వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 8

తాజా వ్యాఖ్య: గ్రామాల పేర్లలో తప్పులు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

రాజనాల-ఆర్ నాగేశ్వరరావు

ఈ ఇద్దరు వేరు వేరు నటులు. కాని "వెతుకు"లో రాజనాల వెతికి వెళ్తే, ఆర్ నాగేశ్వరరావు పుటలోకి వెల్తున్నది, పైగా రాజనాల నుండి దారి మళ్ళింపు అని వ్రాసి ఉన్నది. దయచేసి చూడగలరు. అక్కడ చర్చా పుటలో వ్రాస్తే ఎవరన్నా చూస్తారో లేదో తెలియదు. అందుకని, మీకు సందేశం పంపుతున్నాను.--SIVA 06:06, 18 మే 2008 (UTC)Reply

చూస్తాను--కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:22, 18 మే 2008 (UTC)Reply

సినిమా ప్రకటనలు

కాసుబాబుగారు నమస్తే. చాలా కాలనికి మీ దగ్గరనుండి ఒక వర్తమానం వచ్చింది. నాదగ్గర పాత చందమామలు, యువలు చాలా ఉన్నాయి, కుదిరనప్పుడల్లా అందులోంచి బొమ్మలు (వడ్డాది పాపయ్యగారివి, చందమామ ధారావాహిక ప్రధమ పుటలు లేదా పాత చిత్రాల పకటనలు) కొన్ని స్కాన్ చేసి లేదా పి డి ఎఫ్ పార్మాట్లో ఉన్నవి జెపిజి లుగా మార్చి అప్-లోడ్ చేస్తునె ఉన్నాను. మీరు ఈ విషయం కోరటం మరింత ఉత్సాహాన్నిచ్చింది మరిన్ని అప్-లోడ్ చేస్తాను.

గుడిపాటి వెంకటచలం వ్యాసం వచ్చేవారం "ఈవారం వ్యాసం"గా పెడుతున్నందుకు ధన్యవాదాలు. అందులో సాధ్యమయినంత సమాచారాన్ని ఉంచాను, వ్యాసాన్ని తూకంచెడకుండా మార్పులు చేసాను. మరిన్ని వివరాలు సంపాయించి పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ముంబాయిలో నాపుస్తక నిధిలో కొంత మాత్రమే ఉన్నది అదొక చిన్న అవరోధం.

ఇక వెన్నూతల గురించి, నాదగ్గర అంతకు మించి వివరాలు లేవు. వికీలో వ్యాసం వ్రాయటానికి మాత్రమే ఆ వూరు 2-3 నెలల క్రితం వెళ్ళి అక్కడి ఫొటోలు, విశేషాలు ఉంచాను.ఆ వ్యాసంలో ఉంకొకాయన కూడా కొన్ని ఫొటొలను ఉంచారు, ఆయన దగ్గర మరింత సమాచారం ఉన్నదేమో ఆయనకు కూడా దయ చేసి ఒక మెసేజి ఉంచండి.

రేపు కూడా ఇక్కడ శెలవు (బుద్ద జయంతి అనుకుంటాను) కాబట్టి కొన్ని చలనచిత్ర ప్రకటనలు అప్ లోడ్ చేయగలను.--SIVA 04:53, 18 మే 2008 (UTC)Reply

ధన్యవాదాలు

కాసుబాబు గారూ, నావిన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు. మిత్రుడు నిసార్ అహ్మద్ 21:03, 12 మే 2008 (UTC)Reply

కాసుబాబు గారు, మీరు కూర్చిన స్థూపము బొమ్మతో అమరావతి వ్యాసానికి చక్కని కళ వచ్చింది. ధన్యవాదాలు. అమరావతిలో ధ్యానబుద్ధుని విగ్రహము ఈపాటికి పూర్తయివుంటుంది. ఎవరైనా విగ్రహము ఫొటొ తీసి ఇస్తే బాగుంటుంది.Kumarrao 04:56, 14 మే 2008 (UTC)Reply
గుంటూరు దగ్గరలో ఉన్నవారెవరైనా ఈ పని చేయగలరనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:44, 14 మే 2008 (UTC)Reply
కాసుబాబు గారు, అమరావతి స్తూపము బొమ్మ కొత్త వ్యాసము అమరావతి స్తూపం లో కూడ పెట్టగలరా? అలాగే en:amaravati లోనున్న శిల్పాల బొమ్మలు పెట్టడానికి వీలుంటుందా?Kumarrao 13:14, 14 మే 2008 (UTC)Reply
  అలాగే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:45, 14 మే 2008 (UTC)Reply
కాసుబాబు గారూ నమస్తే, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, మిత్రుడు నిసార్ అహ్మద్ 17:41, 15 మే 2008 (UTC)Reply

