప్రత్యేక హింస, గందరగోళం, స్థానభ్రంశం దీనికి బాగా దోహదం చేసాయి. టైమ్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ ప్రచురణలు, డిక్లాసిఫైడ్ హమూదుర్ రెహమాన్ కమిషన్ నివేదిక ఈ విషయాలను వివరంగా చెప్పాయి. ప్రత్యేకించి లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించిన అనుకూల వైఖరి నేపథ్యంలో ఇది బంగ్లాదేశ్ హిందువులలో చాలా వేదన కలిగించింది.[71]

రెహ్మాన్, హుస్సేన్ ల పాలనల (1975–1990)

మార్చు

అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ రాజ్యాంగం చెప్పిన లౌకికవాద నిబంధనను విడిచిపెట్టాడు. జాతీయ జీవితంలోని అన్ని రంగాలలో (అధికారిక ముద్రలు, రాజ్యాంగ ప్రవేశిక వంటివి) ఇస్లామిక్ ప్రతీకవాదాన్ని ప్రవేశపెట్టడం ప్రారంభించాడు. జియా బహుళ-పార్టీ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చాడు. తద్వారా జమాత్-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ వంటి సంస్థలను తిరిగి సమూహపరచడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికీ అనుమతి లభించింది.

1988లో అధ్యక్షుడు హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ ఇస్లాంను బంగ్లాదేశ్ జాతీయ మతంగా ప్రకటించాడు. ఈ చర్యను విద్యార్థులు, వామపక్ష రాజకీయ పార్టీలు, మైనారిటీ సమూహాలు నిరసించినప్పటికీ, ఈ రోజు వరకు BNP లేదా అవామీ లీగ్ పార్టీలకు చెందిన పాలనలు ఈ మార్పును సవాలు చేయలేదు. అది అమలు లోనే ఉంది.[72]

1990లో, బాబ్రీ మసీదు సంఘటన తర్వాత జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అతిపెద్ద మతపరమైన కల్లోలాలు. ఈ కల్లోలాల్లో ఎర్షాద్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా (కొన్ని మానవ హక్కుల విశ్లేషణలైతే, వాళ్ళు ఈ గొడవల్లో చురుకుగా పాల్గొన్నారని ఆరోపించాయి) నిందలు వచ్చాయి. తన పాలనపై వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతనుండి దృష్గ్టి మళ్ళించేందుకు అతడు దీనికి పాల్పడ్డాడు.[73][74] 1971 తర్వాత మొదటిసారిగా ఢాకేశ్వరి దేవాలయంతో సహా అనేక హిందూ దేవాలయాలు, హిందువుల పరిసరాలు, దుకాణాలు దాడికి గురయ్యాయి, దెబ్బతిన్నాయి. ఈ దారుణాలను చాలా మంది బంగ్లాదేశీయులు పాశ్చాత్య దృష్టికి తీసుకువచ్చారు. అందులో తస్లీమా నస్రిన్ ఒకరు. ఆమె పుస్తకం లజ్జా ఆంగ్లంలోకి అనువదించబడింది. [75]

తిరిగి ప్రజాస్వామ్యానికి (1991–2008)

మార్చు

2001 అక్టోబరు ఎన్నికలలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రతిపక్ష అవామీ లీగ్‌కు మద్దతుగా నిలబడినందుకు ప్రతీకారంగా పాలక సంకీర్ణానికి చెందిన కార్యకర్తలు హిందువులపై పెద్ద ఎత్తున దాడి చేశారు. వందలాది మందిని చంపేసారు. అనేకమంది అత్యాచారానికి గురయ్యారు. వేలాది మంది భారతదేశానికి పారిపోయారు.[76] భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగానే ఈ సంఘటనలు జరిగాయని భావించారు.[77]

తీవ్రవాద భావాలను ఆకర్షించడానికి మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికీ ప్రముఖ రాజకీయ నాయకులు తరచుగా "హిందూ ద్వేషాన్ని" ఆశ్రయిస్తారు. గత ప్రధానమంత్రి ఖలీదా జియా, 1996 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉండగా, మసీదుల నుండి, అజాన్ స్థానంలో హిందూ స్త్రీలు పలికే ఉలుద్వాణి వినిపించే ప్రమాదం పొంచి ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. (1996 నవంబరు 18 నాటి ఏజెన్సీ-ఫ్రాన్స్ ప్రెస్ రిపోర్టు, "మత భావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు").[78]

