దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.[1] ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు. ఆమె భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి కుమార్తె.[2]

జీవిత విశేషాలు   

మార్చు

దీపా వెంకట్ నవంబర్ 24, 1974 న జన్మించారు. ఆమె తండ్రి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (అర్థశాస్త్రం) లో బంగారు పతకాన్ని పొందారు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వెంకట్ ను వివాహమాడారు. ఆయనకు విశాఖపట్నం, చెన్నైలలో స్వంత ఆటొమోబైల్స్ షోరూం లు ఉన్నాయి.[2] ఆమె పేదలకు అండగా నిలుస్తూ నిర్బాగ్యులకు చేయూత అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు. ఆమె లక్ష్యం గ్రామీణ ప్రజల్లో క్రాంతి తీసుకురావటం.  గ్రామీణులు తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తున్న స్ఫూర్తి దాయక మహిళ. ఆమె స్వర్ణభారత్ ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్టీ గానూ, సరస్వతి నగర్, నెల్లూరు జిల్లా అక్షర విద్యాలయ కు కరెస్పాండెంట్ గానూ, చెన్నైలోని విష్ణు మోటార్స్ కు జె.ఎం.డిగాను ఉన్నారు. [3]

సామాజిక సేవ

మార్చు

స్వర్ణభారత్ ట్రస్ట్ ఫ్లాగ్ బేరర్ గా ఆమె గ్రామీణ ప్రాంతాల సేవకి తనని తాను అంకితం చేసుకున్నారు. ఒక పటిష్టమైన భారతీయ సమాజాన్ని నిర్మించాలంటే, గ్రామాలు సుసంవృద్ది జరగాలని,  గ్రామీణులను స్వయం ఉపాధి సాధికారత సాధించాలని ఆమె నమ్ముతారు. పల్లె వాసులు తమ స్వప్నాలని సాకారం చేసుకునేలా వారికి చేయూత నివ్వాలని ఆమె ఆకాంక్ష. గత 16  వసంతాలుగా ఆమె గ్రామీణుల జీవితాల్ని స్పృశిస్తూ, వారి కలల్ని, జీవితాల్ని పండిస్తూ ఫలిస్తున్న వారి ఆత్మవిశ్వాసాన్ని చూస్తూ వారి గెలుపు తన గెలుపుగా భావిస్తూ వారి సేవనే తన కృషిగా నమ్మిన ఆదర్శ మహిళ దీపావెంకట్ గారు. కేవలం ఆర్ధిక స్వావలంభ సాధించటమే కాదు విలువలతో కూడిన జీవన విధానాన్ని వారిలో ప్రోది చేసేందుకు ఆమె నిరుపమాన కృషి చేస్తున్నారు.

విజయాలు

మార్చు
 •  పాఠశాల దశలో ఉత్తమ విద్యార్థిగా నెల్లూరులోనూ చెన్నైలోనూ గుర్తింపు
 • నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ లో స్వర్ణభారత్ ట్రస్టు ఆవిర్భావంలో కీలక భూమిక.
 • సంస్కారవంతమైన విద్యకు నిర్వచనంగా నిలిచిన అక్షర విద్యాలయను నెలకొల్పి మాధ్యమం ఆంగ్లమైనా భారతీయ భావనతో బోధిస్తూ విద్యారంగంలో నవీన ఆధ్యాయానికి శ్రీకారం. భారతీయ విలువలతో ప్రపంచ స్థాయి విద్యార్ధులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.  
 • గ్రామీణ పేదలకు టెలీ మెడిసిన్, సాంకేతిక విద్య అందిస్తున్న సైబర్ గ్రామీణ్ రూపకల్పనలో శ్రీమతి దీప గారిది కీలక పాత్ర
 • పేదరికంతో బడిమొహం చూడని చిన్నారులను, బాలకార్మికులగా బతుకీడుస్తున్న పిల్లలను గుర్తించి వారికి తగు విద్యనందించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న స్వర్ణభారత్ ట్రస్టు రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్  స్థాపకురాలు
 • ముప్పవరపు ఫౌండేషన్ ను తన అన్నగారైన శ్రీ హర్షవర్ధన్ గారితో కలిసి స్థాపించి విజ్ఞాన, వినోద, ఉపాధి, నైపుణ్య శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కుటుంబం ద్వారా సమాజ సేవా నిరతిని చాటారు.
 • వృత్తి ఉపాధి,  నైపుణ్య శిక్షణ కేంద్రాలను స్వర్ణభారత్ ట్రస్ట్ లో నెలకొల్పేందుకు ఆధ్యులు  
 • ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ లలో  సునామీ లాంటి విపత్తుల్లో  సహాయక చర్యలను విరివిగా చేపట్టి, తగిన ఆర్థిక సహాయాన్ని, ఇతర సహాయాల్ని  అందించారు.
 • ఆంధ్రప్రదేశ్ లో ఉచిత వైద్య, ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించారు.
 • జైపూర్ కృత్రిమ అవయవాలని వేలాది మంది పేదలకు స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా ఉచితంగా అందించటం.
 • ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందని గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలను అందించటం, గ్రహణమొర్రి చిన్నారులకు మెడికల్ క్యాంపుల ద్వారా ఉచిత శస్త్ర చికిత్స అందించటం. అనేక ఉచిత వైద్యశిబిరాల ద్వారా వేలాది మందికి వైద్య సేవలు చేరువ చేయటం.
 • వికలాంగుల సేవలో అనుపమాన కృషి
 • నెల్లూరులో ఇరవై మంది వికలాంగులని దత్తత చేసుకుని వారి జీవితాల్లో వెలుగు నింపి. తద్వారా మరికొంత మందికి మార్గదర్శకురాలయ్యారు.
 • హుద్ హద్ విలయంలో దెబ్బతిన్న జాలరుల గ్రామమైన చేపల ఉప్పాడని స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా దత్తత చేసుకుని ఆ గ్రామాన్ని పునర్నిర్మించారు.

అవార్డులు-రివార్డులు

మార్చు
 •  వృత్తి నైపుణన్య శిక్షణ ద్వారా  20,000 మంది యువత ( మహిళలు- పురుషులు) స్వయం ఉపాధితో తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వయం ప్రకాశకులుగా తీర్చిదిద్దారు.
 •  2016వ సంవత్సరంలో వుమెన్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం తరఫు  “ఈ దశాబ్దపు మేటి
 •  మహిళ” అవార్డు పొందారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
 • 2012 లో దుబాయ్ లోని వేవ్ అనే మహిళా సంస్థ “ఉత్తమ మహిళ” అవార్డుని అందించింది.
 • జెసిఐ నుంచీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్స్ అవార్డు పొందారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువులు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ నుంచి ఈ అవార్దుని ఆమె అందుకున్నారు.

మూలాలు

మార్చు
 1. "Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh". deccanchronicle.com/. 2017-07-18. Retrieved 2018-01-28.
 2. 2.0 2.1 "All eyes on daughter". The Hindu. Special Correspondent, Special Correspondent. 2013-04-15. ISSN 0971-751X. Retrieved 2018-01-28.{{cite news}}: CS1 maint: others (link)
 3. "Deepa Venkat revealed some interesting facts about Venkaiah Naidu". smtv24x7. Retrieved 2018-01-28.

భాహ్య లింకులు

మార్చు