భాను వారణాసి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

భాను వారణాసి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 09:01, 17 మే 2022 (UTC)Reply

ధన్యవాదములు శ్రీ రామ మూర్తి గారు. ప్రతి రోజూ కొన్ని క్రొత్త విషయాలు నేర్చు కొంటున్నాను. భాను వారణాసి (చర్చ) 12:54, 24 మే 2022 (UTC)Reply

మీరు సృష్టించిన కథనాన్ని తొలగించమని అభ్యర్థించినందుకు మీరు నాకు ధన్యవాదాలు తెలిపారు

మార్చు

హలో! మీరు సృష్టించిన పేజీని పరీక్ష పేజీగా తొలగించమని అభ్యర్థించినందుకు మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్లు నేను గమనించాను. నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగవచ్చా? అలాగే, వీటిలో కొన్ని అర్థం కాకపోతే, నాకు తెలిసిన ఏకైక భాష ఆంగ్ల భాషగా నేను Google అనువాదాన్ని ఉపయోగిస్తున్నాను. Blaze Wolf (చర్చ) 17:33, 18 మే 2022 (UTC)Reply

చర్చ:సముద్రం పేజీలో మీ వ్యాఖ్యకు స్పందనగా..

మార్చు

భాను వారణాసి గారూ, చర్చ:సముద్రం పేజీలో "ఈ వ్యాసము అసంపూర్తిగా వున్నది.మూలాలు ,లింకులు లేవు.‌‌ వ్యాసకర్త ఎవరు?" అని అడిగారు. దానిపై కొన్ని విశేషాలను చెప్పదలచాను. అయితే, అది ఇక్కడ రాయడం సమంజసం కాబట్టి రాస్తున్నాను.

వికీపీడియాలో వ్యాసకర్తకు ప్రాముఖ్యత ఏమీ లేదు. వ్యాసం ఎవరికీ చెందదు. వాడుకరులందరం కలిసి వ్యాసాలను తయారు చేస్తాం. వికీపీడియాలో ఒకసారి సమాచారం రాసి ప్రచురిస్తే, ఇక ఆ సమాచారంపై తన హక్కును ఆ రచయిత వదులుకున్నట్టే. ఉదాహరణకు మీరు సృష్టించిన మేడికుర్తి పేజీలో నేను కూడా సమాచారాన్ని చేర్చాను. సృష్టించినది మీరు, అందులో గరిష్ఠంగా సమాచారం చేర్చినది నేను. కానీ, ఈ వ్యాసానికి మనిద్దరం స్వంతదార్లం కాము. దీనిపై అన్ని హక్కులనూ వదులుకున్నాం. ప్రచురించేముందు వచ్చే డయలాగు పెట్టెలో, "మీ కృతిని సిసి-బై-ఎస్ఎ 3.0 లైసెన్సు, జిఎఫ్డిఎల్(GFDL) షరతుల ప్రకారం వెనక్కి తిరిగి తీసుకోలేని అనుమతి ఇస్తున్నారు." అని ఉంటుంది, గమనించండి. ఇతర వాడుకరులు ఆ సమాచారాన్ని వికీ నియమాలకు, విధానాలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చవచ్చు, తీసివెయ్యవచ్చు, కొత్తది చేర్చనూవచ్చు. అయితే..

ఆ సమాచారం చేర్చిన వ్యక్తిని సంప్రదించి, దాని గురించి చర్చించాలని మీరు భావిస్తే, తప్పకుండా చెయ్యవచ్చు. ఏ సమాచారాన్ని ఎవరిఉ చేర్చారో తెలుసుకునేందుకు వ్యాసం పైన ఉండే ట్యాబుల్లో "చరిత్ర" అనే ట్యాబుకు వెళ్ళండి. వ్యాసంలో ఇప్పటివరకూ జరిగిన మార్ప్ఉచేర్పులన్నిటినీ అక్కడ చూపిస్తుంది. దాన్నిబట్టి ఏ సమాచారాన్ని ఎవరు రాసారో తెలుసుకోవచ్చు. వారితో చర్చించవచ్చు, ఇతరులతోనూ చర్చించవచ్చు. అలా చెయ్యడం మంచి సంప్రదాయం కూడా.