2001 ఎన్నికల్లో ఇస్లామిక్ అనుకూల మితవాద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతృత్వంలోని రెండు ఇస్లామిస్ట్ పార్టీలతో సహా ( జమాత్-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్, ఇస్లామీ ఐక్య జోటే ) మితవాద కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు, చాలా మంది మైనారిటీ హిందువులు, ఉదారవాద సెక్యులరిస్టు ముస్లింలపై పాలక వర్గం ఒకటి దాడి చేసింది. వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు, తమపై కొత్త ప్రభుత్వ సానుభూతిపరులు చేసిన హింస నుండి తప్పించుకోవడానికి భారతదేశానికి పారిపోయారు.[79] ఈ కాలంలో హిందువులపై జరిగిన అకృత్యాలను నమోదు చేయడంలో చాలా మంది బంగ్లాదేశ్ ముస్లింలు చురుకైన పాత్ర పోషించారు.[78][80]

ఎన్నికల తర్వాత ముస్లిమేతర మైనారిటీలపై జరిగిన ఆరోపణలను డాక్యుమెంట్ చేయడానికి మీడియా చేసిన ప్రయత్నాలను కొత్త ప్రభుత్వం అడ్డుకుంది. హింసాత్మక బెదిరింపులు, ఇతర బెదిరింపుల ద్వారా ప్రభుత్వానికి నేరుగా నియంత్రణ లేని వార్తాపత్రికలపైన, ఇతర మీడియాపైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అత్యంత ప్రముఖంగా, ముస్లిం పాత్రికేయుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన షహరియార్ కబీర్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ శరణార్థులను ఇంటర్వ్యూ చేసి, భారతదేశం నుండి తిరిగి రాగానే దేశద్రోహం ఆరోపణలపై అతన్ని అరెస్టు చేసారు; ఇది బంగ్లాదేశ్ హైకోర్టు ద్వారానే జరిగింది. తరువాత అతను విడుదలయ్యాడు.[81]

BNP, జాతీయ పార్టీ వంటి ఛాందసవాదులు, మితవాద పార్టీలు హిందువులను భారతదేశ సానుభూతిపరులుగా చిత్రీకరిస్తాయి. వాళ్ళు ఆర్థిక వనరులను భారతదేశానికి బదిలీ చేస్తున్నారని చెబుతూ, బంగ్లాదేశ్ హిందువులు రాజ్యానికి అవిధేయులనే విస్తృతమైన అవగాహనకు ఆజ్యం పోస్తూంటారు. అలాగే, హిందువులు అవామీ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారని మితవాద పార్టీలు పేర్కొంటాయి.[82] ప్రార్థనా స్థలాలపై, భక్తులపై విస్తృతంగా దాడులు జరగడంతో హిందువులు స్వేచ్ఛగా ఆరాధించడం కోసం అధికారులు భద్రతను పెంచవలసి వచ్చిందని అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా వచ్చింది.[83]

ఇస్లామిక్ ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్ళు జరిపాక, దుర్గాపూజ, రథయాత్ర వివిధ మైనారిటీ వేడుకల సమయంలో భద్రతను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.[84]

2006 అక్టోబరులో, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ 'బంగ్లాదేశ్ పై పాలసీ ఫోకస్' అనే శీర్షికతో ఒక నివేదికను ప్రచురించింది. దేశంలో జరిగిన గత ఎన్నికల నుండి, 'బంగ్లాదేశ్ మతపరమైన తీవ్రవాదులు చేసే హింస పెరుగుతోంది. దేశంలోని మతపరమైన మైనారిటీలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు తీవ్రతర మయ్యాయి' అని ఆ నివేదికలో చెప్పింది. మతపరమైన, రాజకీయ లేదా నేరపూరిత కారకాలు లేదా కొన్ని కలయికల వల్ల ప్రేరేపించబడిన హింస తీవ్రవాదం పెరుగుతున్న కాలంలో హిందువులకు హాని పొంచి ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశం పట్ల విధేయత ఉందనే ఆరోపణలు, ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు సహించని మత విశ్వాసాల కారణంగా బంగ్లాదేశ్‌లో హిందువులకు అనేక ప్రతికూలతలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. హిందువులపై హింస "వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు, పారిపోయేలా ప్రోత్సహించడానికి" జరిగింది. గతంలో హిందూ అమెరికన్ ఫౌండేషన్ చేసిన నివేదికలు ఈ పక్షపాతరహిత నివేదిక ద్వారా ధ్రువీకరించబడ్డాయి.[85][86]