లైసెన్సు వివరాలు

బొమ్మ:Nizamabad.jpg లో నేను పెట్టిన FAIR USE RATIONALE చూడండి. ఇది ఓకేనా! అలాగయితే మిగిలిన మండలాల బొమ్మలకు కూడా ఈ నోటీసు పెడదాము. (ఒక మూస ఉంటే మరీ మంచిది) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:41, 14 మే 2008 (UTC)Reply

మండలాల బొమ్మలు సొంతగా తయారుచేసినవి కాబట్టి వాటికి ఫెయిర్ యూజ్ అవసరం లేదనుకుంటా..కానీ ఈ జిల్లా పటాలు ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ప్రస్తుతానికి మీరు వ్రాసింది బాగానే ఉంది. --వైజాసత్య 05:03, 16 మే 2008 (UTC)Reply
ప్రస్తుతానికి నేను వ్రాసింది వాడుదాము. నేను వ్రాసిన విషయం ఆధారంగా {{Non-free fair use admin division outline}} అనే మూసను తయారు చేయగలరా? వర్గం:కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు లిస్టును కుదించడానికి ప్రయత్నిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:27, 16 మే 2008 (UTC)Reply
ఇంకొక సంగతి - బొమ్మ:1Mukhadwaram.jpgలో నేను {{GFDL assumed}} అనే మూసను పెట్టాను. ఒకమారు చూసి మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:44, 16 మే 2008 (UTC)Reply

పెదవేగి

కాసుబాబు గారు, కన్నడ ఆదికవి పంప వేంగీవిషయము, పుంగనూరు కు చెందినవాడు. ప్రస్తుతము పుంగనూరు అనే పల్లె చిత్తూరు జిల్లాలోమాత్రమే వున్నది. అది వేంగీ దేశములోది అగుట అసాధ్యము. బహుశా మధ్యచారిత్రక కాలములో అట్టి ఊరు కృష్ణా గోదావరీ మండలాల్లో ఉండివుండవచ్చు లేదా పేరు మారి ఉండవచ్చు. పంప జైన మతావలంబియగు బ్రాహ్మణుడు. వేములవాడ చాళుక్య రాజు అరికేసరి ప్రాపకము సంపాదించి వైదీక మతము లోకి మారాడు. కన్నడములో విక్రమార్క విజయము రాశాడు.Kumarrao 14:05, 18 మే 2008 (UTC)Reply

కృతజ్ఞతలు. మారుస్తాను. లేదా మూలాలు ఉదాహరిస్తాను. ఇది నేను విన్న విషయాన్ని బట్టి వ్రాశాను. కనుక పొరపాటు కావచ్చును. కాని పంపడు, మరొక ముఖ్య కన్నడ కవి వేంగి దేశమువారని ఎక్కడో చదివాను. మళ్ళీ పరిశీలిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:40, 18 మే 2008 (UTC)Reply
పంప వేంగీ విషయమునకు చెందినవాడే. నా అభిప్రాయము ఛిత్తూర్ జిల్లా పుంగనూరు వేంగీదేశమునకు సంబందించినది కాదని.Kumarrao 04:00, 19 మే 2008 (UTC)Reply

కొన్ని మూసలు

కాసుబాబు గారూ, మీరు ఇటీవల తెచ్చిన కొన్ని మూసలు, పేజీలు తెవికీలో ఇప్పటికే ఉన్నాయి. (మరే ఇతర కారణము వళ్ళ తెచ్చి ఉంటే తప్ప) పరిశీలించగలరు

--వైజాసత్య 04:42, 20 మే 2008 (UTC)Reply

సరి చూస్తాను. పాలిసీలు, మార్గ దర్శకాలు చిందర వందరగా ఉండి అందరికీ తేలికగా కనిపించడంలేదు. వాటన్నింటిని ఒక గొడుగు క్రిందికి తేవాలని మొదలు పెట్టాను. నకళ్ళను తొలగిస్తాను. లేదా దారి మళ్ళింపు పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:32, 20 మే 2008 (UTC)Reply

అభ్యర్ధన

కాసుబాబు గారు, తెలుగు వ్యాసములో నున్న లిపి పరిణామము బొమ్మ ను నేను రాసిన en:Bhattiprolu Scriptలో పెట్టగలరా?Kumarrao 15:40, 20 మే 2008 (UTC)Reply

కొంచెం ఆగండి. వైజాసత్య నుండి కాపీ హక్కుల సమాచారం కనుక్కొని, తరువాత ఆంగ్ల వికీలో పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:30, 20 మే 2008 (UTC)Reply

