స్వాగతంసవరించు

ఇందుశ్రీ ఉషశ్రీ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

ఇందుశ్రీ ఉషశ్రీ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:56, 25 జూన్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
విక్షనరీకి లింకులు ఇవ్వడం

చాలా సంధర్భాల్లో ఒక వ్యాసం లోని కొన్ని కష్టమైన పదాలకు నేరుగా తెలుగులో వ్యాసాలు ఉండవు. అలాంటి పదాలకు కేవలం అర్థం మాత్రమే వివరించడానికి వాటీని విక్షనరీలో చేర్చవచ్చు. ఒక పదానికి విక్షనరీ లింకు ఇవ్వాలంటే. [[wikt:పదము]]. అని చేర్చవచ్చు. ఉదాహరణకు లోభి అనే పదానికి విక్షనరీ లింకు ఇవ్వడానికి [[wikt:లోభి|లోభి]]. అని వాడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


వాడుకరి పేజి సృష్టించుటసవరించు

వాడుకరి పేజిని సృష్టించుకోగలరు.. అపుడు మీ గురించి ఇతర వికీపీడియన్లకు తెలిసే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు. Pranayraj1985 (చర్చ) 08:57, 29 జూన్ 2014 (UTC)

{{సహాయం కావాలి}}  Y సహాయం అందించబడింది


ఫ్రబోధానంద యోగీశ్వరులు పేజీ విస్తరించాము. ఇంకా ఆ విస్తరణ నోటిసు ఆలానే వుంది . కారణము యెమిటి?

విస్తరణ మూస తొలగింపు గూర్చిసవరించు

వాడుకరి:ఇందుశ్రీ ఉషశ్రీ గారూ, మీరు ప్రబోధానంద యోగీశ్వరులు వ్యాసం విస్తరించినందుకు ధన్యవాదాలు.మీరు వ్యాసాన్ని విస్తరించిన తదుపరి ఆ వ్యాసంలో ఉన్న {{విస్తరణ}} మూసను తొలగించి సేవ్ చేయవలెను. అపుడు విస్తరణ నోటీసు పోతుంది.----  కె.వెంకటరమణ చర్చ 16:59, 20 సెప్టెంబరు 2014 (UTC)

చర్చ లేకుండా మూసను తొలిగించడంసవరించు

మీరు ఎలాంటి చర్చ చేయకుండానే త్రైత సిద్ధాంతము వ్యాసంలో ఉన్న {{విషయ ప్రాముఖ్యతలేని వ్యాసం}} మూసను తొలిగించారు. మరియు వ్యాసంలో చాలా భాగం వికీ నియమాలను విరుద్ధమైన అంటే ఎక్కడా ఏ ఇతర గ్రంథాలలోలభ్యంకాని సమాచారం చేర్చారు. దానితో ఈ వ్యాసం కాస్త ప్రచారవ్యాసంగా మారింది. ఇది వికీ నియమాలకు పూర్తి విరుద్ధము. వ్యాసంలో "ఆంతర్యము ఏమో గాని", "తెలుసుకుందాము", "చూద్దాము", "ప్రయత్నిద్దాము" లాంటి పదాలు చేర్చారు. వ్యాసంలోని చాలా వాక్యాలు ఆధారం కోరబడుచున్నవి. దానికి సరైన థర్డ్‌పార్టీ ఆధారాలుంటే చేర్చగలరు లేనిచో అవి తొలిగించబడును. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:53, 7 అక్టోబరు 2016 (UTC)

సి. చంద్ర కాంత రావుగారికి నమస్కారములు. ఇంతకుముందు త్రైత సిద్ధాంతము అన్నది ఒక పుస్తక సమీక్ష గా రహమానుద్దీన్ గారి ఆధ్వర్యంలో వికీలోకి ఎక్కించడము జరిగినది, ఇవేకాక ఇంకా చాలా పుస్తకసమీక్ష వ్యాసాలు ఆయన ఆధ్వర్యంలో నే రాయడం జరిగినది. మాకు కూడ వికీతో పరిచయం అప్పుడే ఏర్పడినది. అయితే వ్యాసాలు వికీలో ఎలా వ్రాయాలి అన్న విషయంలో నే మాకు సరి అయిన అవగాహన ఏర్పడలేదని అనిపిస్తున్నది. నా ఉద్దేశ్యము ఏమంటే నేను చదివిన కొన్ని పుస్తకాల(ప్రబోధానంద యోగీశ్వరులువారి రచనలు,భగవద్గీత,బైబిల్, ఖురాన్) ఆధారంగా తెలియబడ్డ విషయాలు(100% వాస్తవాలు) నా తోటి వారికి అందించాలి అని మాత్రమే.ఈ సిద్ధాంత ఆధారముగానే హిందు సోదరులు భగవద్గీత తో సమానముగా బైబిల్, ఖురాన్ ను చూడడము, క్రిస్టియన్ సోదరులు బైబిల్ తో సమానముగా భగవద్గీత, ఖురాన్ ను , ముస్లీం సోదరులు ఖురాన్ తో సమానముగా భగవద్గీత, బైబిల్ ను చూడడము, చదవడము జరుగుచున్నది. అందుకే ఈ విషయం గూర్చి రాయాలి అని అనుకోవడం జరిగినది. అయితే ఈ త్రైత సిద్ధాంతము అన్న ఒక పుస్తక సమీక్షను ఒక సిద్ధాంతం తెలిపే వ్యాసముగా మారిస్తే బాగుంటుందని పలువురు వికీపీడీయన్లు అభిప్రాయం తెలపడం వల్ల, ఆ విధంగా మార్చడం జరిగినది. మార్చిన తర్వాత మూస తొలగించవచ్చని, ఇంతకుముందు చర్చల్లో నాకు తెలిసినందువల్ల (ఇది సరి కాదేమో అని ఇప్పుడు తెలిసినది) మూస తొలగించి వ్యాసాన్ని వ్రాయడం జరిగినది. అయితే వ్యాసం రాయడం ఇంకా పూర్తి కాలేదు అంటే ఇంకా మొలక దశ లో వున్నట్టే. మరి దీని కొరకు ఏ మూసను వాడాలో నాకు తెలియదు. మీలాంటి సీనియర్లు మాలాంటి కొత్త వికీపీడియన్లకు ఈ వ్యాసాలు వ్రాయడంలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది. పదాలు వాడుక గూర్చి కూడా తెలుపగలరు. వీలైతే మీ ఫోన్ నంబరు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. దయ చేసి ఈ వ్యాసాన్ని మొలక దశ లో వున్న వ్యాసంగా గుర్తించి ఆ మార్పులు చేయగలరని ఆశిస్తున్నాను. థర్డ్ పార్టీ ఆధారాలు అనగా ఏమిటో తెలుపగలరు. అభ్యంతరాలు లేని వ్యాసంగా ఈ వ్యాసం రూపు దిద్దుకొనడం లో సహకరించగలరు.ఈ వ్యాస రచనలో మాకు సూచనలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 08:06, 13 అక్టోబరు 2016 (UTC)