బంగ్లాదేశ్, మైనారిటీ హిందువులపై హింసకు పాల్పడిందని 2006 నవంబరు 2న, USCIRF విమర్శించింది. 2007 జనవరిలో బంగ్లాదేశ్ తదుపరి జాతీయ ఎన్నికలకు ముందు మతపరమైన స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల పరిరక్షణను నిర్ధారించడానికి ఢాకాను బుష్ ప్రభుత్వం కోరింది [85][86]

షేక్ హసీనా కాలం (2008–ప్రస్తుతం)

మార్చు

2013లో, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ 1971 బంగ్లాదేశ్ దురాగతాల సమయంలో హిందువులపై యుద్ధ నేరాలకు పాల్పడినందుకు పలువురు జమాత్ సభ్యులపై అభియోగాలు మోపింది. ప్రతీకారంగా, బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ హిందూ మైనారిటీలపై హింసను ప్రేరేపించింది.[87]

BJHM ( బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహాజోతే ) తన నివేదికలో 2017లో కనీసం 107 మంది హిందూ సమాజంలో మరణించారని, 31 మంది గల్లంతయ్యారని, 782 మంది హిందువులు బలవంతంగా దేశం విడిచి వెళ్లవలసి వచ్చిందని లేదా పారిపొమ్మని వారిని బెదిరించారనీ పేర్కొంది. 23 మందిని బలవంతంగా ఇతర మతాలలోకి మార్చారు. కనీసం 25 మంది హిందూ స్త్రీలు, పిల్లలపై అత్యాచారం చేశారు, సంవత్సరంలో 235 దేవాలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసాయి. 2017 లో హిందూ సమాజంపై జరిగిన దురాగతాల మొత్తం సంఖ్య 6474.[88]

2019 బంగ్లాదేశ్ ఎన్నికల సమయంలో ఒక్క ఠాకూర్‌గావ్‌లోనే హిందూ కుటుంబాలకు చెందిన ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.[89] 2019 ఏప్రిల్‌లో, బ్రాహ్మణ్‌బారియాలోని కాజీపరాలో కొత్తగా నిర్మించిన ఆలయంలో లక్ష్మి, సరస్వతి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.[90] అదే నెలలో, మదారిపూర్ సదర్ ఉపజిల్లాలోని రెండు దేవాలయాలలో నిర్మాణంలో ఉన్న అనేక హిందూ దేవతల విగ్రహాలను దుండగులు అపవిత్రం చేశారు.[91]

2021లో, బంగ్లాదేశ్‌లో నరేంద్ర మోడీ పర్యటనపై హెఫాజాత్-ఎ-ఇస్లాం, తదితర రాడికల్ గ్రూపులు మోడీ వ్యతిరేక నిరసనలలో దాడి చేసిన తరువాత అనేక దేవాలయాలు, ఇళ్ళు కూలగొట్టారు. ధ్వంసం చేసారు.[92][93][94] అదేవిధంగా, 2020లో హిందువులపై దాడులు జరిగాయి, శామ్యూల్ పాటీ హత్య తర్వాత వారిలో కొందరు ఫ్రాన్స్‌కు మద్దతు పలికారు.[95] అదే సంవత్సరం అక్టోబరులో బంగ్లాదేశ్‌లో బెంగాలీ హిందువులపై తీవ్రమైన మత హింస జరిగింది. దుర్గాపూజ ఫలకాల వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారనే పుకార్లు వ్యాపించాయి, దీనిలో 120 కంటే ఎక్కువ హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దాదాపు 7 గురు హిందువులను చంపేసారు.[96][97] దీనిని ది న్యూయార్క్ టైమ్స్ "అనేక సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన మత హింస"గా అభివర్ణించింది.[98]

