నారప్ప
నారప్ప, 2021 జూలై 20న విడుదలైన తెలుగు సినిమా. పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా,[1] తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.[2] వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన[3] ఈ సినిమా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ 2020, జనవరిలో ప్రారంభమైంది.[4] ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.[5] ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి సమీక్షలు వచ్చాయి. వెంకటేష్ నటనను, రీమేక్ తీసిన విధానాన్ని, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వాన్ని ప్రశంసించారు.
నారప్ప | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | వెట్రిమారన్ |
దీనిపై ఆధారితం | పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా |
నిర్మాత | కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు |
తారాగణం | వెంకటేష్ ప్రియమణి కార్తీక్ రత్నం నాజర్ రావు రమేశ్ రాజీవ్ కనకాల అమ్ము అభిరామి రాఖీ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 20 జులై 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాశం
మార్చుఅణగారిన కులానికి చెందిన ఒక కుటుంబం, సంపన్న కులంలోని ధనిక భూస్వామి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని, పరిష్కరించుకునే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.[6]
నటవర్గం
మార్చు- వెంకటేష్ (నారప్ప)
- ప్రియమణి (నారప్ప భార్య సుందరమ్మ)[7]
- కార్తీక్ రత్నం (నారప్ప పెద్దకొడుకు మునికన్నా)
- రాఖీ - సిన్నబ్బ [8]
- రావు రమేశ్ (లాయర్ వరదరాజులు)
- రాజీవ్ కనకాల (బసవయ్య)
- అమ్ము అభిరామి (కన్నమ్మ)
- శ్రీతేజ్ (రంగబాబు)
- నాజర్ (షావుకారు శంకరయ్య)
- బ్రహ్మాజీ (మునెప్ప)
- ఆడుకలం నరేన్ (పండుస్వామి)
- దీపక్ శెట్టి
- వశిష్ఠ సింహ
- రామరాజు
- ప్రియాంక
- కాదంబరి కిరణ్
- ఝాన్సీ
- అరుంధతి అరవింద్
- ప్రభాకర్
- చైత్ర
- రాజశేఖర్ అనింగి (శుభోదయం సుబ్బారావు)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల [9]
- కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్ బాబు
- రచన: వెట్రిమారన్ (పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా)
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణసంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాణం
మార్చుఅభివృద్ధి, నటవర్గం ఎంపిక
మార్చుఅసురన్ సినిమాను వెంకటేష్ హీరోగా తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహిస్తానని 2019 నవంబరులో శ్రీకాంత్ అడ్డాల ప్రకటించాడు.[10] 2020, జనవరిలో సినిమాపేరు నారప్ప అని ప్రకటించారు.[11] ఈ చిత్రంలో ప్రియమణి నారప్ప భార్య సుందరమ్మగా, కార్తీక్ రత్నం పెద్ద కొడుకు మునికన్నగా నటించారు.[12]
చిత్రీకరణ
మార్చు2020, జనవరి 22న అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని ఒక గ్రామంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.[13][14] మొదటి షెడ్యూల్ రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరించబడింది.[15] లాక్ డౌన్ కు ముందు సినిమా యూనిట్ తమిళనాడు వెళ్ళింది.[16] తమిళనాడులోని కురుమలై, తేరికడు, తిరునెల్వేలి తదితర ప్రాంతాలలో యాక్షన్ డైరెక్టర్ పీటర్ హీన్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను తీశారు.[17][18] కరోనా-19 మహమ్మారి కారణంగా 2020, మార్చిలో చిత్రీకరణ నిలిపివేయబడింది.[19] ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమవుతుందని 2020 అక్టోబరులో ప్రకటించారు.[20] 2020 నవంబరు 9న హైదరాబాద్‌లో చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని ధృవీకరించబడింది, వెంకటేష్ ఐదు రోజుల చిత్రీకరణలో పాల్గొన్నాడు.[21] 80% షూటింగ్ పూర్తి చేసుకున్న[22] ఈ సినిమా 2021 జనవరి చివరి నాటికి, షూటింగ్ పూర్తిచేసుకుంది.[23][24][25] సెకెండ్ వేవ్ సమయంలో 2021 మే నెలలో వెంకటేష్ తన డబ్బింగ్ ను పూర్తి చేశాడు.[26]