పై వ్యాసంలో సముచితమనుకున్న మార్పుచేర్పులను మీరు చేసెయ్యవచ్చు, చేసెయ్యండి. వెనకాడవద్దు. అయితే, మనం చేర్చే సమాచారంలో అవసరమైన ప్రతిచోటా మూలాలనివ్వాలి. గమనించగలరు. __ చదువరి (చర్చరచనలు) 01:52, 23 మే 2022 (UTC)Reply

మంచి సమాధానం భాను వారణాసి (చర్చ) 08:42, 26 మే 2022 (UTC)Reply

తెలుగు వ్యాసాలు

మార్చు

వికీపీడియా లో స్వయంచాలక అనువాదాలు , వ్యాసాల్లో చాలా అక్షర దోషములు ఉన్నవి.‌ తెలుగు భాష మీద పట్టు , ప్రావీణ్యము వాడుకరులకు ఉండ వలెను. గూగుల్ అనువాదాన్ని సరిదిద్ది ప్రచురించ వలెను.‌ చదువరులకు వ్యాసం చదివిన వెంటనే ఒక సంతృప్తి కలగ వలెను. భాను వారణాసి (చర్చ) 05:59, 24 మే 2022 (UTC)Reply

భాను గారూ, మీ అభిప్రాయం చాలా సమంజసంగా ఉంది. "గూగుల్ అనువాదాన్ని సరిదిద్ది ప్రచురించ వలెను.‌ చదువరులకు వ్యాసం చదివిన వెంటనే ఒక సంతృప్తి కలగ వలెను." - ఈ అభిప్రాయంతో నేను నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను. వికీలో కొన్ని యాంత్రికానువాదాల నాణ్యత బాగోలేదన్నది సత్యం. దానిపై వాడుకరులు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ అనేక వ్యాసాలు అలాంటివి ఉంటూనే ఉన్నాయి. అయితే మీరు మీ అభిప్రాయాలను ఇక్కడ కంటే, రచ్చబండలో రాస్తే మరింత మంది చదువుతారు. అలాగే, వ్యాసాల్లో ఇలాంటి లోపాలు గమనించినపుడు, మీరు -
  • వెంటనే వాటిని సవరించవచ్చు.
  • మీకు అంత సమయం లేకుంటే ఆయా పేజీలలో {{యాంత్రిక అనువాదం}} అనే మూసను గాని, {{కృత్రిమ భాష}} అనే మూసను గాని చేర్చవచ్చు. అది చూసినవాళ్ళు తమకు ఉన్న వీలును బట్టి సరిచేస్తారు.
  • పై మూస పెట్టిన తర్వాత కూడా నెల రోజులపాటు మెరుగుదల జరక్కపోతే ఆ వ్యాసాన్ని తొలగించేందుకు ప్రతిపాదించవచ్చు.
  • భాష మరీ సరిచేసేందుకు కూడా వీల్లేనంత అధ్వాన్నంగా ఉంటే ఆ వ్యాసాన్ని తొలగించేందుకు ప్రతిపాదించవచ్చు.
భాషా దోషాలపై మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 07:11, 24 మే 2022 (UTC)Reply

చతుర్వేది గారూ..మీ వ్యాసములు కొన్ని చదివాను. భాష ,వ్యాస నిర్మాణము చక్కగా ఉన్నది. ఈ సారి రచ్చ బండను వాడుతాను.‌ వీలయితే ఈ చర్చను రచ్చబండ కు చేర్చగలరు.‌నాకు తెలిసి నంత వరకూ తప్పొప్పులను సరిదిద్దుతున్నాను. భాను వారణాసి (చర్చ) 07:50, 24 మే 2022 (UTC)Reply

అనాధ పేజీలు‌

మార్చు

అనాధ పేజీలు...మూలాలు లేని పేజీలు..అసమ్మతి అనువాదాలు..అప్రామాణిక మైన వ్యాసములు చాలా ఉన్నవి.‌ ఇలాంటి వ్యాసముల వల్ల చదువురలకు విజ్నాన వికాసము కలుగదు. ఇలాంటి వ్యాసములు తొలగించ వలెను. ఉదాహరణకు సాంగ్లా , ఆంగ్ల అనువాదములు. వ్యక్తి గత వ్యాసములు.. భాను వారణాసి (చర్చ) 16:40, 25 మే 2022 (UTC)Reply