తుని రైలు స్టేషన్‌ ఫొటో

తిని పేజీలో మొట్టమొదట caption తో ఉన్న ఫొటో నేను తీసినదే. జనవరి 2004 లో తీసేను. పేజీ చెవర మరొక బొమ్మ ఎవ్వరో తుని అభిమానులు తగిలించేరు. దీనికి caption లేదు. ఇది నేను తీసినది కాదు. నేను తీసిన బొమ్మ ప్రచురించటానికి నాకు అభ్యంతరం లేదు. Vemurione 17:58, 25 మే 2008 (UTC)Reply

దేశములు ఇన్ఫోబాక్స్ - జాతీయగీతం

కాసుబాబు గారు నమస్తే, వివిధ దేశాల ఇన్ఫోబాక్స్ లలో ఆయా దేశాలకు చెందిన 'డేటా' మరియు ఇతర విషయాలుంటాయి, వాటి 'జాతీయగీతం' స్థానంలో నొక్కితే నేరుగా మన జాతీయగీతం లోకి వెళ్తున్నాము. దీని గురించి కొంచెం చూడండి. మీ సూచనలివ్వండి. నిసార్ అహ్మద్ 17:41, 26 మే 2008 (UTC)Reply

సరి చూస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:06, 26 మే 2008 (UTC)Reply

ఆటోమాటిక్ సభ్యులు

ఈ రెండుమూడు రోజుల్లోనూ చాలా మంది క్రొత్త సభ్యులు "Account created automatically" అన్న వ్యాఖ్యతో నమోదు అవుతున్నారు. దీని అర్ధం ఏమిటి? ఇదేమైనా స్పామ్ లాంటిదా? ఏమి చేయాలి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 27 మే 2008 (UTC)Reply

కాదు, వికీపీడియా ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల్లోని సభ్యుల అకౌంట్లను ఏకీకృతం చేస్తోంది. అంటే ఒకే సభ్యనామంతో ఏ వికీ ప్రాజెక్టులోనైనా లాగినయ్యే సౌకర్యం ఉంది. అభిరుచుల్లో గ్లోబల్ ఖాతాను నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే ఇది చూడండి [1]. ఈ ఆటోమేటిక్ సభ్యులు వేరే ఏదైనా వికీలో సభ్యులై ఉండి, అన్నీ వికీల్లో సభ్యనామం సృష్టించమని ఎక్కడో నొక్కి ఉంటారు (నాకూ ఇది ఎలా చెయ్యాలో వివరాలు పూర్తిగా తెలియదు) --వైజాసత్య 23:01, 27 మే 2008 (UTC)Reply
ప్రస్తుతం ఈ సౌకర్యం ఏదో ఒక వికీపీడియా ప్రాజెక్టులలో నిర్వాహకులైన సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. రెండు-మూడు నెలల క్రితం చూసాను దీనిని, మొదట్లో ఈ ఆటోమాటిక్ సభ్యులను నిశబ్ధంగా సృష్టించేది. ఇప్పుడు వీటికి కూడా లాగ్స్ వస్తుఆయి అంతే తేడా. నా చర్చా పేజీలో ఉన్న Usurpation request కూడా దీనికి సంభందించిందే. మీరు కూడా ఇప్పటివరకూ వేర్వేరు వికీపీడియాలలో ఉన్న మీఖాతాను ఏకీకృతం చేసుకోండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:08, 28 మే 2008 (UTC)Reply

తెలుగు లిపి

తప్పకుండా చేస్తాను. ముసునూరి కాపానీడు బొమ్మ సంపాదించాను. మీ ఈమెయిలుకు పంపుతున్నాను. బొమ్మను ఎడిట్ చేసి తెలుగు మరియు ఆంగ్ల వికీలలో పెట్టగలరు. ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.Kumarrao 14:16, 28 మే 2008 (UTC)Reply

"మంచిమాట" గురించి

"మంచిమాట"ను ఒక వ్యాసంలా కాకపోయినా వికీ విజ్ఞాన సర్వస్వంలో ఏదో మూలన పడేయండి. ఇక ఆ కథ "అంతా మన మంచికే" అనే భావన ఎంత బలమైందో తెలుపుతుంది. అందుకే వ్రాశాను. నా దగ్గర 222 మంచిమాటలున్నాయి. నెట్ ఉపయోగించడానికి నాకు అవకాశం తక్కువగా ఉంది. అందుకే రోజూ కొన్ని కొన్ని చేరుస్తున్నా. నా ప్రయత్నాన్ని గమనించినందుకు కృతజ్ఞతలు. నా వయస్సు 21 సంవత్సరాలు. నన్ను "మీరు" అని సంభోదించనవసరం లేదన్నయ్యా. వీలును బట్టి ఇతర వ్యాసాలను చూస్తుంటాను.--తమ్ముడు-తాండు 17:56, 30 మే 2008 (UTC)Reply

అలాగే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:42, 30 మే 2008 (UTC)Reply

