మదన్ కార్కి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మదన్ కార్కి వైరముత్తు ఒక భారతీయ గేయ రచయిత, సినీ కథా రచయిత, పరిశోధకుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వ్యవస్థాపకుడు. క్వీన్స్లాండ్ విశ్వ విద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పట్టా పొందిన కార్కి, గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా వృత్తి ఆరంభించి, కొంత కాలానికే పాటల రచయితగా, సంభాషణల రచయితగా తమిళ సినీరంగ ప్రవేశం చేశారు. 2013 మొదట్లో అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి, పూర్తిగా సినీ పరిశ్రమకే నిమిత్తమయ్యారు. అదే సమయంలో భాషా పరిజ్ఞానంపై ప్రధాన దృష్టితో కార్కి రిసెర్చ్ ఫౌండేషన్ (కా.రె.ఫో.) అనే విద్యా పరిశోధన సంస్థను ప్రారంభించారు. చిన్న పిల్లల మానసిక ఎదుగుదలకు విద్యతో కూడిన ఆసక్తికరమైన ఆటలు, కథల పుస్తకాలు తయారు చేసేందుకు మెల్లినం ఎడ్యుకేషన్ అనే సంస్థను స్థాపించారు. స్వతంత్ర సంగీతాన్ని ప్రోత్సహించేందుకు, సినిమా పాటల పంపిణీ కోసం డూపాడూ అనే ఆన్లైన్ వేదికను కూడా ప్రారంభించారు.
మదన్ కార్కి | |
---|---|
జననం | మదన్ కార్కి వైరముత్తు 1980 మార్చి 10 |
జాతీయత | భారతదేశవాసి |
పౌరసత్వం | భారత దేశము |
విద్యాసంస్థ |
|
వృత్తి | గీత రచయిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆచార్యుడు |
జీవిత భాగస్వామి | నందిని కార్కి |
పిల్లలు | హైకు |
తల్లిదండ్రులు | వైరముత్తు పొన్మణి |
బంధువులు | కబిలన్ వైరముత్తు (సోదరుడు) |
తొలి జీవితం
మార్చుగేయ రచయితగా ఏడు సార్లు జాతీయ అవార్డు పొందిన వైరముత్తు, మీనాక్షి మహిళా కళాశాలకు చెందిన ప్రముఖ అధ్యాపకురాలు, తమిళ పండితురాలైన పొన్మణి గార్ల పెద్ద కుమారుడు మదన్ కార్కి. ఈయన తమ్ముడు కబిలన్ ఓ నవలా రచయిత, తమిళ సినీ మాటల, పాటల రచయిత.
విద్యాభ్యాసం
మార్చుమదన్ కార్కి చెన్నై నగరంలో పెరిగారు. కొడంబాకంలోని లయోలా మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చదువుకున్నారు. తమిళం, ఆంగ్ల భాషల్లో మాత్రమే రాణించే తాను, గొప్ప విద్యార్థిని కానని అభిప్రాయపడేవారు. హై స్కూల్ రోజుల నుండే కంప్యూటర్ సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకుని, 1997లో అన్నా యూనివర్సిటీకి చెందిన గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీలో చేరారు.
ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రొఫెసర్ టి. వి. గీత గారి పర్యవేక్షణలో తమిళ భాషలోని అక్షరాలను మాటలుగా మార్చడమే లక్ష్యంగా తమిళ్ వాయిస్ ఇంజన్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను రూపొందించారు. కౌలాలంపూర్, మలేషియాలోని తమిళ్ ఇంటర్‌నెట్ కాన్‌ఫరెన్స్‌కు ఈ పరిశోధన ఎంపికయింది.
క్రియేటివిటీ, ఇన్నొవేషన్ అండ్ న్యూ ప్రాడక్ట్ డెవలప్‌మెంట్ అనే కోర్సులో భాగంగా, భారతీయ ధ్వని శాస్త్రానికి సంబంధించిన పేర్లను యాధృచ్చితంగా ఉత్పత్తి చేసే నేమ్ జనరేటర్ అనే ప్రాజెక్టు చేశారు. నిఘంటు, వ్యాకరణ నియమాలను అనువదించేందుకు అత్యున్నత ప్రోగ్రామింగ్ భాషతో కంపైలెర్ డిజైన్ అనే ప్రాజెక్టు చేసారు.