వికీ నియమాల ప్రకారం మూలాలు లేని వ్యక్తి గత వ్యాసములు చాలా వున్నాయి. గమనించ గలరు.అవి అన్నీ తొలగించ వలెను. భాను వారణాసి (చర్చ) 15:37, 27 మే 2022 (UTC)Reply

జానీ తక్కెడ శిల మూలాలు వికీ నియమాల ప్రకారం లేవు. తొలగింపు పేజీ లో పెట్టండి. శుద్ధి చెయ్యవలసిన పేజీలు. భాను వారణాసి (చర్చ) 02:29, 28 మే 2022 (UTC)Reply

వికీలో స్వంత వ్యాసాన్ని రాసుకోరాదు

మార్చు

మీ పేరిట ఉన్న వ్యాసం వారణాసి భానుమూర్తి రావు లో మీరు అనేక మార్పులు చేసారు. వికీపీడియాలో ఎవరి గురించి వారే వ్యాసాన్ని రాసుకోకూడదు అనే నియమం ఉంది, మీకు తెలుసనుకుంటాను.__ చదువరి (చర్చరచనలు) 04:44, 26 మే 2022 (UTC)Reply

ఇక్కడ పాఠకులే వికీ రచయితలు గదా? ఇంక ఎవరు వ్రాస్తారు? మీరు నా వ్యాసం వ్రాయగలరా? భాను వారణాసి (చర్చ) 08:40, 26 మే 2022 (UTC)Reply

