భీష్మ (2020 సినిమా)
భీష్మ 2020, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారధ్యంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, రష్మిక మందణ్ణా, అనంత్ నాగ్, జిషు సేన్‌గుప్తా, విజయ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా, మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.[3]
భీష్మ | |
---|---|
దర్శకత్వం | వెంకీ కుడుముల |
రచన | వెంకీ కుడుముల |
స్క్రీన్ ప్లే | వెంకీ కుడుముల |
కథ | వెంకీ కుడుముల |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | నితిన్, రష్మికా మందన్న, అనంత్ నాగ్, జిషు సేన్‌గుప్తా, విజయ నరేష్, వెన్నెల కిషోర్ |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | మహతి స్వర సాగర్ |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | సితార ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 21 ఫిబ్రవరి, 2020[1] |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹40 కోట్లు[2] |
కథా నేపథ్యం
మార్చుభీష్మ ఆర్గానిక్స్ అధినేత భీష్మ (అనంత్ నాగ్) సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యం పంచాలనుకుంటాడు. ఫీల్డ్ సైన్స్ గ్రూప్ ఓనర్ అయిన రాఘవన్ (జిషు సేన్ గుప్తా) మాత్రం ఆరోగ్యం దెబ్బతీసే పురుగు మందులు కనిపెట్టి వాటితో ఎక్కువ దిగుబడి సాధించి బిజినెస్‌లో భీష్మ ఆర్గానిక్స్‌ను దాటాలి అని చూస్తుంటాడు. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న భీష్మ(నితిన్) గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి టైమ్‌లో అనుకోకుండా చైత్ర (రష్మిక మందణ్ణా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే, భీష్మ (నితిన్) స్టేటస్ వల్ల రష్మిక తండ్రి (సంపత్) వాళ్ళ ప్రేమను ఒప్పుకోడు.
అదే టైమ్‌లో జూనియర్ భీష్మ అయిన నితిన్‌ని భీష్మ ఆర్గానిక్స్‌కి 30 రోజుల పాటు ఆపరేషనల్ సీఈఓగా ప్రకటిస్తాడు భీష్మ ఆర్గానిక్స్ అధినేత భీష్మ (అనంత్ నాగ్). అయితే, భీష్మ ఆర్గానిక్స్‌కి భీష్మ (నితిన్)ని ఎందుకు ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేసారు, ఈ 30 రోజుల్లో రాఘవన్ పన్నిన కుట్రల నుండి సీఈఓ అయిన భీష్మ ఎలా తన కంపెనీని కాపాడుకున్నాడు, చైత్రతో తన ప్రేమకథను ఎలా సుఖాంతం చేసుకున్నాడన్నది మిగతా కథ.
నటవర్గం
మార్చు- నితిన్
- రష్మికా మందన్న
- అనంత్ నాగ్
- జిష్షూసేన్ గుప్తా
- విజయ నరేష్
- వెన్నెల కిషోర్
- సంపత్ రాజ్
- అజయ్
- ప్రవీణ
- బ్రహ్మాజీ
- మైమ్ గోపి
- కల్యాణి నటరాజన్
- రఘుబాబు
- శుభలేఖ సుధాకర్
- కల్పలత
- సత్యన్
- సత్య
- శివకుమార్
- అప్పాజీ అంబరీష దర్భా
- నారా శ్రీనివాస్
- సుదర్శన్
- హెబ్బా పటేల్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వెంకీ కుడుముల
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
- రచన: వెంకీ కుడుముల
- స్క్రీన్ ప్లే: వెంకీ కుడుముల
- కథ: వెంకీ కుడుముల
- సంగీతం:మహతి స్వర సాగర్
- ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
- కూర్పు: నవీన్ నూలి
- పంపిణీదారు: సితార ఎంటర్టైన్మెంట్స్
నిర్మాణం
మార్చునితిన్ పుట్టినరోజున రష్మిక మందన్న సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం గురించి ప్రకటించింది.[4] 2019, జూన్ నెలలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది.[5][6] కన్నడ నటుడు అనంత్ నాగ్ కీలక పాత్రకు సంతకం చేయగా, బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ పాత్రకు సంతకం చేశారు.[7][8] "హే చూసా" పాట ఇటలీలోని పోసిటానోలో చిత్రీకరించబడింది.[9]
మార్కెటింగ్
మార్చుదీపావళి సందర్భంగా ఈ చిత ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీ ప్రకటిస్తూ తొలి టీజర్ విడుదలైంది.[10] ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను 2020 ఫిబ్రవరి 17న హారిక & హాసిన్ క్రియేషన్స్ విడుదల చేసింది.[11]
విడుదల
మార్చు2019, డిసెంబరు 25 ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ 2020, ఫిబ్రవరి 21న విడుదలయింది.