చెన్నై కవిగళ్ సంస్థ కోసం ఒక తమిళ పదాల ప్రాసెసర్‌కి ఒక స్పెల్ చెకర్‌ను సృష్టించారు. ఈ ప్రాజెక్టులో భాష విధానాలకి సంబంధించిన విషయలు ఉన్నాయి. దానికి ఒక తమిళ భాషా సంబంధిత మూల నిఘంటువుని కూడా స్రుష్టించటం జరిగింది. ఆ భాషలో ఉన్న ప్రతి పదం యొక్క నాణ్యతని వెల్లువరిచే విధంగా చేయటం జరిగింది.
2001లో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత స్థాయి పట్టభద్రత కోసం 2003లో క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ డాక్టర్ జార్జ్ హావస్ పర్యవేక్షణలో గణన, ఉన్నత స్థాయి గణిత సిద్ధాంతం ఆధారంగా ఒక ప్రాజెక్టు చేసారు. ఉన్న మాత్రికని పరిశోధించే విధంగా ఒక ప్రామాణిక పద్ధతిలో "హెర్మైట్ నార్మల్ ఫార్మ్" -పై భాగ త్రికోణ మాత్రిక లాగా చేయటం జరిగింది.
ఈ కోర్సు చేస్తున్న సమయంలో అయన మరిన్ని ప్రాజెక్ట్లు కూడా చేపట్టారు. అందులో ముఖ్యమైనది దిసిప్లిండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టు (ఒక సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చెయటానికి పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనే పేరుతో పరిచయం చేయటం జరిగింది), ఆన్లినె ఆర్ట్ స్టోర్ వెబ్సైట్ (అంతర్జాలంలో చిత్రపటాలని అమ్మే ఒక సాధనం గా), మాట పరం గా గాత్ర సంభాషణ (విషువల్ బసిచ్ సహాయంతో ఈ ప్రాక్షీఎ విధాన సంభాషణ ప్రాజెక్టు చేయటం జరిగింది)
చదువుకుంటూనే యూనివర్సిటీలో బోధకుడిగా కూడా సేవలందించారు. రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ అనే అంశంపై తరగతుల్లోను ప్రయోగశాలలోనూ శిక్షణలు నిర్వహంచారు.
ఆయన సమాచార తెక్నాలజీలో పీహెచ్డీ చెస్తున్నప్పుదు, జావా సహాయంతో SENSE (సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ నెట్వర్క్ సెన్సర్ ఎక్ష్పెరిమెంట్స్) రకరకాల హ్యురిస్టిక్స్ ని పరీక్షించటానికి తయారు చేసారు.దాక్టర్ మరియా ఒర్లోస్కా, దాక్టర్ షాజియా సాదిక్‌ల మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టు చేశారు. ఆయన తీసిస్ పేరు "దెసైగ్న్ కన్సిడరేషన్స్ ఫర్ క్వెరీ డిస్సెమినేషన్ ఇన్ వయర్లెస్ సెన్సర్ నెట్వర్క్స్".
బోధన వృత్తి
మార్చుపై చదువులు అయ్యాక భారత దేశం తిరిగి వచ్చిన మదన్ కార్కీ, అన్నా విశ్వవిద్యాలయానికి 2007 లో చేరుకున్నారు. ఆ తరువాత ఆరు నెలలు సీనియర్ రెసర్చ్ ఫెల్లోగా పనిచేసారు. ఈ సమయంలో చలా పరిశోధన ప్రాజెక్ట్లని నిర్వహణ చేసి విద్యార్థులకి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్లని కూడా చూసుకున్నారు. మాస్టర్సు చెస్తున్న విద్యార్థులకి బోధన కూడా చేసారు. ప్రాజెక్టు శాస్త్రవేత్తగా జూలై 2008 నుంచి జూలై 2009 వరకు కొనసాగారు. ఈ సమయంలో ఎంబీయే, ఎం ఈ విద్యార్థుల ప్రాజెక్టులని స్వయంగా చూసుకున్నారు.