భాను వారణాసి గారూ వికీలో చురుకుగా ఉన్నందుకు ధన్యవాదాలు.అయితే ఇంకొటి. వికీకి రచయితలు కాని పాఠకులు కూడా ఉంటారు.వికీలో రాసిన వ్యాసాలు అన్నీ వికీ వాడుకరులు వారు రాయదగ్గ వ్యాసాలు గుర్తించి స్వచ్చంధంగా రాసిన వ్యాసాలేగానీ ఏవరో చెపితేనో, లేదా చెప్పి రాయించుకున్నవి కావు,"ఇంక ఎవరు వ్రాస్తారు? మీరు నా వ్యాసం వ్రాయగలరా" అని అడగటం, అనే మాట సమంజసంగా లేదు. అలా తినకూడదు అంటే అయితే మీరు తినిపిస్తారా అని అడిగినట్లుగా ఉంది.అసలు ఎవరిని గురించి వారు చెప్పకోవటం అనేది ఒక రకంగామైనస్ పాయింట్ అని నా అభిప్రాయం. గతంలో ఒక వాడుకరి ఇతర వాడకరులుగురించి రాస్తే ఎవరకి వారు ఆ వ్యాసాలు స్వచ్చంధంగా తొలగించుకున్న సందర్బం ఉంది. మీరు గుర్తించదగిన వ్యక్తి కావచ్చు.కాదనను.కానీ వికీలో ఎవరి వ్యాసాలు వారే రాసుకునే సంప్రదాయం లేదు.గమనించగలరు.మీ మనస్సు నొప్పిస్తే క్షంతవ్యుడను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:38, 26 మే 2022 (UTC)Reply
మరేమి చెయ్యాలో తెలపండి. నా వ్యాసాన్ని తొలగిస్తాను.ఏవరో ఒకరు నా విషయాలు సేకరించి ప్రచురిస్తారా? ఈ మధ్య వ్యక్తిగత అపరిచిత వ్యాసములు అనాధ పేజీలు బోలెడు చూస్తున్నాను.‌వీరు అందరూ నాకు పరిచయం ఉన్న వారే! లాగ్ ఇన్ కాని వ్యక్తులు వ్రాసినవే! పోతే నా వ్యాసము చాలా మటుకు మూలాలతో విస్తరించి ప్రామాణికము చేసినదే! ధన్యవాదములు. భాను వారణాసి (చర్చ) 12:30, 26 మే 2022 (UTC)Reply
భాను గారూ, మీరు నా వ్యాసం రాస్తారా అని మీరడిగారు. కింది పాయింట్లు చూడండి:
  • ఇక్కడ మీరు మీ పేజీని సృష్టించుకునే ముందు నేనసలు మీ పేరే వినలేదు (ఏమీ అనుకోకండి సార్, ఇది నా లోపం). కాబట్టి రాసే ప్రశ్నే లేదు.
  • అయితే, "ఇప్పుడు నా పేరు విన్నారు కదా, ఇప్పుడు సృష్టిస్తారా" అని మీరు అడగొచ్చు. లేదా "నా బయోడేటా అంతా మీకు ఇస్తాను, పేజీ సృష్టిస్తారా" అనైనా అడగొచ్చు మీరు. అందుకు నేను చెప్పేది ఇది:
    • వికీలో వ్యాసం సృష్టించాలంటే, ఒక వ్యక్తికి, అందునా రచయితకు, వికీకి ఎక్కేంతటి అర్హత ఉందా అనేది నిర్థారించడానికి కొన్ని నియమాలున్నాయి. దీన్ని విషయ ప్రాముఖ్యత అంటారు. నేను వాటిని పరిశీలిస్తాను. ఈ పేజీ చదివి మీరు కూడా పరిశీలించండి.
    • వ్యాసంలో చేర్చే సమాచారానికి ఆధారాలు ఉన్నాయా? ఉంటే, అవేంటి? ఈ ఆధారాలు విశ్వసనీయమైనవేనా? ఈ ఆధారాలను బట్టి వికీలో సమాచారం చేర్చవచ్చా? అని పరిశీలిస్తాను. ఈ పేజీలను చూస్తే మీరు ఈ పేజీలో చేర్చిన మూలాలు పనికొచ్చేవా కాదా అనేది తెలుస్తుంది. మీరూ చూడండి.
    • మొదటి అంశాన్ని పరిశీలించాక, వికీలో పేజీ పెట్టేంతటి ప్రాముఖ్యత మీకు లేదని నాకు అర్థమైంది. కాబట్టి మీకు పేజీని సృష్టించను.
    • రెండో అంశాన్ని పరిశీలించాక, రెండు విషయాలు అర్థమైనై - 1. మీరు పెట్టాల్సిన చోట్ల మూలాలు పెట్టలేదు. 2. పెట్టిన మూలాల్లో ఒక అరడజను దాకా పనికిరావు.
వ్యక్తులకు, మరీ ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తులకు, పేజీని సృష్టించడంలో వికీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందండి: వ్యక్తిని అవమానించేలా, న్యూనపరచేలా సమాచారం ఉండరాదు. సమాచారం కచ్చితంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శలేమైనా రాస్తే వాటికి బలమైన ఆధారాలు తప్పనిసరిగా చేర్చాలి -వంటివి. దీనివలన వ్యక్తుల పట్ల ఇతరులకు ఉండే ద్వేషాన్ని, వ్యతిరేకతనూ ప్రదర్శించేందుకు వికీని వాడుకోకుండా నివారిస్తుంది. అలాగే తమపట్ల తాము అనురాగాన్ని ప్రదర్శించుకోకుండా నివారించేందుకు ఆత్మకథలు రాసుకోవద్దు అనే మార్గదర్శకాన్ని కూడా చేర్చారు.
మరొక్క ముఖ్యమైన సంగతి: మన గురించి ఎవరో చదువరి పేజీని సృష్టించారనుకోండి.. మరో రామారావు గారు వచ్చి "ఆయనకు అంత విషయ ప్రాముఖ్యత లేదు, అంచేత పేజీ అక్కర్లేదు" అని వ్యతిరేకించారనుకోండి.. అది వాళ్ళిద్దరి వివాదం, అవసరమైన ఆధారాలిచ్చుకుంటూ వాళ్ళిద్దరూ వాదించుకుంటారు, దాన్ని సమర్థించుకోవడం మన బాధ్యత కాదు. కానీ మన గురించి మనమే పేజీని సృష్టించుకున్నామనుకోండి, సమర్థించుకునే బాధ్యత మనదే అయిపోయింది. "నీకు ప్రాముఖ్యత లేదు అని ఎదటివాడు అనడం, లేదు ఉంది" అని మనం చెప్పుకోవడం.. ఇదంతా నామర్దాగా ఉంటుంది కదా! ఆలోచించండి. __చదువరి (చర్చరచనలు) 00:36, 27 మే 2022 (UTC)Reply

