లక్ష్మీనరసింహా

(లక్ష్మీనరసింహ నుండి దారిమార్పు చెందింది)

లక్ష్మీనరసింహా, 2004 జనవరి 14వ తేదీన సంక్రాంతికి విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది ఇంతకు ముందు తమిళంలో విజయవంతమైన "సామి" అనే సినిమాకు తెలుగు పునర్నిర్మాణం.

లక్ష్మీనరసింహా
(2004 తెలుగు సినిమా)
TeluguFilm Lakshminarasimha.jpg
దర్శకత్వం జయంత్ సి. పరాంజి
నిర్మాణం బెల్లంకొండ సురేష్
తారాగణం నందమూరి బాలకృష్ణ,
ఆశిన్,
రక్షిత,
ప్రకాష్ రాజ్,
కె. విశ్వనాధ్,
కృష్ణ భగవాన్
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరుచూరి బ్రదర్స్, హరి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ జనవరి 14, 2004
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

కథసవరించు

"లక్ష్మీ నరసింహ" (బాలకృష్ణ) ఒక నిజాయితీగల, చాలా స్ట్రిక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్. కాని నేరగాళ్ళను అణచి వేయడానికి ముదురుగా, ఒకోమారు చట్టం పరిధికి అతీతంగా వ్యవహరిస్తుంటాడు. ఒకానొకప్పుడు ధర్మభిక్షం (ప్రకాష్ రాజ్) అనే గూండా నాయకుని కారణంగా హీరో చిన్నతనంలో పల్లెటూరిలో అతని చెల్లి దూరమయ్యింది, ఆస్తి నాశనమయ్యింది. తరువాత విజయవాడలో పోలీస్ ఆఫీసర్‌గా వెళ్లీన కథానాయకుడు అక్కడి రౌడీనాయకుడు ధర్మభిక్షం నుండి ఒకటిన్నర కోట్ల "లంచం" తీసుకొని తన వూరిలో దగాపడినవారిని ఆదుకొంటానికి వాడుతాడు. తరువాత ధర్మభిక్షం అసలు సంగతి తెలుసుకొంటాడు. ఇక హీరో, విలన్ల మధ్య ప్రత్యక్షమైన యుద్ధం ప్రారంభమౌతుంది.


హిట్టయిన డైలాగులుసవరించు

రాజూ అప్పటికప్పుడే చంపుతాడు,దేవుడు ఆ పాపం పండాక చంపుతాడు,కాని నేను సాక్ష్యం లేకుండా చంపుతాను.

పాటలుసవరించు

  • దేవున్నీ అడిగానంటే..... రాడు రాడూ ఎంతో బిజీ
  • అందంలో ఆంధ్రా కోస్తా..
  • ఆకేసుకో పప్పేసుకో...
  • కుడి కన్ను కొడితే..

బాక్సాఫీసుసవరించు

  • 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు

బయటిలింకులుసవరించు

మూలాలుసవరించు