మెరుపు వ్యాసం

కాసుబాబు గారూ, మెరుపు అనేవ్యాసం చర్చాపేజిలో మెరుపు (సినిమా) వ్యాసపు చర్చ యున్నది, ఆచర్చా పేజీని ఓపెన్ చేసి, వ్యాసం పేజీని నొక్కితే మెరుపు (సినిమా) పేజీ వస్తోంది, దీనిని గమనించి కొంచెం సరిచేయండి ప్లీజ్. నిసార్ అహ్మద్ 16:40, 31 మే 2008 (UTC)Reply

ఇస్లాం వ్యాసాల జాబితా

కాసుబాబు గారు, అలాగే ప్రయత్నిస్తాను, మీఅభీష్టం మేరకు చేయండి, నేను వ్రాసే వ్యాసాలగురించి అప్పటి కప్పుడు సూచనలిస్తూవుండండి, ధన్యవాదాలు. మిత్రుడు . నిసార్ అహ్మద్ 14:56, 1 జూన్ 2008 (UTC)Reply

భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు

కాసుబాబు గారూ, భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు వ్యాసానికి ఆపేరు సరిపోతుందో లేదో కొంచెం చూసి చెప్పండి, కారణం ఇవికీ నుండి en:Names of India నుండి కాపీచేసి తర్జుమా చేశాను. నిసార్ అహ్మద్ 15:04, 1 జూన్ 2008 (UTC)Reply

కాపానీడు

కాసుబాబు గారు, బొమ్మ మీకు అందినదని తలుస్తాను.Kumarrao 13:13, 4 జూన్ 2008 (UTC)Reply

బొమ్మ అందింది. అప్‌లోడ్ చేస్తాను. ఆఫీసులో కొంచెం బిజీగా ఉన్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:50, 4 జూన్ 2008 (UTC)Reply
బొమ్మ చాలా బాగా కుదిరింది. ధన్యవాదాలు.Kumarrao 03:49, 9 జూన్ 2008 (UTC)Reply
బాగా కనిపెట్టారు. మా ఊరు (తెనాలి పక్కన కూచిపూడి) భట్టిప్రోలుకి బహుసమీపము. తెనాలి-భట్టిప్రోలు బస్సు మాఊరిమీదుగా వెళుతుంది. నేను చిన్నపుడు భట్టిప్రోలు, అచటి తవ్వకములోనున్న స్తూపము చూశాను. మరలా వెళ్ళి చూద్దామని ఉంది. దక్షిణభారత చరిత్రకు ఆద్యమయిన ఒక గొప్ప ప్రాచీనసంపదకు వారసులలో ఒకడినని గర్విస్తాను. దానికి తోడు మాప్రాంతములో వారందరికి బౌద్ధమంటే చాల అభిమానము, ప్రేమ. ఎందుకోతెలియదు.Kumarrao 05:49, 10 జూన్ 2008 (UTC)Reply
అభినందనలు. ఈ సారి వెళ్ళినపుడు మంచి ఫొటోలు తీసుకురండి. పురాతన అవశేషాలు, ప్రస్తుతం వూరు కూడా. "బౌద్ధము-ఆంధ్రము" పుస్తకం లింకు ఇది. http://www.archive.org/details/bouddamuandhramu018708mbp మీరు తప్పక చూడాల్సిన పుస్తకం. ఇందులో భట్టిప్రోలు గురించి చక్కని వ్యాసం ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:20, 10 జూన్ 2008 (UTC)Reply
ధన్యవాదాలు. వ్యాసములో చాలవరకు విషయాలు హనుమంతరావు గారి పుస్తకములోనివే.నాలుగు భట్టిప్రోలు బొమ్మలు మీకు పంపాను. చూడగలరు.Kumarrao 12:02, 10 జూన్ 2008 (UTC)Reply


తైమూర్ లంగ్

వ్యాసము చదివి వ్యాఖ్యానించగలరు.Kumarrao 09:25, 12 జూన్ 2008 (UTC)Reply

బొమ్మలు చాల చక్కగా కుదిరాయి. ధన్యవాదాలు.Kumarrao 05:10, 13 జూన్ 2008 (UTC)Reply


వికీ వ్యాఖ్యలో తెలుగు టైపింగ్ ఎలా?

అన్నయ్యా..! నువ్వు సూచించినట్లే వికీ వ్యాఖ్యను చూశాను. సభ్యత్వం కూడా తీసుకున్నాను. ఏమైనా చేద్దామంటే తెలుగు టైపింగ్ చేయడానికి లేదు. అక్షరాలు ఇంగ్లీష్ లో పడుతున్నాయి. వికీకోట్ లో తెలుగులో వ్రాయడానికి ఏం చేయాలి? మంచిమాట పేజీ ఎలా ఉంది? బాగుందా..? 111 సూక్తులు వరకు మంచిమాటలో రచించి మరో 111 సూక్తులను మంచిమాటలో లింక్ ఇచ్చి మంచిమాట-2 పేజీని రచిద్దామనుకుంటున్నాను. మంచిమాట బాగా పెద్దదిగా అవుతోంది కదా..!-- తమ్ముడు-తాండు(చర్చ) 11:54, 16 జూన్ 2008 (UTC)Reply


మంచిమాట పేజీ ఏది?