ఆగస్టు 2009 నుండి, సహాయక ఉపాధ్యాయుడి గా పనిచేసారు. కంప్యూటర్ శాస్త్రాన్ని బ్యాచ్లర్సు, మాస్టర్సు అభ్యసిస్తున్న విద్యార్థులకి బోధన చేసారు. తమిళ భాషని గనించే ఒక పరిశోధనాలయ బాధ్యతల్ని కూడా చేపట్టారు.ఎన్నారై, విదేశీ విద్యర్థులకి కౌన్సిలర్ గా పనిచేసారు. కంప్యూటర్ సయిన్స్ ఇంజనీరింగ్ సంస్థకి ఉపాధ్యాయుల కోశాధికారిగా కూడా పనిచేసారు. యడ్వాన్స్డ్ డేటాబేసెస్, ఎతిక్స్ ఫర్ ఎంజినీర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వెజస్, పర్యావరణ శాస్త్రం, తమిళ గణణ ( పీహెచ్డీ విద్యార్థులకి) బోధించారు.
కుటుంబం, వ్యక్తిగత జీవితం
మార్చుకార్కి 2008 జూన్ 22లో అన్నా యూనివర్సిటీలో తన పూర్వ సహ విద్యార్థిని నందిని ఈశ్వరమూర్తిని వివాహం చేసుకున్నారు. నందిని కార్కి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో చలన చిత్రాలు, డాక్యుమెంటరీల సబ్‌టైటిల్ విభాగంలో పనిచేస్తున్నారు. వారి కుమారుడు హైకు కార్కి 2009న జన్మించాడు.
చలన చిత్ర ప్రస్థానం
మార్చుప్రవేశం
మార్చుఅన్నా యూనివర్సిటీలో పనిచేస్తున్న రోజుల్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌తిరన్ (2010) చిత్రంతో కార్కి తమిళ సినీ రంగ ప్రవేశం చేశారు. 2008లో తాను రాసిన పాటలతో దర్శకుడు శంకర్‌ను కలిశారు. ఎన్‌తిరన్ చిత్రం సంభాషణలకు సాంకేతిక పదజాలం విభాగంలో సహాయం అందించారు. ఈ సినిమాకి మూడు వెర్షన్‌లలో సంభాషణలు రాయబడ్డాయి. ఒకటి దర్శకుడు శంకర్, ఒకటి కార్కి, మరొకటి సుజాత రంగరాజన్ రాశారు (చిత్రం నిర్మాణ దశలో ఉండగా సుజాత మరణించారు). శంకర్ ఈ మూడు వెర్షన్లను పరిశీలించి వాటిలో ఒక్కొక్క దాన్నుంచి సన్నివేశానికి సరిపోయే సంభాషణలు తీసుకునేవారు. చిత్రం క్లైమాక్స్ మాత్రం పూర్తిగా కార్కి రాశారు.
సంభాషణలతో పాటు ఎన్‌తిరన్‌లో కార్కి రెండు పాటలు కూడా రాశారు: "ఇరుంబిలె ఒరు ఇరుదయం" (తన కెరీర్‌లో మొదటి పాట; ఏ. ఆర్. రెహమాన్ పాడారు), "బూమ్ బూమ్ రోబో డా" అనే పాటలు. ఐతే, కండేన్ కాదలై (2009) అనే చిత్రంలో ఆయన రాసిన "ఓడోడి పోరెన్" అనే పాట ఎన్‌తిరన్ కంటే ముందు విడుదలయింది. ఎన్‌తిరన్ ద్వారా 2011 సంవత్సరానికి 'బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్' విజయ్ అవార్డు గెలుచుకున్నారు.
పాటల రచయిత
మార్చుఎన్తిరన్ విజయంతో అవకాశాలు పెరిగి, ఏ. ఆర్. రెహమాన్, హారిస్ జయరాజ్, డి. ఇమ్మన్, ఎం. ఎం. కీరవాణి, యువన్ శంకర్ రాజా, ఎస్. తమన్, సంజయ్ లీలా భన్సాలీ, అనిరుధ్ రవిచందర్, శాం సి.ఎస్. లాంటి సంగీత దర్శకులతో కలిసి అనేక సార్లు పనిచేశారు. తన మాతృభాష తమిళంలోనేగాక మరెన్నో అంతర్జాతీయ భాషల్లోనూ పాటలు రాయడంలో నిపుణులు; నన్బన్ చిత్రంలో "అస్కు లస్క" (16 భాషల్లో), ఏళాం అరివు చిత్రంలో "ద రైజ్ ఆఫ్ దామొ", నూట్రెన్బదు చిత్రంలో "కంటిన్యూవ" అనే పాటలు కొన్ని ఉదాహరణలు. కార్కి తన పాటల్లో రోజువారీ నిఘంటులో వాడుకలో లేని అసాధారణ తమిళ పదాలను ఉపయొగిస్తుంటారు (కో అనే చిత్రంలో "కువియమిల్లా కాచ్చి పేళై", ఐ చిత్రంలో "పనికూళ్"). తమిళ సినిమాల్లో మొట్టమొదటి పాలిండ్రోమ్ పాటను కార్కి రాశారు. 2018 చివరి నాటికి ఆరు వందలకు పైగా పాటలు రాశారు.