హోమ్ మీడియా
మార్చు2020, ఏప్రిల్ 25న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టిలలో ఇంగ్లీష్ షబ్ టైటిల్స్ తో విడుదలైంది.[12]
పాటలు
మార్చుఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సింగిల్స్ గీతం (రచన: శ్రీమణి)" | శ్రీమణి | అనురాగ్ కులకర్ణి | 3:23 |
2. | "వ్వాట్టే బ్యూటీ (రచన: కాసర్ల శ్యామ్)" | కాసర్ల శ్యామ్ | ధనుంజయ్, అమల చేబోలు | 3:55 |
3. | "సరా సరి (రచన: శ్రీమణి)" | శ్రీమణి | అనురాగ్ కులకర్ణి | 4:01 |
4. | "సూపర్ క్యూట్ (రచన: శ్రీమణి)" | శ్రీమణి | నకేష్ అజిజ్ | 3:41 |
5. | "హేయ్ చూసా (రచన: కృష్ణ చైతన్య)" | కృష్ణ చైతన్య | సంజన కల్మాన్జి | 3:30 |
మొత్తం నిడివి: | 18:30 |
బాక్సాఫీస్
మార్చువిదేశాలలో ఈ చిత్రం మొదటి వారంలో 684,000 డాలర్లకు పైగా వసూలు చేసింది.[13][14]
పురస్కారాలు
మార్చుసైమా అవార్డులు
మార్చు2020 సైమా అవార్డులు
- ఉత్తమ హాస్యనటుడు (వెన్నెల కిషోర్)
మూలాలు
మార్చు- ↑ Creations, Haarika & Hassine (6 November 2019). "Here's the first glimpse of #Bheeshma. A very Happy Birthday to our Guiding Force & Wizard of Words, #Trivikram garu. #BheeshmaFirstGlimpse #HBDTrivikram Let's meet in theatres on 21st Feb 2020 @actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar".
- ↑ "Nithiin and Rashmika Mandanna's Bheeshma has minted over Rs 85 crore in 7-day first week at the worldwide box office". The Times of India. 29 February 2020. Retrieved 2020-10-23.
- ↑ "Nithiin Reddy and Rashmika Mandanna launch the first look poster of Bheeshma | Regional News". zeenews.india.com. Archived from the original on 7 November 2019. Retrieved 2020-10-23.
- ↑ Mandanna, Rashmika (29 March 2019). "Happy happiest birthday to you @actor_nithiin siiirrrrrr have a great year ahead!! @VenkyKudumula @vamsi84 @SitharaEnts this year is going to be so much fun. Let's show the fun we had while shooting on screens as well..can't wait! #Bheeshma #HappyBirthdayNithiinpic.twitter.com/GZp4tDGVTL". Retrieved 2020-10-26.
- ↑ Mandanna, Rashmika (12 June 2019). "All set! #Bheeshma Excited can't wait for the shoot to start. @actor_nithiin @VenkyKudumula @vamsi84 @SitharaEntspic.twitter.com/zC6P1qdoFx". Retrieved 2020-10-26.
- ↑ Entertainments, Sithara (11 June 2019). "Finally, For all @actor_nithiin fans who have been waiting for #Bheeshma, we have an exciting update. Pooja ceremony of the movie will be held tomorrow and more details about the film will follow soon @iamRashmika @venkykudumula @vamsi84pic.twitter.com/pipjR1W12i". Retrieved 2020-10-26.
- ↑ "Veteran actor Anant Nag returns to Telugu with Bheeshma - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 7 November 2019. Retrieved 2020-10-26.
- ↑ "'Bheeshma' Trailer: Formulaic but entertaining". NTV. 18 February 2020. Archived from the original on 2020-10-29. Retrieved 2020-10-26.
- ↑ "Hey Choosa from Bheeshma released". The Times of India. 3 March 2020. Retrieved 2020-10-26.
- ↑ "Bheeshma First Look: చిట్టి నడుముని ఒడిసి పట్టు.. 'భీష్మ' ఫస్ట్‌లుక్ పోస్టర్లు అదుర్స్ - nithin, rashmika mandanna starrer bheeshma first look released". Samayam Telugu. Archived from the original on 7 November 2019. Retrieved 2020-10-26.
- ↑ Bheeshma Theatrical Trailer - Nithiin, Rashmika Mandanna - Venky Kudumula. Haarika & Hassine Creations. YouTube. 17 February 2020. Retrieved 2020-10-26.
- ↑ "Bheeshma". sunnxt.com. Retrieved 2020-10-23.
- ↑ "US Box Office Bheeshma Inching Towards 1 Million". telugucinema.com. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.
- ↑ "Bheeshma Box Office Collection heading towards next Tollywood Hit". 26 February 2020. Archived from the original on 26 అక్టోబరు 2020. Retrieved 23 అక్టోబరు 2020.