మొదటి పేజీలోని వెతుకు పెట్టెలో "మంచిమాట" అని టైపు చేసి {వెళ్ళు} మీట నొక్కితే మంచిమాట పేజీ లేనే లేదు. మీరు ఆ పేజీని సృష్టించవచ్చు అని వస్తోంది. అన్నయ్యా మరి నువ్వు ఎలా ఆ పేజీని చూశావు?-- తమ్ముడు-తాండు(చర్చ) 11:34, 17 జూన్ 2008 (UTC)Reply

తెలుగు లిపి

కాసుబాబు గారు,

తెలుగు లిపి పరిణామము పట్టిక భద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకములో(The Dravidian Languages) 79వ పేజీలో టేబుల్ 3.1a గా ఉన్నది. దీన్ని ఆంగ్ల వికీలో (Telugu script) పెట్టగలరని ఆశిస్తున్నాను. కృష్ణమూర్తి గారి పుస్తకము గూగుల్ బుక్స్ లో దొరుకుతుంది.Kumarrao 11:28, 17 జూన్ 2008 (UTC)Reply


వికీ వ్యాఖ్య గురించి

అయితే వికీ వ్యాఖ్యలో సినిమా పాటలు పెట్టవచ్చా.-- తమ్ముడు-తాండు(చర్చ) 16:28, 19 జూన్ 2008 (UTC)Reply

కేలండర్ నిర్వహణ

కాసుబాబు గారు, మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంవత్సరాల వ్యాసాలకు తెవికీ హిట్లు చాలా వస్తున్నాయి. కాని దురదృష్టవశాత్తు ఈ పేజీలలో సమాచారం చాలా తక్కువగా ఉంది. కొన్ని పేజీలలో విభాగాలు తప్ప సమాచారమేమీ లేకుండా ఉన్నాయి. కాబట్టి జనాదరణ దృష్ట్యా ఈ పేజీల సమాచారం వృద్ధిచేయాలని నిశ్చయించి నేను ఈ పని మొదలుపెట్టాను. మీరు 1950 పేజీలో చేర్చిన తెలుగు సినిమాలు 1950 లింకు చూశాను. ఇది సమాచారం కాకుండా ఒక లింకు మాత్రమే కాబట్టి దీన్ని ఇవి కూడా చూడండి అనే విభాగంలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:18, 20 జూన్ 2008 (UTC)Reply

నెల్లూరు జిల్లా

ప్రదీప్!

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:06, 22 జూన్ 2008 (UTC)Reply

సినిమా మూసను సరిచేసాను, నెల్లూరు జిల్లా కొత్త పేరుకు బాట్ ద్వారా ప్రోగ్రాము రాయడానికి కొంత(?) సమయం పడుతుంది... __మాకినేని ప్రదీపు (+/-మా) 15:33, 22 జూన్ 2008 (UTC)Reply

దారిమార్పు ఎలా చేయాలి?

కాసుబాబు గారూ, నమస్తే, ఈదుల్-అజ్ హా అనే పేజీని 'తరలింపు' బక్రీదు లేదా బక్రీద్ పేజీతో చేస్తే, తరలింపు జరిగి, బక్రీదు లేదా బక్రీద్ పేరుతో పేజీ వస్తుంది. కానీ పేజీ పేరు ఈదుల్-అజ్ హా గానే వుండాలి, బక్రీదు లేదా బక్రీద్ పేరులతో తరలింపు జరగాలి, అంటే యేమి చేయాలి కొంచెం తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 20:49, 23 జూన్ 2008 (UTC)Reply


బక్రీదు లేదా బక్రీద్ అనే (క్రొత్త) వ్యాసాలు తెరిచి, వాటిలో #REDIRECT [[ఈదుల్-అజ్ హా]] అని వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 03:50, 24 జూన్ 2008 (UTC)Reply

తెలుసుకోవాలనుకుంటున్నాను

కాసుబాబు గారూ, నమస్తే, నేను చిన్నప్పుడు కొన్ని లోకాలగూర్చి చదివాను, సరిగా గుర్తుకు రావడంలేదు, చూచాయగా మాత్రం చెప్పగలను, ఉదాహరణకు; అతలము, తలాతలము, రసాతలము, పాతాళము మున్నగునవి (బహుశా సప్తలోకాలు గావచ్చు, నాకు సరిగా తెలియదు, పౌరాణిక చిత్రాల్లో కూడా విన్నట్టు గుర్తు). ఇవి ఉన్నాయా? ఉంటే వాటి విషయాలు ఎక్కడనుండి గ్రహించవచ్చునో తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 17:31, 27 జూన్ 2008 (UTC)Reply