కార్కి పాటల్లో బాగా ప్రాచుర్యం పొందినవి కొన్ని: "ఇరుంబిలె ఒరు ఇరుదయం" (ఎన్‌తిరన్), "ఎనామో ఎదో" (కో), "నీ కూరినాళ్" (నూట్రెన్బదు), "అస్కు లస్క" (నన్బన్), "గూగుల్ గూగుల్" (తుప్పాకి), "ఏలే కీచాన్" (కడల్), "ఒసక్క" (వణక్కం చెన్నై), "సెల్ఫీ పుల్ల" (కత్తి), "పూక్కలే సత్రు ఒయివెడుంగాళ్" ([[ఐ (సినిమా)|ఐ]), "మెయ్ నిగరా" (24), "అళగియే" (కాట్రు వెలియాడు), "ఎంతిర లోగతు సుందరియే" (2.0), "కురుంబ" (టిక్ టిక్ టిక్).
సంభాషణల రచయిత
మార్చుఎన్తిరన్ విజయం తర్వాత కార్కి మళ్ళీ మాటల రచయితగా శంకర్‌తో కలిసి నన్బన్ చిత్రానికి పనిచేశారు. హిందీలో ఘనవిజయం పొందిన త్రీ ఈడియట్స్ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో, కాలేజీ జీవితాన్ని విభిన్న పద్ధతిలో ప్రదర్శించేందుకు మాటలు సరికొత్తగా రాశారు. ఆ తర్వాత భాతదేశంలో నిర్మించిన అత్యంత ఖరీదైన 2.0 చిత్రానికి సాంకేతిక సలహాదారుడిగా దర్శకుడు శంకర్ వద్ద పనిచేశారు.
ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి చిత్రంలోనూ కార్కి పనిచేశారు; రెండో భాగం దక్షిణ భారతదేశంలోనే అత్యంత లాభదాయకమైన చిత్రం. కార్కి మాటలు అందించిన చిత్రాల్లో గుర్తించదగినవి మరి కొన్ని: గోకుల్ దర్శకత్వంలో ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మాసు ఎంగిర మసిలమణి, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి (దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో గొప్ప నటి సావిత్రి గారి బయోపిక్).
భాషావేత్త
మార్చుబాహుబలి చిత్రంలో కాలకేయ తెగ ప్రజలు మాట్లాడే "కిలికి" భాషను కార్కి ప్రత్యేకంగా సృష్టించారు. దానికి కార్కి ఆస్ట్రేలియాలో చదువుకునే రోజుల్లోనే పునాది వేశారు. అక్కడ ఆయాగా పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తూ చిన్నపిల్లలతో కలిసి "క్లిక్" అనే భాషను సృష్టించారు. భాషలోని పదాలు భీతిగొలిపేలా ధ్వనించాలని రాజమౌళి కోరడంతో, 750 పదాలు, 40 వ్యాకరణ నియమాలతో, తాను అప్పతికే సృష్టించిన "క్లిక్" భాష ఆధారంగా "కిలికి" అనే పేరుతో కొత్త భాషను రూపొందించారు. క్రియ విషయాలు 'త్చ్', 'త్స్క్' లాంటివి కాలం, బహువచన సూచలనుగా ఎక్కువ వాడటం జరిగింది .శబ్దాలను తలక్రిందులు చేస్తూ వ్యతిరేక పదాలు తయారు చేశారు ("నేను"కి 'మిన్', "నువ్వు"కి 'నిం'). చిత్రంలో ఈ భాషలో పాత్రలకు పస్చాత్తాప గుణం లేనందున ఆ భావానికి సంబంధించిన పదాలు కూడా ఈ భాషలో ఉండవు.