థీమ్స్, ప్రభావాలు
మార్చుసంగీత దేవి డూండూ ప్రకారం "ప్రతీకార కథ, కథానాయకుడి పరివర్తన రజినీకాంత్ నటించిన బాషా (1995) సినిమాని గుర్తుచేస్తుంది".[27]
సంగీతం
మార్చుUntitled | |
---|---|
2013లో సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు నేపథ్య సంగీతంకోసం పనిచేసిన తరువాత, శ్రీకాంత్‌తో కలిసి మణిశర్మ పనిచేయడం ఇది రెండవసారి, పాటలకు స్వరకల్పన చేయడం మొదటిసారి. మొదటి సింగిల్ "చలాకి చిన్నమ్మీ" 2021, జూలై 11 న సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదలైంది.[28][29]
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చలాకీ చిన్నమ్మీ" | అనంత శ్రీరామ్ | ఆదిత్యా అయ్యంగార్, నూతన మోహన్ | 3:27 |
2. | "ఓ నారప్ప" | అనంత శ్రీరామ్ | ధనుంజయ్, వరం | 3:41 |
3; తల్లి పేగు చూడు , సైందవి సిరివెన్నెల .
4: రాజ్ఆఫ్ నారప్ప, అనంత శ్రీరామ్, శ్రీకృష్ణ ఎల్. వి. రేవంత్, సాయి చరణ్
5: ఊరు నట్ట,సిరివెన్నెల , అనురాగ్ కులకర్ణి
విడుదల
మార్చు2021 మే 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా[30] భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.[31] 2021, జూన్ 29న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు ప్రకటించబడింది.[32][33] 2021, జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్టు 2021, జూలై 10న ప్రకటించారు.[34] అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా విడుదల గురించి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, "ఈ సినిమా ప్రధాన సందేశం చాలా ముఖ్యమైనది. కాని ఎవరూ ఊహించని విధంగా ఇది ప్రభావం చూపుతుందని నాకు తెలుసు. 240 దేశాల్లోని ప్రేక్షకులకు మా చిత్రాన్ని ప్రదర్శించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నాడు.[35]
స్పందన
మార్చుది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికు చెందిన నీషిత న్యాపతి ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా తీయడం ద్వారా శ్రీకాంత్ అడ్డాల కుటుంబ కథా చిత్రాల కంఫర్ట్ జోన్ నుండి బయటపడతాడు" అని రాసింది.[36]"మొత్తం మీద, నారప్ప రీమేక్ బాగుంది; అసురన్ సినిమా రీమేక్ ను తప్పు పట్టే మార్గం లేదు. నారప్ప లోపాలు ఉన్నప్పటికీ, తెలుగు సినిమాలో స్వాగతించే మార్పు ఇది" అని సినిమా ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెందిన రామ్ వెంకట్ శ్రీకర్ రాశాడు.[37]
"నారప్ప సినిమా అసురన్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ, ఈ సినిమాలో అసురన్ సినిమా ఆత్మ లేదు" అని ఇండియా టుడే పత్రికకు చెందిన కె. జనని రాసింది.[38] "నిజంగా అసురన్ సినిమా రిమేక్ అవసరమా?, రీమేక్ బాగుంది కాని ధనుష్ నటనకు సమానం కాదు. అయినప్పటికీ నటీనటుల నటన, దర్శకుడి ప్రతిభను ప్రశంసించాల్సిన అవసరం ఉంది" అని కొయిమోయి పత్రికకు చెందిన శుభం కులకర్ణి రాశాడు.[39]
మూలాలు
మార్చు- ↑ "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Retrieved 13 December 2020.
- ↑ "Venkatesh Daggubati's Narappa shoot put on hold - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "Venkatesh starts shoot for 'Asuran' Telugu remake 'Naarappa'". The New Indian Express. 22 January 2020. Retrieved 13 December 2020.