పెద్దాపురం ఆంగ్ల వ్యాసములోని చిత్రాల గురించి వివరణ

శ్రీ కాసుబాబు గారికి శుభోదయం. పెద్దాపురం ఆంగ్ల వ్యాసములోని చిత్రాలు http://eastgodavari.nic.in/Peddapuram.html వెబ్ సైటు నుంచి గ్రహించబడినవి.ఈ చిత్రాల కాపీ రైట్ వివరాలు తెలియవు.మీరు దయచేసి వాటికి తగిన సవరణలు చేయగలరు. Lab125 07:03, 28 జూన్ 2008 (UTC)Reply


ఆంగ్లవికీలో ఈ పేజే పెడదామా!

కాసుబాబు గారూ నమస్తే! ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు అనే పేజీ 'ఇవికీ'లో లేదు. ఈ పేజీని 'తర్జుమా' చేయకముందు ఇవికీలో పెడదామా? మూడు జిల్లాల సమాచారం తెలుగులో తర్జుమా చేసాను, దాని తరువాత నాకు తట్టింది, ఆంగ్లంలో వున్న విషయాన్ని 'ఇవికీ' పెడదామని. తెలుగులో వున్న కొద్ది భాగాన్ని, లింకునుండి సేకరించి అలాగే పెట్టవచ్చు. మీ అభిప్రాయం తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 15:13, 7 జూలై 2008 (UTC)Reply

అది మీ అభిరుచి ప్రకారం చేయవచ్చును. అంటే నా ఉద్దేశ్యం తెలుగు వికీలో వ్రాసిన దానికి ఆంగ్లంలో వ్యాసం ఉండి తీరాలని లేదు. నాకేమనిపిస్తుందంటే ఏ లింకునుండయినా కాపీ చేసి ఆంగ్లంలో పెట్టడం చాలా తేలిక. కనుక ఆంగ్ల వికీలో వ్యాసం పెట్టినందువల్ల పెద్దగా ప్రయోజనం రాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:39, 7 జూలై 2008 (UTC)Reply

విష్ణుకుండినులు

కాసుబాబు గారు, వ్యాసములొ ఉండవల్లి, మొగల్రాజపురము గుహాలయాల బొమ్మలు దయవేసి పెట్టగలరా?Kumarrao 17:43, 8 జూలై 2008 (UTC)Reply

అలాగే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:20, 9 జూలై 2008 (UTC)Reply
ధన్యవాదాలు.Kumarrao 10:02, 11 జూలై 2008 (UTC)Reply

చిన్న సమస్య

వ్యాసాలలో విభాగాలు ప్రారంభించినపుడు మార్చు అని కాకుండా [<small>మార్చు</small>] అని వస్తుంది. ఎక్కడో మూసల్లో చిన్న మార్పులు జరిగి ఉంటుందని నా అనుమానం. మీకు కూడా అలాగే కనిపిస్తోందా? రవిచంద్ర(చర్చ) 09:08, 11 జూలై 2008 (UTC)Reply

అవును. ఇది మూసలకు సంబంధించిన విషయం కాదనుకొంటాను. మెటావికీ యేమో. ఎవరైనా తెలిసినవాళ్ళు చూస్తారులే అని ఊరుకొన్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:13, 11 జూలై 2008 (UTC)Reply

pdf ఫైళ్ళ వినియోగం

వైజా సత్యా! రహమతుల్లా గారు కొన్ని pdf ఫైళ్ళు అప్‌లోడ్ చేశారు. ఇంకా ఇతరులు కూడా చేసి ఉండొచ్చు. ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించాలి? నాకు అర్ధం కాలేదు. ఆంగ్ల వికీలో ఇందుకు సంబంధించిన సూచనల పేజీ ఏదైనా ఉంటే నాకు లింకు ఇవ్వ గలవా? నేను వెతికితే దొరుకలేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 9 జూలై 2008 (UTC)Reply