మీరు చెప్పినది నిజమే! కానీ మన తెలుగు వ్యాసాల్లో ఉన్న అరడజను కు పైగా జీవించి వున్న వ్యక్తులకు విషయ ప్రాముఖ్యత లేదు. మూలాలు ప్రామాణిక త లేదు.‌నామిని సుజనా దేవి , జానీ తక్కెడ శిల లాంటి వ్యాసాలు అర్హత లేనివి వున్నాయి.‌ వాటిని గూడా శుద్ధి చెయ్యవలెను గదా? భాను వారణాసి (చర్చ) 01:14, 27 మే 2022 (UTC)Reply

రమేష్ కార్తీక్ నాయక్, తోట నిర్మలా రాణి‌, రేణుకా అయోలా,బిల్ల మహేందర్ , పొట్ల పల్లి శ్రీనివాస రావు...ఇంకా డజన్‌ వరకు జీవించి ఉన్న‌ వ్యక్తులు ,ప్రామాణికం‌ లేని మూలాలు ఉన్నాయి.‌ఇవి కొన్ని వాడుకరులు ద్వారా, కొన్ని అనాధ పేజీలుగా సంక్షిప్తమై‌ ఉన్నాయి.ఇలాంటి వ్యాసాలను శుద్ధి చెయ్య వలసిన అవసరము ఉన్నది.‌ భాను వారణాసి (చర్చ) 01:28, 27 మే 2022 (UTC)Reply

భాను వారణాసి గారూ, మీరు తెలియజేసిన పై వ్యాసాలు విషయ ప్రాముఖ్యత లేనివిగా భావిస్తే ఆ వ్యాసంలో తొలగింపు మూసను చేర్చండి. అనగా వ్యాసం పై భాగంలో {{తొలగించు|కారణం}} మూసను చేర్చితే దానిపై చర్చ జరుగుతుంది. లేదా ఆ వ్యాస చర్చా పేజీలో తెలియజేయండి. చర్చ జరిగిన తరువాత ఆ వ్యాసం వికీలో ఉండదగినది కాదు అని భావిస్తే తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణచర్చ 06:26, 27 మే 2022 (UTC)Reply

తెలుగు సాహిత్యానికి సేవ చెయ్యాలనుకొంటే కవులు , రచయితల పేజీలను యధాతధంగా ఉంచాలి అని నా అభిప్రాయం. మూలాలు అంటే ఏమిటి? కొన్ని పత్రికలలో ఆమె/అతడు గురించి కవితలో/ కథలో పడినట్లు చూపిస్తే చాలదా? లేదా ఏదైన సాహిత్య అకాడమీ నుండి అవార్డు రావలెనా? పేరు ప్రఖ్యాతులున్న రచయితలకు అవార్డ్లు రాక పోవచ్చును.‌ నేను చెప్పేదేమిటంటే మూలాలు లేవని ఆ పేజీని తొలగించ వచ్చా? భాను వారణాసి (చర్చ) 02:18, 28 మే 2022 (UTC)Reply

భాను వారణాసి గారూ మీరు గొప్ప కవి, రచయిత కావచ్చు. కొన్ని కవితలు, కథలు పత్రికలలో అచ్చయినంత మాత్రాన వికీపీడియాలో వ్యాసంగా చేర్చలేము. ఈ పేజీలో రచయితలను వికీపీడియా వ్యాసంగా చేర్చడానికి కావలసిన ప్రమాణాలు చదవండి. ఆ ప్రమాణాలకు సరియైన అంతర్జాల మూలాలు గానీ, పుస్తక మూలాలు, ప్రముఖ పత్రికలలో ఆ రచయిత గురించి రాసిన వ్యాస మూలములు, పురస్కారం వస్తే దాని మూలాలు, మొదలగునవి చేర్చాలి. మీ గురించి మీరు విషయాలను మౌఖికంగా మాకు తెలియజేసినా ఆ అంశాలతో వ్యాసంగా రాయడం సాధ్యం కాదు. విశ్వసనీయ మూలాలు ఉంటే వ్యాసం ప్రారంభించండి.➤ కె.వెంకటరమణచర్చ 05:01, 28 మే 2022 (UTC)Reply