రాజకీయ ప్రాతినిధ్యం

మార్చు

1974లో బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 13.5% నుండి క్షీణించిన తర్వాత కూడా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, జనాభా లెక్కల ప్రకారం 2001లో హిందువులు జనాభాలో దాదాపు 9.2% ఉన్నారు. అయితే, 2001 ఎన్నికల తర్వాత 300 మంది సభ్యుల పార్లమెంటులో హిందువులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు; 2004లో ఉప ఎన్నికల విజయం తర్వాత ఇది ఐదుకు పెరిగింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నేరుగా నామినేట్ చేసే మహిళల 50 సీట్లలో ఒక్కటి కూడా హిందువులకు కేటాయించలేదు. రాజకీయ ప్రాతినిధ్యం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. పాకిస్తాన్ పాలనలో ఉన్నప్పుడు ఉన్న మతపరమైన ఎన్నికల వ్యవస్థను తిరిగి నెలకొల్పాలని అనేక హిందూ న్యాయవాద సమూహాలు డిమాండ్ చేశాయి. తద్వారా పార్లమెంటులో మరింత న్యాయమైన, దామాషా ప్రాతినిధ్యం లభిస్తుంది. వారు దానికి చెప్పే కారణం 1946 నుండి హిందువులపై హింస కొనసాగుతూనే ఉంది [99]