రహంతుల్లా గారు తమ సొంతరచనలను ఇక్కడ అప్లోడ్ చేసినట్టున్నారు. వాటిని తొలగించాలి. వికీపీడియాలో ఫీ.డీ.ఎఫ్ ల తో పనిలేదు. ఎందుకంటే అవి కనిపించవు కూడాను. అంత ప్రాముఖ్యమై అవి భద్రపరచయోగ్యమైన పీ.డీ.ఎఫ్లైతే కామన్స్లో ఎక్కించాలి. అయినా బొమ్మలగాగానీ, పాఠ్యముగాగానీ కాకుండా ఫీడిఎఫ్లను భద్రపరచవలసిన సందర్భాలు చాలా అరుదు. వికీసోర్సులో కూడా ఎక్కించవచ్చు. కానీ అక్కడా వీటిని నేరుగా చూసే సౌలభ్యంలేదు. ఈ విషయమై ఇక్కడ కొంత చర్చ జరిగింది చూడండి. ఇవి ఆయన సొంత రచనలై కాపీహక్కులు త్యజించే పక్షాన కామన్స్లో అప్లోడ్ చేయటం మంచి పద్ధతి. --వైజాసత్య 23:46, 11 జూలై 2008 (UTC)Reply
PDFs ought not be used in any wiki cos .pdf is not a free format. .djvu ought to be used. more on .djvu here. చర్చసాయీరచనలు 11:15, 6 ఆగష్టు 2008 (UTC)

అమరావతి స్తూపం

తగు మార్పులు తప్పక చేయండి. స్తూపాకృతి భాగములో ఖాళీ స్థలము చూడడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే ఆంగ్ల వ్యాసము en:Andhra Pradesh లో Andhra Pradesh State Symbols పెట్టె స్థాన భ్రంశం చెందింది. సరిచేయగలరా? Kumarrao 06:15, 13 జూలై 2008 (UTC)Reply

కొత్త సమాచారముతో వ్యాసము చాల బాగుంది. మీ శ్రమకు ధన్యవాదాలు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విభాగాలు చాల పెద్దవిగా ఉన్నాయి. వాటిని సంక్షిప్తపరిస్తే బాగుంటుందేమో. మీరు అనుమతిస్తే ఆ పనికి పూనుకుంటాను.Kumarrao 06:35, 21 జూలై 2008 (UTC)Reply
రెండు మూడు రోజులు ఆగండి. ఆ వ్యాసాన్ని పునః పరిశీలించి మీతో చర్చిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:15, 21 జూలై 2008 (UTC)Reply
స్వల్ప విరామం తరువాత గోరంట్ల వెంకన్న వ్రాశాను. చరిత్ర చాల బాగా వస్తున్నది. అభినందనలు. ముఖ్య పేజీలో సమాచారం కుదిస్తే బాగుంటుందేమో.Kumarrao 16:29, 2 ఆగష్టు 2008 (UTC)

వ్యాసము - చర్చ

కాసుబాబు గారు, బ్రహ్మచారి వ్యాసమునకు గల చర్చా పేజీలో బ్రహ్మచారి (సినిమా) పేజి చర్చ వున్నది. దానిని కొంచెం సరిచేయగలరా. నిసార్ అహ్మద్ 18:41, 14 జూలై 2008 (UTC)Reply

కాకతీయులు

కాసుబాబు గారు, వ్యాసములోనున్న రుద్రమ దేవి బొమ్మ చాల అసహజముగా ఉన్నది. ఈ బొమ్మ ఆంగ్ల వికీలో కూడ ఉన్నది. బొమ్మలోని వేషధారణ భారతదేశములో ముస్లిముల ప్రవేశము తరువాత రాజపుత్ర స్త్రీలు, ఉత్తరభారత మహిళలు పాటించిన పద్ధతిలో ఉంది. నా అభిప్రాయము రుద్రమదేవి ఈ విధముగా ఉండి ఉండదు. ఆమె కాలానికి ముస్లిములు వారి వేషభాషలు ఆంధ్రదేశములోనికి రాలేదు. చర్చించి దయచేసి బొమ్మ తీసివేయండి.Kumarrao 09:48, 21 జూలై 2008 (UTC)Reply

అవును. నాకూ అలానే అనిపించింది. ఎలాగూ ట్యాంక్ బండ్ విగ్రహాలలో రుద్రమదేవి బొమ్మ ఉంది గనుక ఈ బొమ్మ అవుసరం లేదనుకొంటాను. పరిశీలించి, తరువాత తొలగిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:26, 21 జూలై 2008 (UTC)Reply

పేజీని తొలగించే విధానం తెలుపగలరు

కాసుబాబుగారూ, నమస్తే, పేజీని ఎలా తొలగిస్తారు? దీని విధానం కొంచెం తెలుపగరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 08:44, 23 జూలై 2008 (UTC)Reply

గ్రామాల పేర్లలో తప్పులు

దేవా గారూ, గ్రామాల పేర్లు దాదాపు అన్నీ ఆంగ్లం జాబితా నుండి అనువదించినవే కనుక మీరు చెప్పిన తప్పులు వచ్చి ఉండవచ్చును. మీకు ఖచ్చితంగా తెలిసిన పేర్లను సరైన పేర్లకు తరలించేయండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:07, 22 జూలై 2008 (UTC)Reply