అత్యధిక వసూళ్ళు పొందిన సినిమాలు
మార్చుమాటల, పాటల రచయితగా తన మొదటి దశాబ్దంలో కార్కి ఆధునిక భారతీయ సినిమాలో ఘనవిజయం సాధించిన ఎన్నో చిత్రాలకు పని చేశారు. ఎన్‌తిరన్ (2010), కో (2011), నాన్ ఈ (2012), తుప్పాకి (2012), కత్తి (2014), ఐ (2015), బాహుబలి:ద బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్ క్లూజన్ (2017), నడిగైయర్ తిలగం (2018), పద్మావత్ (2018), 2.0 (2018).
ఇతర ప్రాజెక్టులు
మార్చుకార్కి రిసెర్చ్ ఫౌండేషన్
మార్చు2013 జనవరిలో అన్నా యూనివర్సిటీలో ఉపాధ్యాయ వృత్తికి రాజేనామా చేసి, భార్య నందినితో కలిసి భాషా పరిజ్ఞానంపై ప్రధాన దృష్టితో కార్కి రిసెర్చ్ ఫౌండేషన్ (కా.రె.ఫో.) అనే లాభాపేక్ష లేని విద్యా పరిశోధన సంస్థను ప్రారంభించారు. దానికి ఆయన పరిశోధనాధిపతిగా పని చేశారు.
కా.రె.ఫో. అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు: "చోళ్" (ఆన్‌లైన్‌లో తమిళ-ఆంగ్ల-తమిళ నిఘంటువు), "పిరిపొరి" (మదనిర్మాణ్ విశ్లేషణకు, తమిళ భాషలోని సమ్మేళనపదాల విభజనకు), "ఒలింగో" (లిప్యంతరీకరణ సాధనం), "పేరి" (తమిళ ధ్వనిశాస్త్ర ఆధారంగా సుమారు 9 కోట్ల ఆడ/మగ పేర్లను ఉత్పత్తి చేయును), "ఎమొని" (పద్యాలను కనుగొనే సాధనం), "కురళ్" (తిరుక్కురళ్ పోర్టల్), "ఎన్" (సంఖ్యలను పదాలుగా మార్చుటకు), "పాదళ్" (తమిళ పాటల సాహిత్య పరిశోధనకు), "ఆడుగళం" (పదవినోదాలకు).
మెల్లినం ఎడ్యుకేషన్
మార్చు2008 నవంబరులో కార్కి మెల్లినం ఎడ్యుకేషన్‌ను స్థాపించి దాని డైరెక్టరుగా పనిచేశారు. చిన్న పిల్లలకు తమిళ సాహిత్యంలోని సైన్స్, ఇన్నొవేషన్ పట్ల తమిళ భాషలో ఆసక్తి పెంపొందించేందుకు అవసరమైన ఆటలు, పుస్తకాలకు కంటెంట్ సృష్టించడం ఈ సంస్థ ప్రత్యేకత.
"ఐపాట్టి" అనే పేరుతో చిన్న పిల్లలకు కథలు, పాటల పుస్తకాలు, భాష ఆధారిత ఆటలు తయారు చేస్తారు. ఇంకా బొమ్మలు, ఎలక్ట్రానిక్ గేమ్స్ వంటి ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి.
స్వతంత్ర సంగీతంలో సహకారం
మార్చుడూపాడూ
మార్చుకార్కి 2016 ఏప్రిల్‌లో తన స్నేహితుదు కౌంతేయతో కలిసి స్వతంత్ర, నాన్-ఫిల్మ్ సంగీతాన్ని ప్రోత్సహించేందుకు డూపాడూ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించారు. స్వతంత్ర సంగీతంతో నిండిన ఈ పాటల బ్యాంకు నుండి దర్శక నిర్మాతలు తమ సినిమాలకు అవసరమైన పాటలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. డూపాడూ ద్వారా తమిళ సినీ సంగీతాన్ని పంపిణీ కూడా చేస్తున్నారు.