మొత్తం శాతం పరంగా హిందువుల జనాభా క్షీణిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో వారి భౌగోళిక కేంద్రీకరణ కారణంగా వారు ఇప్పటికీ గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు. కనీసం రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలలో (ఖుల్నా-1, గోపాల్‌గంజ్-3) హిందువులకు మెజారిటీ ఉంది. కనీసం మరో ముప్పై నియోజకవర్గాల్లో 25% కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కారణంగా, వారు తరచుగా పార్లమెంటరీ ఎన్నికలలో నిర్ణయాత్మక అంశంగా ఉంటారు. ఇక్కడ విజయాల మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది హిందువులను ఎన్నికలలో ఓటు వేయనీకుండా అడ్డుకుంటారని తరచూ ఆరోపిస్తూంటారు. ఓటర్లను భయపెట్టడం ద్వారా లేదా ఓటరు జాబితా సవరణలలో మినహాయించడం ద్వారా ఇలాంటి పనులు చేస్తూంటారు.[100]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Lorea 2016, p. 89
  2. Lea Schulte-Droesch (10 September 2018). Making place through ritual : land, environment and region among the Santal of Central India. p. 187. ISBN 978-3-11-053973-8. OCLC 1054397811.
  3. "Population & Housing Census-2011: Union Statistics" (PDF). Bangladesh Bureau of Statistics. March 2014. p. xiii. Archived (PDF) from the original on 3 September 2017. Retrieved 2015-04-17.
  4. "Bangladesh Population (2021) - Worldometer". www.worldometers.info (in ఇంగ్లీష్). Retrieved 2021-05-04.
  5. Rummel 1998, p. 877.
  6. Nasrin 2014, pp. 67–90.
  7. "Kali Puja on Saturday". Dhaka Tribune. 2020-11-13. Retrieved 2021-02-13.
  8. "The Subaltern Deities of Bengal Are up Against Aggressive Hindutva Now". The Wire. Retrieved 2021-02-13.
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 9.11 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. Mark W. Muesse (2011). The Hindu traditions. Internet Archive. Fortress Press. pp. 6670. ISBN 978-0-8006-9790-7.
  11. Chari, S. M. Srinivasa (1994). Vaiṣṇavism: Its Philosophy, Theology, and Religious Discipline (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publishe. pp. 32–33. ISBN 978-81-208-1098-3.
  12. "International Journal of Hindu Studies | Volumes and issues". SpringerLink (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
  13. Aquil, Raziuddin. "History of a distinct culture". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
  14. Ray, Krishnendu (2004g). The Migrants Table: Meals And Memories In (in ఇంగ్లీష్). Temple University Press. p. 1014. ISBN 978-1-4399-0561-6.
  15. Bandyopadhyay 2004.
  16. Refugees, United Nations High Commissioner for. "Refworld - World Directory of Minorities and Indigenous Peoples - Bangladesh : Adivasis". Refworld.
  17. Nagarajan, Rema (22 May 2010). "Door out of Dhaka". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-09.
  18. "Official Census Results 2011 page xiii" (PDF). Bangladesh Government. Archived (PDF) from the original on 3 September 2017. Retrieved 2015-04-17.
  19. https://www.dw.com/en/bangladeshi-hindus-seeking-safety-in-india/a-19310941
  20. alaldulal (2014-04-12). "Is this the Bangladesh we wanted? Analyzing the Hindu Population Gap (2001-2011)". আলাল ও দুলাল | ALAL O DULAL (in ఇంగ్లీష్). Retrieved 2021-04-21.
  21. "As per as Bangladesh Bureau of Statistics, The country's Hindu population have declined from 8.5% in 2011 to 7% in 2016". News Indian Express.
  22. "Bangladesh: Wave of violent attacks against Hindu minority". Amnesty International. 6 March 2013. Archived from the original on 5 November 2018. Retrieved 9 November 2015.
  23. "Door out of Dhaka Rema Nagarajan". Retrieved 2010-05-22.
  24. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Lintner అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  25. "Not Bengalis,Hindus were Pakistani targets in 1971 Bangladesh War,claims new book". The Indian Express (in ఇంగ్లీష్). 2013-10-16. Retrieved 2021-05-04.
  26. Streatfield, Peter Kim; Karar, Zunaid Ahsan (2008). "Population Challenges for Bangladesh in the Coming Decades". Journal of Health, Population, and Nutrition. 26 (3): 261–272. PMC 2740702. PMID 18831223.
  27. "Population & Housing Census 2011 (Zila Series & Community Series)". http (in ఇంగ్లీష్). Retrieved 2021-07-23.[permanent dead link]
  28. "Population & Housing Census 2011 (Zila Series & Community Series)". http (in ఇంగ్లీష్). Retrieved 2021-07-23.[permanent dead link]
  29. Ashraf, Ajaz. "Interview: Hindus in Bangladesh have faced ethnic cleansing since 1947". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
  30. Mithun, Mahanam Bhattacharjee (2019-05-14). "Reasons Behind the Forced Migration of Bangladeshi Hindu Religious Minorities to India". International Journal on Minority and Group Rights (in ఇంగ్లీష్). 26 (3): 461–483. doi:10.1163/15718115-02603002. ISSN 1385-4879.
  31. "At a mere 7 per cent, Bangladesh Hindus under threat, says US rights activist". The New Indian Express. Retrieved 2021-07-20.
  32. 33.0 33.1 "Projected Changes in the Global Hindu Population". Pew Research Center's Religion & Public Life Project (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-04-02. Retrieved 2021-02-09.