కాసుబాబు గారూ! ధన్యవాదాలు. నాకు ఖచ్చితంగా గుర్తులేవండి, ఆ పేర్లు, కానీ ఎందుకో అనుమానం వచ్చింది. అందుకే చర్చాపేజీల్లో రాసా. ఖచ్చితంగా తెలిసినోళ్ళెవలైనా మార్చుతారని. δευ దేవా 08:22, 25 జూలై 2008 (UTC)Reply
ఓ.కే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:26, 25 జూలై 2008 (UTC)Reply

ప్రాధమిక హక్కులు వగైరా

కాసుబాబు గారూ నమస్తే, మూస:భారత రాజకీయ వ్యవస్థ లో, భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు, భారత రాజ్యాంగం - ప్రాధమిక విధులు మరియు భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు అనే లింకులు (ఎర్రరంగులో) వున్నాయి. కానీ ఈ విషయాల కొరకు వ్యాసాలు మాత్రం, భారతదేశంలో ప్రాధమిక హక్కులు, భారతదేశంలో ప్రాధమిక విధులు మరియు భారతదేశంలో ఆదేశిక సూత్రాలు అనే పేర్లతో గలవు. వీటిని లింకులిచ్చి సరిదిద్దగలరని ఆశిస్తున్నాను. నిసార్ అహ్మద్ 04:41, 2 ఆగష్టు 2008 (UTC)

అలాగే చూస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:53, 2 ఆగష్టు 2008 (UTC)

ఈ వారం వ్యాసం

ఈ వారం వ్యాసం గా స్వామీ వివేకానంద పెడదామా?- రవిచంద్ర(చర్చ) 04:46, 5 ఆగష్టు 2008 (UTC)

"పెడుదామా?" అనే బదులు ఇక్కడ ప్రతిపాదన చేయచ్చు కద? చర్చసాయీరచనలు 11:18, 6 ఆగష్టు 2008 (UTC)

వ్యాసములో చిన్న, పెద్ద దిద్దుబాట్లు చేశాను. చూడండి. 'కాకతీయుల పతనము' పై సమాచారము సేకరిస్తున్నాను.Kumarrao 11:56, 7 ఆగష్టు 2008 (UTC)

పొటో అప్లోడ్

నేను ఫొటొ జత చేయటానికి ప్రయత్నిస్తే ఫైలుకి పొడగింపు (".jpg" లాంటిది) లేదు. అని ఎర్రర్ వస్తూంది, నేను తీసిన కొన్ని ఫొటోలు ఎలా జత చేయాలో దయచేసి తెలియజేయ గలరా.Ramyageethika 09:40, 10 ఆగష్టు 2008 (UTC)

కాసుబాబు గారు దన్యవాదాలు,ఇప్పుడు సరిగా అప్ లోడ్ చేయగలిగాను.Ramyageethika 15:17, 10 ఆగష్టు 2008 (UTC)

వ్యాసానికి లేదా ముందుగానే ఉన్న వివరాలకి బొమ్మ ని జత చేయాలంటే ఎలాగో తెలియజేయగలరు, ఉదాహరణకి చంద్రగిరి గురించిన వివరాలు ఉన్నచోట నేను అక్కడి రాణీ మహల్ బొమ్మ జత చేయాలంటే ఎలాగ? అలాగే చెట్లు వివరాలు రాసాక వాటికి బొమ్మ జతచేయ లేక పోయాను. థాంక్యు.Ramyageethika 15:48, 10 ఆగష్టు 2008 (UTC)

Telugu Wikiquote

Hi, I found you because of this discussion about closing the Telugu Wikiquote on the Meta site. Is this project still functioning? You can get back to me on my talk page on English Wikipedia. Thanks!--Aervanath 11:50, 13 ఆగష్టు 2008 (UTC)

తాండూర్ లేదా తాండూరు

తాండూర్ (రంగారెడ్డి) గురించి. తాండూరు అని ఉండాలని అనుకుంటాను. చర్చసాయీరచనలు 14:12, 18 ఆగష్టు 2008 (UTC)

కనుక్కొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:19, 18 ఆగష్టు 2008 (UTC)

కాసుబాబు గారు, కొంత విరామము తరువాత గండికోట యుద్ధం వ్రాశాను. చూడగలరు.Kumarrao 07:11, 24 ఆగష్టు 2008 (UTC)

పేర్లు మార్చగలరా!

కాసుబాబు గారూ! నమస్తే. బొమ్మ:Tabuku assembly constituency.svg మరియు బొమ్మ:Nidavole assembly constituency.svg బొమ్మలను సరైన పేర్లకు మార్చండి, ప్లీజ్. δευ దేవా 20:24, 19 సెప్టెంబర్ 2008 (UTC)

Return to the user page of "కాసుబాబు/పాతచర్చలు 8".