లొట్టపీసు చెట్టు


లొట్టపీసు చెట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ఐపోమియా కార్నియా. ఇది ఉదయమే పుష్పించడం చేత దీనిని ఆంగ్లంలో మార్నింగ్ గ్లోరి (ఉదయపు గులాబి) అని అంటారు. ఈ మొక్క నీటి జలాశయాల ఒడ్డున, తేమ ఉన్న ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఔషద మొక్క. ఈ మొక్క కాండం బోలుగా ఉంటుంది. దీని ఆకులు, కాండం తెల్లని నూగు వంటి పూతను, లోపల పాల వంటి లేటెక్స్ ను కలిగి ఉంటుంది. ఇది పశువులకు, జంతువులకు హానికరమైన విషపదార్ధం. తెలంగాణాలో దీనికి ఇతర పేర్లు కింది విధంగా ఉన్నాయి.

పట్టిక మార్చు

క్ర.సం జిల్లా వ్యవహారం
1.        నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట లొట్టపీసు పూలు
2.        కరీంనగర్, జనగామ పిచ్చి పూలు, పాలసముద్రం పూలు
3.        జగిత్యాల, మెట్టుపల్లి పాలసముద్రం పూలు, పిచ్చి చెట్లు
4.        సిద్ధిపేట లొట్టపీసుపూలు, తూటు పూలు, రబ్బరు పూలు
5.        ఖమ్మం తూటి బరిగె, పిచ్చి బరిగె
6.        మహబూబాబాద్ సలీంద్ర పూలు
7.        వరంగల్ రబ్బరు పూలు/ లబ్బరి పూలు, గడ్డ గరుగుడు పూలు
8.        పాలమూరు లొట్టపీసుపూలు
9.        మెదక్ తూటి పూలు
10.    రంగారెడ్డి లొట్టపీసు పూలు
11.    ములుగు సలేంద్ర పూలు, లబ్బరు చెట్లు
12.    మహబూబ్ నగర్ లొట్టపీసు పూలు
13.    మంచిర్యాల పాల సముద్రం
14.    అదిలాబాదు భేషరం పూలు, సిగ్గుమాలిన పూలు
15.    ఉత్తర తెలంగాణాలో కొన్ని చోట్ల సొంగ పూలు
16.    కామారెడ్డి శబాస్ పూలు, బద్మాష్ పూలు, లొట్టపీసు పూలు, సిగ్గుమల్లె
17.    భాగ్యనగరం లొట్టపీసు పూలు
18.    పెద్దపల్లి, సిరిసిల్ల పాల సముద్రం పూలు
19.    సంగారెడ్డి తూటి పూలు
20.    నిజామాబాద్ భేషరం పూలు