  33. "What will Bangladesh look like in 2050?". The Daily Star (in ఇంగ్లీష్). 2018-04-14. Retrieved 2021-05-09.
  34. "Violence Against Minority Hindus in Bangladesh: An Analysis". www.vifindia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-05-09.
  35. "No Hindus will be left in Bangladesh after 30 years: professor". The Hindu (in Indian English). PTI. 2016-11-22. ISSN 0971-751X. Retrieved 2021-04-22.
  36. Alam, Nurul; Barkat-e-Khuda (2011). "Demographics of Muslims and Non-Muslims in Bangladesh". Demography India. 40 (1): 163–174 – via ResearchGate.
  37. "Religions in Bangladesh | PEW-GRF". www.globalreligiousfutures.org. Archived from the original on 2022-04-09. Retrieved 2021-04-22.
  38. "Homepage". home.iitk.ac.in. Retrieved 2021-04-21.
  39. 40.0 40.1 "Ethnic cleansing of Hindus on rise in Bangladesh". The New Indian Express. Retrieved 2021-04-21.
  40. 41.0 41.1 https://www.ohchr.org
  41. https://www.ipf.org.in › EncycPDF Bangladesh Book final english - India Policy Foundation
  42. https://www.ipf.org.in › EncycPDF Bangladesh Book final english - India Policy Foundation
  43. Welle (www.dw.com), Deutsche. "Bangladeshi Hindus seeking safety in India | DW | 07.06.2016". DW.COM (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-05-04.
  44. alaldulal (2014-04-12). "Is this the Bangladesh we wanted? Analyzing the Hindu Population Gap (2001-2011)". আলাল ও দুলাল | ALAL O DULAL (in ఇంగ్లీష్). Retrieved 2021-04-21.
  45. Manish, Sai (2019-12-11). "Resurgence of Bengali-phobia driving anti-CAB protests in Assam". Business Standard India. Retrieved 2021-05-09.
  46. 47.0 47.1 "Bangladesh's Hindus number 1.7 crore, up by 1 p.c. in a year: report". The Hindu (in Indian English). PTI. 2016-06-23. ISSN 0971-751X. Retrieved 2021-05-09.
  47. "Atrocities on Hindus in Bangladesh: Now, 1.8 crore Hindu Bengali citizens of Bangladesh are ready to go to India, said Ravindra Ghosh, Chairman of Bangladesh Hindu Janajagruti Samiti" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-09.
  48. https://mofa.gov.bd/site/page/6dde350b-1ca6-4c69-becd-a3f12cf14ac1/Bangladesh--An-Introduction
  49. "Protests across Assam over Citizenship (Amendment) Bill". The Hindu (in Indian English). PTI. 2019-12-06. ISSN 0971-751X. Retrieved 2021-05-09.
  50. https://www.state.gov › reports › ba.
  51. "As per as Bangladesh Bureau of Statistics, there are around 2.5 crore Hindus living in the country, constituting 15.7 per cent of the population as of 2019 year". Apn news.
  52. "Top 10 Hindu Temple in Bangladesh (Oldest And Biggest)". Travel Mate (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-11. Retrieved 2021-04-22.
  53. Feldman, Shelley (2016-04-22). "The Hindu as Other: State, Law, and Land Relations in Contemporary Bangladesh". South Asia Multidisciplinary Academic Journal (in ఇంగ్లీష్) (13). doi:10.4000/samaj.4111. ISSN 1960-6060.
  54. "'Black' property law still haunts Bangladesh minorities - UCA News". ucanews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-04-22.
  55. "Bangladesh: Family code". Archived from the original on 2019-05-18. Retrieved 2009-06-10.
  56. "Hindus can practice polygamy in Bangladesh; forbidden to divorce, remarry". Business Standard. IANS. 2017-08-16. Retrieved 2021-02-09.
  57. "बांग्लादेश में ¨हदू परिवारों के हमलावरों पर हो कार्रवाई : सुशील". Dainik Jagran.
  58. Alexandar and ed 2015, pp. 210–215; Chakravarti 2017, pp. 650–651; Lorea 2016, pp. 110–112.
  59. বাংলাদেশ আওয়ামী লীগ এর গঠনতন্ত্র [Constitution of Bangladesh Awami League] (in Bengali). Archived from the original on 29 July 2017. Retrieved 21 November 2016.
  60. "We were originally Hindus, says Bangladeshi author Sharbari Zohra Ahmed". The Hindu (in Indian English). PTI. 2020-01-01. ISSN 0971-751X. Retrieved 2021-02-13.
  61. Murshid 2018, p. 21
  62. [1][62]
  63. "Pakistan: The Ravaging of Golden Bengal". Time. Vol. 98, no. 5. 2 August 1971. Archived from the original on 11 March 2007. Retrieved 2013-10-25.
  64. An article in Time magazine dated 2 August 1971, stated "The Hindus, who account for three-fourths of the refugees and a majority of the dead, have borne the brunt of the Moslem military's hatred."[64] Senator Edward Kennedy wrote in a report that was part of United States Senate Committee on Foreign Relations testimony dated 1 November 1971, "Hardest hit have been members of the Hindu community who have been robbed of their lands and shops, systematically slaughtered, and in some places, painted with yellow patches marked "H". All of this has been officially sanctioned, ordered and implemented under martial law from Islamabad". In the same report, Senator Kennedy reported that 60% of the refugees in India were Hindus and according to numerous international relief agencies such as UNESCO and World Health Organization, the number of East Pakistani refugees at its peak in India was close to 10 million. The Pulitzer Prize–winning journalist Sydney Schanberg covered the start of the war and wrote extensively on the suffering of the East Bengalis, including the Hindus both during and after the conflict. In a syndicated column "The Pakistani Slaughter That Nixon Ignored", he wrote about his return to liberated Bangladesh in 1972. "Other reminders were the yellow "H"s the Pakistanis had painted on the homes of Hindus, particular targets of the Pakistani army, (Newsday, 29 April 1994).
