రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం
(రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రానికి దగ్గరగా వుంచటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు.
రాజంపేట లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 17°6′0″N 81°42′0″E |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చునేపధ్యము
మార్చు- 1957లో టీఎన్ విశ్వనాథరెడ్డి రాజంపేట తొలి ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1962లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దూకిన సీఎల్ నరసింహారెడ్డి గెలుపొందారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే.
- 1967లో జరిగిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన పోతురాజు పార్థసారథి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచారు. 1971, 1977, 1980లో ఈయనదే విజయం. కేంద్ర మంత్రిగా కూడా కొన్నాళ్ల పాటు పనిచేశారు. 1967- 84 వరకు సుమారు 17 ఏళ్లపాటు ఈయనే ఎంపీగా ఉన్నారు.
- 1984లో తెదేపా అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడు విజయఢంకా మోగించారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థి అన్నయ్యగారి సాయిప్రతాప్‌ను ఓడించారు.
- 1989లో రాజకీయం చిత్రం మారింది. కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఎ.సాయిప్రతాప్ సత్తాచాటి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఈసారి మాత్రం తెదేపా అభ్యర్థి పాలకొండ్రాయుడు ఓటమి పాలయ్యారు. 1991, 1996, 1998, 2004, 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆరుసార్లు గెలిచిన సాయి రికార్డు సృష్టించారు. ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
- 1999లో జిల్లాకు చెందిన గునిపాటి రామయ్య తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రత్యర్థి ఎం.సాయిప్రతాప్‌ను రామయ్య ఓడించారు.
- 1967- 2009 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే కడప జిల్లా వాసులే ఎన్నికవుతూ వచ్చారు.
- భారతీయ జనతా పార్టీ- తెదేపా పొత్తులో భాగంగా రాజంపేట స్థానాన్ని కమలనాథుల కోసం తెలుగుదేశం కేటాఅయించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఎ.సాయిప్రతాప్ తొమ్మిదోసారి పోటీ పడ్డారు. వైకాపా నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రంగంలోకి దూకారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు రగిలిపోయారు. హస్తం గుర్తుకు ఓటేయలేదు. ఆరుసార్లు నెగ్గిన సాయి మూడోసారి ఓటమి పాలయ్యారు. గెలుపోటములు సహజమే. కానీ ఈసారి పాతిక వేల ఓట్లు కూడా ఈయనకు రాలేదు. ఇక పురందేశ్వరి కూడా ఓటమిని చవిచూశారు. యువనేత మిథున్‌రెడ్డిని ఓటర్లు ఆదరించి గెలిపించారు. ఫలితంగా కడప జిల్లా నేతల చేతిలో ఉన్న రాజంపేట లోక్‌సభ పదవి చిత్తూరు జిల్లా నేతకు దక్కింది.
ఇప్పటిదాకా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చులోక్సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ రెండవ 1957-62 టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 సి.ఎల్.నరసింహారెడ్డి స్వతంత్ర పార్టీ నాలుగవ 1967-71 పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 సుగవాసి పాలకొండ్రాయుడు తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పన్నెండవ 1998-99 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 గునిపాటి రామయ్య తెలుగుదేశం పార్టీ పద్నాలుగవ 2004-09 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-14 అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెసు పదహారవ 2014-19 పి.వి.మిధున్ రెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్ 17వ 2019- ప్రస్తుతం పి.వి.మిధున్ రెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్
2004 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | అన్నయ్యగారి సాయిప్రతాప్ | 369,797 | 53.49 | +8.84 | |
తెలుగుదేశం పార్టీ | గునిపాటి రామయ్య | 291,712 | 42.20 | -6.56 | |
Independent | Md అజాం షేక్ హాజి | 11,919 | 1.72 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | పీచర అశోక రావు | 11,247 | 1.63 | ||
జనతా పార్టీ | ముక్కా నరసింహా రెడ్డి | 6,654 | 0.96 | ||
మెజారిటీ | 78,085 | 11.29 | +15.40 | ||
మొత్తం పోలైన ఓట్లు | 691,329 | 69.76 | -1.97 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +8.84 |
2009 ఎన్నికలు
మార్చువివిధ పార్టీలనుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు:
- కాంగ్రెస్ : అన్నయ్యగారి సాయిప్రతాప్ [1]
- తెలుగుదేశం : రెడ్డప్పగారి పల్లి రమేష్ కుమార్ రెడ్డి [2]
అభ్యర్థి ( పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
అన్నయ్యగారి సాయిప్రతాప్ (కాంగ్రెస్) | 4,23,910
|
రెడ్డప్పగారి పల్లి రమేష్ కుమార్ రెడ్డి (తెలుగుదేశం) | 3,13,533
|
2014 ఎన్నికలు
మార్చు2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పి.వి.మిథున్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి భా.జ.పాకు చెందిన దగ్గుబాటి పురంధ్రీశ్వరిపై 1,70,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 సాధారణ ఎన్నికలు రాజంపేట జనరల్ పి.వి.మిథున్ రెడ్డి పు వై.సి.పి 601752 దగ్గుబాటి పురంధ్రీశ్వరి మ భా.జ.పా 426990
2019 ఎన్నికలు
మార్చు2019 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పి.వి.మిథున్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి భా.జ.పాకు చెందిన డి.కె. సత్యప్రభ పై 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-19.