రెడీ

2008 సినిమా

రెడీ శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008 లో విడుదలైన సినిమా. ఇందులో రామ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

రెడీ
TeluguFilm Ready.jpg
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనగోపీమోహన్
నిర్మాతరవి కిషోర్
తారాగణంరామ్ పోతినేని,
జెనీలియా
ఛాయాగ్రహణంమూరెళ్ళ ప్రసాద్
కూర్పుఎమ్. ఆర్. వర్మ
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2008 జూన్ 19 (2008-06-19)
భాషతెలుగు
బడ్జెట్13 కోట్లు

ఈ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో సహా మూడు నంది పురస్కారాలు దక్కాయి. 2009 లో కన్నడంలో రాం అనే పేరుతో, 2010 లో తమిళంలో ఉత్తమ పుదిరన్ అనే పేరుతో 2011 లో హిందీలో రెడీ అనే పేరుతో పునర్నిర్మాణం చేయబడింది.[1][2][3]

కథసవరించు

రఘుపతి, రాఘవ, రాజారాం ముగ్గురు అన్నదమ్ములు. వారికి స్వరాజ్యం అనే చెల్లెలు. వీరి కుటుంబం ఆర్. ఎస్. బ్రదర్స్ అనే షాపింగ్ మాల్ నడుపుతుంటారు. రఘుపతి ఆ ఇంటిపెద్దగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. రాజారాం కొడుకైన చందు మరదలు స్వప్న, ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆమె తనకిష్టం వచ్చిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి చందు సహాయం చేయడంతో రఘుపతి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. చందు తిరిగి ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతుంటాయి. చందు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగా తన స్నేహితుడు గూగుల్ గోపి కోసం ఒక అమ్మాయిని పెళ్ళి మండపాన్ని ఎత్తుకు వచ్చేస్తారు. తీరా మండపానికి వచ్చాక ఆమె పూజ అనే వేరే అమ్మాయి అని తెలుస్తుంది. ఈ లోపు పూజ కోసం రౌడీలు వారిని వెంబడిస్తారు.

పూజ తన నేపథ్యం గురించి చెబుతుంది. తాను అమెరికాలో పెరిగిన అమ్మాయిననీ, తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతారు. తన మామయ్యలు పెద్ది నాయుడు, చిట్టి నాయుడు తన ఆస్తి కోసం తమ కొడుకులకు ఇచ్చి బలవంతంగా పెళ్ళి చేయాలనుకుంటున్నట్టు చెబుతుంది. చందు ఆమెను వారినుంచి కాపాడటానికి తన పెదనాన్న ఆధ్యాత్మిక గురువు పంపించినట్లు ఆమెను తన ఇంట్లో ప్రవేశపెడతాడు. తర్వాత తానూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చందు, పూజ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళి నిశ్చయమయ్యే సమయానికి పెద్దినాయుడు మనుషులు ఆమెను ఎత్తుకు పోతారు. చందు తన కుటుంబంలో వాళ్ళకు అసలు విషయం చెబుతాడు. అందరూ కలిసి మొరటు వాళ్ళైన వారి మనసులు మార్చడానికి నాటకం ఆడటానికి నిర్ణయించుకుంటారు. పెద్ది నాయుడు, చిట్టి నాయుడు ఇళ్ళలో ఆడిటరుగా పనిచేస్తున్న మెక్‌డోవెల్ మూర్తి దగ్గర సహాయకుడిగా చేరి వాళ్ళ ఇళ్లలో పాగా వేస్తాడు. రఘుపతి చికాగో సుబ్బారావుగా, రాఘవ డల్లాస్ నాగేశ్వరరావు పేరుతో వారి కొడుకులకు తమ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నట్లు చెబుతారు. చందు చివరికి తన కుటుంబ సభ్యుల సాయంతో వాళ్ళ మనసులు మార్చి పూజను వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

నటీనటులుసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు.

 • గెట్ రెడీ
 • అయ్యో అయ్యో అయ్యో దానయ్యా
 • మేరే సజ్నా మేరే సజ్నా
 • నిన్నే పెళ్ళాడుకుని రాజై పోతా
 • నా పెదవులు నువ్వైతే
 • ఓం నమస్తే బోలో

సంభాషణలుసవరించు

 • ఏం రా పులీ, పంతులుగారిని దుమ్ము లేప్తాండావే!
 • ఆ ఇంట్లో ఏం వుండాయో, ఏం లేవో, ఒక లారీకి బియ్యం, బ్యాళ్ళు ఏసి పంపిజ్జామా?
 • మీ మనసులు దెల్సుకున్యాం, మా అలవాట్లు మార్చుకున్యాం

మూలాలుసవరించు

 1. "Raam Movie Review". Archived from the original on 2009-11-19. Retrieved 2022-10-25.
 2. "Uthamaputhiran is illogical". Rediff.
 3. "King Khan? In 2011, Salman's Ready is biggest Bollywood box-office hit". The Times of India. Archived from the original on 2013-01-03.
"https://te.wikipedia.org/w/index.php?title=రెడీ&oldid=3870087" నుండి వెలికితీశారు