ఎం. ఎస్. విశ్వనాథన్ స్వరపరిచిన పాటను ఈ వేదికలో విడుదలైన మొదటి పాట. రోజుకొక పాట విడుదల చేయాలనే లక్ష్యంతో తమిళ సినీ పరిశ్రమకు చెందిన 60కి పైగా స్వరకర్తలను ఈ వేదికలో చేర్చారు.
శనివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో బిగ్ ఎఫ్.ఎమ్. 92.7లో ప్రసారమయ్యే బిగ్ డూపాడూ కార్యక్రమంలో కార్కి రేడియో జాకీగా కూడా పనిచేశారు.
డూపాడూ కోసం కార్కి ప్రత్యేకంగా ఎన్నో పాటలు రాశారు. శ్రీనివాస్, కార్తీక్, అనిల్ శ్రీనివాసన్, రిజ్వాన్, కార్తికేయ మూర్తి, విజయ్ ప్రకాష్, యాండ్రియా జెరీమియా, ఏజే అలిమీర్జక్, దర్శకుడు గౌతమ్ మీనన్ (ఈయన కార్కి రాసిన మూడు పాటలకు టొవినో థామస్, దివ్యదర్శిని, ఐశ్వర్య రాజేష్, అథర్వ లతో మూడు మ్యూజిక్ వీడియోలు చేశారు) వంటి సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కలిశారు. కార్కి రాసిన కొన్ని ప్రముఖ స్వతంత్ర పాటలు: "ఉలవిరవు", "కూవ", "బోధై కోధై", "యావుం ఇనిదే", "ఏదో ఒఅర్ అరైయిల్", "కాదల్ తొళి", "పెరియార్ కుత్తు".
సండేస్ విత్ అనిల్ అండ్ కార్కి
మార్చుపియానో వాద్యకారుడు అనిల్ శ్రీనివాసన్‌తో కలిసి సండేస్ విత్ అనిల్ అండ్ కార్కి అనే మ్యూజిక్ రియాలిటీ షోకి సహ వ్యాఖ్యాతగా చేశారు. ఈ కార్యక్రమం జీ తమిళ్ హెచ్‌డి ఛానల్‌లో 2017 డెసెంబరు నుండి 2018 ఏప్రిల్ మధ్యలో 13 భాగాలుగా ప్రసారమయింది. ఈ కార్యక్రమంలో సంగీత రంగానికి చెందిన ప్రముఖులేగాక ఇతర రంగాలకు చెందిన నిష్ణాతులు కూడా అతిథులుగా వచ్చి వారి విద్వత్తును ప్రదర్శించారు. వారిలో కొందరు స్వరకర్తలు: సీన్ రోల్డన్, జి.వి. ప్రకాష్ కుమార్, శ్రీనివాస్; దర్శకులు: వెంకట్‌ప్రభు, వసంత్, గౌతం మీనన్, రాజీవ్ మీనన్; నతులు: సిద్ధార్థ్, ఆర్.జె. బాలాజీ, కుష్బూ; గాయనీగాయకులు: కార్తీక్, యాండ్రియా జెరీమియా, గాన బాల, సైంధవి.
అభిరుచులు
మార్చుకార్కికి చిన్నతనం నుండే ఫోటోగ్రఫీ పట్ల అభిరుచి ఉంది. అందులోని మెళకువలను యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు. చిన్న పిల్లల యాద్రుచ్చిక భావోద్వేగాలు చిత్రీకరించేందుకు ఎక్కువ ఇష్టపడతారు. ట్రావెలింగ్ ఆయనకు ముఖ్యమైన అభిరుచి. ఏటా కనీసం మూడు సార్లు ఎప్పుడూ వెళ్ళని కొత్త ప్రదేశాలకు వెళ్తారు - భారతదేశం బయట, భారతదేసమ్ళొ, తమిళనాడులో. 2018లో అంటార్కిటికా సహా ప్రపంచంలోని ఏడు ఖండాలనూ సందర్శించారు. వంట, బ్యాడ్మింటన్, జావాలో కోడింగ్ ఆయన ఇతర అభిరుచులు. పాటల మీదేగాక తమిళంలో మరెన్నో అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు.
బాహ్య లింకులు
మార్చు- అధికారిక వెబ్సైటు
- కార్కి రిసెర్చ్ ఫౌండేషన్
- మెల్లినం ఎడ్యుకేషన్ Archived 2019-01-05 at the Wayback Machine
- డూపాడూ