  65. Nasrin 2014, pp. 78–79.
  66. Krishnaswami Aiyangar, Sakkottai (1921). South India and her Muhammadan invaders (in English). London: H. Milford, Oxford University Press. OCLC 5212194.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  67. "Bangladesh slammed for persecution of Hindus". www.rediff.com. Retrieved 2021-02-13.
  68. Gupta, Jyoti Bhusan Das (2007). Science, Technology, Imperialism, and War (in ఇంగ్లీష్). Pearson Education India. p. 733. ISBN 978-81-317-0851-4.
  69. "Discrimination against Bangladeshi Hindus: Report". rediff.com. Retrieved 2021-02-22.
  70. Mujtaba, Syed Ali (2005). Soundings on South Asia (in ఇంగ్లీష్). Sterling Publishers Pvt. Ltd. p. 100. ISBN 978-1-932705-40-9.
  71. "Bangladesh Parliament Votes To Make Islam State Religion". The New York Times. 8 June 1988. Retrieved 2013-10-25.
  72. "Primary Report". Hrcbm.org. 31 October 1990. Retrieved 2013-10-25.
  73. "South Asia: Afghanistan" (PDF). United States House Committee on International Relations. Archived from the original (PDF) on 2006-12-29.
  74. Nasrin 2014.
  75. Ramananda Sengupta (22 March 2006). "The truth about Bangladesh's Hindus". Rediff.com. Retrieved 2013-10-25.
  76. "Analysis: Fears of Bangladeshi Hindus". BBC News. 19 October 2001. Retrieved 2013-10-25.
  77. 78.0 78.1 "Bangladesh". State.gov. Retrieved 2013-10-25.
  78. "India state warns of Bangladesh refugees". BBC News. 15 November 2001. Retrieved 2013-10-25.
  79. "Bangladesh Hindu atrocities 'documented'". BBC News. 8 November 2001. Retrieved 2013-10-25.
  80. "Bangladesh scribe arrest 'illegal'". BBC News. 12 January 2002. Retrieved 2013-10-25.
  81. "Bangladesh: Wave of violent attacks against Hindu minority". Amnesty International. 6 March 2013. Archived from the original on 5 November 2018. Retrieved 9 November 2015.
  82. "Security fears for Hindu festival". BBC News. 8 October 2002. Retrieved 2013-10-25.
  83. "Business & Financial News, U.S & International Breaking News | Reuters". www.reuters.com. Archived from the original on 31 March 2007. Retrieved 2021-02-22.
  84. 85.0 85.1 "Bangladesh slammed for persecution of Hindus". Rediff.com. Archived from the original on 3 March 2016. Retrieved 2013-10-25.
  85. 86.0 86.1 "Original USCIRF Report, United States Commission on International Religious Freedom" (PDF). Uscirf.gov. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 2013-10-25.
  86. "Bangladesh: Wave of violent attacks against Hindu minority". Press releases. Amnesty International. Archived from the original on 9 March 2013. Retrieved 2013-03-08.
  87. "BJHM: 107 Hindus killed, 31 forcibly disappeared in 2017". Dhaka Tribune. 2018-01-06. Archived from the original on 29 March 2019. Retrieved 2019-10-30.
  88. "Hindu houses under 'arson' attack ahead of Bangladesh elections". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 20 April 2019. Retrieved 2019-10-30.
  89. "Hindu idols vandalized in Brahmanbaria". Dhaka Tribune. 2019-04-08. Retrieved 2019-10-30.
  90. "Hindu idols desecrated in Madaripur". Dhaka Tribune. 2019-04-26. Retrieved 2019-10-30.
  91. "Extremist Islamist group's supporters attack 70-80 Hindu houses in Bangladesh: Police". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-04-22.
  92. "Bangladesh violence spreads after PM Modi's visit, attacks on Hindu temples, train - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-04-22.
  93. "Hardline Hefazat-e-Islam supporters attack Hindu village in Bangladesh: Report". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2021-04-22.
  94. "Hindu homes attacked in Bangladesh over rumours about alleged Facebook post slandering Islam". The Hindu (in Indian English). PTI. 2020-11-02. ISSN 0971-751X. Retrieved 2021-04-22.
  95. "Seven dead after violence erupts during Hindu festival in Bangladesh". the Guardian (in ఇంగ్లీష్). 2021-10-16. Retrieved 2021-11-21.
  96. "Police: Comilla resident Iqbal placed the Quran on a Puja idol". Dhaka Tribune. 2021-10-20. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-21.
  97. Hasnat, Saif; Mashal, Mujib (2021-10-15). "Bangladesh Strengthens Security as Violence Targets Hindu Festival". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-11-21.
  98. "Home - Noakhali Noakhali". Noakhalinoakhali.webs.com. Archived from the original on 11 April 2012. Retrieved 2013-10-25.
  99. "Hindu areas in Ctg still out of listing". The Daily Star. Archived from the original on 2016-08-17. Retrieved 2016-08-16.