మూలాలు లేని వ్యాసాలు

మార్చు

జాని తక్కెడశిల వ్యాసం మూలాలు బొత్తిగా లేవు.‌తొలగింపు పేజీకి చేర్చండి. భాను వారణాసి (చర్చ) 03:30, 28 మే 2022 (UTC)Reply

భాను వారణాసి గారూ మీరు వికీపీడియా వ్యాసాలు శోధించినపుడు ఏ వ్యాసమైనా వికీనియమాలకు అనుగుణంగా లేదని భావించినా, వ్యక్తుల వ్యాసాలకు విశ్వసనీయ మూలాలు లేకపోయినా, మీరే ఆ వ్యాసంలో తొలగింపు మూసను చేర్చండి. ఉదా: {{తొలగించు|తొలగింపునకు కారణం}} మూసను చేర్చి, మూసలో "తొలగింపునకు కారణం" వద్ద మీరు ఎందుకు ఆ వ్యాసాన్ని తొలగింపునకు ప్రతిపాదిస్తున్నారో కారణం తెలపండి. అపుడు ఆ వ్యాసంపై చర్చ జరుగుతుంది. చర్చలో అది వికీలో ఉండదగినది కాదు అని భావిస్తే తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణచర్చ 04:14, 28 మే 2022 (UTC)Reply
బూర్ల వేంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి వ్యాసాలలో మీరు తొలగింపు మూస ఉంచారు. తొలగింపు మూస చేర్చిన తరువాత అక్కడ కనిస్తున్న ఎర్ర లింకు వ్యాసాలను ఓపెన్ చేసి మీరు ఎందుకు ఆ వ్యాసం తొలగించాలనుకుంటున్నారో తెలియజేయండి. అనగా మూస చేర్చిన తరువాత ఆయా వ్యాసాలలో ఎర్ర లింకులలో కనిపిస్తున్న వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కూకట్ల తిరుపతి మరియు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బూర్ల వేంకటేశ్వర్లు పేజీలను సృష్టించండి. దానిపై చర్చ జరుగుతుంది. ➤ కె.వెంకటరమణచర్చ 04:54, 28 మే 2022 (UTC)Reply
మీరు ఏదైనా విషయం చర్చా పేజీలో చేర్చిన తరువాత ~~~~ లతో సంతకం చేయండి.➤ కె.వెంకటరమణచర్చ 05:09, 28 మే 2022 (UTC)Reply
చర్చాపేజీలో మీ అభిప్రాయాలను తెలియజెసిన తరువాత దయచేసి సంతకం చేయండి. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెరుగు రామకృష్ణ (కవి) పేజీలోనే మీ అభిప్రాయం రాయండి. దాని చర్చా పేజీలో కాదు. ➤ కె.వెంకటరమణచర్చ 02:34, 29 మే 2022 (UTC)Reply

కొన్ని రోజువారీ పనులకు సంబంధించి, సూచనలు

మార్చు

భాను గారూ, వికీ శుద్ధి పనుల్లోను, చర్చల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. మీ చొరవ ఇతరులకు మార్గదర్శకంగా ఉంది. ఈ సందర్భంగా కొన్ని సూచనలు:

  1. తొలగింపు మూస పెట్టినపుడు, ఆ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరికి ఒక సందేశం పంపించడం అనేది సంప్రదాయం. తద్వారా ఆ వాడుకరికి ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీరు తొలగింపు మూస పెడుతున్న పద్ధతిలో ఆ సందేశం వెళ్ళడం లేదు. అంచేత మీరు ట్వింకిల్ వాడి (వ్యాసానికి పైన ఉండే ట్యాబుల్లో TW అనే ట్యాబులో PROD అనే మెనూ నొక్కాలి) తొలగింపు మూస పెడితే అదే ఆ వాడుకరికి సందేశం కూడా పంపిస్తుంది. మిగతాదంతా ఇప్పుడు మీరు చేస్తున్నట్టే జరుగుతుంది. ప్రయత్నించండి.
  2. ఎక్కడైనా చర్చల్లో మీ వ్యాఖ్యను ఎవరైనా వాడుకరి చూడాలి అని మీరు భావిస్తే, అక్కడ ఆ వాడుకరిని పింగ్ చెయ్యండి (ఉదాహరణకు మిమ్మల్ని పింగ్ చెయ్యాలంటే [[వాడుకరి:భాను వారణాసి]] అని రాయాలి. దాంతో "ఫలానా వారు ఫలానా పేజీలో మిమ్మల్ని ప్రస్తావించారు" అనే గమనింపు ఆ వాడుకరికి వెళ్తుంది. దాంతో వారు ఆ చర్చను మిస్సయ్యే అవకాశం ఉండదు. లేదంటే ఆ వాడుకరి మీ చర్చను చూడక పోవచ్చు. అయితే మీరు రాస్తున్నది సదరు వాడుకరి చర్చ పేజీలో అయితే, అలా ప్రస్తావించాల్సిన పని లేదు; అది ఆటోమాటిగ్గా జరిగిపోతుంది. అందుకే ఇక్కడ (ఇది మీ చర్చ పేజీయే కాబట్టి) నేను మీ పేరుకు లింకు ఇవ్వలేదు. __ చదువరి (చర్చరచనలు) 11:22, 30 మే 2022 (UTC)Reply

ధన్యవాదములు. ఇప్పుడిప్పుడే నేర్చు కొంటున్నాను. మీ సలహా పాటిస్తాను. వికీ తెలుగు విభాగాన్ని ప్రామాణికంగా చెయ్యాలనేదే నా అభిలాష. భాను వారణాసి (చర్చ) 11:27, 30 మే 2022 (UTC)Reply

మీరు చర్చాపేజీల్లో ఏవైనా అభిప్రాయాలు తెలియజేసినపుడు తప్పని సరిగా సంతకం చేయండి. చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. మూడు టిల్డెలతో అనగా ~~~ రాస్తే ఒక్క సంతకం మాత్రం వస్తుంది. ఐదు టిల్డెలతో అనగా ~~~~~ రాస్తే తేదీ, టైము ముద్రితమౌతాయి. కనుక మీరు చర్చాపేజీలలో నాలుగు టిల్డెలతో సంతకం చేయండి.➤ కె.వెంకటరమణచర్చ 13:20, 30 మే 2022 (UTC)Reply

తొలగింపుకు ప్రతిపాదించినపుడు

మార్చు

భాను గారూ, వ్యాసాన్ని తొలగింపుకు ప్రతిపాదించినపుడు చెయ్యాల్సిన పనులు కిందివిధంగా ఉంటాయండి.

  1. ట్వింకిల్ లోని PROD ద్వారా తొలగింపును ప్రతిపాదిస్తారు
  2. అప్పుడు వ్యాసం పేజీలో తొలగింపు మూస చేరుతుంది. అందులో ఎందుకు తొలగించాలో రాసిన కారణం కూడా వస్తుంది. తొలగింపు చర్చ పేజీకి ఒక ఎర్ర లింకు వస్తుంది - [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం పేరు]] - ఇలాగ.
  3. ఆ ఎర్ర లింకును నొక్కి, అపుడు కనిపించిన పేజీలో తొలగించేందుకు మీరు చూపిన హేతువును రాసి భద్రపరచండి (ఇది ప్రస్తుతం మీరు చేస్తున్నారు). అయితే, రోజు గడిచిపోయిందంటే, కొత్త మార్పుచేర్పులు రావడాన, ఈ కొత్త పేజీలో మీరు తొలగింపు చర్చ మొదలుపెట్టినట్టు ఎవరికీ తెలియకుండా పోతుంది. దాంతో అలాంటి పేజీలు ఏ చర్చా లేకుండా అలాగే మురిగిపోతాయి. అలా జరక్కుండా ఉండాలంటే..
  4. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం పేరు]] అనే ఈ పేజీని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో "తాజా చేర్పులు" అనే విభాగంలో అడుగున చేర్చాలి. దాంతో తొలగింపు కోసం ఎదురుచూస్తున్న చర్చలేమేమి ఉన్నాయి అని చూసేవాళ్ళకు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ చర్చల్లో పాల్గొంటారు. లేదంటే, పైన చెప్పినట్టుగా, ఆ చర్చల పేజీలు కొత్తగా వస్తున్న మార్పుచేర్పుల కింద కూరుకుపోయి ఎవరికీ కనబడకుండా పోతాయి.

గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 01:30, 31 మే 2022 (UTC)Reply

అన్నట్టు భాను గారూ, తొలగింపు చర్చ కోసం ఒక వారం పాటు సమయం ఉంటుంది. ఆ గడువు ముగిసిన తరువాత ఎప్పుడైనా సరే, ఆ చర్చలో పాల్గొనని నిర్వాహకులు చర్చపై నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. __

అదే చూస్తున్నాను. నాకు ఆ PROD నాకు కనబడడం లేదు. భాను వారణాసి (చర్చ) 01:59, 31 మే 2022 (UTC)Reply

PROD అనేది వ్యాసం పేజీల్లో మాత్రమే కనిపిస్తుంది. (అన్నట్టు మీరు నన్ను పింగు చెయ్యలేదు. అంచేత నాకు గమనింపేమీ రాలేదు. నేను ఇటీవలి మార్పుల్లో చూసాను కాబట్టి మీరు రాసిన సంగతి తెలిసింది) __ చదువరి (చర్చరచనలు) 05:05, 31 మే 2022 (UTC)Reply

ఆధునిక కవుల జాబితా

మార్చు

తెలుగు ఆధునిక కవుల జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించిన వాడుకరిలకు ధన్యవాదములు. ‌పోతే ఎర్ర రంగులో కనబడుతున్న కవులు లబ్ధ ప్రతిష్ఠులైన వారున్నారు. వారికి పేజీ కేటాయించి వారి గురించి వివరించ వలెను.‌ అంతర్జాతంలో వెదికిన కన బడును. [[ప్రత్యేక:చేర్పులు/) 09:22,భాను వారణాసి (చర్చ) 09:24, 8 ఆగస్టు 2022 (UTC)Reply

కొందరి కవులకు , రచయితలకు మూలాల్ని వెదికి పేజీని కేటాయించ వలసినదిగా కోరినాను. అది ఇంతవరకూ జరగ లేదు‌ === భాను వారణాసి (చర్చ) 09:09, 3 జనవరి 2023 (UTC)Reply

మకర సంక్రాంతి పేజీలో మీరు చేసిన దిద్దుబాటు

మార్చు

మకర సంక్రాంతి పేజీలో మీరు ఈ దిద్దుబాటు ద్వారా చేర్చిన పాఠ్యంలో కింది లోపాలున్నాయి:

  • ఆ పాఠ్యం ఒక వ్యక్తి అనుభవం.. దానికి విజ్ఞానసర్వస్వ యోగ్యత లేదు.
  • దిద్దుబాటు సారాంశంలో చెప్పినట్టు ఫేస్‌బుక్ నుండి కాపీ చేసి తెచ్చి పెట్టినట్లుంది
  • ఆ పాఠ్యం లోని శైలి, వికీకి అనుగుణంగా లేదు

ఆ పాఠ్యం నుండి, విజ్ఞాన సర్వస్వానికి తగినట్టుగా ఉన్న భాగాలను మాత్రమే ఉంచి మిగతాదాన్ని తొలగించాలి. అయితే ఇది తక్షణం తీసెయ్యాల్సిన పాఠ్యంగా భావించి దాన్ని నేను తీసేస్తున్నాను. పాఠ్యాన్ని సరిచేసి మళ్ళీ ఎక్కించండి. __చదువరి (చర్చరచనలు) 02:58, 15 జనవరి 2023 (UTC)Reply