- ↑ "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Ist. Retrieved 13 December 2020.
- ↑ "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. 22 January 2020. Retrieved 13 December 2020.
- ↑ Sakshi (20 July 2021). "'నారప్ప' మూవీ రివ్యూ". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Andrajyothy (16 July 2021). "ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ..ఏమో". chitrajyothy. Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ Namasthe Telangana (25 July 2021). "'నారప్ప' కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ Namasthe Telangana (19 July 2021). "నాలోని మాస్ కోణాన్ని చూపించా!". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ "Telugu director Srikanth Addala to remake Dhanush's 'Asuran'". The News Minute. 2019-11-20. Retrieved 13 December 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Desk, The Hindu Net (2020-01-22). "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. ISSN 0971-751X. Retrieved 13 December 2020.
- ↑ "Karthik Rathnam's first-look as Munikanna from Narappa released on his birthday - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "Narappa: Venkatesh Daggubati starrer Asuran Telugu remake goes on floors; See Pics". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూలై 2021. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh's 'Naarappa' begins shoot in Anantapur - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ Nyayapati, Neeshita (22 January 2020). "Venkatesh's 'Naarappa' begins shoot in Anantapur". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "నారప్ప వచ్చాడప్ప". Sakshi. 2020-03-19. Retrieved 21 July 2021.
- ↑ "Narappa Update! Shooting of 'Asuran' remake progressing rapidly at Theri Kaadu Red Desert - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Narappa shot at Theri kaadu Red Desert". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Daggubati's Narappa shoot put on hold". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 22 March 2020. Retrieved 21 July 2021.
- ↑ World, Republic. "Asuran's Telugu remake, Narappa's shooting process to restart in October 2020?". Republic World (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venky to shoot some scenes for Narappa". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2020-10-21. Retrieved 21 July 2021.
- ↑ "Team of Narappa resumes shooting in the new normal | Telugu Movie News - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Shooting for Venkatesh and Priyamani starrer Narappa wrapped up - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Narappa: Priyamani And Venkatesh Starrer Telegu Film Wraps Up Its Shooting". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Narappa wraps up shooting". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Venkatesh's special care in dubbing for Narappa". 123telugu.com (in ఇంగ్లీష్). 2021-06-12. Retrieved 21 July 2021.
- ↑ Dundoo, Sangeetha Devi (2021-07-20). "'Narappa' movie review: A faithful, frame-to-frame remake of 'Asuran'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 July 2021.
- ↑ Hymavathi, Ravali (11 July 2021). "First Single 'Chalaaki Chinnammi' From Narappa Is Out". The Hans India (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Narappa's Chalaaki Chinnammi: Melody Brahma Mani Sharma's family song is beautiful". Pinkvilla (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Chiranjeevi's 'Acharya', Venkatesh's 'Narappa' eye summer 2021 releases". The Hindu. Special Correspondent. 29 January 2021. Archived from the original on 14 February 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Palisetty, Ramya (29 April 2021). "Venkatesh's Narappa release date postponed due to Covid-19 spike". India Today. Archived from the original on 15 May 2021. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh's 'Narappa' gets U/A certification". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-30. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Daggubati and Priya Mani's Narappa gets U/A certification". www.msn.com. Retrieved 21 July 2021.
- ↑ Bhasin, Shriya (2021-07-12). "Venkatesh, Priyamani-starrer Telugu film 'Narappa' to premiere on Amazon Prime Video in July". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "The narrative of 'Narappa' is layered and thought-provoking: Co-producer D Suresh Babu". Zee News (in ఇంగ్లీష్). 2021-07-14. Retrieved 21 July 2021.
- ↑ "Narappa Movie Review", The Times of India, retrieved 21 July 2021
- ↑ "Narappa Movie Review: Asuran's identical twin is pedantic yet powerful". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ ChennaiJuly 20, Janani K.; July 20, 2021UPDATED:; Ist, 2021 08:46. "Narappa Movie Review: Venkatesh's Asuran Telugu remake lacks soul". India Today (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Narappa Movie Review: Did We Really Need A Scene-To-Scene Copy..." Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-20. Retrieved 21 July 2021.